Skip to main content

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---34)


(నిన్నటి టపాలో జరిగిన కథ=== స్వార్థం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరనీ భావించే ఆలోచనా సరళి లొనే లోపం ఉందని, డిఫరెంట్’గా ఆలోచిస్తే తానెవరో తెలుస్తుందని అంటాడు దానయ్య. అలా అంటూనే ఏ స్వార్థం లేకుండా , మేలు చేసిన ‘అమర్ సింగ్’ కథ చెప్తాడు దానయ్య. --ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం----34


“ బదరీ  బాదరాయణ  సంబంధం  లాగ  ఉంది, కురుక్షేత్రానికి  దగ్గరగా  ఉండబట్టి  అలా అనుకొని  ఉంటారు.” అన్నాడు  ఇనస్పెక్టరు.


“ కావచ్చు !” 


“ రామా  రామ ! దుర్యోధనుడు  ప్రాణాలు  కాపాడుకోవడానికి  జలస్తంభన  చేసింది  కూడా  ఆ చెరువులోనే  కాబోలు !”


“ చూసారా, మీకు  కూడా నమ్మకం  కలుగుతోంది. ఇంతకీ  చెప్పొచ్చేదేమిటంటే,  ఏ స్వార్థాన్ని ఆశించి ,అమర్  సింగు  ఆ నేలని  త్రవ్వాడు అని.?”


“ రామా  రామ ! మీకు  కూడా  అమర్ సింగికి  వచ్చినట్లే  ఈ బొమ్మలు  ఇక్కడున్నట్లు కల  వచ్చిందా  సార్ ?”


“ నిజమే ! ఆ బొమ్మలు  నాకు  కలలోనే  కనిపించాయి. కాని  ఆ స్థలమేదో   తెలియ  లేదు.”


“ రామా  రామ ! మరి  ఆ స్థలాన్ని  ఎలా  కనిపెట్టారు  ?”


“ బొమ్మల పనితనం దక్షిణ  భారత దేశానిది  లాగ  అనిపించింది. వెంటనే పుస్తకాలు వెతికాను. ఆ పరిశోధనలో  ఉన్న  నాకు, పధ్నాలుగు  నెలల  క్రిందట , దానయ్యతో  పరిచయం  అయింది ! కుండ  పోతగా  కురుస్తున్న వర్షంలో  తల  దాచుకోవడాని కని  నా  పంచన  చేరిన  అతన్ని  లోపలికి  పిలిచి, మాటల్లో  దించాను. అతని  పిచ్చి  వాగుడు  నాకు  కావలసిన  సమాచారం ఇచ్చింది ! దానయ్యకి  తొమ్మిది  తరాల  ముందు  మనిషి, ప్రోలయ  నాయకుని కొలువులో  పని  చేసేవాడట ! దనంజయ  నాయకుడు  చేసిన  కంచు  బొమ్మలు  అతను  చూసాడట ! వెంటనే  ఆ దానయ్యని----”


ఇనస్పెక్టరు  అలర్టు  అవుతాడు, “ చెప్పండి, ఆ దానయ్యని  ఏం చేసారు ?”


“ పిచ్చి  నయమయేందుకు , ‘ బాల  శివ యోగీంద్ర గారి  ప్రకృతి  చికిత్సాశ్రమంలో ’ చేర్పించాను. దానయ్య  ఇప్పటికీ  చికిత్స  తీసుకొంటూనే  ఉన్నాడు.”


“ గుడ్ గాడ్ ! తరువాత  మీరు  దానయ్య  వేషంలో ,మొసలి కొలను’ చేరుకొన్నారు, అవునా ?”


“ ఆ బొమ్మలని  త్రవ్వి  తీయడానికి, పిచ్చి దానయ్యగా, మారిపోవడమే  మంచిదనుకొన్నాను. కాని నేను  ఇక్కడికి వచ్చేటప్పటికే ---”


“ రామా రామ ! ఇక్కడ  ‘ట్రెజర్సు & మైన్స్  కంపెనీ ’ ట్రెజర్ హంట్ ’ చేయడం మొదలు పెట్టింది, అంతేనా, రామా  రామ  ?”



“ ఆ కంపెనీ  త్రవ్వకాలలో  ‘వినాయడి బొమ్మ ’ బయటపడి, ఈ మ్యూజియం స్థాపనకి  ముందడుగు పడింది.”


“ రామా  రామ ! మొదటి అడుగు నుండి  చివరి అడుగు వరకు  చేరుకొన్నా, మీరెవరో  ఇంకా  ప్రశ్నార్థకంగానే  మిగిలి  పోయారు ?”


“ ఇనస్పక్టరు గారూ ! టు నాట్ త్రీ గారూ ! ఇదుగో  నా విజిటింగు  కార్డు,” అని  రెండు  కార్డులు తన  షరాయి బొందు  లోంచి  తీసి, వాళ్లకిచ్చాడు,“దీన్ని మీ దగ్గర  ఉంచుకొని, నన్నిక  రిలీజు  చేయండి” అని, వాళ్లిద్దరికీ  నమస్కారం  చేసి, కటకటాల  తలుపు తెరచుకొని  బయట పడ్డాడు  అతను !
టు నాట్ త్రీ  ఆ కార్డును  బిగ్గరగా  చదివాడు, ‘ ఇంద్రనీల్. కె. పినాక  పాణి’, ‘ రీసెర్చి  స్టూడెంట్  ఆఫ్ ఆర్కియాలజీ ’ అని  ఉందా కార్డులో’ .   
ఆ కార్డుని చదివిన  ట నాట్ త్రీ  ఆశ్చర్యంతో  నోరు వెళ్లబెట్టి  ,” రామా  రామ ! సారూ !  మీ దగ్గర పది  నెలలు  పని చేసినా  మిమ్మల్నే  పోల్చలేక  పోయాను  సారూ ! ” అంటూ వాపోయాడు.


“ టు నాట్ త్రీ ! ఇతను ఆ మాజీ  ఇనస్పెక్టరేనా ?!”


“ అవును  సార్ ! కాని  రామా రామ ! నాకో  చిన్న  అనుమానం  ఉండి పోయింది,  ఇతను మాజీ ఇనస్పెక్టరు  ఇంద్రనీల్ గారు  అయినప్పుడు, కంసాలి  లచ్చన్న  ముందు కంచు కరిగించి  బొమ్మలు  ఎలా  తయారు చేసి  ఉంటాడు ?”


“ ఎన్నో  డూప్లికేటింగు  మిషన్లు  ఉన్న  ఈ  రోజుల్లో,  అసలుకి  సిసలైన  నకలు  తీయడం  పెద్ద పనేమీ  కాదు ! మందు  జాగ్రత్త  కోసం  ముందుగానే  మ్యూజియం  అధికారులతో  మాట్లాడి, కొన్ని బొమ్మలకి   నకళ్లని  మిషన్ ద్వారా  చేయించి  ఉంటాడు, కంసాలి  లచ్చన్నకి  ఎదురుగా  కరిగించింది  కంచు మాత్రమే ! ”


“ రామా  రామ ! ఇంకో  చిన్న  సందేహం, సొంత  కూతురికి  తెలియకుండా  దానయ్య  పాత్ర  ఎలా  పోషించాడో ?”


“ ధనంజయ  నాయకునిలాగ  నటించి  మనని  నమ్మించ  లేదూ ! అయినా  పిచ్చివాడిలాగ  నటించడం  పెద్ద  చిక్కేమీ  కాదు.”


“ నిజమే, రామా  రామ ! కాని, అతనలా  వెళ్లిపోతూంటే  చూస్తూ  ఊరుకుండి  పోయారేం ?”


(తరువాత భాగం రేపటి  టపాలో)

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...