Skip to main content

Posts

Showing posts from February, 2013

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---35)

మొసలి కొలను మ్యూజియం--- 35 (ఆఖరు భాగం) “ కేసు  పరిశోధన  పూర్తయి  పోయింది , టు నాట్ త్రీ ! వాట్సన్  తిరుగు  లేని  సాక్ష్యాలతో  పట్టుబడ్డాడు. విదేశాలలో అతనికి ఇంకెవరైనా స్పాన్సర్లు  ఉన్నారేమో  కనిపెట్టాలని, ఆ లగేజీని  షిప్పింగు  పోర్టు  దగ్గర   పట్టుకొన్నాం ! అది  ఇంకెవరి  పేరా  కాక, తన  పర్సనల్  లగేజ్ గా  తన  చిరునామాకే  పంపడం  వల్ల  ఈ దోపిడీకి  పూర్తి  భాద్యత  తనదేనని  ఋజువయింది ! వాట్సన్ దొంగతనం  కోసం  నియమించిన  ఏజెంట్లు  కూడ,  పట్టుబడ్డారు. ఎంకన్నను  పొడిచినట్లు, బొమ్మలను  ఎత్తుకు  పోయినట్లు  అంగీకరింఛారు.ఇంద్ర నీల్  కూడా  ఇనస్పెక్టరే  గనుక  ఎన్నో  విలువైన  సాక్ష్యాలను ఇచ్చాడు.  అందుకే  ఊరుకొన్నాను. అంతే  కాక, ఇంద్ర నీల్  ఎంతో  ఆతృతతో  వెళ్ల  వలసిన  చోటు  ఒకటుంది ! అక్కడకే  వెళ్లి  ఉంటాడు,” అన్నాడు  గోపాల్రావు. “ రామా  రామ ! ఎక్కడికి  వెళ్లాడు  సార్ ?” “ ఆస్పత్రికి,  వీలయినంత  త్వరగా  వెళ్లి, ‘ తులజని’ కలియడానికనే  అనుకొంటున్నాను.  అతని  ఆతృత  అలాంటిది  మరి ! మనం  అక్కడే  అతనిని  కలవ  వచ్చు.” “ రామా  రామ ! అయితే  రేపు  మీరు  గోవా  వెళ్లడం  లేదా ?” “ తప్పకుండా  వెళ్తాను, వాట్సన్ ని,

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---34)

(నిన్నటి టపాలో జరిగిన కథ=== స్వార్థం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరనీ భావించే ఆలోచనా సరళి లొనే లోపం ఉందని, డిఫరెంట్’గా ఆలోచిస్తే తానెవరో తెలుస్తుందని అంటాడు దానయ్య. అలా అంటూనే ఏ స్వార్థం లేకుండా , మేలు చేసిన ‘అమర్ సింగ్’ కథ చెప్తాడు దానయ్య. --ఇక చదవండి) మొసలి కొలను మ్యూజియం----34 “ బదరీ  బాదరాయణ  సంబంధం  లాగ  ఉంది, కురుక్షేత్రానికి  దగ్గరగా  ఉండబట్టి  అలా అనుకొని  ఉంటారు.” అన్నాడు  ఇనస్పెక్టరు. “ కావచ్చు !”  “ రామా  రామ ! దుర్యోధనుడు  ప్రాణాలు  కాపాడుకోవడానికి  జలస్తంభన  చేసింది  కూడా  ఆ చెరువులోనే  కాబోలు !” “ చూసారా, మీకు  కూడా నమ్మకం  కలుగుతోంది. ఇంతకీ  చెప్పొచ్చేదేమిటంటే,  ఏ స్వార్థాన్ని ఆశించి ,అమర్  సింగు  ఆ నేలని  త్రవ్వాడు అని.?” “ రామా  రామ ! మీకు  కూడా  అమర్ సింగికి  వచ్చినట్లే  ఈ బొమ్మలు  ఇక్కడున్నట్లు కల  వచ్చిందా  సార్ ?” “ నిజమే ! ఆ బొమ్మలు  నాకు  కలలోనే  కనిపించాయి. కాని  ఆ స్థలమేదో   తెలియ  లేదు.” “ రామా  రామ ! మరి  ఆ స్థలాన్ని  ఎలా  కనిపెట్టారు  ?” “ బొమ్మల పనితనం దక్షిణ  భారత దేశానిది  లాగ  అనిపించింది. వెంటనే పుస్తకాలు వెతికాను. ఆ పరిశోధనలో  ఉన్న  నాకు, పధ్నాలుగు  నెలల  క్

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---33)

(నిన్నటి టపాలో జరిగిన కథ--- దానయ్య శరీరంలో పవేశించిన ఆత్మ తన కథను చెప్తుంది. ఇనస్పెక్టర్ గోపాల్రావు. కానిస్టేబిల్ టూ.నాట్ త్రీ అతని మాటలను నమ్మేస్తారు. ఆత్మ నాటకం ఆడిన దానయ్య పారిపోబోతాడూ. గోపాల్రావు అతనిని ఆపి, అతని అసలు పేరు అడుగుతాడు---ఇక చదవండి ) మొసలి కొలను మ్యూజియం--33 “ రామా  రామ ! పితృ  లోకానికి  కాకపోతే ---” “ మరెక్కడికో  మాకు  చెప్పి  వెళ్లండి.” దానయ్య  చేతులు  విడిపించుకొని బిగ్గరగా నవ్వి, “ ఇనస్పెక్టర్ , మీరు – మీరీ  ఆత్మకథని  నమ్మేసారా  ఇనస్పెక్టర్ ! ఐ.పిటీ. అపాన్  బోత్  ఆఫ్ యూ ! ” అన్నాడు. వాళ్లిద్దరూ  అతని వంక  తెల్లబోయి  చూస్తారు.  “ మీరీ మర్రి చిగిళ్లు, వేప మండలు, తులసీ దళాలు  తీసుకొని రావడంతో  నాకు  కూడా సరదా  వేసి  ఒక  ఆత్మగా నాటకం ఆడాను ! మీరు ఆ నాటకాన్ని  నమ్మేసారు  కదూ ! హు ! అయినా  మిమ్మల్ని  అని  ఏం లాభం ! ఈ  దేశన్నేలే  నాయకులు, చిన్న  ఎం.ఎల్.ఏల  నుండి, ప్రధాన  మంత్రుల వరకు, తాంత్రిక  శక్తులని  నమ్మి, తాంత్రికులని  ఆశ్రయిస్తున్నారు ! ప్రజలకు  దారి  చూపాల్సిన  మేధావులైన  రచయితలు , క్షుద్ర  సాహిత్యంతో  పేజీలు  నింపి, పొట్టలు  పెంఛుకొంటున్నారు ! ఇందాకల  మీ  టు నాట