Skip to main content

Posts

Showing posts from July, 2010

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—10

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—10 ( దృశ్యము 47 ) ( వేంకటాచలం దిగువ కపిల తీర్థము ) ( మాధవుడు ఆ తీర్థ స్నానం చేసి, బయటికి వచ్చి, కొండకు నమస్కరిస్తాడు) మాధవ --- ఓ వేంకటాచలమా ! దర్శన మాత్రమున నా పాపములు దహించిన నీ వెంతటి మహిమాన్వితమగు గిరి రాజమవో కదా !! ( పద్యము ) సీ-- శృంగార రాయుని చెలువు మీరిన కొండ / ఫణిరాజ పేరిట పశిడి కొండ పుష్ప జాజుల, విష్ణు పూజింపగల కొండ / కల్ప వృక్షము లెల్ల గలుగు కొండ చిలుకలు, కోవెలలును చేరి యాడెడి కొండ / మృగజాతి కండ్లను మెలగు కొండ ఘోర దురితము లణచు, కోనేర్లు గల కొండ/ ఘనమైన మోక్షంబు గలుగు కొండ అమర వరులకు నాధారమైన కొండ / ఆళ్వారులకు ప్రత్యక్షమైన కొండ అలరు జూచిన బ్రహ్మాండమైన కొండ / యేను పొడగంటి శ్రీ వేంకటేశు కొండ. ( అని ఆ కొండను పొగిడి, ఆ తీర్థం ఎగువన ఒక గుహను చూస్తాడు. ఆ గుహలోకి వెళ్తాడు ) ( ఆ గుహలో కపిల మహర్షి కూర్చొని ఉంటాడు. మాధవుడు అతనిని చూసి, నమస్కారం చేస్తాడు. ముని కూడ కళ్లు తెరచి మాధవున్ని చూస్తాడు ) కపిల ---

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—9

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—9 ( దృశ్యము 40 ) ( నైమిషారణ్యము. సూత పౌరాణికుడు, శౌనకాది మహామునులు ఉంటారు ) సూతుడు -- శౌనకాది ముని సత్తములారా ! శ్రీమన్నారాయణుడు , కశ్యప మహర్షి నిర్దేశము వలన, కర్తవ్యోన్ముఖుడై తపస్సు చేయుటకు ‘ వేంకటాద్రికి’ బయలు దేరెను. శౌనక -- సూత మహర్షీ ! శ్రీమన్నారాయణుడు వేంకటాద్రిని చేరిన విధము, అతని కొరకు చిరకాల నిరీక్షణ చేయుచుంఢెడు, ఆదిశేష, పిపీలిక, తింత్రణీ వృక్షముల కోర్కె తీర్చి విధమును , మాకు తెలియ జేయుడు. సూతుడు – మునులారా ! శ్రీనివాసుడు వేంకటాచలమును చేరిన విధము, సావధాన చిత్తులై వినుడు. ****************** ( దృశ్యము 41 ) ( అడవి. శ్రీనివాసుడు నడుస్తూ ఉంటాడు. అతనిని ఆకాశంలోంచి , గరుత్మంతుడు, ఆంజనేయడు ఇద్దరూ చూస్తారు ) ( ముందుగా గరుడుడు శ్రీనివాసుని ఎదుటకు వచ్చి నిలుస్తాడు ) గరుడ -- ప్రభూ! నేను మీ భృత్యుడను, మీ వాహనమగు గరుడుడను ! నే నుండగా మీరు పాదచారులై, సంచరించుట, ఉచితము కాదు ! ప్రభూ ! మీరు నా వీపుపై విరాజమాను

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8 ( దృశ్యము 29) ( మధురలో కృష్ణాలయము. పూజారి, వైఖానస సాంప్రదాయానికి చెందిన గోపీనాథుడనే ఋషి ఉంటారు) ( వైఖానస ఋషి గర్భగుడి ద్వారం ముందు నిల్చొని ఉంటాడు. పూజారి హారతి ఇస్తూ ఉంటాడు ) ( ప్రవేశం-- విష్ణువు. నుధుటి మీద ఒకే ఒక నిలువు నామంతో సామాన్య బాలకునిలాగ ఉంటాడు ) ( అతను ప్రవేశిస్తూ ఉండగానే , వైఖానస ఋషి అతనిని చూస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకొంటాయి ) ( వైఖానసునుకి అతను ‘బాల కృష్ణుని’ లాగ, కనిపిస్తాడు.) ( విష్ణువు కృష్ణుని విగ్రహానికి నమస్కరించి మధురాష్టకం చదువుతాడు ) విష్ణు ------ శ్లోకం-- అధరం మధురం, వదనం మధురం, /నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, / మధురాధిపతే రఖిలం మధురం వచనం మధురం, చరితం మధురం/ వసనం మధురం, వలితం మధురం చలితం మధురం, భ్రమితం మధురం / మధురాతి పతే రఖిలం మధురం. (విష్ణువు మధురాష్టకం చదువుతున్నంత వరకు వైఖానస ఋషి, విష్ణువు ముఖాన్ని, కృష్న విగ్రహాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు ) విష్ణు ----- వేణూర్మధురో, రేణూర

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—7

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—7 ( దృశ్యము 23 ) ( బ్రహ్మలోకం-- బ్రహ్మ జపమాలతో జపం చేస్తూ ఉంటాడు ) ( నారదుడు ప్రవేశం ) నారద ------ నారాయణ, నారాయణ ! ( బ్రహ్మ కళ్లు తెరచి చూస్తాడు. నారదుని వంక చూసి చిరునవ్వు నవ్వుతాడు ) నారద ----- జనకా ! నమస్కారములు ! బ్రహ్మ ----- వత్సా ! ఆశీస్సులు ! నీవు వచ్చిన కారణము ? నారద ---- విధాతా ! కాల వైపరీత్యము వల్ల లక్ష్మీదేవి రసాతలమును, వైకుంఠమును వదిలి, భూతలమునకు ఎటు వెళ్లినదో తెలియనీయక మాయమైనది !, బ్రహ్మ ---- నారాయణుడు కూడ, ఆమెను వెదకుచు భూలోకమునకు బయలుదేరెను, అదియేనా ?— నారద ____ అదేయే జనకా ! వారిరువురు పోయిన జాడ తెలియక, నా మనసు ఆతుర పడుచున్నది ! బ్రహ్మ ---- నీ మనమున ఆత్రుతయా ! కలహమును ఎగత్రోసి, వారిని వేరుచేసినది నీవు ! ఇప్పుడు ఆతుర నందుట చిత్రముగా నున్నది ! నారద ----- తండ్రీ ! మీరిటుల అపహాస్యము చేసిన నేనేమి చెప్పగలను ? వైకుంఠమా రిక్తమయినది ! స్వామి భ్రమణ శీలులయినారు ! భక్తులకు వారి దర్శనమెట్లు కాగలదు ? బ్రహ్మ -----

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--6

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--6 ( దృశ్యము –18) ( వైకుంఠము. శ్రీ మహావిష్ణువు పాన్పుపై అరమోడ్పు కనులతో పడుకొని ఉంటాఢు . శ్రీ మహాలక్ష్మి అతని పాదసేవ చేస్తూ ఉంటుంది ). (భృగుడు ప్రవేశించి ఆ దృశ్యాన్ని చూస్తాడు ) భృగుడు ----- ( తనలో ) జామాత అరమోడ్పు కనులతో శయనించి ఉన్నాడు ! అనిమేష నయనుని నయనాలు, అరమోడ్పు లయినవి !! ఇక నా ధుహిత --- పతి పాద సేవలో ప్రపంచమునే మరిచినది !! వీరిరువురు యీ విధమున నుండిన భూలోక వాసులు సిరి సంపదలకు కరువైన వారయి, కడగండ్ల పాలవక తప్పదు !!! శ్రీవారు ప్రమత్తులయి శయనించి ఉన్న సమయమిది ! -- ఇదే మంచి సమయము--- లక్ష్మిని జాగృతమొనర్చెదను గాక !! ( భృగుడు నేరుగా వెళ్లి, శ్రీ మహావిష్ణువు గుంఢెల పైన కాలితో తంతాడు ) ( లక్ష్మి అదరి పడుతుంది ! విష్ణువు ఉలిక్కి పడతాడు. దిగ్గున లేచి భృగుణ్ని చూస్తాడు ) విష్ణు ---- తమరా, మహర్షీ ?! ( అని భృగువు దగ్గరగా వస్తాడు ) మీ రాక గమనించి గౌరవించ నందుకు, మంచి శాస్తియే చేసితిరి. భృగు మహర్షీ, మీరు సామా

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన –5

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన –5 ( దృశ్యము----- 13 ) ( బ్రహ్మ లోకం. బ్రహ్మ ఒక ఆసనం మీద కూర్చొని ఉంటాడు. ప్రక్కనే మరొక ఆసనం ఖాళీగా ఉంటుంది.) ( కొంత మంది ఋషులు అతనికి ఎదురుగా కూర్చొని ఉంటారు. బ్రహ్మ వారితో శాస్త్ర చర్చ చేస్తూ ఉంటాడు ) 1 ఋషి ------ బ్రహ్మ దేవా ! సృష్టికి, ప్రతి సృష్టిని విశ్వామిత్ర మహర్షి చేసాడంటారు ! నిజమేనా ? బ్రహ్మ ----- అవును, విశ్వామిత్రుడు, వశిష్ఠునితో సమానమైన బ్రహ్మర్షి అవాలని ఘోర తపస్సు చేసి, తనని వశిష్ఠుడు గుర్తించాలనే తపనతో ప్రతిసృష్టిని చేసాడు ! 2 ఋషి ---- అతను బ్రహ్మర్షి ఎప్పుడయ్యాడు ? బ్రహ్మ ----- గాయత్రి దర్శనం తరువాత ! గాయత్రి విశ్వామిత్రుని తపోబలం, సంకల్పం నుండి జన్మించిన, సత్త్వగుణ ప్రధానమైన దేవతగా, ప్రసిద్ధి పొంది, బ్రాహ్మణులకు ఆరాధ్య దేవత అయింది ! 3 ఋషి ----- బ్రహ్మ దేవా ! గాయత్రీ దేవి రూపాన్ని విశ్వామిత్రుడు ఏ విధంగా ఊఁహించాడు ! బ్రహ్మ ----- చాల అధ్భుతంగా ఊఁహించాడు ! 5 ముఖములు, 8 భుజములు. ముఖములలో మొదటిది ముత్యపు రంగ

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --4

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --4 ( దృశ్యము—12 ) ( భూలోకంలో భృగు మహర్షి ఆశ్రమం ) ( మహర్షి భృగు గొప్ప జ్యోతిష సంహిత రచించిన వాడు. ఆగతానాగత వర్తమానాలు క్షుణ్ణంగా తెలిసిన మహా ద్రష్ట. అతనికి ఎదురుగా శిష్యుడు ద్వారకా ఋషి కూర్చొని ఉంటాడు. భృగుడు తన సంహితలోని పాఠం చెప్తూ ఉంటాడు ) భృగుడు ---- వత్సా, ద్వారకా ! ద్వారక ----- గురుదేవా ! భృగుడు ----- జాతక చక్రం పరిశీలించి. ఆయుర్దాయ నిర్ణయం చెయ్యడం తెలుసుకొన్నావు గదా ! ద్వారక ----- మీ దయవల్ల అంతా కరతలామలకం అయింది. భృగుడు ---- నీ వంటి శిష్యుడు దొరికితే, అధ్యయనం నల్లేరు మీద బండిలా నడిచి పోతుంది ! ఇక ఈ రోజు నుంచి నవమ భావం గురించి చెప్తాను, విను. ద్వారక ---- చిత్తం గురుదేవా ! భృగుడు ------- (శ్లోకం ) -- “ భాగ్య, ధర్మ, దయా, పుణ్య తపస్తాత్, సుతాత్మజః దానోపాసన, సౌశీల్య, గురవో నవమాదమీ “” ( అదే సమయానికి కుటీరంలోకి ఒక పాము ప్రవేశిస్తుంది . ఆ పాము మహర్షికి ఎదురుగా రాబోయి, శిష్యుడు ద్వారకని చూసి, తిరిగి వచ్చిన దారినే వెనుకకు

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --౩

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --3 ( దృశ్యము 10 ) ( కైలాసం --- బ్రహ్మ, దేవతలు, ఋషి సమూహాము ప్రవేసిస్తారు ) ( శివ శంకరుడు ధ్యాన మగ్నుడై ఉంటాడు ) ( పాత్రలు -- బ్రహ్మ, దేవ ముని సమూహము, ఇంకా శంకరుడు ) బ్రహ్మ ---- ఓం నమశ్శివాయ--- దేవతులు --- ఓం నమశ్శివాయ--- ఋషులు ---- ఓం నమశ్శివాయ--- ( శివుడు ధ్యాన ముద్రనుండి బయట పడి, వారి నందరినీ చిరునవ్వుతో చూస్తాడు ) బ్రహ్మ ----- మహాదేవా ! మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు---- దేవతలు,/ఋషులు ---- మేమందరము క్షంతవ్యులము---- బ్రహ్మ ----- అనంత, అనిలుల మహాపోరాటము భూలోకము నందు సమస్యగా ఘనీభవించినది. మీ జోక్యము లేనిదే శాతించేలా లేదు. శివ ---- బ్రహ్మ దేవా ! మీరు, దేవతలు, మరియు ఋషుల ప్రతినిధులై మా ముందు వచ్చినందుకు, మేము చాల సంతసించితిమి. రండు, వారి పోరును ఆపి, లోక కళ్యాణమును జరిపించెదము గాక !! ( శివుడు, బ్రహ్మ, తదితర దేవ ఋషి సమూహములు అందరూ నిష్క్రమిస్తారు. ) ****************** ( దృశ్యము---11) ( భూలోకంలోని ఆనందాద్రి. ఆధ