Skip to main content

మొసలి కొలను మ్యౌజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---22)


(నిన్నటి టపాలో జరిగిన కథ---- మ్యూజియం వెళ్లిన ఇనస్పెక్టర్ గోపాల్రావు అక్కడ వాట్సన్ దొర ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు. అతను ఒక తామ్ర శాసనాన్ని ఫొటోలు తీయడం చూస్తాడు. అంతే కాదు ఎంకన్నని పొడిచిన చోట, రబ్బరు మేట్ మార్చబడి ఉండడం గమనిస్తాడు. వాట్సన్ అతనితో వాదనకి దిగుతాడు తరువాత కోపంతో వెళ్లిపోతాడు. గోపాల్రావుకి వాట్సన్ మీద అనుమానం వస్తుంది. ఆ తరువాత కరీం ఖాన్’ని ప్రశ్నలతో తికమక పెట్టి , దానయ్య మీద హత్యానేరం మోపబడిందనీ, అసలు హంతకుడు వేరే ఉన్నాడని తెలుసుకొంటాడు---ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం ---22

“ అదేమిటి, అలా అంటున్నారు? ఎంకన్న చనిపోయిన సంగతి అప్పుడే తెలిసి పోయిందా ?”

“ వాట్సన్  దొరగారికి  మీరు  లోపల  చెప్పారట  కదా, హతను  నాకీ  చెప్పారు.”

‘ ఓహో, దొరకీ  నీకూ  ఇంత  ఇంటిమసీ  ఉందా, లోపల  చెప్పిన  విషయం  అప్పుడే  బయటికి  వెళ్లిందే !’ అనుకొని, “ అవును ఖాన్ సాహెబ్ , దానయ్యని  అరెస్టు  చేసాను. వాణ్ని  బొక్కలోకి  తోయించి  నేరుగా  ఇక్కడికే  వచ్చాను. దానయ్య  చొక్కా  జేబులో  కొన్ని  కరెన్సీ నోట్లు  దొరికాయి. వాటిని  మీరు  ఇచ్చారని  చెప్పాడు—”

“ లేదు  ఠానేదార్  సాహెబ్ ! హంతా  జూఠ్ ! ఆ డబ్బు ఆ సైతాన్దే,  ఆంజనేయుడి  బొమ్మా  కోసం  నాకీ  లంచం  హియ్యడాన్కి  వచ్చాడు.”

“ అలాగా, మీరు  తిరస్కరించారు  అవునా ?”

“ హవును  సార్ ! హరామ్  డబ్బు,  అలాంటిది  నేను  ముట్టను !”

“ దానయ్య  ఆ డబ్బు  ఆచారి  కళ్ల  ముందే  మీకు  ఇచ్చాడా ?”

కరీం  తడబడ్డాడు, ఏం చెప్పాలో  తోచలేదు, అయినా  ఒక అబధ్ధం  చెప్పాక  మరొకటి చెప్పక  తప్పదు. అనుకొని, “ నాకే  కాదు  సార్, ఆచారికీ  కూడా ఇవ్వ బోయాడు. ’ అని అన్నాడు.

“ ఆచారికి  ఎందుకు  ఇవ్వ బోయాడు ?”

“ గనిలో  దొరికిన  బొమ్మలు, ఇవరాలు  చెప్పామని  హివ్వాబోయాడు.”

“ ఆచారి  కూడా  తీసుకోలేదా ?” అమాయకంగా  అడిగాడు  గోపాల్రావు.

“ లేదు, అప్పుడు  రెండు  కత్తులు  తీసి, మాకీ  బెదిరించి,  మ్యూజియం  లోపలికీ  తీసుకా  హెళ్లి  కట్టి  పడేసాడు.”

“ మరి  ఎంకన్నని  ఎప్పుడు  పొడిచాడు ?”

“ మాకీ  కట్టేయ్యడం  చూసి, హెంకన్న  మ్యూజియం  బయటకి  వెళ్లి, ‘ హెల్ప్, హెల్ప్ ’ అని అరిచాడు. అప్పుడు  ఆ సైతాను  అక్కడి  కక్కడే  హెంకన్నని  పొడిచేసాడు.”

“ అంటే  ఎంకన్నని  మ్యూజియం  బయటే  పోడిచాడా ?”

“ హవును, ఠానేదార్  సాహెబ్ !”

“ మీ ఇద్దరినీ లోపల కట్టి  పడేసాడు కదా, మీరు ఎంకన్నని పొడిచెయ్యడం ఎలా చూసారు ?”

కరీం  గతుక్కుమన్నాడు. “ కళ్లతో  చూడలేదు  సార్ ! ‘దిల్ సే’  అదే  మనసుతో  చూసాను.”

“ సరే , అర్థమయింది, ఎంకన్నకి  ఏమయిందో  మీ  ఇద్దరిలో  ఎవరికీ  తెలియదు. తర్వాత  జరిగిన దానిని  బట్టి, ఊహించారు  అంతేనా ?”

“ హవును సాబ్ ! అదే  సమజ్  అవుతోంది  కదా ?”

“ సరే, మరి  బొమ్మలు  ఎప్పుడు  దొంగలించాడు ?”

“ హెంకన్నని పొడిచేసి వచ్చి ,మ్యూజియంలో ఉన్నబొమ్మలన్నీ హెత్తుకా పోయాడు , సైతాను.”

“ అంటే  దానయ్య  బొమ్మలు  దొంగలించడం  మీరు, అదే  మీరిద్దరూ  చూసారన్నమాట ?”

“ హవును  సార్ !”

“ రేపు  కోర్టులో  కూడ  ఇలాగే  చెప్పండి, ఖాన్  సాబ్ ! ఎందుకంటే  మన  మాటలన్నీ  నా సెల్  ఫోనులో  రికార్డు  చేసాను.” అన్నాడు  ఇనస్పెక్టర్.

కరీం ఖాన్ కి  ఏం  చెప్పాలో  తోచలేదు. అంతలోనే  ఇనస్పెక్టర్  మరో  ప్రశ్న  వేసాడు. “ ఖాన్ సాహెబ్ ! డబ్బు  దానయ్యదే  అయినప్పుడు  ఆ డబ్బును  ఎంకన్నని  పొడిచేసిన  తరువాత  అక్కడ ఎందుకు వెదజల్లాడు ?”

“ నాకీ  తెల్వాదు  సార్ ! నేను  లోపలా  బంద్ అయిపోయాను  కదా !”

ఇంతలో  జీపు హారన్ వినిపిస్తుంది. మురుగన్ చెప్పిన  పని  చేసేసి  ఉంటాడని  ఇనస్పెక్టర్కి  అర్థమయిపోయింది, వెంటనే  జీపు దగ్గరకి  వెళ్లాడు.

(తరువాత భాగం రేపటి టపాలో) 

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...