Skip to main content

Posts

Showing posts from April, 2016

ప్రేమ, వంచనకి చిరునామా!! --20 చివరి భాగము.(చిలక రథంలో సరదా షికారు 2 వ పార్టు కూడా అయిపొయింది)

 ప్రేమ అంటే ... మధుర భావన, తీయని అనుభూతి, ఉల్లాసాన్ని కలిగించే స్పందన, ఉత్సాహాన్ని రేకెత్తించే ఆకర్షణ, ఇవన్నీ అందరూ అంగీకరించిన విషయాలే! ప్రేమ అంటే---- గ్రుడ్డిది, మూగది, చెవిటిది, అంటే ఏ ఇంద్రియానుభూతికీ లొంగనిది, అతీంద్రియ శక్తులకి కూడా అందు బాటులో లేని విచిత్రమైన  ‘మాయాజాలం’ అని కూడా అనవచ్చు! శ్రీ లలిత వివాహ బంధానికి కట్టుబడి, మర్యాదని అతిక్రమించకుండా, స్వచ్చమైన ప్రేమతో చరణ్’ని ప్రేమించింది. అయినా వంచనకి గురి అయింది! కందళి ప్రేమ- అజ్ఞానం వల్ల, హేమలత ప్రేమ- అమాయకత్వం వల్ల, విలాసిని-  ప్రేమ ఈర్ష్య వల్ల, సనక మేనకల ప్రేమ- స్వార్థం వల్ల విఫలమయ్యాయి. అయినా ఈ ప్రేమ మాయాజాలంలో చిక్కిన వాళ్ళు, బయట పడలేక చిక్కుల పాలు అవుతూనే ఉన్నారు! అజ్ఞానం, అమాయకత్వం, ఈర్ష్య, స్వార్థం, ఇలాంటి వన్నీ బలహీనతలు, ఇవన్నీ ఈ మాయా జాలపు ఆకర్షణకి అనుగుణంగా  ‘ఆ యా మాయావులకి’ ఎప్పటికీ సహాయం చేస్తూ, వంచనకి గురి చేస్తూనే   ఉంటాయి!! శ్రీ లలిత అలాంటి మాయావి యొక్క వంచనని గుర్తించి, దాని నుండి బయట పడేందుకు మనసు దిటవు చేసుకొంది. తన అపూర్వ ప్రేమ ఫలమైన గర్భాన్ని అపురూపంగా చూసుకొని రాజీ పడింది. అంతే కాదు, మంజీరని

ప్రేమ, వంచనకి చిరునామా!..19౯చిలక రథంలో సరదా షికారు..పార్టు 2 )

నిందితుడు వైభవ్ చరణ్ భవనం లోపల ఆయుధాలతో సుసజ్జితుడయి ఉన్నాడు. అతని బలం ఎంతో తెలియదు! వాళ్ళు భవనంలో ఉండడం వల్ల సురక్షితంగా ఎటాక్  చేయ గలరు! అందుకే నలుగు దిక్కులా నుండి ఒకేసారి చేయమని ఆదేశించాడు అతను. తాము మైదానంలో చిన్న చిన్నవెహికల్సులో ఉండడం వల్ల బేంకర్లు లాంటి వేవీ అడ్డు లేక పోవడం వల్ల సురక్షితులయి లేరు! అందుకే నాలుగు వైపిల నుండి చేస్తే శత్రువు ఎంత బలగంతో ఉన్నాడో, ఎంత తయారుగా ఉన్నాడో తెలుస్తుంది. ఎటాక్’కి ముందు, లౌడ్ స్పీకరు ద్వారా హెచ్చరిక  చెయ్యడం తప్పని సరి! లౌడ్ స్పీకర్లో  హెచ్చరిక జారీ అయింది. “మిస్టర్ వైభవ్ చరణ్! నువ్వు బ్రతికే ఉన్నావని, నీ అన్న అయిన సూర్య చరణ్  పేరుతో జీవితం గడుపుతున్నావని మాకు తెలిసి పోయింది. క్రొత్త జీవితం చాలా జాగ్రత్తగా గడిపినా, నీ పాత అలవాటు మాన లేక మళ్లీ, డ్రగ్సు వ్యాపారంలో తల దూర్చావని కూడా మాకు తెలిసి పోయింది. ఇక నీ ఆట కట్టు! మర్యాదగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా మాకు లొంగి పో! అలా లొంగి పొతే నీకు పడే శిక్షలో  కొంత భాగం తక్కువ గడప వచ్చు. నువ్వు పోలీసు ఫోర్సుతో  యుద్ధం చెయ్యలేవు! మేము పది లెక్క పెట్టె లోగా, నువ్వు తెల్ల జెండా చూపిస్తే సరే సరి! లేదంటే ఘర్

ప్రేమ, వంచనకి చిరునామా!..18 (చిలక రథంలో సరదా షికారు...పార్టు 2 )

శ్రీ లలిత దానిని చూసి బెదరింది. “ఏం చేస్తున్నారు మీరు?” అని అడిగింది, కాతర నయనాలతో! “ఏం చేస్తానా, చూడు తొందరేముంది!” అంటూ ఆమె జబ్బ పట్టుకొని మంచం పైన బోర్లా పడుకోబెట్టాడు. ఆమె జాకెట్టుని సికెల్’తో చీల్చి, విప్పేసాడు. శ్రీ లలిత నగ్నమైన వీపు కళ్లు చెదరగొట్టే ఆ వెలుగులో కూడా మెరుపు మెరసి నట్లు కనిపించినా, లైట్ల వేడికి చురక్కు మని కాలింది! “ నువ్వు బట్టలు వేసుకొన్నా, వేసుకోక పోయినా, కూర్చొన్నా, నిల్చోన్నా, పడుకొన్నా  ఈ వేడి నీ  శరీరాన్ని కాలుస్తుంది. నువ్వు బాట్ రూములో కాలం గడపాలని ఆలోచించకు, ఎందుకంటే దానిని లాక్ చేసి, వెళ్తాను. నీ  ఒంట్లో నీరంతా ఆవిరి అయిపోయే వరకు, అలా కాలుస్తూనే ఉంటుంది, సరేనా? నాతో పెట్టుకొన్నందుకు నీకు ఇదే శిక్ష! అంత వరకు బై!” అంటూ బాత్ రూముని, లాక్ చేసాడు, ఆతరువాత బయట గడియ పెట్టేసాడు! వెళ్ళే ముందు ఆమె మొబైలు తీసుకొనే వెళ్ళాడు! శ్రీ లలిత ఆలోచించింది, ఈ గదిలో ఎక్కడున్నా తను వేడికి గురికాక తప్పదు! మంచం క్రిందన పడుకొంటే అన్న ఉపాయం తట్టి వెంటనే అమలు చేసింది! రాత్రి  నాలుగు గంటలకి  తలుపు కొట్టిన చప్పుడు విని, పినాక పాణి నిద్ర లేచాడు. ఎవరో బయట నుండి  కేక పెడుతున్నార

ప్రేమ, వంచనకి చిరునామా! --17 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )

“కథ బాగానే ఉంది, కాని నీ  పోలిక ఏమీ బాగులేదు అంతేకాదు, నీ మాటలు నమ్మ శక్యం కావడం లేదు” అంది మంజీర. “అయితే అతనినే ఈ రోజు నిలదీసి అడుగు” అంది శ్రీ లలిత. “సరే! ఈ రోజే అడుగుతాను, నీ మాటలు నిజమవునో కాదో, అవి నీ భ్రమలే అయితే, నువ్వు ఇంకాకుదుట పడనట్లే!”అంది మంజీర. ఆ రోజు రాత్రి శ్రీ లలిత ఒంటరిగానే తన గదిలో పడుకొంది. ‘తను ప్రెగ్నెన్సీ నెపంతో చరణ్’ని దూరంగా ఉంచడం వల్ల తన కంటె, చరణ్’కే  ఎక్కువ లాభం కలిగిందని తెలుసుకొంది ఆమె. ఇప్పుడు అతను ఆ అందాల బొమ్మతో ఆడుకొంటున్నాడు. ఆమె అడిగిన దానికి, నవ్వేసి, ‘లల్లీ అలాగే మాట్లాడుతుంది, అది పిచ్చిది’, అని డిక్లేరు చేసేసి, ఆమెని కౌగిట్లోకి తీసుకొని మత్తులో పడేసి ఉంటాడు! లవ్లీ అతని చిలిపి చేష్టలలో, కౌగిలింతలలో, ముద్దు మురిపాలలో మునిగి మైమరిచి పోయి ఉంటుంది! అయినా తనేమిటి ఇలా ఆలోచిస్తోంది! లవ్లీ పట్ల అసూయ పడుతోందా? చ! తను వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి!’అని భావించి శ్రీ లలిత తెప్పరిల్లింది. తెల్లవారి ఝాము మూడున్నరకి లేచేందుకు అలారం పెట్టుకొని, నిద్రకి ఉపక్రమించింది. సాగర్’తో ఆమె ఒప్పందం చేసుకొంది, ప్రతీ రాత్రి బ్రాహ్మీ కాలానికి అతనితో కంటాక్టు చేస్తానని!

ప్రేమ, వంచనకి చిరునామా!--16 (చిలక రథంలో సరదా షికారు-- పార్టు 2 )

ఆ ప్రణయ కేళి, కాదు కాదు పాములాట రోజుకో విధంగా ఉండేది. ఒక రోజు, అపరాహ్ణ వేళ ఇంటి ముందర వృక్షచ్ఛాయలో, విశ్రమించిన, ‘సనక’ చల్లని చందన స్పర్శతో పులకితురాలై వెను తిరిగి చూసింది.ఎదుట మధుర భావనలే మూర్తి దాల్చినట్లు, చేత చందనపు గిన్నెతో ప్రత్యక్ష మయ్యాడు పుణ్య రత్నుడు. పొద్దు రెండు ఝాముల వరకు కూర్చి కట్టిన పూలమాల అతని కంఠానికి అలంకరిస్తూ,“ ఇంకాఎన్నాళ్లీ దుస్సహ నిరీక్షణ ప్రభూ ! గోముగా అడిగింది సనక, అతని హృదయం మీద వాలిపోయి. “ఏం చెయ్యమంటావో ఆజ్ఞాపించు దేవీ !” “మహారాజా వారి నిర్యాణం వరకు ఎదురు చూడక వారి అనుమతి తోనే మన వివాహం జరగదా ప్రభూ?” “వీలు పడదు సనకా ! అతని అనుమతి లభించడం అసాధ్యం !” ఆ మాటలకి దిగజారి పోయిన సనక విషణ్ణ వదనం చూస్తే నవ్వు వచ్చేది పుణ్యరత్నునికి. ఆమెనింకా మాటలతో రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో, “ఒక ఉపాయం ఉంది సనకా !” అన్నాడు హఠాత్తుగా. “ఏమిటది ప్రభూ ?!” ఆతృతతో ధ్వనించింది సనక కంఠం. “మహారాజుని మన ప్రణయ పథం నుంచి అపసారితం చెయ్యడమే !” మాట పూర్తి కాకుండానే అడ్డు పడింది సనక. “ అంతటి భయంకరమైన ఆలోచనలకి తావివ్వకండి ప్రభూ!” “అయితే దినాలపై దినాలు, యుగాలపై యుగాలుగా ఈ దుస్సహ నిరీక్ష

ప్రేమ, వంచనకి చిరునామా! --15 (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2 )

ఫారం హౌసులో మూడు గదులు, ఒక పెద్ద హాలు, కిచెన్, ఉన్నాయి. రెండు రూములకి ఎటాచ్ టాయి లెట్లు, హాలుకి ఆనుకొని కామన్ టాయిలెట్ ఉన్నాయి. ముందుగా హాలు, కిచెన్, తరువాత వరుసగా మూడు గదులు ఉన్నాయి. ఆ గదులని కలుపుతూ పొడవైన కారిడార్ ఉంది. కారిడార్ చివర పెరటి వైపు ద్వారముంది. హౌస్ చుట్టూ పొలాలు, వాటి గట్ల మీద కొబ్బరి చెట్లు ఉన్నాయి. అన్ని ఆధునిక  వసతి  సౌకర్యాలు కలిగి, పట్టణ  జీవితానికి దూరంగా, పచ్చని ప్రకృతి వాతావరణం మధ్యన ఉందా హౌసు! శ్రీ లలిత మనసే గాని గాయపడకుండా ఉండి ఉంటే, ఆ ఫారం హౌసు ఆమెకి ఎంతగానో నచ్చి ఉండేది! చరణ్ కారుని తీసుకొని, బిజినెస్ పని అంటూ వెళ్ళిపోయాడు. మంజీర తన గదిలో కూర్చొని, టి.వి. చూస్తోంది. శ్రీ లలిత ఫారం హౌసు అంతా కలయ తిరిగి, దాని బయటికి వచ్చి చూసింది. ఆ ఇంట్లోని ప్రతీ గదినీ, హాలునీ,కిచెన్’నీ, తనదగ్గర ఉన్న మోబైలుతో ఫోటోలు తీసి, ఆ ఫోటోలని  సాగర్’కి ఎం.ఎం.ఎస్ ద్వారా పంపింది. ఆ హౌసుకి  దూరంగా ఒక నిర్మాణాధీనమైన బిల్డింగు ఉంది. మూడు అంతస్తులు వరకు లేచిన ఆ బిల్డింగు పని ఎందుకు నిలిచి పోయిందో గాని, ఎన్నో సంవత్సరాలుగా ఆగి పోయినట్లు, దానిని చూస్తేనే తెలుస్తోంది! వానలకి తడిసి, పాకుడు

ప్రేమ, వంచనకి చిరునామా! 14 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )

శ్రీ లలిత  భర్త దగ్గరకి వెళ్ళాలని నిర్ణయించు కొన్నట్లు, సాగర్  అత్తయ్య మామయ్యలతో చెప్పాడు.అతని నుండి పిలుపు కోసం ఎదురు చూస్తోందని, ఈ లోగా దుఖాన్ని మరచి పోయేందుకు తన దగ్గర కొన్ని వ్యక్తిత్వ వికాస పాఠాల ట్రైనింగు తీసుకొంటుందని కూడా చెప్పాడు. పినాక పాణి, మీనాక్ష్మమ్మలకి కూతుర్ని ఒంటరిగా వదలి ‘అరటి పాడుకి’ వెళ్ళడానికి మనస్కరించ లేదు. సాగర్ ఆమెకి ధైర్యాన్ని ఇచ్చేందుకు పూనుకోవడం వాళ్లకి సంతోషాన్ని కలిగించింది. కూతురు భర్త దగ్గరకి వెళ్లి పోతుంది, రాజీ పడి బ్రతుకు గడుపుతుందన్న విషయం భాధాకరమైనా, ఆమె తనంత తానుగా ఆ నిర్ణయం తీసుకోవడం మంచికే అని భావించారు. పోలీసు కంప్లయంటులు, కోర్టుకి అపీల్లు చేయడం దండగ అని చేయడం మానేసారు. ఇది వరకు కేశవ్ గుప్త మీద చేసిన పోలీసు కంప్లయంటు వెనక్కి తీసుకొన్నారు. మీనాక్షమ్మ వంటింటి పని అంతా, తన భుజాల మీదనే వేసుకొంది. కూతురికి సాగర్ దగ్గర ట్రైనింగు అయేందుకు పూర్తిగా సహకరించింది. అదేమి ట్రైనింగు, ఇప్పుడు ఎందుకు అని వాళ్ళు అడగ లేదు. ‘ఆమె వివాహం చేసే ముందు, వరుని ఆను పానులు వివరంగా తెలుసుకోకుండా, తొందర పడి ముడి పెట్టేసామన్న, ‘అపరాధ భావన’ వాళ్లకి మరే ప్రశ్నలూ వేసే సా

ప్రేమ, వంచనకి చిరునామా!---13 (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2 )

ఇంతలో ఒక ‘కొరియర్ బాయ్’ వచ్చి, “శ్రీ లలిత గారికి ఒక కవరు ఉంది!” అన్నాడు. సాగర్ దాన్ని అందుకొన్నాడు. కొరియర్ అతని సంతకం తీసుకొని వెళ్లి పోయాడు.ఆ కవరుని శ్రీలలితకి ఇచ్చాడు అతను. “నువ్వే చదువు బావా!” అని ఆమె అనగానే, సాగర్ కవరు విప్పాడు, లోపల ఇంకొక కవరు ఉంది. ఆ లోపలి కవరు మీద ‘పర్సనల్ & కాంఫిడేన్షియల్’ అని ఉంది. దానిని శ్రీ లలితకే ఇచ్చి “ఇది పర్సనల్ అట! నువ్వే చూడు” అని అన్నాడు. శ్రీ లలిత లోపలి కవరుని విప్పింది. అందులో ఒక ఉత్తరం ఉంది! దానిని చరణ్ వ్రాసాడు! ఆమె ఉత్సుకతతో దానిని చూసింది. “ఎక్కడ నుంచి వచ్చిందే, ఉత్తరం? ” అడిగింది మీనాక్షమ్మ. “ఆయన వ్రాసారమ్మా!” “అలాగా! చదివి విశేషాలు ఏవైనా ఉంటే చెప్పు.” శ్రీ లలిత ఉత్తరాన్ని తన మనసులోనే చదువుకుంది! చరణ్ ఉత్తరాలు ఎలా ఉంటాయో ఆమెకి తెలుసు! డియర్ లల్లీ! ఈ పాటికి నీకు కొన్ని వాస్తవాలు తెలిసే ఉంటాయి! నిన్ను పెళ్ళాడింది, నీతో సంసారం చేసింది, సూర్య చరణ్ కాదని, వైభవ్ చరణ్ అని ! అయినా పేరులో ఏముంది లల్లీ, నేనేగా నీ చరణ్’ని! లల్లీ! నే ప్రేమ ఎంత గాఢమైనదో  నాకు తెలుసు! అలాగే నా ప్రేమ కూడా అంతే లోతైనది డియర్! మన ఇద్దరిదీ అంటే నీది, నా

ప్రేమ, వంచనకి చిరునామా! --12 (చిలక రథంలో సరదా షికారు-- పార్టు 2 )

పినాక పాణి , మీనాక్షమ్మ ఆ మరుచటి రోజే అక్కడకి వచ్చారు. వాళ్ళెవరూ  సూర్య చరణ్’ని తప్పు పట్ట లేదు. సాగర్ ప్రోత్సాహంతో, కేశవ్ గుప్త మీద, సూర్య చరణ్ అపహరణ నేరాన్ని మోపుతూ పోలీసులకి ఫిర్యాదు చేసారు. అది ‘హై ప్రొఫైల్’ వ్యక్తులు చేసిన నేరమని, పోలీసులు ఏక్టివ్’గా పరిశోధన చేయరని సాగర్’కి తెలుసు! ఒక క్రిమినల్  లాయరుగా అతనికి కొంత మంది పోలీసు ఇనస్పెక్తర్ల తోనూ, మరికొంత మంది ప్రైవేటుడిటెక్టివ్’ల తోనూ పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలని పురస్కరించుకొని అతను సూర్య చరణ్ కేసుని తనంత తనే పరిశోధన చేయడానికి నడుం కట్టాడు.   ముందుగా సూర్య చరణ్ తల్లి తండ్రుల వివరాలు సేకరించడానికి అతను పినాక పాణి గారిని ప్రశ్నించాడు. “మామయ్యా! సూర్య చరణ్’ పేరెంట్స్ గురించి మీకు ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పండి. అతను కనబడని విషయం వాళ్లకి కూడా చెప్పాలి కదా!” అని. “ఏం చెప్పమంటావురా! సూర్య చరణ్ తల్లి తండ్రులు విమాన ప్రమాదంలో చని పోయారట!” “అతనికి అన్నా చెల్లెళ్ళు ఎవరూ లేరా?” “ఒకే ఒక్క ట్విన్ సోదరుడు ఉన్నట్లు చెప్పాడురా, అతను కూడా ఆ విమాన దుర్ఘటన లోనే పోయాడట ఏ బాదర బందీ లేని సంబంధం అని అప్పట్లో సరదా పడ్డామురా సాగర్! ఇప్పుడు ఎం

ప్రేమ, వంచనకి చిరునామా! 11 (చిలక రథంలో సరదా షికారు -పార్టు 2 )

అరటి పాడు వెళ్ళిన తరువాత శ్రీ లలిత, తల్లి తండ్రులని చూసిన ఆనందంలో తన సమస్యని తాత్కా లికంగా మరచి పోయింది. పినాక పాణి, మహాలక్ష్మమ్మల దృష్టిలో శ్రీ లలిత, సూర్య చరణ్ లాంటి భర్తని పొందిన అదృష్టవంతు రాలు! ఎందుకంటే అల్లుడు గారు అద్వితీయులు! అతనికి సాటి ఎవరూ లేరు!’ అలాంటి అభిప్రాయం ఉన్న వారికి ‘తన భర్త అంగీకరించిన పని నచ్చక పోవచ్చు! అయిన అతనా పని ఒప్పుకోవడానికి తన బాధ్యత కూడా ఉంది కదా, అలాంటప్పుడు ఎలా చెప్తుంది?’ అందుకే ఆమెచెప్ప లేదు, సాగర్ బావని కూడా చెప్పవద్దని అంది. సాగర్ విషయం పూర్తిగా తెలిసేంత వరకూ, పాజిటివ్ గానే ఆలోచించమని చెప్పాడు. బహుశా చరణ్ అమాయకుడు కావచ్చు! శ్రీ లలితని వంచించి నట్లే అతనిని కూడా తమ నాటకానికి పావుగా వాడుకొం టున్నారేమో, కేశవ్ గుప్త లాంటి స్వార్థ పరులు! అందు వల్ల చరణ్’కి కొంత సమయం ఇవ్వడమే మంచిది . ఎలాగూ శ్రీ లలిత పుట్టింటికి వచ్చింది కాబట్టి, కొన్ని రోజులు అక్కడే ఉండి తరువాత ఇంటికి వెళ్ళడమే సరి అయిన నిర్ణయం అవుతుంది. ఈ లోగా చరణ్ తన పని పూర్తి చేసుకొని వచ్చినా రావచ్చు కదా! అని అన్నాడు. వారికి అర్థం కానిదల్లా చరణ్ మొబైలులో మాట్లాడడం  మానేసాడెందుకు, అనేదే! అతని మొబైలు

ప్రేమ, వంచనకి చిరునామా !--10 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )

ఇంతలో “ ఏయ్,శ్రీ లలితా!” అంటూ ఎవరో పలకరించే సరికి తలెత్తి అటు వైపు చూసింది ఆమె, తన సీటు ప్రక్కనే నిలబడి తన వైపే చూస్తూ పిలిచాడు అతను! శ్రీ లలితకి కొంత సేపటి వరకు మైండ్ బ్లాంక్ అయి అతనెవరో జ్ఞాపకానికి రాలేదు, తరువాత క్విక్’గా రికవరీ అయి,“ సాగర్ బావా! అదేమిటి అలా నిలబడి పోయావు? రా కూర్చో”అంటూ తను మరి కాస్త విండో వైపు జరిగి, అతనికి సీటు ఆఫర్ చేసింది సాగర్ ఆమె ప్రక్కనే కూర్చొన్నాడు. సాగర్ శ్రీ లలిత 3 వ మేనత్త కొడుకు, జయనగరం లోనే ఉంటున్నాడు. ‘లా’ చదివి, పెద్ద హైకోర్టు క్రిమినల్ లాయరు దగ్గర, జూనియర్’గా పని చేస్తున్నాడు. వాళ్ళ ఊరు కూడా అరటి పాడే! అతను శ్రీలలిత కన్నా కేవలం 3 నెలలే పెద్ద! ఆమెని సాగర్ బావకి ఇచ్చి చేద్దామనే అనుకొన్నారు గాని వయసులో మరీ తక్కువ తేడా ఉండడం వల్ల పినాక పాణి గారు బయట సంబంధం చేసారు ఆమెకి! “సాగర్ బావా! ఎక్కడకి, అరటి పాడుకేనా?” అడిగింది శ్రీ లలిత. “అదే ప్రశ్న నిన్ను కూడా అడుగుదామనే  అనుకొన్నాను గాని...” అంటూ ఆగాడు సాగర్. “ఎందుకని అడగ లేదంటే మన ఇద్దరి సమాధానం ఒక్కటే కాబట్టి, అంతేనా బావా!” మాట పూర్తి  చేసింది శ్రీ లలిత. ఇద్దరు పకపకా నవ్వుకొన్నారు. “శ్రీ లలితా! అన్

ప్రేమ, వంచనకి చిరునామా!---9 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )

మరునాడు హవేలీకి కేశవ్ గుప్త ఒంటరి గానే వచ్చాడు, హాలులో కూర్చొని రంగమ్మని పిలిచి, కాఫీ తెమ్మని చెప్పాడు. రంగమ్మ ద్వారా, అతను వచ్చిన విషయం తెలిసి, శ్రీ లలిత సూర్య చరణ్’లు ఇద్దరూ హాలు లోకి వచ్చి, అతన్ని, ”గుడ్ మార్నింగ్ సర్!” అని విష్ చేసారు. కేశవ్ గుప్త వాళ్లని చూసి,’గుడ్ మార్నిగ్! బోత్ అఫ్ యూ! అలా కూర్చోండి, నేను మీకు ‘మంజీర రికవరీ’గురించి ఆలోచించిన ప్లాన్ చెప్తాను” అన్నాడు. “ఆమెకి ఎలా ఉంది అన్నయ్య గారూ?”అడిగింది శ్రీ లలిత. “స్టేబుల్’గా ఉంది ఏ మాత్రం ఎక్కువ తక్కువలు లేవు, అయితే వైలన్స్ లేనందుకు సంతోషించాలి” “ఆమె రికవరీ గురించి ఏ ప్లాను ఆలోచించారు?” సూర్య చరణ్ అడిగాడు. “చెప్తాను వినండి, చెల్లెమ్మా! నువ్వు కూడా వినవమ్మా! మీరు ఇద్దరూ నాతో  టి .వి స్టూడియోకి రావాలి. అక్కడ రికార్డింగు కార్య క్రమంలో పాల్గోవాలి.” “రికార్డింగు కార్యక్రమమా?!” “అవును, చిత్రమేమిటంటే సూర్య చరణ్ గారి ‘వాయిస్’ కూడా వైభవ్ వాయస్’తో కలుస్తోంది! అందు వల్ల సూర్య చరణ్ గారు తాన గొంతుతో, మేము తయారు చేసిన స్క్రిప్టుని చదవాలి. దానిని రికార్డు చేయడం జరుగుతుంది.” “ఆ రికార్డుని మంజీరకి వినిపిస్తారా అన్నయ్య గారూ?