Skip to main content

Posts

Showing posts from March, 2012

పడగ మీద మణి--౬

        ఆదిరాజు భాస్కర మూర్తి ,మంచం పట్టి, శల్యావశిష్టుడయ్యాడు.అతనికి శ్రీనివాసున్ని చూడాలని అనిపించింది.కాని కావాలని దూరం చేసుకొన్నఆ కుర్రవానిని,ఎలా పిలిచి రప్పించ  గలడు. చిత్రమేమో  గాని అతని మందులు అతనికే  పని చెయ్యడం లేదు.మందులు  కూడా గ్రహ గతుల ననుసరించే పని చేస్తాయమో !     అతని మనసులో  ఆలోచనలని చదివాడేమో  అన్నట్లు, శ్రీనివాసుడు  వచ్చి, మంచం పట్టిన గురువు గారిని చూసి, కృంగి పోయాడు.ఇంత జరిగినా తనని పిలువ నంపక పోవడాన్ని తప్పు పట్టాడు.     “ శ్రీనివాసా ! కాల గతిని అనుసరించి జరిగే  మార్పులకి, వ్యక్తులని  దోషులుగా చేయకు.నువ్వు ప్రయోజకుడువి అయ్యావని తెలిసి, అలా చెయ్యాలనే  నా తపనని, ప్రక్కకు నెట్టి, నా స్వార్థం కోసం నిన్ను వెనకకి పిలిపిస్తానని ఎలా అనుకొన్నావు ?”     “ గురువు గారూ ! మీ మందులు మీకు పని చెయ్యక పోవడ మేమిటి ?” రోదించాడు  అతను.     “ మందులు వాటి పని అవి చేసుకొని పోతున్నాయి శ్రీనివాసా ! శరీరమే వాటికి  సహకరింఛడం లేదు. కాయానికి జరావస్థ సోకింది మరి ! తరువాతి  గమ్యాన్ని ధైర్యంతో ఎదుర్కోవడమే ఇప్పుడు చేయాల్సిన పని !”     శ్రీనివాసుడు వెక్కి వెక్కి ఏడ్చాడు,గురువు అతనిని అడ్దుకోలేదు.దుః

పడగ మీద మణి--౫

    ప్రణీత కళ్లు ఆనందంతో మెరిసాయి,ఈ సారి  ఆమె కళ్లల్లో  వైడూర్య కాంతులు  చోటు చేసుకొన్నాయి. “శ్రీనివాస్ గారూ !ఇంత వరకు నా కాలుని చూసిన వారెవరూ ఈ మాట  చెప్పలేదు. పెద్ద  పెద్ద  డాక్టర్లు కూడా పెదవి విరిచేసారు. మీరు బాగు చెయ్యగలిగితే –”     “ మీరు నన్ను నమ్మాలి ! వైద్యుణ్ని నమ్మినప్పుడే  రోగికి  స్వస్థత చేకూరుతుంది. కాలు  బాగయితే  జరిగే బాగు  మీకే  కాబట్టి, మీరు నేను  చెప్పినట్లు  చేయాలి. నేను చెయ్యమన్న  వ్యాయామాలు  చెయ్యాలి. లేపనాలు, తైలాల  మాలీషులు  చేయించుకోవాలి. నాకు అన్ని  విధాలా  సహకరించాలి.     ప్రణీత అబ్బురంతో  శ్రీనివాసుని  వంక  చూసింది. ఆ  చూపు ఎంత  అబ్బురంగా ఉందంటే, ఆ చూపులో, ప్రశంస ఉంది. ఇన్నాళ్లూ  తనకీ  మాట  చెప్పకుండా  వంచించిన  డాక్టర్ల  మీద కసి  కోపం ఉంది. కాలు  నిజంగా  బాగవుతుందా  అన్న ఆశ్చర్యం ఉంది.అతని  మాటలు  నిజమవుతే  బాగుంటుందన్న  ఆశ  ఉంది.అదేదో  వేగంగా  జరుగుతే  చూడాలన్న  ఆర్తి  ఉంది. ఇంకా  మాటలలో వర్ణించ లేని  ఎన్నో  భావాలు  ఇముడ్చుకొని ఉంది.     ఆ చూపు , అదే  చూపు, మదనుని  పంచ శరాలైన  అశోక, పున్నాగ, చంపక, కుముద, మల్లీ సుమాల  పరాగాలు  శ్రీనివాసుని  ఎదలో  నాటాయి.  

పడగ మీద మణి-౪

        పితృతుల్యులు, గురుపాదులు  అయిన, ఆదిరాజు  భాస్కర మూర్తి  గారు  వ్రాసి ఇచ్చిన  ఉత్తరాన్ని, దత్తాత్రేయ దక్ష ప్రజాపతి గారికి  ఇచ్చాడు  శ్రీనివాసుడు. అతనిని కూర్చోమని చెప్పి, ఆయన తన ఆపీసు గది లోపలికి వెళ్లి ఆ ఉత్తరాన్ని చదువుకొన్నారు.     శ్రీనివాసుడు  తన దగ్గరకి  ఎలా వచ్చాడో, తన దగ్గర ఎలా శిక్షణ , క్రమ శిక్షణ తీసుకొన్నాడో, ఎలా  పెరిగాడో   సవిస్తరంగా  వ్రాసి  ఉందా ఉత్తరంలో. ఇటు పైన ఆ యువకున్ని  మీ చేతులలో పెడుతున్నానని, వాని సర్వతోముఖ అభివృద్ధికి  సోపానం  వెయ్య  వలసిందనీ  విన్నవింఛారు  తిరిగి  తన దగ్గరకి పంపించ వద్దనీ,  అలా అడగడానికి  చాలా  కారణాలు ఉన్నాయనీ, వాటిలో  ఆరోగ్య  కారణం ముఖ్యమయినదనీ వ్రాసి స్పష్టమైన  ఆదేశం కూడా ఇచ్చారు. మూర్తిగారు. ఆ ఉత్తరం చదివాక ,అతను  శ్రీనివాసుని తన గదికి పిలిపించారు, “ శ్రీనివాస మూర్తి గారూ ---”     ప్రజాపతి  మాటలకి , శ్రీనివాసుడు అడ్డుపడ్డాడు. “ నన్ను  అంత  పొడుగు పేరుతో పిలువకండి. శ్రీనూ అని పిలువండి చాలు,” అన్నాడు.     ప్రజాపతిగారు  గుంభనగా  నవ్వుకొన్నారు. “ సరే, శ్రీనూ, నీ కోరిక అదే అయితే  అలాగే పిలుస్తాను. భాస్కర మూర్తి గారి  అభ్యర్ధన వల్ల నీకు

పడగ మీద మణి-౩

           ఆదిరాజు భాస్కర మూర్తి తన దగ్గరకి వచ్చిన ఆ కుర్రవానిని , దైవరాతునిగా భావించి, తన గురుకులం లోని  విద్యనంతా నేర్పించి , వారసత్వాన్ని కాపాడుకొన్నాడు. జీవితం లోని నిమ్నోన్నతాలనీ, ఒడి దుడుకులనీ  ఎరిగిన అతడు, ఒకరోజు తన నిత్య పూజా విధానం లోని  మంత్రాలని  మననం చేసుకోంటూ , వాటిలో  ఒక మంత్రం  లోని  కొన్ని అక్షరాలు సరిగా పలకక  పోవడం గ్రహించాడు. అనుభవఙ్ఞుడైన  అతనికి ఆ అక్షరాలు పలకక పోవడం లోని పరమార్థం  తెలిసింది. తన జీవన యాత్ర  ముగిసేందుకు  ఇంకా  కొన్ని సంవత్సరాల  వ్యవధి  మాత్రమే ఉందని ఆకళింపు చేసుకున్నాడు.     అతనికి  తన కన్న, ‘శ్రీనివాసుని చింత’ఎక్కువయింది. విషయం తెలుస్తే అతడు తనని వదలడు ! వాని భవిష్యత్తు  కోసం వానిని  తన నుండి  వేరు  చేయక  తప్పదు  అన్న  నిర్ణయానికి వచ్చాడు.     కాకతాళీయమో , దైవ సంకల్పమో తెలియదు గాని , అదే సమయానికి  ‘గుజరాతు ’ లోని  ఒక ప్రముఖ  టూర్స్ & ట్రేవల్స్ కంపెనీ నుంచి ,అతనికి  ఒక ఉత్తరం వచ్చింది. ఆ కంపెనీ  పేరు ‘ప్రజాపతీ  ట్రేవల్స్’ .దాని యజమాని ‘  శ్రీ దత్తాత్రేయ  దక్ష ప్రజాపతి’  ఆంధ్ర బ్రాహ్మణ  కుటుంబానికి చెందిన వాడే అయినా , జైన ‘ షా ’పరివారం  లోని, ఒక 

పడగ మీద మణి-౨

    నాగూరు  గ్రామంలోని  ‘శ్రీ కోదండ రామాలయం’ ఎదురుగా ఉన్న ఖాళీ  స్థలంలో  నలుగురు  పిల్లలు  ‘బిల్లా చెక్కా’  ఆట ఆడుతున్నారు.     బిళ్ల అనేది  జానెడు  పొడవుండే వెదురుతో, రెండు కొసలూ  సూదిగా చెక్కిన కర్ర ! ఇక ‘చెక్క’ అనేది ధృడమైన గుగ్గిలం కలపతో  చెయ్యబడ్డ  మోచేయి పొడవు కలిగి, ఒక  చివరని సూదిగా చెక్కి తయారు చేసిన కర్ర..! నేల మీద చిన్న గొయ్యి తీసి ‘బిళ్లని’ దాని  మీద  అడ్డంగా పెట్టి, ‘ చెక్క  యొక్క  సూది మొనతో  దానిని   మీదకి ఎత్తి, అది మీదకి ఎగరగనే దానిని చెక్కతో బాది, విసురుతాడు.మిగతా  పిల్లలు ఆ బిళ్లని పట్టుకోవడానికి పరుగెడతారు. పట్టుకొంటే ,‘అవుటే ! పట్టుకోలేక పోతే, బిళ్ల ఎక్కడ పడిందో అక్కడకి వెళ్లి, ఆ బిళ్ళ చివరని చెక్కతో కొట్టి, అది మీదకి లేవగానే తిరిగి దూరంగా పడేలా కోడతాడు.మిగతా పిల్లలు దానిని పట్టుకోవడానికి  రకరకాల  స్థలాలలో నిలబడేవారు, వానిని  అవుట్ చేయడానికి.బిళ్ల పడిన చోటునుండి గొయ్యి వరకు దూరాన్ని చెక్కతోనే కొలిచే వారు. అది పది చెక్కల దూరంలో పడితే పది పాయింట్లు దొరికేవి. ఈ ఆటే నేటీ క్రికెట్ ఆటగా  రూపాంతరం చెందిందేమో తెలియదు  గాని,అప్పట్లో ఆ  ఆట పిల్లలకి చాల సరదా అయిన ఆట !     ఆ

పడగ మీద మణి--1

శ్రీ సోమనాధుని ఆలయం , రంగు రంగుల దీప తోరణాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా ఉంది . ఆ రోజు మాస శివరాత్రి , పర్వదినం . రాత్రి పన్నెండు గంటలయింది . ద్వాదశ జ్యోతిర్లింగాల పరంపరలో ఎనిమిది మూర్తులని చూపించే యాత్రలో భాగంగా , శ్రీ వైద్యనాధ , శ్రీ విశ్వేశ్వర , శ్రీ మహాకాళేశ్వర , శ్రీ ఓంకారేశ్వర లింగాలని దర్శించుకొని శ్రీ సోమనాధుని దర్శనార్థమై ఆ రోజే చేరుకొన్నారు ఆంధ్రదేశం నుంచి వచ్చిన తీర్థ యాత్రీకుల గుంపు . మాస శివరాత్రి పర్వదినం కూడ కలిసి రావడంతో , స్థానిక తెలుగు పండితునితో సామూహిక రుద్రాభిషేక