Skip to main content

Posts

Showing posts from March, 2016

ప్రేమ, వంచనకి చిరునామా!---8 (చిలక రథంలో సరదా షికారు -- పార్టు 2)

అవి కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన రోజులు. క్రీ :శ: 1325 నుండి 1335ల మధ్య కాలం! దక్షిణాపథం(దక్ లన్), దక్షిణ దేశం (తమిళ), డిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. వీటిని ‘దేవగిరి, తిలింగ్(తెలంగాణా), కంపిలి, ద్వార సముద్రం, మాబర్ (మధుర) అనే అయిదు రాష్ట్రాలుగా విభజించి పరిపాలించారని చరిత్ర కారులు చెప్తారు.   ఆ రోజులలో అరాజక పరిస్థితి ద్రవిడ దేశంలో ఏర్పడింది! ధనవంతులు ధన నిమిత్తం పిడింపబడే వారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకి రక్షణ ఉండేది కాదు. సుల్తాను ఎంతో దూరంలో ఉండడం వల్ల అతని ప్రతిని ధులు స్వార్థంతో తమ తమ బొక్కసాలు నింపుకోవడం కోసం ఎన్నెన్నో దుష్క్రుత్యాలు చేసేవారు!           ఇలా అరాజక స్థితికి లోనైన దక్షిణ భరత దేశానికి విముక్తి కలిగించడానికి,’కాకతి ప్రతాప రుద్రుని సేనానులైన తెలుగు నాయకులు ఆంధ్ర దేశం లోను, కర్ణాటకి పాలకుడైన, 3వ బళ్ళాలుడు విముక్తి ఉద్యమాలని నడిపారు. ఆంద్ర దేశం లోని ముక్తి సేనకి ప్రోలయ నాయకుడు నడుం బిగించాడు. అతనికికొంత మంది కమ్మ నాయకులు, రెడ్డి నాయకులు బాసటగా నిలిచారు. వారిలో మన కథానాయకుడు ధనంజయుడు ఒకడు. ధనంజయ నాయకుడు శిల్పము, నాట్యము, చిత్ర లేఖనము లాంటి లలిత కళలలో

ప్రేమ, వంచనకి చిరునామా! --7 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )

సూర్య చరణ్ ముందుగా తేరుకొని లేచి వెళ్లి తలుపు తీసాడు. ఎదురుగా కేశవ్ గుప్త నిలబడి ఉన్నాడు, “మే ఐ కమిన్” అంటూ. “లోపలికి రండి అన్నయ్య గారూ! ఏమిటిలాగ దయ చేసారు?” అని పలకరించింది శ్రీ లలిత. కేశవ్ గుప్త లోపలికి  వచ్చి సోఫా పైన కూర్చొన్నాడు. “ అమ్మా, చెల్లెమ్మా! నువ్వే నన్ను కాపాడాలి! మంజీర మన స్థితి మళ్ళీ పాడయింది. ఒక సైక్రియాటిస్టుగా నేను మీ ఇరువురినీ ఒక ఫేవర్ అడగడానికి వచ్చాను. నాకు సహాయం చెయ్యండి” అన్నాడు. “ఆయ్యో! ఏమయింది అన్నయ్య గారూ! మంజీర మునుపటి లాగ లేదా?” “లేదు చెల్లెమ్మా! మునుపటి లాగ 'సైలెంట్'గా' లేదు, 'వైలెంట్' అయిపొయింది. దానిని మీరిరువురే కాపాడ గలరమ్మా!” “మేము ఏమి  చెయ్యగలమో, ఏం చెయ్యాలో చెప్పండి కేశవ్ గుప్తాగారూ!” అని అడిగాడు  చరణ్. “మిస్టర్ చరణ్! మీ రూపం వైభవ్’తో కలుస్తోంది, ఆ విషయం మీకు ఇది వరకే తెలుసు! మీరు వైభవ్’లాగే నటించి మంజీర జీవితాన్ని సరి దిద్దండి. ఆమెకి వైభవ్ ఈ లోకంలో లేడన్న విషయం తెలియదు.ఆమె మనసు ఒక సారి స్వస్థత చెందితే, నెమ్మదిగా దానిని ఆమెకి తెలియజేయ వచ్చు! అప్పుడు ఆమె కుదుటబడి విధి విధానాన్ని అంగికరించి జీవితాన్ని రాజీ మార్గంలో గడు

ప్రేమ, వంచనకి చిరునామా!--6 (చిలక రథంలో సరదా షికారు --పార్టు-2 )

వైభవ్! ఎక్కడున్నావు, అసలు ఈ మంజీరని విడిచి ఎలా వెళ్లి పోయావు? నువ్వు ‘కాటుక పిట్టలనీ, కలువల కొలనులనీ, పౌరుష సూదంటు రాళ్లని, గేలమేసి లాగ గలిగే ఆకర్షక అయస్కాంత యంత్రాలనీ, కటాక్షిస్తే ఆమనులనీ, వర్షిస్తే పయోధరాలనీ వర్ణించే నా కళ్లు’ నీ కోసం చూసి చూసి వేసారి, విసుగెత్తి, ‘ తేజస్సునీ, ఆకర్షణనీ, ఆర్ద్రతనీ’ కోల్పోయి కాయలు కాచాయి! త్వరగా వచ్చేయవూ? నీ కోసం ఎదురు చూసే లవ్లీ మంజీర. కేశవ్ గుప్త ఇంటిలో మంజీర గది లోంచి వచ్చిన కాగితాలలో ఒకదాన్ని, ‘తన లల్లీకి’ బిగ్గరగా చదివి వినిపించాడు సూర్య చరణ్.     శ్రీ లలిత, గమ్యానికి చేరని ఉత్తరం లోని ఆవేదనని విని, భావుకతకి లోనై కంటి వెంట కన్నీరు కార్చింది. ఆ కన్నీరు సూర్య చరణ్ బుగ్గల మీద పడింది, అలా పడక ఏం చేస్తుంది! అతనామె ఒడిలో పడుకొని ఉన్నాడు మరి ! ఆ కన్నీటి తడికి చరణ్ ఎలర్ట్ అయ్యాడు. “ఏయ్, ఏమిటిది లల్లీ! నువ్వు కంట తడి పెట్టావా? అది కూడా ఈ చరణ్ నీ ఒడిలో సేద తీర్చుకోవడానికి విశ్రమించి ఉండగా! నో ఎందుకంత ఎమోషనల్ అవుతావు, మనకి సంబంధం లేని విషయాలలో!” అని అన్నాడు. “సంబంధం లేని విషయం కాదు, చరణ్! మంజీర నన్ను ‘చెల్లీ ’ అని పిలిచింది, నా అక్కకి ‘ పతీ  వ

ప్రేమ, వంచనకి చిరునామా!--5 (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2 )

ఇద్దరు కారు దిగి మహల్ లోపలికి అడుగు పెట్టారు. మహల్ యొక్క లౌంజు అద్భుతంగా అలంకరించబడి ఉంది! విజిటర్లు కూర్చునేందుకు, మూడు రకాల సోఫా సెట్లు వేర్వేరు రకాల థీమ్  ప్రకారం అమర్చబడి ఉన్నాయి.నేలంతా కాశ్మీరు తివాచీలతో కప్పు బడి ఉంది. రెండు వైపులా నుండి ఎర్రని తివాచీలు పరచి ఉన్న విశాలమైన మెట్లు, ఆ మెట్లు కలసే చోట గోడలకి పెద్ద పెద్ద వాల్’హేన్గింగ్సు వ్రేలాడుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది నవాబుల హవేలీ లాగ ఉంది!! “రండి శ్రీ లలిత గారూ! వచ్చి ఇల సోఫా మీద  కూర్చోండి. మీ కోసం మంచి స్పెషల్ కాఫీ తెప్పిస్తాను అంటూ “రంగమ్మా!” అని కేక వేసాడు కేశవ గుప్త. రంగమ్మ వంటింటి నుండి హడావిడిగా వచ్చి,”ఏమిటి బాబుగారూ?” అని అడిగింది. “రంగమ్మా! ఈవిడ శ్రీ లలితమ్మ గారు! మంజీర లాగే నాకు చెల్లెలు లాంటిది, ఈమె కోసం మంచి స్పెషల్ కాఫీ, కొన్ని స్నేక్సు పట్టుకొని రా, నా కోసం టీ!” “ అలాగే బాబుగారూ!” అని, రంగమ్మ శ్రీ లలిత వైపు చూసి “నమస్కారం అమ్మగారూ! మీకు ఏమీ కావలసినా నన్ను అడగండి, నేను చేసి పెడతాను, వారం పది రోజులు ఉంటారా అమ్మగారూ?” “అబ్బే! లేదు రంగమ్మా, ఆవిడది ఈ ఊరే! మన ఇల్లు చూడడానికని వచ్చేరు, మంజీర ఏం చేస్

ప్రేమ, వంచనకి చిరునామా!--4 ( చిలక రథంలో సరదా షికారు--పార్తు2 )

తనకి దగ్గరగా వచ్చి, ప్రక్కనే నిలబడ్డ ‘మహేంద్ర లోగాన్’ కారుని ఆశ్చర్యంతో చూసి, అప్రయత్నంగానే ఆగి పోయింది శ్రీ లలిత. ఆమె ప్లాస్టిక్ బుట్ట పట్టుకొని, కొన్ని పళ్ళు ఇంకా గ్రోసరీ సామాన్ల కోసం, దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్’కి కాలి  నడకనే వచ్చింది. దగ్గరే కదా అని తన బైకు తీయలేదు. తను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కూడా గ్రేకలర్ లోని ఆ కారును చూసింది, అంటే ఈ కారు తనని ఫాలో చేస్తోందా! లేక అడ్రస్ దొరకక ఇటు, అటూ తిరుగుతోందా? ఆమె ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే, ఆ కారు డ్రైవరు తలుపు తెరచుకొని ఆమెకి ఎదురుగా వచ్చాడు.  “మేడం! ఒక్క నిముషం మీరు ఏమీ అనుకోక పొతే ఈ అడ్రెస్సు ఎక్కడ ఉందో చెప్తారా?” అంటూ ఒక కాగితాన్ని ఆమెకి చూపించాడు. శ్రీ లలిత ఆ కాగితాన్ని చూసింది, ఆశ్చర్యం! ఆ కాగితం మీద ఉన్నది తమ ఇంటి అడ్రస్సే! ‘అంటే వీళ్ళు తమ ఇంటినే వెతుక్కొంటున్నారు. అయినా తనతో గాని చరణ్’తో గాని వీళ్ళకేం పని! ఎవరు వీరంతా?’ ఎన్నో సందేహాలు తలెత్తాయి ఆమెలో! “మేడం! ఈ అడ్రెస్సు మీకు తెలుసా?” “తెలుసు, కాని ముందు ఈ విషయం చెప్పండి. సూర్య చరణ్ గారిని ఎందుకు కలియాలని వెళ్తున్నారు?” “మేడం! మేము ద్రాక్షారామం నుండి వస్తున్నాం, అక

ప్రేమ, వంచనకి చిరునామా! --3 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2)

పై బెర్తు మీద కలవరపాటుకి (సూర్య చరణ్’కి) కలత నిద్రే గతి అయింది! అలా రాత్రి మూడు గంటలు అయింది. రైలు బండి ఏదో ‘నేలబారు స్టేషన్లో’ నిలిచి పోయింది. చరణ్ లేచి, క్రిందకి దిగాడు. దిగుతూనే యాంత్రికంగా ‘అటు వైపు’ చూసాడు. మృగ నయన నల్లని శాలువా కప్పుకొని ఒక వైపు ఒత్తిగిలి పడుకొని ఉంది. నిద్ర పోయిందో లేదో తెలియడం లేదు! ‘ఛ, ఏం చేస్తున్నాను నేను! ఆమె ఊసు నాకు ఎందుకు?’ అని తనని తాను మందలించుకొని, టాయిలెట్ బ్లాకుకి వెళ్లాడు. అక్కడ ముఖం కడుగుకొని, బండి ఏ స్టేషన్లో ఆగిందో చూసేందుకు తలుపు తెరచాడు. ప్లాట్ ఫారం మీద గుంపుగా జనం కనిపించారు, గొడవ గొడవగా మాట్లాడు కొంటున్నారు! “ఏమయింది?” అని సూర్య చరణ్ అటు వైపు నుండి వస్తున్న ‘ట్రైన్ సూప రెండెంటు అయిన గార్డుని’ పిలిచి అడిగాడు. “రైల్వే ట్రాక్ పైన ‘ఫిష్ ప్లేట్లు’ ఎవరో తీసేసారు. డ్రైవరు జాగ్రత్త వల్ల ప్రమాదం తప్పింది! కంట్రోల్’కి ఫోను చేసాము, ఇంజనీరింగ్ పనివారు వచ్చి ట్రాక్ రిపేరు చేసాక, బండి కదులుతుంది”అని చెప్పాడు అతను. “ఎంత సమయం పడుతుంది?” “మరో గంట, గంటన్నర పట్టవచ్చు!” అంటూ తన పెట్టె వైపు వెళ్లి పోయాడతను. చరణ్ ఏమీ తోచక క్రిందకి దిగ

ప్రేమ, వంచనకి చిరునామా--2 !(చిలక రథంలో సరదా షికారు--పార్టు 2

ఆ హాస్యానికి శ్రీ లలిత ఉగ్రురాలు అయింది. మీకు సరసానికి వేళా పాళా లేదేమిటి అని అప్పడాల కర్ర చరణ్’కి చూపించింది. చరణ్ తప్పయింది అంటూ చెవులు పట్టుకొన్నాడు.    అదే ఆ శ్రమదాన సన్నివేశం!! దానిని గుర్తు చేసుకొని ఇద్దరూ నవ్వుకొన్నారు. అలా ముసి ముసిగా నవ్వుకొంటూనే వాళ్లు ప్రస్తుతం లోకి పడ్డారు.“చూపుల పురాణం చెప్పుకోవడానికి ఇంటికి వెళ్లేంత వరకూ ఎదురు చూపులు తప్పవంటావా?” ఒక పూరీ ముక్క త్రుంచి నోటిలో పెట్టుకొంటూ అడిగాడు చరణ్. “తప్పదు కాక తప్పదు” అంటూ, తను కూడా పూరీ ముక్కని నములుతూ, అతని కళ్ళ లోకి చూసి నవ్వింది శ్రీలలిత. అలా చూడడంలో ఆమె సోగ కళ్లు కొంటెతనంతో కుంచించుకు పోయాయి. “నీ కళ్లకి ఏం అయింది, నలుసు గాని పడిందా?” “లేదే!” “మరి అవి అలా చిన్నబోయా యేమిటి ?” “కను రెప్పలు అరమోడ్పులు అయితే, కళ్లు చిన్నవిగానే కనిపిస్తాయి. అల్లరి ఆపి ముందు పూరీలని ఆరగించండి. మనం రైలు పెట్టెలో ఉన్నాము. ఎంత పరదా మాటున ఉన్నా, మన మాటలు అందరూ వింటారు. పరాయి మనుషులు, పరిసరాలు గుర్తు ఉంచుకోండి” అంది శ్రీలలిత కోపంతో. కోపం వల్ల ఆమె కళ్లు వెడల్పయి కెందామరాలు అయ్యాయి. “అమ్మయ్య! ఇప్పటికీ నా అనుమానం తీర

ప్రేమ వంచనకి చిరునామా! (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2)

అలా అహ్లాదానుభూతిలో మైమరిచి పోయిన ఆ కుటుంబ సభ్యులని విడదీస్తూ, రైలు బండి ‘కెవ్వుకేక’ పెట్టి ఫ్లాట్ ఫారం నుంచి కదలింది. అందరూ చేయెత్తి లలితా చరణులకి ‘బై,బై’ చెప్పారు. వాళ్లు కూడా తలుపు దగ్గరే నిలబడి, ‘బై,బై’ చెప్తూ, కంపార్ట్మెంట్ లోపలికి  వచ్చారు. ఇద్దరి మనస్సుల లోనూ ఉత్సాహం ఉరకలు వేయ సాగింది. తమ ప్రయాణం సరదాగా, సంతోషంగా, అర్థవం తంగా ముగిసినందుకు,ఇద్దరికిద్దరూ మురిసి పోతూ, ‘ఎలాట్’ అయిన సైడు బెర్తు మీద ఎదురెదురుగా కూర్చొని, ఒకరి నొకరు మురిపెంగా చూసుకొన్నారు. శ్రీలలిత కళ్లల్లో చరణ్ పట్ల ఆరాధన, ప్రశంస, సూర్య చరణ్ కళ్లల్లో శ్రీలలిత పట్ల మక్కువ, అనురాగం వెల్లివిరిసాయి. శ్రీలలిత కళ్లు ద్రించుకొంది. “లల్లీ! చూపులు ఎందుకు దిగ జార్చావు?” “ఏమో, బాబూ! నాకు సిగ్గేస్తోంది.” “సిగ్గు పడాల్సిన పని ఏం చేసాను నేను?” “కళ్ళతో కళ్లు కలిపి చూడ లేదా ?” “ఆ పని నువ్వు కూడా చేసావు కదా?” “నిజమే! మీవి కొంటె చూపులు, వాటి నిండా చిలిపితనమే! అవి కవ్వించి గిలిగింతలు పెట్టేస్తున్నాయి” “అలాగా, మరి నీ చూపులలో ఏమున్నాయి?” “ఏమో! నా చూపులని నేను చూసుకోలేను కదా? మీ చూపుల లోని భావాలు బాగానే అర్థం