Skip to main content

Posts

Showing posts from October, 2011

వృక్ష విలాపం --- ౩

గోవిందయ్య --- అదేంటమ్మా , అలా అంటావు, మనిషి చెట్టు అయిపోవడామేమిటి,నీకు మతి గాని పోలేదు కదా ? ఆశ --- లేదు మామయ్యగారూ , నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే మీరే పరీక్షించి చూడండి. గోవిందయ్య – నిజమా, తమాషా చేయడం లేదు కద ! (అంటూ అశోక్ దగ్గరకు వెళ్తాడు. వెళ్లి అశీక్’ని కదిపి, కుదిపి చాల రకాలుగా ప్రయత్నం చేసి చూస్తాడు. అశోక్ నిరుత్తరుడై ,స్థిరుడై , కదలక, మెదలక ఉంటాడు ) ఆశ – చూసారా మామయ్యగారూ, ఎంత అన్యాయం చేసారో, చెట్టునయి పోతానని మనకి చెబ్తూనే ఉన్నారు, ఏ మందు మాకూ తిన్నారో ఏమో చివరకి అన్నంత పనీ చేసారు. గోవిందయ్య --- అమ్మా, నేనొక కాలు, నువ్వొక కాలూ పట్టుకొని గట్టీగా లాగుదాం పద, కదుల్తాడో లేదో చూద్దాం ! ఆశ --- అలాగే మామయ్యగారూ ! ( గోవిందయ్య, ఆశ అశోక్ చెరొక కాలూ పట్టుకొని లాగుతారు. అశోక్’లో చలనం ఉండదు, కాని వారిద్దరూ స్టేజి మీద బొక్కా, బోర్లా పడతారు , అది చూసి గౌరి ఏడుస్తూ వాళ్ల దగ్గరకు వస్తుంది ) ( అశోక్ పైన గ్రీన్ స్పాట్ లైటు పడుతుంది. తక్కిన స్టేజి లైటింగు డిమ్ అవుతుంది. గోవిందయ్య, ఆశ , గౌరి ఫ్రీజ్ అవుతారు. అశోక్’లో చలనం వస్తుంది , స్టిల్’లో ఉన్న వాళ్ల చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తాడు. గోవీ