Skip to main content

Posts

Showing posts from January, 2011

రత్న గర్భ యీ వసుంధర 2

రత్న గర్భ యీ వసుంధర 2 ”పడకా---” ” అవును. అది, ఇంట్లో మంచం మీద ఇలా మర్రి చెట్టు కొమ్మల్లో కాదు.” అతను తన ఉయ్యాల కేసి చూసాడు..” ఆ ఉయ్యాల్లో నా లేప్ టాప్ బేగు, బట్టలు ఉన్నాయి”--- ” మీరేం శ్రమ తీసుకోవద్దు, నేనే దాన్ని తీసి ఇస్తాను.” ” మీరా ! మీరెలా తీస్తారు, నేలకి చాల ఎత్తులో ఉందది.” ”చూస్తూ ఉండండి ఎలా తీస్తానో,” అంటూ నవ్వుల జల్లు కురిపించి, నందినిని ఆ చెట్టు క్రింద నిలబెట్టి, తాను దాని మీద నిలబడి ఆ కొమ్మ నందుకొని ఉయ్యాల ముళ్లు విప్పసాగింది పార్వతి ఉయ్యాలనీ దాంట్లోని సామాన్లనీ క్రింద పడకుండా పట్టుకొంటూ అడిగాడతను,” మీ పేరేమిటి ?” ”పార్వతి, మరి మీ పేరో”--- ” పశుపతి.” క్రిందకి దిగుతూ అంది పార్వతి.,” పశుపతి గారూ ! మీ సామాన్లన్నీ సరిగా ఉన్నాయా ?”” ” ఉన్నాయి, కొన్ని కాగితాలు తప్ప”— “ దానికి నేనేం చేసేది ! అది మా నందిని పొట్టలో ఉన్నాయి.” ”పోన్లెండి ! కనీసం అక్కడైనా చేరి, అవి పాలిస్తాయి, ఉండి నన్నేం ఉధ్ధరించాలి గనక”— పార్వతి కళ్లు విప్పార్చి అతని వంక చూసింది.’ ఏమిటితను, ఇల్లు వదిలి పారిపోయి వచ్చిన బాపతు కాదు గద !’ అనుకొంది.’అ

రత్నగర్భ యీ వసుంధర 1

రత్నగర్భ యీ వసుంధర 1 స్వస్తిశ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర , కార్తీక , బహుళ పంచమి , పునర్వసూ నక్షత్ర యుత, శుక్రవారం (రోమన్ కేలండరు ప్రకారం తేదీ ౨౬.౧౧.౨౦౧౦) నాటి రాత్రి . గొల్లకావిడి పడమర వాలిపోయింది. సప్తర్షి మండలం ఇంచు మించుగా, మధ్యభాగానికి వచ్చేసింది.పూర్ణ ( బహుళ పంచమి) చంద్రుడు జేగీయ మానంగా చల్లని కిరణాల్ని వెదజల్లు తున్నాడు. ఆకాశం నిర్మలమైన నక్షత్ర కాంతులతో చూడ ముచ్చటగా ఉంది. పెద్ద మర్రిచెట్టు , దాని ప్రక్కగా ఆంజనేయుడి గుడి, గుళ్లో దీపం గుడ్డిగా వెలుగుతూ, అప్పుడప్పుడు భగ్గుమని లేస్తోంది, కాసేపట్లో ఆరి పోవడానికి కాబోలు ! చెట్టు చుట్టూ వలయా కారంగా వెడల్పైన అరుగు నున్నని గచ్చుతో మెరుస్తోంది. గుడి ప్రక్కనే పెద్ద చెరువుంది. నాలుగు ప్రక్కల నుంచి, దాన్లోకి పావంచాలు ఉన్నాయి. నాచు కూడా విస్తారంగా పాకి ఉంది, ’పార్వతి’ మంచినీటి బిందెతో నలు ప్రక్కలా బిక్కు బిక్కు మని చూస్తూ , చెరువు దగ్గరకి వచ్చింది. తోడు తెచ్చుకొన్న ’నందిని’ ఆమె వెనకనే అర్థనిమీలిత నేత్రాలతో తాపీగా నెమరు వేసుకొంటూ, గంగడోలు ఊపుకొంటూ నడిచి వస్తోం

లక్ష్మి ఎందుకు అలుగుతుంది !?

లక్ష్మి ఎందుకు అలుగుతుంది !? లక్ష్మి ధనానికి అధిష్టాన దేవత. ఆమె అలుగుతే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ? ఆమె చంచలమైనదని , ఒకచోట నిలువదని అందరూ అంగీకరించిన విషయమే !.ఆమెని స్థాయీ రూపంలో ఇంట్లో నిలుపుకోవాలని ప్రతీ గృహ యజమానులే కాక, గృహంలో తక్కిన సభ్యులు సైతం ఎగబడడం కద్దు. కొందరు ధన ప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయడమే కాక, శ్రమని కూడా ఆపేస్తారు, అలాంటప్పుడు ఆమెని నిలుపుకోవడం ఎలా జరుగుతుంది ? ఇంతకీ ఆమె ఎందుకు అలుగుతుంది ? అలా అలగకుండా మనమేదైనా ఉపాయాలు చెయ్యగలమా ? అన్న ప్రశ్నకి తంత్రం సమాధానం ఇచ్చింది. వాటిలో కొన్ని నాకు తెలిసినవి పాఠకుల కోసం ఇస్తున్నాను.  మంగళ వారం నాడు అప్పు తీసుకోకూడదు, అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును స్థాయీ రూపంలో నిలిపివేస్తుంది..  బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు. అలా మాటిమాటికీ చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది.  తామర పువ్వులు , బిల్వ పత్రాలు నలప కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.  ఈశాన్య కోణంలో వంట ఇంటిని గాని శౌచాలయాన్నిగాని కట్ట కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.  పూజా గృహంలో ఎంగిలి, ఆశౌచము ఉంచ కూడదు, అలా చేస

మంగల్ పురోహిత్ థాం.

మంగల్ పురోహిత్ థాం. అది మూడంతస్తుల మేడ. దాని పేరు ‘మంగళ పురోహిత్ థాం !’ పేరు చూస్తే కళ్యాణ మండపంలాగ ఉంది కదూ, కాని కాదు, అది ఎముకల ఆస్పత్రి , దుర్ఘటనా గ్రస్తుల వైద్యశాల.! ముంబయి మహానగరంలోని ప్రసిద్ధి పొందిన మొదటి పదిమంది అస్థి శస్త్ర చికిత్సా నిపుణులలో ఒకరు, ప్లాస్థిక్ సర్జరీ నిపుణులలో మరొకరు అయిన ఇద్దరు సర్జన్లు, ముంబాయికి 46కిలో మీటర్ల దూరంలో, పన్వేల్ దగ్గర, పూనా_ గోవా హైవే ప్రక్కగా అనువైన స్థలంలో దుర్ఘటనకి లోనయిన దౌర్భాగ్యులని ఆదుకొనేందుకు దానిని నిర్మించారు. క్రింద భాగంలో డాక్టర్ ధనంజయ పురోహిత్ క్లినిక్ ఉంది అతను ఆర్థో పెడిక్ సర్జను. రెండవ అంతస్తులో ఆనంద మంగల్ క్లినిక్ ఉంది. అతని ప్లాస్టిక్ సర్జను. మధ్యలో రోగుల పడక గదులు, మూడవ అంతస్తులో డాక్టర్ల నివాసాలు ఉన్నాయి. ఆ రోజు జ్యేష్ట శుద్ధ నవమి ! మూడు నెలలుగా కాలి బొటనవ్రేలు వాచి, ఉబ్బిపోయి, కట్టిన పిండికట్లు బెడిసి కొట్టగా, రోజురోజుకీ పెరిగిపోతూ అసహ్యమూ, దుర్భరమూ అయి చివరికి కుళ్లిపోయి కంపు కొడుతూ ఉంటే, గత్యంతరం లేక ఆ ‘థామ్’కి వచ్చాడు

హాస్య సంజీవనీ థూమము

హాస్య సంజీవనీ థూమము ‘ శంకాకులమనే’ రాజ్యాన్ని,‘నిత్య శంకితుడనే’ రాజు పరిపాలిస్తున్నాడు. అతని తల్లి తండ్రులు, ఎంతో వెనుక చూపుతో (ముందు చూపుకి *) ముందుగా ఆ పేరుని కనినందువల్ల కాబోలు, అతనెప్పుఢూ చింతిస్తూనే ఉంటాడు. అతని చింతకి కారణం, ‘అగ్గిపుల్లా- సబ్బుబిళ్లా ‘ ఏదైనా కావచ్చు ! లేదా కాకపోనూ వచ్చు ! ‘ అగ్గిపుల్ల వెలగక పోతే చింత, వెలిగితే-‘ అయ్యో ! వెలిగి పోయిందే !’ అని చింత. ’సబ్బుబిళ్ల’ అరిగినా చింతే, అరగక పోయినా చింతే ! చింతకి కారణం కనబడక పోయేసరికి, ‘అయ్యో,ఈ రోజు చింతించడానికి ఏదీ లేదే !’ అన్న చింత.! ఇలా ఆ మహారాజు ఎప్పుడూ చింతాక్రాంత మగ్నుడై ఉండేవాడు. చితి శవాన్ని, చింత శరీరాన్ని, కాలుస్తుందంటారు. అతనిని చూస్తే ఆ మాట నిజమేనని అనిపిస్తుంది. నడివయసు రాకముందే,‘నెరసిపోయిన జుట్టు, లోతుకు పోయిన కళ్లు, అంటుకి పోయిన బుగ్గలు, చిక్కి సూదిగా మారి వంకర పోయిన ముక్కు,రాజరికపు దుస్తులు, హంగులూ మోయలేని సన్నని అస్థిగత శరీరమూ, అంతా కలిసి, ఒక జీవచ్ఛవం, అతని రూపం !’ చింత అతని శరీరాన్ని కాలుస్తూ ఉంటే, అతని సంపదనీ, వివేకాన్నీ భ్రష్టు

శ్రీ హరీ ! రాత్రిని రానీయకు ! భయానక భక్తుని కథ

శ్రీ హరీ ! రాత్రిని రానీయకు ! చీకటి రాత్రి లోని చీకటిని ,‘ హేడ్ లైట్లు ‘ చీలుస్తూ ఉండగా , ‘ఘాట్ రోడ్డు’ మీద మొరాయిస్తూ వెళ్తోంది బస్సు . ప్రహ్లాద రావు ‘కిటికీ; దగ్గర సీటులో కూర్చొని చూస్తున్నాడు. లోయలు ,లతలు, చెట్లు, రక రకాల రూపాలని తలపుకి తెచ్చే రాళ్ల గుట్టలు , వీటన్నిటి పైన ‘చీకటి’, నల్లని దుప్పటి కప్పేసింది .ఇక చేసేదీ, చూసేదీ లేక, ప్రహ్లాద రావు తన చూపును బస్సులోపలికి మరలించాడు. బస్సు డ్రైవరు గళ్ల టీ షర్టు వేసుకొని ,గుబురు మీసాలు ,స్థూల శరీరంతో , ‘కత్తుల రత్తయ్యను ’ తలపిస్తున్నాడు. కండక్టరు, క్లీనరు ఇద్దరూ ఖాకీ దుస్తులలో, సన్నగా, గెడకర్రల్లాగ, ‘రమణా రెడ్డిని’, ‘రాజ బాబునీ’ తలపిస్తున్నారు. ‘వాళ్లిద్దరినీ కలిపి ఒకటిగా చేసినా, ఆ డ్రైవరులో సగానికి వస్తారేమో !’ తన ఆలోచనకి తానే నవ్వుకొని సాటి ప్రయాణీకులని గమనించాడు అతను.ఇంచు మించు అందరితోనూ పరిచయం ఉందతనికి ! రెండు సీట్ల వెనకాల, ‘సంగీతం మేస్టారు’ చేతిలో వీణని జాగ్రత్తగా పట్టుకొని, సిల్కు లాల్చీ, పోలియస్టరు పంచెతో, చూడగానే గౌరవం కలిగించే ‘ముఖ సిరితో’ కూర్చొని ఉన్నాడు. అతని ప్రక్కనే అతని చెల్లెలు, నిండు నవ మాసాల గర్భిణీ స్త్

శిథిలాలయ దేవత 2

శిథిలాలయ దేవత 2 చరిత్రకారుడు – చూసారా మిలిటరీ వాళ్ల కాలు కమాండ్ మీదే కదులుతుంది ! మీకు నాకు కూడ ఈ ప్రయాణంలో ఎంతో మసాలా లభించింది. ఈ శిథిలాలయం వెనుక చోళరాజు, ఆనంద శ్రమణకులు, బుడతకీచు దొర !! అబ్బ ! ఎంత చరిత్ర దాగి ఉంది !! రచయిత --- ఆపవయ్యా నీ సొద ! మనం ఇక్కడ నుండి బయట పడి ఇల్లు చేరినప్పుడు కదా అదంతా !! ముందు ఆ విషయం ఆలోచించాలి. చరిత్రకారుడు --- అవును, అందుకు నాకు ఒకటే ఉపాయం కనిపిస్తోంది. రచయిత --- ఏమిటది ? చరిత్రకారుడు --- అద్భుత శక్తి వంతురాలైన ఈ దేవతే మనని ఇంటికి చేర్చాలి ! రండి, ఇద్దరం కలిసి ఆమెని ప్రార్థన చేద్దాం ! రచయిత --- దేవత పేరు, రూపం వగైరా తెలుస్తే ప్రార్థన సులువవుతుంది. మీరు చరిత్రకారులు కదా, ఈ చుట్టు పట్ల రాళ్ల మీద ఆమె వివరాలు దొరుకుతాయేమో చూడరాదూ ! చరిత్రకారుడు --- గుడ్ అయిడియా కవిగారూ ! ఇప్పుడే అన్వేషిస్తాను. ( కొంత సేపు వెతికాక ) కవిగారూ ! ఒక శిలా శాసనం మీద ఈ వివరాలు దొరికాయి. చదువుతాను వినండి.—ఈ మృగేంద్ర వాహనా దేవి ఆలయము , మహారాజ పరమేశ్వర వాకాటి కులాంభోధి చంద్ర, వాతాపి రాజ్య రమా రమణులైన శ్రీశ్రీశ్రీ తిమిర ప్రభువు చేత నిర్మింప బడినది. వ్యాపార నిమిత్తం, ‘జాఫ్నా’

శిథిలాలయ దేవత 1

శిథిలాలయ దేవత 1 ( రేడియో నాటిక ) (స్థలం ఓకశిథిలాలయ ప్రాంగణం ) ( చీకటి రాత్రి. భయంకరమైన నేపథ్య సంగీతం మధ్య ఈ క్రింది వ్యాఖ్య వినిపిస్తుంది ) వ్యాఖ్య --- ముప్ఫయి మంది ప్రయాణీకులతో బొంబాయి నుండి కొచ్చిన్ బయలు దేరిన స్టీమర్ , ‘జలపుష్ప’ ‘జాఫ్నా’ ద్వీపానికి కొంత దూరంలో , సుడిగుండంలో పడి మునిగి పోయింది. ఆ ప్రయాణీకులలో చావు తప్పి, తీర ప్రాంతానికి చేరుకొన్న వాళ్లే వీరిద్దరూ ! ఒకరు ‘రచయిత’, రెండవవాడు ‘ చరిత్రకారుడు’. రచయిత – అదుగో చూడండి ! అదేదో ఆలయంలాగ ఉంది. ఈ రాత్రికి మన్ కష్టం గట్టెక్కినట్లే ! చరిత్రకారుడు – నిజమే కవిగారూ ! అఙ్ఞాత ప్రదేశం లోని ఈ శిథిలాలయం , చావు తప్పి చేరుకొన్న మనకి ఫైవ్ స్టార్ హోటల్తో సమానం. రండి, లోపలికి వెళ్దాం. ( ఇద్దరూ ఆలయం లోకి వెళ్లబోతారు. తెరలో నుండి “ ఆగండి” అన్న గర్జన వినిపిస్తుంది ! ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఒక ‘రాజు’ ప్రవేసిస్తాడు ) రాజు – ఆగండి ! గర్భ గుడిలోకి దేవత దగ్గరకి వెళ్లి ఆపద కొని తెచ్చుకోవద్దు. రచయిత + చరిత్రకారుడు --- మీరెవరు స్వామీ? రాజు --- నేను జాఫ్నా దీవిలోని ‘ నీలాపురి’ ఏలికని ! చరిత్రకారుడు --- మీ తలపాగా తీరు చోళరాజుల కాలం నాటిదిలా ఉంద

24 అంకెలో గాయత్రీ దర్శనం

24 అంకెలో గాయత్రీ దర్శనం గాయత్రి మన జీవన శైలికి, చక్కని క్రమశిక్షణకి, సర్వ దేవతా వశమునకు పునాది. ఇది 24 అక్షరములు, ‘అ’ ,‘ఉ’, ‘మ’ అనే మూడక్షరాల సంపుటితో, ఏకాక్షర సంయుక్తగా ఏర్పడిన ‘ఓం’ అనే అక్షరంతో, మొదలయి బ్రహ్మర్షి విశ్వా మిత్రునిచే, మన మనుగడకు మూల మంత్రంగా సృష్టించబడింది. ప్రతీ అక్షరమూ చక్కని ప్రభావం కలిగి ఉంది. ఆ అక్షరాలు ఋషి, ఛంధస్సు, క్రమంలో చూస్తే, ఈ విధంగా గ్రహించవచ్చు. 1.వామదేవుడు 2.అత్రి 3.వసిష్టుడు 4.శుక్రుడు 5.కణ్వుడు 6.పరాశరుడు 7.విశ్వామిత్రుడు 8.కపిలుడు 9.శౌనకుడు 10.యాఙ్ఞవల్కుడు 11.భరద్వాజుడు 12.జమదగ్ని 13.గౌతముడు 14.ముద్గలుడు 15.వేదవ్యాసుడు 16.లోమశుడు 17.అగస్త్యు 18.కౌశికుడు 19.వత్సుడు 20.పులస్త్యుడు 21.మాండూకుడు 22.దూర్వాసుడు 23.నారదుడు 24.కశ్యపుడు ఇప్పుడు యీ ఇరవై నాలుగు అక్షరాలేమిటో పరిశీలిద్దాం. ( ఓం భూః, ఓం భువః, ఓం సువః = ఓం భూర్భువత్సువః ) త (1) త్సవితు (4) వరేణ్యం (7) భర్గో (9) దేవస్య ( 12 ) ధీమహి (15) ధియో (17) యోనః (19 ) ప్రచోదయాత్ (24) ఈ24 అక్షరాలకి ఋషులని తెలుసుకొన్నాం కదా ! ఇప్పుడీ ఋషుల

రెండున్నర నెలల విరామం తరువాత---

రెండున్నర నెలల విరామం తరువాత--- నవంబరు ౫ తరువాత ‘ క్షీర గంగలో ’ టపా పెట్టడం జరుగ లేదు ! దానికి కారణం నా చిన్న కూతురి యొక్క , చాలా విలువైన ‘గర్భధారణ, ప్రసవం !’ చాలా విలువైన గర్భధారణ అని ఎందుకంటున్నానంటే, అది సహజమైనది కాదు, పరీక్ష నాళిక ద్వారా జరిగిన గర్భధారణ ! నా చిన్న కూతురి పేరు ‘ఇ౦ద్రాణి’, ప్లస్ టూ తరువాత, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలో పోలిటెక్నిక్ డిప్లొమో చేసింది. ఆ విద్యార్హత ఉన్న కారణంగా, రైల్వేలో అతి చిన్న క్లాసు ఫోరు ఉద్యోగిగా ప్రవేశించింది. ఆ తరువాత అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ , డిపార్టుమెంటు పరీక్షలో అసాధారణ ప్రతిభ కనబరిచి, జూనియర్ ఇంజనీయరుగా పదోన్నతి పొందింది. రైల్వే శాఖలో పదేళ్లలో అతి చిన్న స్థాయినుండి, సూపర్వైజరు స్థాయికి ఎదగడం అబ్బురమే మరి ! ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగం లభించడం వల్ల , ఆమె వివాహం జరిగింది. ఆమె భర్త శ్రీ జోగారావు రైల్వేలోనే ‘గార్డుగా’ పని చేస్తున్నారు.అతనిది పశ్చిమ రైల్వేలో పని ,అమ్మాయిది దక్షిణ మధ్య రైల్వేలో పని, ఇద్దరూ ఉద్యోగ రీత్యా చెరొక దిక్కులోనూ ఉండేవారు ! చివరికి ఎంతో ప్రయత్నము, నిరీక్షణ తరువాత పదేళ్లకి అతనికి బదిలీ మంజూరు అయి, ఆమె ఉన్న చ