Skip to main content

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--6)


( నిన్నటి టపాలో జరిగిన కథ==== ‘ కేసులు పురుగు నుండి పాము వరకు ఇంకా పూల నుండి హారం వరకు జయప్రదంగా పరిశోధించినా , బాధితులకి న్యాయం జరగక పోవడం వల్ల ఇంద్రనీల్ సంతాపానికి లోనవుతాడు. కాకీ బట్టలతో న్యాయం చేయలేనని అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొంటాడు. కానిస్టేబిల్ ౨౦౩కి ట్రాన్స్;ఫర్ అవుతుంది. .ముకబీర్ మురుగన్ కూడా వాచ్;మెన్ ఉద్యోగం వెతుక్కొంటాడు. ఇంద్రనీల్ ముందురోజు వర్షం నాటి రాత్రి తన ఇంటీకి వచ్చిన ఒక పిచ్చివాని మాటలు విని ప్రభావితుడవుతాడు--- ఇక చదవండి)
 

మొసలి కొలను మ్యూజియం 6

‘ మొసలి కొలను’ చిత్తూరు జిల్లాలోని ఒక కుగ్రామం ! వంద గడపలు కూడా లేని ఊరు. కొండ చరియల క్రింద , ప్రకృతి మాత ఒడిలో , అనాఘ్రాత కుసుమంలా ఒదిగి పోయి, ప్రశాంతతకి మారు పేరులాగ ఉంటుంది. ఒకప్పుడు చంద్రగిరిని పరిపాలించిన విజయనగర చక్రవర్తుల కాలంలో , ఆ ప్రాంతం  ఒక సూక్ష్మ బుధ్ధి అయిన ‘నియోగి మంత్రికి  దానంగా ఇవ్వబడింది. అతని తన పరివారంతో పాటు, కులవృత్తినే నమ్ముకొన్న నాలుగు కులాల వారిని చేరదీసి, ఆశ్రయ మిచ్చి, అక్కడ ఒక ఆదర్శ గ్రామాన్ని స్థాపింఛాడు . అలాంటి ప్రశాంతమైన గ్రామం , హఠాత్పరిణామానికి  గురి అయి అతలాకుతల మయింది.


    దానికి కారణం, ఆ గ్రామం ‘ భూతత్వ విఙ్ఞాన పరిశోధక సంస్థ ’ ( జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ) వారి దృష్టిలో పడింది. ప్రాథమిక పరిశీలనలో అక్కడ , ‘ లిగ్నైట్ గనులు’ ఉంద వచ్చని వాళ్లు ధృవీకరించి , ఆ వివరాలు ప్రభుత్వ పరం చేసారు. అయితే ఆ ఖనిజాన్ని త్రవ్వి తీయడం చాల ఖర్చుతో కూడిన పని అని , ప్రభుత్వ ఆర్థిక బృందం ‘ససేమిరా’ అనేసింది.. అందుకని ఉభయ తారకమైన ఉపాయం ఆలోచించి, ప్రైవేటు భాగస్వామ్యానికి, టెండరు పిలవడం జరిగింది. ఆ టెండర్ని పశ్చిమ భారత దేశనికి చెందిన , ‘ ట్రెజర్స్ & మైన్స్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ’ దక్కించుకొంది. త్రవ్వకాలలో లభ్యమయే ముప్ఫయి శాతం ఖనిజం ప్రభుత్వానికి ఇవ్వడానికి , మరో ఇరవై అయిదు శాతం చవక ధరలో ప్రభుత్వ సంస్థకే  అమ్మడానికి, తక్కిన  నలభై అయిదు శాతం ఓపెన్ మార్కెట్టులో లాభాలతో అమ్ముకోవ డానికి ఒప్పుకొని, ఆ కంపెనీ  ప్రభుత్వంతో ఎం ఓ,యు చేసుకొంది.


    కొన్ని రోజుల త్రవ్వకంలోనే  అక్కడ లిగ్నైటుతో పాటు ‘, ‘ బాల్ క్లే’  కూడా లభించ గలదని  ఆ కంపెనీ కని పెట్టింది. ఆ అన్వేషణ ప్రభుత్వ ప్రతినిధులకి తెలిసినా , అవినీతికి  అమ్ముడు పోయిన వాళ్లుమౌనం వహించారు. దాంతో ఆ కంపెనీ ,‘ బాల క్లే ’ త్రవ్వకానికి రంగం సిద్ధం చేసుకొంది. చూడడానికి అది  స్టోరేజీ  స్థలంలా కనిపించే లాగ జాగ్రత్తలు వహించింది.

    మురుగన్ ఇప్పుడు ఆ స్థలానికే , వాచ్ మేన్ గా  పని చేయడానికి  వెళ్లేందుకు   ఇంద్రనీల్ పర్మిషన్ అడిగాడు.


    “ మురుగన్ ! సంవత్సరం పాటు రెగ్యులర్ గా  హాజరీ ఇచ్చావు.  నీ మీద ‘ శిక్షాంతర ఖైదీ పునరావాస కేంద్రం కార్యదర్శి’ ‘ అమృత గారు’’ కూడా మంచి రిపోర్టుని ఇచ్చారు. అందు వలన ఇక మీద ప్రతీ రోజూ వచ్చి, హాజరీ ఇవ్వ వలసిన అవసరం లేదు. వాచ్ మెన్ ఉద్యోగం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నీ కుటుంబాన్ని ఇక్కడే ఉంచుతావు కాబట్టి, రెస్టు రోజున వచ్చి, ఆరు నెలల పాటు హాజరీ  ఇస్తే చాలు ! ఆ తరువాత  నువ్వు స్వతంత్రుడివి అయిపోతావు. నీ పునరావాసాన్ని నువ్వే స్వయంగా ఏర్పరచుకొన్నట్లు అవుతుంది. ఒక్ వేళ నీ ఉద్యోగం పోయినా, ఆ సంస్థ కార్యదర్శి అమృత గారు నీకు ఉద్యోగం కల్పిస్తారు.”


    ఇంద్రనీల్ మాటలు మురుగన్కి సంతోషాన్నీ, ఆశ్చర్యాన్నీ కూడా కలిగించాయి. తనని వారం పది రోజులకి ఒకసారి  వచ్చి కలిసే ‘ అమృతా మేడం’ ఒక సామాజిక సంస్థ కార్యదర్శి అని,  అతనికి ఇంతవరకు తెలియదు ! తన  పిల్లల  కోసం  ఏదో అభిమానంతో  బిస్కెట్లు, పెన్సిళ్లు లాంటివి తెస్తోందని అనుకొన్నాడు.    “ నీకు నిద్ర బాగా పడుతోందా , నిద్రలో కలలు వస్తాయా,  వస్తే ఎలాంటి కలలు వస్తాయి, సారాయి త్రాగుతావా, పెళ్లాన్ని ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్టావా ?” ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు  వేసేది, తన ప్రవర్తనని, తనలోని మార్పుని  కనిపెట్టడానికే అన్నమాట ! ఈ ఇంద్రనీల్ సారు ఎంత మంచివాడు ! తనకి చెప్పకుండానే తనమీద నిఘా పెట్టించి, అమృతా మేడం చేత తన భార్యకి ఉపాధి కల్పించి, తన పూర్తి స్వాతంత్రానికి వీలు కల్పించాడు ! 


    మురుగన్ భక్తితో, ఇంద్రనీల్ కి రెండు చేతులూ ఎత్తి, జోడింఛాడు. ఇంద్రనీల్  అతని భావాన్ని అర్థం చేసుకొని , అతని భుజాన్ని తట్టాడు. “ మురుగన్ ! నువ్వు నాకేమీ  ధన్యవాదాలు చెప్ప నవసరం లేదు. నేను నా డ్యూటీ  చేసానంతే ! నువ్వు పని చేయబోయే ,‘ మొసలి కొలను’ ఇకమీద మన, ‘టూనాట్ త్రీ ’ పరిథిలో ఉంటుంది. అంటే అతను ట్రేన్స్ ఫర్  అక్కడి దగ్గర్లో ఉన్న టౌనుకే అయింది. ఆ రకంగా మీ రిద్దరూ ఈ పోలీసు ఠాణాకి దూరమవుతున్నారు.”


    “ మీరు కూడా ఉద్యోగానికి రాజీనామా ఇస్తారని –”


    “ విన్నావా, అవును నిజమే ! ఈ వృత్తిలో నేను ఆశించే ఆత్మానందం, ఎడారిలో ఎండమావి లాంటి దని  తెలిసి పోయింది. అంతె కాక, రెండు రోజుల క్రిందట వర్షంలో తడిసి, వణికి పోతూ, నా పంచన నిలబడిన  ఒక ఉన్మాది మాటల ద్వారా నేను ఎన్నో జీవిత సత్యాలు నేర్చుకొన్నాను. అతని ‘ బాల శివయోగీంద్ర గారి ప్రకృతి చికిత్సాశ్రమంలో’ చెర్పించి, అతని ఉన్మాదాన్ని బాగు చేయించాలి !  ఆ పని అయ్యాక  నేను నా రాజీనామా ఇచ్చి వెళ్లిపోతాను.”


    “ ఎక్కడికి వెళ్తారు బాబూ ?” టూ నాట్ త్రీ ,మురుగన్ ఇద్దరూ ఒకేసారి అడిగారు.


    “ ఎక్కడికి వెళ్లాలో నాకే తెలియదు, ఏ పని చేపట్టాలో కూడా  తెలియదు ! మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే తప్పక కలుస్తాను. అంత వరకు ఆ పిచ్చివాడే నాకు మార్గదర్శి !”


(తరువాయి భాగం రేపటి టపాలో )

Comments

  1. శ్రీధర్ గారు వరసగా రోజూ చదువుతున్నా.

    ReplyDelete
    Replies
    1. సంతోషం కలిగిందండీ. మీకు నచ్చిన సన్నివేశం వచ్చినప్పుడు మళ్లీ కామెంట్ పెట్టండి. అలాగే ఇంకొకరికి చెప్పి చదివించండి.---శ్రీధర్.ఎ

      Delete

Post a Comment

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...