Skip to main content

Posts

Showing posts from April, 2010

కబంధ హస్తాలు ( ముంబాయి మోసాలు )

ఎస్టేటు ఏజెంటు ‘’ పటవర్థన్ ‘ , తన కెదురుగా కూర్చొని ఉన్న నవ దంపతుల వంక , ముఖం క్రిందకి దించి , కళ్లజోడు మీదుగా కనుబొమల మధ్యనుండే కోణంలోంచి చూసాడు .అలాంటి చూపుని సినిమాల్లో పేటెంటు చేసింది ఎవరోగాని , అది మాత్రం ముమ్మాటికీ దొంగచూపే !! నవ దంపతులయిన ‘రమ-అనిరుద్ధులకి ‘ మాత్రం ఆ ఏజెంటు తమ అవసరం తీర్చేందుకు వచ్చిన ఆపద్భాంవుడిలా , ఆ చూపులు తమ పైన కురిపించిన కరుణా కటాక్షాల లాగ కనిపించి-అనిపించాయి . “ మీకు ఇష్టమయితే నా కారులో రండి. ఇల్లు చూపించి అక్కడనుంచి దగ్గరలోనే ఉన్న లోకల్ ట్రైన్ స్థేషన్ దగ్గర దింపేస్తాను “అన్నాడు , పటవర్థన్ . అనిరుద్ధు,రమ అంగికారంగా తల ఊపి అతనితో పాటు, అతని కారులో ఎక్కారు . ఇల్లు చాల బాగుంది . పబ్లిక్ పార్కుకి చివర దానికి ఆనుకొనే ఉంది. పచ్చని పచ్చిక బయళ్ల మధ్య , ఒంటరిగా అందంగా కట్టించిన రెండు గదుల ‘రో హవుస్ ‘ అది. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మోడ్యులర్ కిచెన్, గదులలో వాడ్రోబ్, రోజంతా ఉండే నీటి కొళాయిలతో, మంచి సీనరీ ఫిట్టింగులతో ఆధునికంగా కూడా ఉంది. “లక్షరూపాయలు అడ్వా

నల్ల కల్ల జోడు ( వాలెంటైన్ డే కద )

నల్ల కళ్లజోడు. ఆ రోజు వలెంటైన్ డే ! సూటు, బూటు, నల్ల కళ్లద్దాలు, తలపైన టోపీ, పెట్టుకొని, బయలుదేరాను నేను, యాత్రా విశేషాలు చూద్దామని. అలా వెళ్లడమంటే నాకు చాల ఇష్థం. నన్ను నేను దాచుకొని, ఇతరులని దగ్గరగా చూడ వచ్చని. వాళ్లు నలుగురు_____ ముంబయి మహా నగరం లోని నాలుగు కేంద్రాలనుంచి, తమ తమ ‘వలంటైన్’లతో సహా, ‘ గేట్ వే ఆఫ్ ఇండియా’కి వచ్చారు. వారిలో మూడు జతలు, కొత్తగా పెళ్లైనవారు. మరొక జంట ప్రేమికలు. గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలు, చూడడానికి 120 రూపాయల టికెట్లు కొనుక్కొని, లాంచిలో బయలు దేరారు.నేను కూడా వాళ్లతో పాటు లాంచి ఎక్కాను. సముద్రం మీద గంట సేపు లాంచిలో ప్రయాణం. జంటలందరూ తోసుకొంటూ, లాంచీలో అంచులకుండే కర్ర బెంచీల మీద కూర్చొనేందుకు పోటీ పడ్డారు. నేను మాత్రం లాంచీ మధ్య భాగంలో వేసిన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొన్నాను. కర్ర బెంచీల మీద సీటు సంపాదించాక ఆ నాలుగు జంటలూ, కాసేపు సముద్రాన్ని చూసి, ఆ తరువాత ఎవరి ధోరణిలో వారు పడ్డారు. భర్తల చేతులు, భార్యల నడుములు మీద, భార్యల చేతులు భర్తల భుజాల