ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది. అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!! __ ఎ. శ్రీధర్ గారి చారిత్రక రచన పరిభూత సురత్రాణం చదవండి. ఈ రచన జూన్ నెల 3వ తా్రీఖు పొద్దులో పడింది. ……………. పరి భూత సురత్రాణం కనిబరిగె (గుల్బర్గా) లోని ప్రసిధ్ధమైన ‘కపిలేశ్వర దేవాలయంలో’ కపిలేశ్వరునికి అష్టోత్తర శతనామార్చన చేయించి శివోపస్థాన రూపమైన ద్విపద గీతిని ఆలాపించింది ‘అవనిజ’.. “రంగు మీరగ వచ్చి రమ కౌగలింప—బంగరు పుంఖపు ప్రభ కైతవమున కాలంబు వచ్చు నాకలి దీరునంచు—గాలినెయ్యుండు ముఖంబున డాగ తూణీర రూప పాథోరాశియందు---బాణ రూపంబున పవళించు హరిని గారవమున లేపి కరమున నంది—స్ఫార సుమేరు చాపంబున గూర్చి చికుర రూపంబగు జేజేల దారి- శకట రూపంబగు క్షమయును గదల శకటాంగ రూప భృచ్చంద్రార్కరుచుల—ప్రకటాట్టహాస ప్రభలు మించి పర్వ హుంకార భోధిత మురునభోవాటి-- నోంకార పటునాద ముగ్రమై వెలయ ధనురాయు మన చండ ధాటికి నదరి—మినుకుల గుర్రాలు మేనులు వంప “జయము నీ కగుగాక శంకరా” యనుచు-- హయ చో