Skip to main content

Posts

Showing posts from June, 2012

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౫—ద్రప్స నందిని---౪ ( ఆఖరి భాగం)

మహారాజ ద్రప్సుడు , జరామాత ఆదేశాన్ని శిరసావహించి మహావీర కర్ణుని, భైరవాలయంలో సంధించడానికి సమ్మతించాడు. ఆ రోజు మంగళవారం, భైరవ దుర్గం దీపమాలికలతో అలంకరింపబడి కలకల లాడుతోంది ! నిండు చంద్రుడు తారాగణంతో ఆకాశ వీధిలో ప్రకాశిస్తున్నాడు. భైరవ దుర్గ ముఖద్వారం పైనున్న శాలలో మంగళ తూర్యారావం వీనుల విందు చేస్తోంది. కోట చుట్టూ ఆశ్విక దళం అప్రమత్తతతో కాపలా కాస్తోంది. భైరవాలయ గోపురం దీపమాలికలతో దేదీప్యమానంగా ఉంది ! రెండు మదపుటేనుగులు కోట సింహ ద్వారానికి రెండు వైపులా నిలబడి ఉన్నాయి. భేరీ కాహళ ధ్వనులు మిన్నుముట్టాయి, కారణం ?  మహారాజాధిరాజ రాజ పరమేశ్వర ద్రప్స భట్టారకుల వారు సింధూరారుణ కాంతి గల అశ్వరాజంపై, కోటకు వేంచేస్తున్నాడు ! మహారాజును పరివేష్టించి రెండు వందల మంది రౌతులు వస్తున్నారు. కోట సింహద్వారం తలుపులు బాహాటంగా తెరువబడ్డాయి. మహారాజ ద్రప్సుడు లోనికి ప్రవేశించాడు.అంగరక్షక దళం కూడ లోపలికి ప్రవేశించింది. కొంత సేపటికి ఒక నల్లని గుర్రం బాణంవలె దూసుకొని వస్తూంది. తిరుగ భేరీ కాహళ ధ్వనులు చెలరేగాయి ! అతిరథ శ్రేష్ఠుడైన వృషాకపి కోటలోనికి చొచ్చుకొని వెళ్లాడు. భైరవ దుర్గ సింహద్వారపు తలుపులు మూయబడ్డాయి !  “ మహావీ

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౫—ద్రప్స నందిని—౩

మహారాజ ద్రప్సుని అధికారయుత ప్రకటన అన్ని దేశాల లోనూ ఘోషింప బడింది. ఆర్యావర్తం లోని మహావీరులలో సంచలనం ఏర్పడింది. మాలిని అసాధారణ రూపవతి ! బంగారానికి తావి అబ్బినట్లు ఆమెలో యువతీ జన దుర్లభమైన శస్త్రాస్త్ర పాండిత్యం కూడ కలదు. వీర యువకు లందరి హృదయాల లోనూ అట్టి ఉత్తమ నారీమణిని చేపట్టాలనే వాంఛ ప్రబలింది. కాని, ఆ ప్రకటనలోని ప్రధాన విషయం అనేక మందిని నిరుత్సాహ పరచింది , అదేది ? నాగాయుత బలుడును, శరీర బలంలో దీటులేని పోటు మానిసియగు మహా బలవంతుడైన ద్రప్సుని ముష్టి యుధ్ధంలో ఓడించిన వాడే , సర్వోత్కృష్ట వీరసుందరి యైన మాలినిని చేపట్ట గలడట ! ఆ పని అసాధ్యమని అనెక మంది నిరుత్సాహ పడ్డారు. ద్రప్సుని ఎదిరించి నిలువగల మహావీరులు ఆర్యావర్తంలో చాల తక్కువ !  పృథా పుత్రుడు భయమానుడు (కుంతీ పుత్రుడు భీముడు) , పర్శు పుత్రుడు దుర్యోణుడు ( గాంధారీ పుత్రుడు దుర్యోధనుడు) , తుగ్ర పుత్రుడు స్మధిభుడు (ద్రోణ పుత్రుడు అశ్వథ్థామ) స్వశ్వ పుత్రుడు వృషాకపి ( కర్ణుడు), వికుంఠా సుతుడు వైకుంఠుడు ( దేవకీ పుత్రుడు శ్రీకృష్ణుడు) – వీరే ద్రప్సుని ఎదిరించి పోరగల యోధులు ! వీరిలో స్మధిభుడు బ్రహ్మచర్య వ్రతం పూనిన తపస్వి, కాబట్టి స్వయంవరానికి వ

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౫-- ద్రప్స నందిని--౨

సాయంకాల సంధ్యారుణిమ కాంతులు, ‘భైరవ దుర్గంపై’ ప్రసరించి నలుపుతో కలిసిన ఎరుపు శోభను ప్రసాదిస్తున్నాయి. భైరవ దుర్గం నల్ల సానరాతితో కట్టబడి ఉంది. చంద్ర వంకతో కలిసిన ఎర్రని త్రిశూల పతాక నీరెండలో ప్రకాశిస్తూంది. కోటలోని భైరవ దేవాలయంలో సాయంకాల పూజా చిహ్నంగా గంటలు మ్రోగుతున్నాయి. కర్ణుడు అశ్వారూఢుడై దుర్గపు సింహద్వారాన్ని సమీపించాడు. సింహద్వారాన్ని బలిష్ఠులైన యోధులు కాపలా కాస్తున్నారు. కాపలాదార్లను ప్రతిఘటిస్తే తప్ప దుర్గం లోకి వెళ్లడానికకి వీలుండదు ! ప్రతిఘటన వల్ల లాభం కన్న నష్టమే అధికంగా ఉండవచ్చు! కర్ణుడు తీవ్రంగా ఆలోచించి తుదకొక తీర్మానానికి వచ్చాడు. కర్ణుడు తన గుర్రాన్ని దుర్గ సమీపంలో చెట్ల గుంపు మధ్యన కట్టాడు. నందా భగవతి తనకు ప్రసాదించిన మణిని నోట్లో వేసుకొని పాదచారిగా సింహద్వారాన్ని దాటి దుర్గ ప్రవేశం చేసాడు. కర్ణుని ప్రవేశాన్ని ఎవరును గమనించినట్లు లేదు. అప్పుడు పూర్తిగా నభోమణి అస్తాద్రి మరుగు జొచ్చాడు. చంద్రోదయ మయింది తారాగణం ముసుగు తొలగించుకొంది. ఆకాశం నీలిపట్టు చాందినీ వలె రమణీయంగా కన్పడుతూంది. చల్లని మందమారుతం దుర్గంలో నందనవన పుష్ప సౌరభాన్ని వెదజిమ్ముతూంది. ఒక మనోహర దృశ్యం ! క

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౫—ద్రప్స నందిని—౧

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ ఆంధ్ర ప్రభ వార పత్రికలో ౩౦.౧౨.౧౯౬౪ నుండి ధారా వాహికంగా ౨౦.౦౧.౧౯౬౫ వరకు ప్రచురింప బడింది. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} “ ఓహ్ ! సువర్చలా ! అరే, ఎంత ఎదిగి పోయావ్ ? ఇంకా నీకు నా ఙ్ఞాపకం ఉందా ? మానవుల కంటే నీవే నయం ! రా ! వత్సా ! రా ! నీ మెత్తని శరీరాన్ని కట్టుకొని ఎన్ని రోజులయింది !” సువర్చల తన ముఖాన్ని ఎత్తి చూచింది. అతి విశాలములైన దాని కాటుక కండ్లు తళతళమని మెరిసాయి. నాసా పుటాలు సంతోషాధిక్యంతో  ఎగిరెగిరి పడుతున్నాయి. ముందరి కాళ్లను మీదికెత్తింది. దాని నల్లని చిన్నారి డెక్కలను రెండు చేతులతోను పట్టుకొని --- “ సువర్చలా ! అమ్మా, నాన్నా సుఖంగా ఉన్నారా, రేవతి సుఖంగా ఉందా ?” అని ఆప్యాయంగా పలకరించాడు కర్ణుడు. సువర్చల తన అందమైన చిన్న తోకను ఆడించింది. దాని గొంతు లోంచి గురగుర మని శబ్దం వచ్చింది ! దాని కంద్లు చెమ్మగిల్లి , కొలకుల లోంచి కన్నీరు కారింది. “ అరే, ఏడుస్తున్నావా

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు—౪—దైవరాతుడు.

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ జాగృతి మాసపత్రిక ౧౯౬౨ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించారు. అంతే కాదు ఈ కథకి ఉత్తమ పౌరాణిక కథగా బహుమతి కూడా వచ్చింది ! ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} “ అదేమో ! సువ్రతా ! ఇంత పెందరాళే నదికి వచ్చావేం ? ఇంకా భూమి పాటారలేదు ! నా కంటే, ఈ రోజు మా ఇంట్లో ‘ఇష్టి’ ఎంతపనో చెప్పలేను ! అందుకే ఇంత త్వరగా వచ్చేశాను” అంది గోదా. “ చెప్పితే సిగ్గో వదినా ! చూచావా నాచీరెని ? ఒక వంద  చిరుగులుంటాయి. నగుబాటు –శరీర మంతా కన్పడుతుంది ! అందుకే తొలికోడి కూతకి ముందే గబగబా వచ్చేసాను.”  సువ్రత యొక్క చీరని ఆ మసక చీకటిలో పరీక్షించి చూసింది గోదా.ఆమె మనస్సు చివుక్కుమంది. “వదినా ! ఈ విషయంగా అన్నగారు కులపతుల వారిని కలుసుకొంటే బాగుణ్ను! వారేదా వృత్తిని చూపెట్టక పోతారా, మొన్ననే మావారు ఒక గోవుని సంతలో మార్చి, అర్థ సంవత్సర  గ్రాసం ఇంట్లో పోసారు. నాలుగు చీరెలు పట్టుకొచ్చారు. ( కొంచెం సువ్రతకు దగ్గరగా

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు ప