Skip to main content

Posts

Showing posts from May, 2012

చిలక రథంలో సరదా షికారు-- ౮ (ఆఖరి భాగం)

           కుమారారామ క్షేత్రంలో శ్రీ భీమేశ్వర స్వామి వారి అభిషేకం చేసిన తరువాత, చక్రపాణి గారి ఇంటికి చేరారు వారందరూ. చక్రపాణి రైల్వేలో ‘లోకో పైలట్’గా పని చేస్తున్నాడు. అతను ఉండేది రెండు గదులు రైల్వే క్వార్టర్ ! ఒక గదిని కొత్త అల్లుడు గారికి కేటాయంచి, తక్కిన వారందరూ మరో గదిలో గుంపుగా విశ్రమించారు. శ్రీలత ఆ ఏర్పాటుకి వ్యతిరేకించినా వాళ్లెవరూ ఒప్పుకోలేదు ! ఫలితం లేక మరచెంబుతో నీళ్లు తీసుకొని, గదిలోకి అడుగు పెట్టింది ఆమె !     మెత్తగా కౌగిలి లోనికి ఇమిడిన ఆమెని, పొదివి పట్టుకొంటూ, అడిగాడు సూర్యచరణ్. “ సిరీ ! మీ చక్రి బాబాయి ఇంట్లో అన్నీ ‘ ఫెంగ్ షూయి’ సామాన్లు, ఎక్కడ పెడితే అక్కడ కన్పిస్తున్నాయ్ ! ఎందుకలా ?” అని అడిగాడు.     “ ఫెంగ్ షూయి సామాన్లా !?”     “ అవును, ఇదిగీ చూడు,” అంటూ ఆ గదిలో ఉన్న పరికరాలు చూపించాడు. ‘నోట్లో నాణాన్ని పట్టుకొన్న మూడు కాళ్ల కప్ప, ఒకదాని మీద ఒకటి ఎక్కి కూర్చొన్న తాబేలు, లాఫింగ బుధ్ధా,’ ఇంకా కొన్ని పిరమిడ్లు కనిపించేయి.     “ ఓహో ! అవా ! ఈ ఇంటికి వాస్తు దోషం ఉందని లలిత పిన్నికి అనుమానం ! అందుకే అవన్నీ ప్రతీ గదిలోనూ అమర్చింది.     “ వాస్తు దోషాలా ! అంటే ఎలాంటి సమస్

చిలక రథంలో సరదా షికారు --౭

                కుబేరుని రాజధాని అయిన అలకాపురిలో రాకుమారుడు నలకుబేరుని మందిరం. ఆ మందిరం లోని శయన  కక్ష్యం, అత్యంత సుందరం.ఆ కక్ష్యానికి నలుదిశలా నాలుగు ప్రధాన ద్వారాలు. ద్వారములు, ద్వారబంధములు,  తలుపులు.సర్వమూ సువర్ణఖచితములు.సుమశోభిత అలంకారాలతో  సుసజ్జితములు.        గవాక్షములు సరేసరి! వృత్తాకారంలో అలంకరింపబడి, పూలదండలలా కన్పడుతున్నాయి. ఆ ప్రాసాద  మధ్యంలో పెద్ద పడవలాంటి పందిరిమంచం, వాటి పైన స్వర్ణకాంతులీనే పట్టు ఆవరణముల మధ్య మృదువైన  హంస తూలికా తల్పము, దిండ్లు అమర్చబడి ఉన్నాయి.     పారిజాత,సౌగంధికా పుష్పసౌరభాలు ఆ  ప్రదేశాన్నంతా  ఆవరించి  మత్తు  గొలుపుతున్నాయి.     పర్యంకము పైన నలకుబేరుడు కూర్చొని ఉన్నాడు.ఇంద్రునితో, చంద్రునితో,మన్మధునితో సరి తూగే సుందర  యువకుడతడు.సాక్షాత్తు రంభయే భార్యయైనను, అతడు నిత్యనూతన యక్షిణీ కాంతల పరిష్వంగము కోరువాడు.       రాజ్యము అతనిది, యక్షులు అతని పరిపాలిత ప్రజలు. సుందరులైన యక్షిణీ కాంతలు కనుసన్నలలో  మెలగు వారు.అదుపాజ్ఞలు వర్తించని, సర్వ స్వతంత్ర  సుందర మధుకరుడయిన అతనికి, సౌందర్య సుమ నివాళులిచ్చే  స్త్రీలకు  కొదవేమున్నది!     ఆ రోజు  యక్షకన్నియ—“విలాసిని:” వం

చిలక రథంలో సరదా షికారు --౬

    బహుళ  పాడ్యమి  రోజు.     హేమావతి ఆలస్యంగా నిద్ర లేచింది. ఆమె శరీర మంతా నొప్పులు, పాలిండ్లయితే- ముట్టుకొంటే చాలు నొప్పి  పెడుతున్నాయి, అయినా అది తీయని బాధ అనిపించింది.శరీరాన్నికర్పూర తైలంతో మర్దన చేసుకొని, స్నానం  చేసాక  హాయిగా అనిపించింది. కురులకు సాంబ్రాణి పొగ పెడుతూ ఆలోచించింది. రాత్రి  సోమదేవునికి ఎలా స్వాగతం చెప్పాలా! అని.ముందు రోజు రాత్రి  జరిగినదంతా తలచి,తలచి మధురోహలతో మురిసిపోతూ,ఆ రోజు రాత్రికి రూపకల్పన చేసింది.     తండ్రి ననుకదేవునితో, సరోవర  విహారానికని  చెప్పి, ఒక  గూటి పడవ తెప్పించింది. తన అలంకార సామగ్రిని.   ఆభరణాలని రహస్యంగా ఆ పడవలో చేర్చింది. పడవగూటిపై లేలేత కొబ్బరిమట్టలను పరచింది.లోపల మెత్తని పట్టు పరుపు దిండ్లు అమర్చింది.వాటిని మల్లెలతో మరుగు పరిచింది. సుమహారాలతో ముఖద్వారాన్ని అలంకరించింది.     రాత్రి మొదటి—ఝాముకే పడవని చేరి, తనని తాను అలంకరించుకొంది. సోమదేవుని ప్రశంసలు పొందిన తన  శరీర భాగాలకు,ముఖ్యంగా పాలిండ్లపై చూచుకాలకు బంగారు తొడుగులు తొడిగింది. నాభిలో వజ్రం పొదిగింది. చేతులకి  గాజులు పాదాలకు స్వర్ణమంజీరాలు తొడిగింది.చెవులకు గుత్తులు గుత్తులుగా వ్రేలాడే కర్ణాభర

చిలక రథంలో సరదా షికారు --౫

    మర్నాడు ఉదయం, ఫలహారాలు ముగించాక, అందరూ మూడావ మజిలీ అయిన ద్రాక్షారామం వైపు షికారు కోసం బస్సు ఎక్కారు. .    సారంగ పాణి, కాంతమ్మలు కూడా ఎక్కడం చూసిన పినాక పాణి ఆశ్చర్యంతో అడిగాడు. “ అదేమిటి ! మీరు ఇంట్లోనే ఉండిపోతారని అన్నారే ? ప్రోగ్రాం మార్చుకొన్నారా ?” అని.     “ అల్లుడుగారు కమ్మని కథలు చెప్తున్నారు కదా, అవి వినే అవకాశం పోతుందని బయలు దేరాం. శివాని చిన్నపిల్ల కదా, పైగా దాని స్కూలు తెరచేసారు, అందుకని అది ఉండిపోయింది” అని కాంతమ్మ బదులిచ్చింది.     “ అదేమిటి పిన్నీ ! నోములు నోచుకోవడానికి నీకు సమయం లేదనికొన్నానే !” అంది శాంతిసేన.     “ నోముల్లో కూడా క్థలే ఉంటాయే తల్లీ !” అంది కాంతమ్మ.     “ అల్లుడు గారూ ! విన్నారు కదా, మీ కథలకి డిమాండ్ పెరిగి పోయింది. కమ్మని క్థ ఒకటి అందుకోండి. ” అన్నాడు పినాక పాణి.     శ్రీలత వెంటనే లేచి , తన చేతిలోని ప్లాస్టిక్ పెట్టేలోంచి , ఖార్జూరం పళ్ళు తీసి తలో రెండూ పంచింది. ” ఇవి అలసటని వెంటనే పోగొడతాయట, మీ అల్లుడు గారు చెప్పారు.” అంటూ.     “ ఏ అలసటే  చెల్లీ ?” మేలమాడీంది శాంతి. ‘    “అలసటలో కూడా రకాలు ఉంటాయా అక్కా ! నాకు తెలియదే !’” అమాయకంగా ముఖం పెట్టి జవాబిచ

చిలక రథంలో సరదా షికారు -౪

       “సుందరీ ! నీ పేరేమిటి ? నీ వెవరవు? కన్యారూపం లోని శోణ నదివి కాదుగదా ?” ఆనందుని ప్రశ్న ఆమెని చకితురాలిని చేసింది..     రాజఠీవి ఉట్టిపడే దుస్తులతో ధృడమై,సుదర్శనమైన సమున్నత కాయంతో, విశాలమైన ఫాలభాగంతో. దట్టమైన కుంచె లాంటి కనుబొమల క్రింద వృషభాక్షాలతో,కోటేరు లాంటి నాసికతో,చతురస్రాకారమైన చిబుకంతో, పొడవైన మెడతో, ఉన్నతమైన భుజకీర్తులతో, వెడల్పైన భుజ స్కందాలతో, క్రీడాభూమి లాంటి వక్షస్థలంతో, సన్నని నడుముతో, ఆజాను బాహువులతో, తన ముందు నిలిచిన ఆ పురుషుణ్ని, బాల్యం నుంచీ  భైరవులని తప్ప,ఇంకెవరినీ చూసి ఎరుగని ఆమె, విశాలమైన తన కళ్లని ,మరింత విశాలంగా చేసి,విస్మయంతో చూసింది.     అంత వరకు ఆమె మేని కాంతులనే చూసి, పరవశించిన అతను, ఆమె శరీర సౌందర్యానికి జోహార్లు  అర్పించాడు. ఆంద్ర భాషలోని పంచ కావ్యాలైన ‘మనుచరిత్ర’ లోని ‘వరూధిని’, ‘వసు చరిత్ర’ లోని ‘గిరిక’,‘ ఆముక్త మాల్యద’లోని ‘గోద’, ‘విజయ విలాసం’ లోని ‘ఉలూచి’, ‘పాండురంగ మహాత్మ్యం’ లోని ‘సుశీల’ కలిసి కట్టుగా వచ్చి, ఆమెని చూసినట్లయితే,తమని తాము చూసుకొని  అసూయ పడేటంత, అందంగా ఉంది ఆమె !     “నాపేరు స్నిగ్ధ భైరవి ! మీ పేరేమిటి ? మిమల్ని చూస్తే భైరవ సాధకుల లా

చిలక రథంలో సరదా షికారు ౩

    ద్వాపర యుగంలో దూర్వాస ముహాముని ప్రేమ కానుక అయిన ,‘ కస్తూరి కదళి’ బాగా విస్తరించింది. కలియుగంలో కుంటుబడింది.     కలి ప్రభావం వల్ల కాబోలు, ధర్మదేవత మూడు పాదాలు ముడుచుకొని పోయి, ఒకే పాదం బాగుండడం వలన, ద్వాపర యుగంలో మరణించిన , అసుర వర్గాల ప్రేతాత్మలు, అదను కోసం ఎదురు చూస్తూ, తమ క్రూర కర్మల కోసం తగిన మానవ శారీర మాధ్యమాలని  వెతుకుతూ పరిభ్రమించ సాగాయి.దూర్వాస ముని చేత , భస్మం చేయబడిన , ‘వ్యాఘ్రుడనే’ రాక్షసును దుష్టాత్మ కూడా , అదను కోసం ఎదురు చూడసాగింది.     కస్తూరి కదళి మహిమని కూడా , స్వార్థపరులైన , భూకామందులలో  కొందరు దుర్వినియోగం చెయడం మొదలు పెట్టారు. దాని ఇతర ప్రయోజనాలని మరుగున పెట్టి, కేవలం సంతాన ఫలంగా దాని వాడకాన్ని ప్రోత్సహించారు. దాని కోసం కొన్ని కఠిన నియమాలని పెట్టారు.     కస్తూరి కదళిని ఆడవాళ్లు మాత్రమే సేద్యం చేయాలన్నది వాటిలో ఒకటి ! స్త్రీలే వాటిని నాటి నీరు పోసి చుంబన ఆలింగనాది క్రియల చేత, కాపుకి వచ్చేలా దీహదం చేసేవారు.పౌర్ణమి నాటి రాత్రి , గెలవేసిన కస్తూరి కదళి, దివ్య సువాసనలు వెదజల్లేది ! దానిని కేవలం తడిసిన చీర ధరించిన స్త్రీలు మాత్రమే కొయ్యాలనే నిబంధన ఉండేది !ఆ విధంగా సాగ

చిలక రథంలో సరదా షికారు ౨

     మినీ బస్సు డ్రైవరు , అతని హెల్పరు, బస్సు దిగి పంక్చరు అయిన వెనక చక్రాన్ని, పరిశీలించి చూసారు. ఆ తరువాత అందరినీ దిగమని చెప్పి, డ్రైవరు తన నిస్సహాయతని వ్యక్తం చేసాడు. చిత్రమేమిటంటే  ఆ బస్సు పేరు  ‘చిలకమ్మ !’      “ బాబుగారూ! టైరు మార్చనిదే బస్సు కదలదు. నా దగ్గర  స్టెఫ్నీ కూడా లేదు, నిన్నే ముందు చక్రానికి మర్చాను.  నిన్నటి నుండి డిపోకి వెళ్లడం కుదరక పోవడం వల్ల స్టెఫ్నీ బాగు చేయడం కుదర లేదు.” అన్నా చిలక సారథి.!      “ డ్రైవరు గారూ ! ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు ?” అడిగాడు పినాక పాణి.     “ ముందు అందరూ తలా ఒక చేయి వేసి, బస్సుని గుంట నుంది బయటికి తొయ్యండి” అన్నాడు డ్రైవరు.     అందరూ కలసి కట్టుగా తలా ఒక చేయి వేసి, బస్సుని గుంట నుండి బయటికి లాగారు. ఆ తరువాత చుట్టుపట్ల పరిసరాలని గమనించారు.     ‘తూరుపు రేఖలు తొలి  వలపు తెరల్లా క్రమ క్రమంగా విచ్చుకొంటున్నాయి. పచ్చని చేల మీద , మంచు బిందువులు , ఆకుపచ్చ తివాచీకి కుట్టిన ముత్యాల సరాల్లా మెరుస్తున్నాయి. చల్లని పిల్ల తెమ్మర ఆగి, ఆగి వీస్తూ, జ్యేష్ట మాసపు తాపంతో ఆర్తి నందిన భూదేవి మేనికి ఊరట కలిగిస్తూంది.  కళ్లకి ప్రశాంతతనీ, మనసుకి ఉల్లాసాన్

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల