Skip to main content

Posts

Showing posts from November, 2010

నీల గ్రహ నిదానము 10

నీల గ్రహ నిదానము 10 రోహిణి ---దశరథా ! వికృతాకారుడు, భయంకరుడు అయిన గుళికుని నీవు మాటలతోనే మరల్చినావు. ఇది నీ విజయమునకు తొలి మెట్టు.! దశరథ ----- తల్లీ ! ఆకారములు, చేష్టలు వికృతములయినంత మాత్రమున , మనో వ్యాపారములు వికృతములనుట పొరపాటు ! గుళికు డెంతటి భయంకరుడైనను న్యాయమును అభిలషించు వాడని, వెల్లడి అయినది కదా ! ఎందరో సుందరాకారులు కపట మానసు లగుట నేను ఎరుగుదును. రోహిణి ----రాజా ! నీ మాటలలో శ్లేష ధ్వనించు చున్నది. నేను నా సవతులతో ప్రవర్తించిన విధము వికృతము, భయంకరము అందువా ? దశరథ --- తల్లీ ! నా మాటల వెనుక నీ కట్టి యర్థము స్ఫరించిన యెడల నన్ను క్షమించుము. తల్లి తండ్రుల వర్తనమును విమర్శించు అధికారము తనయునకు లేదు ! ( దశరథుని మాటలు పూర్తవగానే, తెరపై నీలి రంగు వెలుగు పడుతుంది, స్టేజంతా నీలం అయిపోతుంది ) రోహిణి ---- దశరథా ! ఇదుగో శని తేజము ! శని వచ్చుచున్నాడు. సంసిద్ధుడవు కమ్ము ! దశరథ ---- ( చూసి ) అవును, శని దేవుడు ప్రవేశింప నున్నాడు. తల్లీ ! సామమున

నీల గ్రహ నిదానము 9

నీల గ్రహ నిదానము 9 ( చంద్ర _ రోహిణులిద్దరూ చెరొక ప్రక్క నిలబడగా దశరథుడు మధ్యన నిలబడుతాధు, అందరూ కలిసి ) ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమ ప్రభం కుమారం శక్తి హస్తంచ, ‘ మంగళం’ ప్రణమామ్యహం. ( రంగ స్థలం మీద లైట్లు ఆరి, తిరిగి వెలుగుతాయి. కుజ గ్రహ చ్ఛాయ కనిపిస్తుంది. ) మంగళుడు ---- రోహిణీ చంద్రులారా ! మీరు కోరిన మేరకు అజవాహనుడ నైన నేను ఈ అజకుమారుని ధనస్సును విద్యుచ్ఛక్తి పూరితము చేయుచున్నాడను. ( డైలాగు పూర్తి కాగానే, దశరథుని ధనస్సును ఒక మెరుపు లాంటి కాంతి వచ్చి తాకుతుంది ) మంగళుడు --- శశాంకా ! ‘ శని’ , తన పాశముచేత --- ఈ దశరథుని ధనస్సుతో పాటు బంధింప వేయగల సమర్థుడు. అసుర గురుడైన శుక్రాచార్యుని కవచము సాధించి, ఈ రాజన్యుని శని పాశ బంధము నుండి రక్షించుము ( కుజ గ్రహం నీడ మాయమవుతుంది. రంగ స్థలం పైన చిన్న స్పాట్ వెలుగులో, ముగ్గురూ శుక్రగ్రహ స్తోత్రం చేస్తూ కనిపిస్తారు ) హిమ కుంద మృణాలాభం, దైత్యనాం పరమం గురుం సర్వ శాస్త్ర ప్

నీల గ్రహ నిదానము 8

నీల గ్రహ నిదానము 8 ( తృతీయాంకము ) (శేష దృశ్యము ) ( రోహిణీ నక్షత్ర మండలం__ గమనిక : రోహిణీ నక్షత్రం శకటాకారంగా ఉండే అయిది నక్షత్రాల కూటమి ) ( రోహిణి పాన్పుపై కూర్చొని దశరథుని రాకకు ఎదురు చూస్తూ ఉంటుంది ) ( దశరథుడు ధనుర్భాణములు చేత బట్టి, పూర్తి యుద్ధ వేషంలో వస్తాడు. ) ( రోహిణి దశరథుని రాక చూసి, దోసిలతో పూలని తీసుకొని పాన్పు దిగి వస్తుంది,) రోహిణి ---- ఆగుమాగుము అకళంక కీర్తిచంద్ర, అయోధ్యా పురీ రమేంద్రా ! (దశరథుడు ఆగిపోతాడు ) రోహిణి ---- శశాకుని ప్రియ భామిని అయిన ఈ రోహిణి నీకు స్వాగతము చెప్పుతున్నది. ( దోసెట్లో పూలు దశరథుని పాదాల మీద పోస్తుంది ) రోహిణి ---- స్వాగతం ! దశరథ రాజేంద్రా ! సుస్వాగతం ! దశరథ ---- మాతా ! మీ నక్షత్ర మండలమున నా యందలి ప్రీతితో, మీ రిచ్చిన స్వాగతము నా జీవితమున ఒక మధురానుభవము ! ఈ అల్పుని ప్రణామము స్వీకరించెదరు గాక ! రోహిణి ---- ( ఆశ్చర్యంతో ) ఇది యేమి అజ కుమారా ! నేను నీ శరణాగతను !! శరణార్థులు

నీల గ్రహ నిదానము 7

నీల గ్రహ నిదానము 7 (ద్వితీయాంకము) ( ద్వితీయ దృశ్యము ) ( అయోధ్య లోని నాలుగు రోడ్ల కూడలి ) ( బుధుడు ఒక ఆసనంపై కూర్చొని ఉంటాడు. అకంపనుడు ,అర్ణవ ష్ఠీవి --- శిష్యులుగా మారి అతనికి చెరొక ప్రక్క నిలబడి ఉంటారు.) ___పాట__ శిష్యులు --- సౌమ్య గురుని శరణు పొందండి, జనులార ! మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి అకంప -- అత్రి మునికి మనుమడండీ ! అసుర గురుని శిష్యుడండీ ! అర్ణవ -- తపస్సాధన చేసి , దండి సత్యమును కనిపెట్టినాడండీ !| శిష్యులు ---------- సౌమ్య గురుని శరణు పొందండి, జనులార ! మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి బుధుడు -------- హర హరిః ఓం, హర హరిః ఓం, హర హరిః ఓం, హర హరిః ఓం అయోధ్యాపురి వాసులారా ! అన్నాలారా, అక్కలారా ! పూజ్య మాతా పితరులారా ! నే చెప్పబోయే నిజము వినరండి శిష్యులు ---------- సౌమ్య గురుని శరణు పొందండి, జనులార ! మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి బుధుడు ------- ప్రజా రక్షకు పరమేష్ఠి ఘటితము రోహిణీ నక్షత్ర శకటము శనైస్వరుని కది ప్రథమ కబళము కానున్న

నీల గ్రహ నిదానము 6

నీల గ్రహ నిదానము 6 ( అందరూ ఆ వార్త విని నివ్వెర పోతారు. దశరథుడు చెవులు మూసుకొంటాడు ) దశరథ ---- హరి హరీ ! ఎట్టి దుర్వార్త వినవలసి వచ్చినది !! మహాత్మా , మీరు చెప్పునది నిజమేనందురా ? బుధుడు -- సందేహము వలదు రాజేంద్రా ! మానవులే కాదు, పశువులు, సర్పములు , లతలు ,వృక్షములు , మొదలగు తిర్యగ్ స్థావర సముదాయములు కూడ నశింప నున్నవి అదియే కాక--- దశరథ --- అమంగళము ప్రతిహతమగు గాక ! విప్రోత్తమా, మీరు చెప్పునది ఇంకేది మిగిలినను సత్వరము చెప్పివేయుడు. ఈ దశరథుడు గుండె రాయి చేసుకొని వినుటకు సంసిద్ధుడై యున్నాడు. బుధుడు ---- అవశ్యము నృపుడా ! వినుము. గ్రామములు , నగరములు , దేశములు , ద్వీపములు---- సుమంత్ర ----- ఆగండి ! భూసురోత్తమా ! చిన్న సందేహము, నగర, మృగ , మానవ జాతి సముదాయముల నాశన కాండ ఎట్లు సంభవించ నున్నది ? బుధుడు ----- భూ వలయము లోని, సప్త ద్వీపముల జలములు వాపీ కూప తటాకములు, నదీ నదములు ఇంకి పోవుట వలన. అకంప --- మ--- మహాత్మా ! ఇదంతా ఒక్క రోజులోనే