Skip to main content

Posts

Showing posts from May, 2016

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 8 :బాపు బొమ్మలతో సహా

 14 వ ప్రకరణము: అంతట, “నాగమణీ ! నాగమణీ!” అని ఎవరో తలుపు తట్టారు. ఆ కంఠ ధ్వని అందరికీ సుపరిచితమే! ఆమె రాజకాళి అని అందరికిని తెలిసింది. ఆ సభలో చాలామందికి రాజకాళి పైన పూజ్య భావం ఉంది. నిశుంభువుని అనుజ్ఞ పొంది, జంభుడు తలుపు తీసాడు. రాజకాళి లోపల ప్రవేశించింది. పర్ణినిచే అమర్చ బడిన ప్రత్యెక ఆసనం మీద కూర్చొని ఆ కూటాన్ని ఛందోబద్ద వాణితో ఈ విధంగా ప్రశ్నించింది రాజకాళి. “రాణి లీలావతి రాజ్యము చేయ / కోణము నందేమి కూయుచున్నారు?                                                                  మన పక్షపు రథంబు మహిమతో భువిని / చనినట్లుగా నేమి చేయనున్నారు?” “అమ్మా! ఆ ఉపాయాన్ని మీరే ఉపదేశించాలి.” అన్నాడు శివకీర్తి. రాజకాళి చందోబద్ధ వాణితో --- “భూజనుల హితంబు బుద్ధిచే కోరి / రాజమ్మ యోచించే రాజకీయముల                                                                వాటిలో నున్నవి బాటలు నాల్గు / సూటిగా నున్నది సుమ్ము నా బాట, మీ బాట నున్నది మితిలేని మబ్బు / మా బాట నున్నది మరి జారు బురద,                                                     మీ బాట మితిలేక మింటికి నెగయు / మా బాట మతి లేక మంటిలో కలియ

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --7 : బాపు బొమ్మలతో సహా

వీర సింహుడు, సత్యప్రభ జన్మ గురించిన అపవాదును ముందుగా తన చెల్లెలు విలాసవతి చెవిలో ఊదాడు. ఆమె తన ప్రాణ స్నేహితురాలు కనక వల్లికి చెప్పింది. కనక వల్లి తన ప్రియ జనకుడు హిరణ్యనాభునికి తెలియ జేసింది. హిరణ్యనాభుడు తన మిత్రులలో ముఖ్యుడైన  కాణ్వ శుకనాసునికి వెల్లడించాడు. సోమవారం పూర్వాహ్ణమే ఆ సప్రాణ వార్తా పత్రికకి (శుకనాసునికి) ఈ నూతన వార్త అందింది. ఆ ఆంద్ర నారదుడు ఆ సాయంకాలం లోపుగా వందకు తక్కువ కాని స్త్రీ పురుషులకు ఈ వార్తను చేర వేసాడు. వారు  తమకు తెలిసిన వారికి నివేదించారు! సోమవారం నాడు సూర్యాస్తమయమునకు తరువాత స్త్రీ గోష్టుల లోను, పురుష సమాజం లోను, ప్రాయికంగా ఈ వార్త దొర్లి పొరలింది. రాజ దంపతుల వరకు ఈ వార్త ఎగబ్రాకింది. “ఎవరు కనిపెట్టారు, ఎ విధంగా కనిపెట్టారు?”అని అడిగే వారు ఎవ్వరూ లేక పోయారు! కాత్యాయనీ సులోచనులకు కూడా ఈ వార్త తెలిసింది. వారు ఆశ్చర్యపడ్డారు! ఈ నీలి వార్త సత్యప్రభ ప్రాణ స్నేహితురాలైన రథినీ కుమారికి తెలిసింది. దీని సత్యా సత్యాలని కనిపెట్టాలని ఆమె తీర్మానించింది. రథిని కాత్యాయనిని పిలిపించింది. రాజకుమారి ఆహ్వానాన్ని మన్నించి ఆమె సేనాపతి భవనానికి రాత్రి పూర్వ యామంలో వచ్

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 6 : బాపు బొమ్మలతో సహా

 వీర సింహుడు, సత్యప్రభ జన్మ గురించిన అపవాదును ముందుగా తన చెల్లెలు విలాసవతి చెవిలో ఊదాడు. ఆమె తన ప్రాణ స్నేహితురాలు కనక వల్లికి చెప్పింది. కనక వల్లి తన ప్రియ జనకుడు హిరణ్యనాభునికి తెలియ జేసింది. హిరణ్యనాభుడు తన మిత్రులలో ముఖ్యుడైన  కాణ్వ శుకనాసునికి వెల్లడించాడు. సోమవారం పూర్వాహ్ణమే ఆ సప్రాణ వార్తా పత్రికకి (శుకనాసునికి) ఈ నూతన వార్త అందింది. ఆ ఆంద్ర నారదుడు ఆ సాయంకాలం లోపుగా వందకు తక్కువ కాని స్త్రీ పురుషులకు ఈ వార్తను చేర వేసాడు. వారు  తమకు తెలిసిన వారికి నివేదించారు! సోమవారం నాడు సూర్యాస్తమయమునకు తరువాత స్త్రీ గోష్టుల లోను, పురుష సమాజం లోను, ప్రాయికంగా ఈ వార్త దొర్లి పొరలింది. రాజ దంపతుల వరకు ఈ వార్త ఎగబ్రాకింది. “ఎవరు కనిపెట్టారు, ఎ విధంగా కనిపెట్టారు?”అని అడిగే వారు ఎవ్వరూ లేక పోయారు! కాత్యాయనీ సులోచనులకు కూడా ఈ వార్త తెలిసింది. వారు ఆశ్చర్యపడ్డారు! ఈ నీలి వార్త సత్యప్రభ ప్రాణ స్నేహితురాలైన రథినీ కుమారికి తెలిసింది. దీని సత్యా సత్యాలని కనిపెట్టాలని ఆమె తీర్మానించింది. రథిని కాత్యాయనిని పిలిపించింది. రాజకుమారి ఆహ్వానాన్ని మన్నించి ఆమె సేనాపతి భవనానికి రాత్రి పూర్వ యామంలో వ

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ 5: బాపు వేసిన బొమ్మలతో సహా

రాజకాళి నత్యప్రభని  చూసి, “సత్యా! బాగావతి శుభ్రాంగి ఆనతి ప్రకారం కవిత్వ పర్వవ్క్ష ప్రారంభించు”అన్నది. సత్య ప్రభ లేచి తన ద్విపదలు ఆశువుగా పాడింది. సత్యప్రభ---“చల  పర నారీ  ఫిశాచికి  తనదు వెలగల - హృదయము  బలియీయ వలదు పరి పరి  విధముల  బోవు  భారము చేత - పరిణీత  మీరిన  ప్రణయము రోత. మణిమాల......నర  రంభయైనను పర  నారి  వలదు-తరుణ  సోదరులార!  దైవంబు కలదు నీ  కాంత  విడుచుట  నీచమైన  ఫని- ఫై కాంత బట్టుట  ఫాఫముల  గని.  ధరణి..........నరునకు  ఫరనారి  నాశన  మాత్ర-  స్థిర  కళంకము  తెచ్చు  జీవితయాత్ర ఫర  సుందరీలోల  ఫురుషుడు  చేయు – వర ఫుణ్య  కర్మ ముల్వరుసగా మాయు మధువాణి.......ఎగ్గు చేష్ట  పరుని  ఇల్లాలి  ఫాల -  తగ్గును  మర్యాద  దానిచే  చాల నరులెంగిలి  భుజింఫ నగుదురువాడ – పరనారి  ఎంగిలి  పరికించి చూడ ఫలిని.......చోరత  ఒక్కని  శుభముల  బాఫు – జారత  బాఫును  జాతుల  ఏఫు పర పద్మ  లోచనా  భజనమ్ము తఫ్ఫు – ఫురుషుడా, దానిచే   పొసగును ముఫ్ఫు రథిని........పరనారి  సద్ధర్మ  వధశాల  సుమ్ము – వరమతీ!  ఫెద్దల  వాక్యంబు  నమ్ము  ఫిల్లరా  చిన్నది  పెఱభామ  నీకు – తల్లిరా  పెద్ధది  తలవంఫు  తేకు రాజకాళి--

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ 4 : బాపు వేసిన బొమ్మలతో సహా

 8 వ ప్రకరణం. మరునాడు మహారాఙ్ఞి లీలావతీ దేవిగారి వర్ధంత్యుత్సవం జరిగింది. ప్రాతఃకాలంలో మహావైభవంతో ఆయుష్య హోమం నెరవేర్చబడింది. హోమానంతరం కోటలోని మైదానం ముందు, ఆమె పురస్త్రీలందరికీ దర్శన మిచ్చింది. మధ్యాహ్నం బీదలకు, బ్రాహ్మణులకు సంతర్పణలు జరిగాయి. భోజనానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత అంతఃపురం లోని పెద్ద కచ్చేరి సావిడిలో సాక్షర నారీ సభ సమావేశ మయింది. ఆ వర్షపు వర్ధంతిలో భగవతి శుభ్రాంగి గురుకులంలో చదువుకొని కవిత్వం చెప్పగల కన్యకల కవిత్వ పరీక్ష జరుగునని ముందే చేటీ జనాధ్యక్షురాలు భృంగాలక ప్రకటించి ఉండింది..రాజధానిలోని చదువుకొన్నస్త్రీలందరూ సభలో సన్నిహితులయ్యారు. నారీ సభా ప్రేక్షణార్థం కూడిన పురుషుల ఆసన పంక్తులు ఒక ప్రక్కగా ఉన్నవి. పదునేడుగురు పెద్ద మనుష్యులు ఆ భాగం మొదటి పంక్తిలో ఆసీనులై ఉన్నారు ఆ పంక్తిలో మధ్య మహారాజ సుచంద్ర భట్టారకుడు కనక సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. అతని దక్షిణ పార్శ్వమందు కుమార శక్తిధరుడు, వామ పార్శ్వమందు కుమార భోగనాధుడు కూర్చొని ఉన్నారు..భోగనాధునికి కుడివైపుగా చిత్రకూట మహా మండలేశ్వరుని కుమారుడు దండనాయక రణేశ్వరుడు, మహామంత్రి సునందుడు, రాష్ట్రీయుడు వీరనందుడు,