Skip to main content

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--- 20)



(నిన్నటి టపాలో జరిగిన కథ---- ముకబీరు మురుగన్ , ఇనస్పెక్టర్ గోపాల్రావుకి, మ్యూజియం దొంగతనం గురించి చెప్తాడు. కొన్ని ఫొటోలు, ఆడియో కేసట్టు ఇస్తాడు. దానయ్య చొక్క జేబులో దొరికిన నోట్లు, ఎంకన్న గాయపడి స్పృహ తప్పి పడిపోయిన చోట పోలీసులకి దొరికిన నోట్లు ఒకే దస్త్రం లోనివని చెప్తాడు. గోపాల్రావు దానయ్య విషయంలో ఆలోచనలో పడతాడు --- ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం---20

“ ఐసీ ! అయితే  దానయ్య  ఈ  నోట్లని,  చొక్కానీ  కావాలనే  టూ నాట్  త్రీ  గేలానికి  తగిలించి  వెళ్లాడన్న మాట ! ” అని  ఇనస్పెక్టర్  అంటూ  ఉండగానే, టూ నాట్ త్రీ  దానయ్యని  తీసుకొని  అక్కడకి వస్తాడు. దానయ్య  చేతులు  రెండూ  గట్టిగా  ఆస్పత్రి  బేండేజీతో  కట్టేసి  ఉంటాయి. టు నాట్ త్రీ  గొడుగు  హుక్కుని  ఆ  బేండేజీ కట్లలో  దోపి, రెండో  కొసని  తన  భుజం  మీదుగా  పట్టుకొని  తీసుకొని వస్తాడు. ఇనస్పెక్టర్  గోపాల్రావు  ఆ  దృశ్యాన్ని  చూస్తాడు. 

దానయ్య పారిపోవాలను కొంటే ఆ బేండేజీ  అతనినేమీ  చెయ్యలేదని,  కావాలని  పట్టు బడ్డాడనీ  అర్థమవుతూనే  ఉంది.

“ రామా రామ ! ఇదుగోనండి  ఆ  దానయ్య ! పట్టి బంధించి  తెచ్చానండి,” అంటూ  గర్వంగా  చూసాడు, ఇనస్పెక్టర్.  వంక  టు నాట్  త్రీ.

“ టు నాట్ త్రీ ! ఇతను  నీకెక్కడ  దొరకాడు.’’

“రామా  రామ ! దొరకక  ఏం చేస్తాడండి ! ఒంటి  మీద చొక్కా లేదు  కదండి, ఎంతో దూరం పోయి  ఉండడని  ఆలోచించి, ఆస్పత్రిలోనే  వెతికానండి. రూము  నెంబరు  పదిహేడులో  బెడ్ నెంబరు  ఎనిమిది  మీద, ముఖం మీద  దుప్పటి  ముసుగు  వేసుకుని, తొంగున్నాడండి  అసలా  బెడ్డు  కూడ  దాటి  పోయే వాడినే నండి ! సిస్టరు  వచ్చి,జబ్బ  మీద  ఇంజక్షన్ సూది  గ్రుచ్చడంతో ,లేచి కూర్చొన్నాడండి. కత్తితో  మనుషులని  పొడిచే  కసాయి  వెధవ, సూది  నొప్పికే  విల విల  లాడిపోయాడండి ! ఆ  సూదిని  గన్నులాగ  చూపించి,  నర్సమ్మ  వాణ్ని  కదలనీయకుండా  చేసిందండి. నేను గట్టిగా కట్టేసి, తెచ్చానండి.” అన్నాడు  టు నాట్ త్రీ.

“ బలే ! మొత్తం మీద  ప్రాణాలకి  తెగించి, పట్టుకొన్నావన్న మాట ! ” ప్రశంసించాడు  ఇనస్పెక్టరు.

“ మరే , లేకపోతే  నా  కాన్ఫిడెన్షియల్  కూతురు  పెద్ద  మనిషి  అయిపోయి,  కడుపు  కూడ  చేసేసుకొంటుంది  కదండి !”

“ ఇప్పుడు  మాత్రం  చేసేసుకోదన్న గ్యారంటీ  ఏమిటి ?”

“ చేసుకొన్నా  రామా  రామ ! నాకు  తెలియకుండా, కాన్ఫిడెన్సులో  చేసుకుంటుందండి.”

“ ఇనస్పెక్టరు  దానయ్య  వంక  చూస్తాడు, “ దానయ్యా ! యూ  ఆర్  అండర్  అరెస్ట్ ! ఎంకన్న  హత్యా  నేరం  మీద  నిన్ను  అరెస్టు  చేస్తున్నాను.”అన్నాడు

“ఎంకన్న  సచ్చిపోయేడేంటండి ?’’అన్న  దానయ్య  ప్రశ్నకి, అక్కడే  ఉన్న మురుగన్, బొంగురు పోయిన  కంఠంతో  జవాబిస్తాడు. “ అవును  మామా ! ఇప్పుడే  ఇనస్పెక్టరు గారు చెప్పారు”.

దానయ్య  ఏడుస్తాడు. “ ఒరే  ఎంకన్నా ! అల్లుడూ ! ” అంటూ  , ఆనక  బేండేజీ  కట్టిన  చేతులతోనే  తుడుచుకొంటాడు. “ మురుగప్పా ! ఎంకన్నా  శవం  కోసం  ,‘ లచ్చితో’ కాయితం  పెట్టించు. ” అని  ఇనస్పెక్టరుతో, “ బాబూ ! సితికి  నిప్పెట్టడానికి  ఆడికొక  కొడుకు  ఏడేళ్ల  వాడు  ఉన్నాడండి, మీరు దయ ఉంచి, ఆడి శవాన్ని ఆళ్లకిప్పించాలండి.”

“ అలాగే  దానయ్యా,! ఏయ్ టు నాట్ త్రీ !”

“ రామా  రామ ! యస్  సార్ !”

“ నువ్వు  దానయ్యను  పోలీసు స్టేషనుకి  తీసుకెళ్లు.”

“ రామా  రామ ! జాగరత్తగా  తీసుకెళ్లి  లాకప్పలో  పెడతాను  సార్ ! ”

‘‘తరువాత  ఈ  నోట్లని  తీసుకెళ్లి, వీటి  మీద  నెంబర్లని  బట్టి, ఏ బేంకు  నుంచి  డ్రా  అయ్యాయో  ఎన్ క్వయిరీ  చెయ్యి, బేంకు  బేంకుకీ  వెళ్లు, నెళ్లాళ్ల  వరకు  రికార్డులు  చెక్  చెయ్యి, వెళ్లు,” అని  దానయ్య చొక్కా జేబులొని  నోట్లని  టూ నాట్ త్ర్రీకి  ఇచ్చాడు  గోపాల్రావు.

“ రామా  రామ ! అలాగే  సార్ !’ అని  నోట్లు  జేబులో  పెట్టుకొని  దానయ్యని  తోసుకొంటూ  వెళ్తాడు  టు నాట్ త్రీ. అతను  వెళ్లి  పోయాక  ఇనస్పెక్టర్ , మరుగన్తో  “ మురుగన్ ! నువ్వు  నాతో  రా ! మీ  ఊరికి  వెళ్లి, అక్కడి  మ్యూజియం  లోని  అంగుళం, అంగుళం  గాలించాలి. తరువాత  ఆంజనేయుడి  విగ్రహానికి  నకలు  తీసిందెవరో  తెలుసుకోవాలి, పద ! అవి  సాధారణమైన  బొమ్మలు  కావు, కొన్ని  కోట్లు  విలువగల  వజ్రాలను  రహస్యమైన  అరలో  దాచుకొన్న  బొమ్మలు ! ” అన్నాడు  ఆవేశంతో.

“ మురుగన్  ఆశ్చర్యపోతూ , ఇనస్పెక్టర్ ని  చూస్తాడు, “ ఏమంటున్నారు  సార్ ! బొమ్మలలో  వజ్రాలు  దాగి  ఉన్నాయా ?” అని  అడిగాడు . ఇనస్పెక్టర్  మౌనం  వహించడం  చూసి, “ పదండి  సార్ !” అంటూ  ముందడుగు  వేస్తాడు.

(తరువాయి భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...