Skip to main content

భావజాలానికి స్వాగతం...





“క్షీర గంగ” అనే శీర్షిక పెట్టి , దాని క్రిందన “”విరిసిన హరి విల్లు” అని ప్రశీర్షిక పెట్టడం ఏమైనా బాగుందా ఆనే సందేహం రావచ్చు! దానికి నా సమాధానం ఏమిటంటే---“కామధేనువు” అనేది, ఈ సమాజం లోని 97 శాతం ప్రజలకు ప్రతినిధి అయితే తక్కిన 3శాతం ఎవరు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దానికి ఈ క్రింది విధంగా వివరించ వచ్చు.


 పాడినిచ్చే స్తన్య జీవులు
 ఇంధ్రియ సుఖాన్నిచ్చే వేశ్యలూ:
 పంట పండించే వ్యవసాయ శ్రామికులూ
 తదితర జీవితావసర వస్తువుల్ని ఉత్పత్తిచేసే కార్మికులూ
 జనాభాలో నూటికి 97శాతం మంది అందరూ పశువులే!11
 ఈ పశువు లన్నిటి సమిష్టి రూపమే “కామ ధేనువు!!!
 సమాజంలో మిగిలిన ముగ్గురూ పశుపతులు: ధన పతులూ: ఉద్యోగ పతులు ఋషులయిన నాడే----
 కర్మాగారాలు ఆశ్రమ వాటికలవుతాయి.


శ్రమ యజ్ఞమయి పవిత్రత సంతరించుకుంటుంది. అది సాధ్యమా! అసాధ్యమయితే ఏం చేయాలి అన్న ప్రశ్నకు ఈ పశువులేం చేయాలి? అన్న ప్రశ్నకు కూడా ------



“”విరిసిన హరి విల్లు “” లాంటి ఈ ప్రపంచంలో స్పందించే ప్రతీ హృదయమూ ఇచ్చే నివాళే సమాధానం కావాలి.


అదేనండీ, ఈవివరణ!! దీనిని ఆధారంగా చేసుకొని నేను వ్రాయబోయే భావ జాలానికి ప్రతీ ఒక్కరికీ ఆహ్వానం!!!


భవధీయుడు

అయలసోమయాజుల శీధర్ ( ఏ. శ్రీధర్ )

Comments

  1. శ్రీధర్ గారూ!
    బ్లాగు లోకానికి హృదయ పూర్వక స్వాగతం. మీరు రాయబోయే పౌరాణిక రచనల కోసం ఎదురు చూస్తుంటాను.

    ReplyDelete
  2. సుస్వాగతం !మీ రచనలకు , మీ భావాలకు ఇది చక్కని వేదిక.
    అభినందనలు !
    తెలుగుకళ - పద్మకళ
    http://telugukala.blogspot.com

    ReplyDelete
  3. శ్రీధర్ గారూ !
    మంచి వేదికను ఎన్నుకున్నారు. మీకిదే మా స్వాగతం.

    ReplyDelete
  4. బ్లాగ్లోకానికి సుస్వాగతం.

    ReplyDelete
  5. బ్లాగులోకానికి ఇదే మా స్వాగతం. ఆధ్యాత్మికంగా మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోవడానికి మీకు ఇది మంచి ప్రదేశం. మీ పౌరాణిక రచనలకోసం ఎదురు చూస్తూ ఉంటాము. :)

    ReplyDelete
  6. Welcome to the wonderful land of teleugu blogspot. infact you were looking for such type of platform for a long type. this is a long cherished dream coming true. we hope you earnestly contribute to this spot and keep updating we readers.
    with regards,
    JOGA RAO/INDRANI KARRI, BHILAI

    ReplyDelete

Post a Comment