Skip to main content

Posts

Showing posts from June, 2011

విరిసిన హరివిల్లు---( స్పెషల్ స్టోరీ ) 3

పది రోజులు తరువాత ఒక రోజు సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో ఒక కుర్రాడు నన్ను ఆపి, ఒక ఉత్తరాన్ని చేతికిచ్చి, పరుగు తీసాడు. ఆశ్చర్యంతో ఉత్తరాన్ని చూసుకొన్నాను, నా పేరే ఉంది దాని మీద! కుతూహలంతో ప్రక్కనే ఉన్న మైదానం మీదకి వెళ్లి, లైటుస్తంభాన్ని ఆనుకొని ఉత్తరం తెరచాను. ‘ ఎలా వ్రాయమంటావు తమ్ముడూ! ఈ ఉత్తరాన్ని, ఏమని వ్రాయాలి ? ఏదో ఒక దౌర్భాగ్యపు సంవత్సరం అది ! మధ్య తరగతి గ్రామం లాంటి ,‘ డొంకిన వలసలో’ ఆడపిల్లనై ,తల్లిని మ్రింగి పుట్టాను నేను. అయినా నా వ్యధాపూరిత బాల్య జీవితాన్ని గురించి వేరే చెప్పడం దేనికి ? ఎంత వర్ణించినా అది నీ ఊహా శక్తికి క్రిందుగానే ఉంటుంది ! ఒకానొక పూర్ణిమా శరత్తులో, నా ఇరవై ఒకటవ ఏట, ఇల్లు విడిచి పరుగెత్తాను నేను ! ఒక కన్నెపిల్ల ఇల్లు విడిచి పోవడానికి కారణాలేముంటాయి గనుక ! సవతి తల్లి రాపిడి, తండ్రి ఏరికోరి తెచ్చిన ముసలి వరుడు, ఉబికే ఆశలు, ఉద్రేకాన్ని తీర్చలేని పేదరికం, --- వీటిలో ఏ ఒక్కటైనా చాలు. కాని నా దౌర్భాగ్య స్థితి ఏమని చెప్పమంటావ్ ? ఇవన్నీ కలిపి చుట్టుముట్టాయి నన్ను. పరిస్థితుల ఒత్తిడి నా మీద ఎంత తీవ్రంగా పని చేసిందంటే, రైల్వే స్టేషన్ వైపు నడిచాను నేను. ‘ రాయపూరు

విరిసిన హరివిల్లు—( స్పెషల్ స్టోరీ ) 2

నేను వెళ్లేసరికి అతనేదో డిటెక్టివ్ పుస్తకం చదువుతున్నాడు. నన్ను చూసి మామూలు ధోరణిలో పలకరించి కూర్చో బెట్టాడు. నేను అడగకుండానే తనకి తెలుగులో విశేషమైన పరిచయం లేదనీ, డిటెక్టివ్ పుస్తకాలు చదవడం తప్ప మరొకటి చదవడం రాదనీ, ఒక చిన్న అల్మైరా నిండా నిండిన,‘శవ సాహిత్యం ’ చూపెట్టాడు. నా పుస్తకం సంగతి అడుగుదామని అనుకొనే సరికి లోపలి నుండీ పిలుపు వినిపించింది. వెంకటచలం కూడా కళ్లతోనే నిర్దేశించాడు,“ లోపలికి వెళ్లు” అని. ఎన్నెన్నో ఊహలు వెంటాడుతుంటే లోపలికి వెళ్లాను. ఎర్ర గులాబీ అంచు మల్లె రంగు చీరలో ‘శశికళ’ మూర్తీభవించి ఎదురై నా అంచనాలని తారుమారు చేసింది. “ నీకా పుస్తకం అంత అవసరమా తమ్ముడూ ?” పెద్ద టేకు చెక్క బీరువా నుండి, నేనేనాడూ చూడ్డానికి కూడా నోచుకోని పుస్తకాల దొంతరల లోనుండి ,‘సాక్షిని ’ తీసి ఇస్తూ అడిగిందామె. ‘ ఇంత మంచి సాహిత్యాన్ని అభిమానించ గల ఈమె చరిత్రహీన ఎందుకవుతుంది ?’ “ ఫరవాలేదు, మీరు చదివిన తరువాతనే ఇయ్యండి,” అన్న మాటతో బయటపడ్డాను. ఆ తరువాత చెప్పవలసినది ఏముంది? నాకూ ఆమెకీ సంబంధం సాహిత్యానికి చెందినంత వరకూ ధృడతరమయింది. ఒకరోజు ఎప్పటిలాగే ఆమె దగ్గరనుండి తెచ్చిన, ‘దశకుమార చరిత్ర’ చదువుతున్నాను

విరిసిన హరివిల్లు--- ( స్పెషల్ స్టోరీ )--1

ఇది అన్ని కథల లాంటిది కాదు ! ధృఢమైన సమున్నత కాయమూ, సూదిగా కోటేరు లాంటి ముక్కు, గాంభీర్యము మూర్తీభవించినట్లుండే ముఖం, ఆలోచిస్తున్నట్లుండే కళ్లు, ఇంచు మించు అర అంగుళం లోతైన గడ్డమూ, పట్ట విడిచిన నుదురు కలిగి నలభైవ పడిలో పడ్డ ‘వెంకట చలం’ కథానాయకుడూ కాలేడు. అయినా నిజమైన జీవిత చిత్రణ కథలా ఉంటుందనీ, ఎన్నదగిన రూప సంపద, లెక్కించదగిన గుణాలు కలవాడే ‘కథా---నాయకుడు’ కావాలనీ అనుకోవడం పొరపాటేనేమో ! 1964 వ సంవత్సరం జూలై నెలలో కాబోలు , ‘ఖరగ్ పూరు రైల్వే వర్క్ షాపులో’ ట్రైనీగా పని చేస్తున్న రోజులవి. వెంకట చలాన్ని మొట్ట మొదటి సారిగా చూసాను నేను. “ మీరు ఈ రోజు ఇతనితో పని చేయండి” అన్న చార్జిమేన్ మాటల ననుసరించి కావలసిన పనిముట్లు తీసుకొని,‘ చలం’ వెనుక బయలుదేరాను అతనితో పని చేసిన నాలుగు గంటలలోనే , 22 ఏళ్ల సర్వీసు తీర్చి దిద్దిన పనివాడని తెలుసుకొన్నాను. పని అంతా ముగించుకొని, పంపు దగ్గర చేతులు కడుగుకొనే సమయంలో ఎవరో అడిగారు, “ వెంకట చలంతో పని చేసారా ?” అని. అవునన్నట్లుగా తల ఊపాను. అంతే ! అతనితో పాటు అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు ! “ ఏం?” అని ఆశ్చర్యంతో అడిగాను. “ ఇంకా నిన్న మొన్న సర్వీసులో చేరిన కుర్రాడ

ఆనంద భైరవి.-----(100+)

అయిదు వందల శరత్తుల క్రిందటి మాట. కాపాలిక సాంప్రదాయ వాదులు అప్పట్లో ‘రుద్ర భైరవ’ పూజలు జరిపే వారు, కొండలు, కోనలు,లాంటి దుర్గమమైన రహస్య స్థలాలలో..వాళ్లందరి పేర్లు భైరవులే’ ! ఒకరు కాల భైరవు డయితే,తక్కిన వారు, ‘వీర భైరవ, విజయ భైరవ, నాధ భైరవ, జిత భైరవ, మదన భైరవ’ లాంటి పేర్లతో ఒకరినొకరు పిలుచుకొనే వారు. ‘వాళ్ల సాధనలో ‘పంచ మకరాలు’ ముఖ్య మయినవి.పంచ మకారాలంటే, మద్యము, మాంసము, మత్స్యము, మదిర, చివరగా అయదవది ‘మగువ’ ! ఆ మగువల పేర్లు కూడా, ‘కరుణ భైరవి, అరుణ భైరవి, దివ్య భైరవి, నాగ భైరవి, ముగ్ధ భైరవి, స్నిగ్ధ భైరవి’,ఇట్లాంటి పేర్లతో పిలిచే వారు. ఒక్కొక్క తండాకి ఒక గురువు ఉండేవాడు.గురువు మాట వారికి రుద్ర భైరవుని ఆఙ్ఞతో సమానం ! పంచ మకారాలతో ‘రుద్ర భైరవ’ సాధన, కాపాలికుల జీవితాశయం ! వాటిలో ఒకటైన మగువల కోసం వారు పడరాని పాట్లు పడేవారు. జన పదాలకు వెళ్లి, చిన్నారి ముక్కు పచ్చలారని బాలికలని అపహరించి, తమ గుహల లోకి తరలించి, పెంచి పెద్ద చేసేవారు. భైరవీ సాంప్రదాయానికి అనుగుణంగా వారిని మలచుకొనే వారు. ఆ పనిని వృధ్ధులైన భైరవీ మాతలు నిర్వర్తించే వారు. అలాంటి ఒక స్నిగ్ధ భైరవిని, మొట్ట మొదటి సార

ప్రకీర్ణకము

[ ధర్మాధర్మ , ఉచితానుచిత, న్యాయాన్యాయ విధులను, వివిధ వాఙ్మయ ధారల నుండి సేకరించి గ్రుచ్చెత్తిన ప్రకీర్ణకము] 1. ఙ్ఞానాన్ని పొందాలని ఆశించే వ్యక్తి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తదితర హీన నిమ్న మరియు హూణ జాతుల లోని ఏ వ్యక్తి నుండి అయినా దానిని అనగా ఙ్ఞానాన్ని సముపార్జించవచ్చు, అందులో దోషము లేదు. ( మహాభారతం—శాంతిపర్వము ౩౧౮/౮౮; మనుస్మృతి-- ౨/౨౩౮; భవిష్యపురాణం –బ్రహ్మ పురాణం ౪/౨౦౭) 2. శాస్త్రాధారము లేకుండా కేవలము మౌఖికంగా, ప్రాయశ్చిత్త, చికిత్స, జ్యోతిష, ఫలాదేశములను చెప్పే వ్యక్తి బ్రహ్మహత్యా పాతకము చేసిన వానితో సమానుడు అవుతాడు.( నారద పురాణం—పూర్వ ౧౨/౬౪) 3. రేపటి దినము చేయవలసిన విధిని నేడు, సాయంత్రము నిర్వర్తింప దలచిన విధిని ప్రాతఃకాలమందే పూర్తిచేయవలెను, ఎందుకంటే మృత్యువుకు కార్య పరిసమాప్తితో నిమిత్తము లేదు.( విష్ణుస్మృతి – ౨౦) 4. ఇవ్వ వలసినవి, పుచ్చుకో వలసినవి మరియు యోగ్యమయిన సుకర్మలను శీఘ్రముగా చేసివేయవలెను, ఏలననగా కాలయాపనము వాటి రసమును పీల్చివేయును.( హితోపదేశము –సంధి ౧౦౧ ) 5. అనేక కార్యములను చేయవలసి వచ్చినప్పుడు, బుధ్ధిమతి అయిన వ్యక్తి సుయోగ్యమైన కార్యములను సత్వరము చేయవలెను. లౌకి