Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 23

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 23

( దృశ్యము 95 )

( ఆకాశ రాజు మహలు )

( పద్మావతీ దేవి పెళ్లి కూతురు అలంకరణలో ఒక వెదురు బుట్టలో కూర్చొని ఉంటుంది.)

( ఆమెకి ఎదురుగా ఒక పీఠంపై పార్వతీ దేవి మంగళ చండికా రూపంలో కూర్చొని ఉంటుంది. ఎర్రని చీర, ఎర్రని రవికె, ఎర్రని మందార మాల, ఎర్రని ఆసనము, ఎర్రని అక్షతలు, ఎర్రని కుంకుమ, పసుపు ఉండదు. అంతా ఎరుపు రంగులోతోనే ఉంటుంది )

( పద్మావతి ,కుంకుమతో పురోహితుడైన బృహస్పతి మంత్రం చదువుతూ ఉండగా, మంగళ చండికా దేవిని పూజిస్తుంది.

మంగళ చండికా స్త్రోత్రము---( మూల మంత్రం ) ఓం, హ్రీం,శ్రీం క్లీం సర్వ పూజ్యే దేవీ మగళ చండికే హూంహూం ఫట్ స్వాహా !

౧ దేవీం షోడశ వర్షీయాం శాశ్వత సుస్థిర యౌవనాం/బింబోష్టీం సుదతీం, శుద్ధాం శరత్ పద్మ నిభాననాం
శ్వేత చంపక వర్ణాభాం సునీలోత్పల లోచనాం / జగద్ధాత్రీంచ ధాత్రీంచ సర్వేభ్య స్సర్వ సంపదాం !
సంసార సాగరే ఘోరే జ్యోతి రూపాం సదా భజే !

౨ రక్ష రక్ష జగన్మాతే, దేవీ మంగళ చండికే / హారికే విపదాం రాశే, హర్ష మంగళ చండీకే !
హర్ష మంగళ దక్షెచ, శుభే మంగళ చండీకే / శుభే మంగళ దక్షేచ , శుబే మంగళ చండికే !
శుభే మంగళే మంగళార్హచ , సర్వ మంగళ మంగళే/ సతతాం మంగళదే దేవీ , సర్వెషాం మంగళాళయే !

౩ పూజ్య మంగళ వారస్యాచ, మంగళాభీష్ట దేవతే /పూజ్యే మంగళ భూపస్య , మను వంశస్య సతతాం !
మంగళ అధిష్టాత్రీ దేవీ, మంగళా నాంచ మంగళే / సంసారే మంగళాధారే, మోక్ష మంగళ దాయినీ !
సారేచ మంగళాధారే, పారేచ సర్వ కర్మణాం / ప్రతి మంగళ వారేచ పూజ్యే మంగళ సుఖ ప్రదే !

( పూజ ముగిసాక పద్మావతి, మంగళ చండి రూపంలో ఉన్న గౌరీ దేవికి నమస్కరిస్తుంది . గౌరీ దేవి ఆమెను ఆశీర్వదిస్తుంది )

(ఇదంతా చూస్తున్న సూత మహర్షి , బృహస్పతిని ఆడుగుతాడు )

సూతుడు ---దేవ గురూ ! వధువు చేతమంగళ చండికా పూజ చేయించడంలో ఆంతర్యమేమిటి ?

బృహస్పతి --- సూత మహర్షీ ! వ్రత కథలన్నిటినీ కరతలా మలకం చేసుకొన్న మీరీ ప్రశ్న ఆడగడం ఆశ్చర్యంగా ఊంది. ఈ పూజ దేవీ భాగవతం లోనిది ! మంగళ చండిక కన్య వివాహానికి కలిగే అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. వధువుకున్న కుజ దోషం పరిహారం చేస్తుంది.

సూతుడు ---- పద్మావతీ దేవికి కుజ దోషమా ? గురువర్యా ! ఆమె అయోనిజ కదా ?

బృహస్పతి ---నిజమే పద్మావతీ దేవి అయోనిజ ! అంతకు ముందు జన్మలో వేదవతిగా కూడ ఆమె అయోనిజయే ! ఈ కన్య సంకల్ప మాత్ర జన్య !!--- కాని లక్ష్మీ దేవి సంకల్పించిన సమయం దోషానికి గురయింది. ఈ పూజతో ఆ దోష పరిహారం అయింది.

లక్ష్మి -- గురువర్యా ! వధువు జాతకమున కుజదోషము వైధవ్యమునకు కారణము కదా ?

బృహస్పతి--- అవును.

లక్ష్మి ---(నవ్వి ) ఆది మధ్యాంత రహితుడు, విరాట్ పురుషుడు , ఈ వివాహాన వరుడు అయిన, నా స్వామికి కూడ, మీరు ఈ దోషాన్ని ఆపాదిస్తున్నారా ?

బృహస్ఫతి --- ఆపాదించడం కాదు, శంకిస్తున్నాను.

లక్ష్మి --- ఎందుకని ?

బృహస్ఫతి --- స్వామి లీలా మానుష రూపమును ఇంకా త్యజించ లేదు గనుక !

లక్ష్మి --- దోషము, దోష నివారణము , యీ రెండూ భవష్యత్తులో జరగ నున్నాయా గురుదేవా ?,

బృహస్ప్తతి--- అవును శ్రీదేవీ !

లక్ష్మి --- వధువు నిక వివాహ మండపానికి తీసుకొని పోవచ్చా ?

బృహస్పతి--- తీసుకొని పోవచ్చు ! ఆమె మేనమామలు , బుట్టతో పాటు ఆమెను తీసుకొని వెళ్లి. వరుని కెదురుగా కట్టిన తెర ముందు ఆశీనురాలిని చేయాలి.

( అని వధువు దోశిలలో ఒక కొబ్బరి బొండం పెడతాడు )

( వరుని ముందు తెర వేస్తారు )

( వధువుని ఆమె మేనమామలు బుట్టతో పాటు మోసుకొని వచ్చి, వరుని కెదురుగా ,తెరముందు , కూర్చోపెడతారు )

( ఆకాశ రాజు , ధరణీ దేవి వధువు ప్రక్కన కూర్చొంటారు )

( ఆకాశరాజు, వరుని కాళ్లు కడిగి, వధువునీ, ఆమె చేతిలో కొబ్బరి బొండంన్ని, గుమ్మడికాయ, అరటి పళ్ల గెలలతో పాటు, వరుని చేతికిచ్చి కన్యాదానం చేస్తాడు )

( ఆ తరువాత జీలకర్ర బెల్లం వధూవరులు ఒకరి తలమీద మరొకరు పెడతారు )

( వివాహం సంపన్నమయినట్లే ! అందరూ అక్షింతలు వేసి వారిని ఆశీర్వదిస్తారు )

( తరువాత పద్మావతీ దేవి బుట్టలోంచి లేచి, నిలబడుతుంది. ’మధుపర్కాలు’ తీసుకొని లక్ష్మీ పార్వతులు ఆమెను లోనికి తీసుకు వెళ్తారు. మధుపర్కాలు కట్టించడానికి )

( శ్రీనివాసుడు , మధుపర్కాలు పట్టుకొని లేస్తాడు. అన్న గోవింద రాజులు , తమ్ముడు ఇంద్రుడు అతనిని తీసుకొని మరో లోగిలికి తీసుకొని వెళ్తారు, )

( ముందుగా వరుడు మధుపర్కాలు ధరించి వచ్చి, పెళ్లి పీట మీద కూర్చొంటాడు. )

( ఆ తరువాత వధువు వచ్చి, అతని ప్రక్కనే కూర్చొంటుంది. ఆమె చేతిలో జ్యోతులు వెలిగించిన పళ్లెం పట్టుకొని , లక్ష్మీ పార్వతులు తీసుకొని రాగా, ఇంకో జ్యోతుల పళ్లేన్ని ధరణీ దేవి, వకుళ మాలికలు పట్టుకు వస్తారు )

( ఆ తరువాత పురొహితులైన వశిష్టుడు, బృహస్పతుల మంత్ర పఠనాల మధ్య మాంగల్య ధారణ అవుతుంది )

( వచ్చిన పెళ్లివారందరూ ఆ జంటను ఆశీర్వదిస్తారు )

( పద్మావతీ కళ్యాణం సుసంపన్న మయింది )

******************

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...