గోవిందయ్య --- అశోక్;లో మార్పు వస్తుందంటావా ఆశా ?
ఆశా --- పురుషుడికి స్త్రీ అవసరం చాల ఉంటుంది మామయ్యగారూ ! నా దగ్గరనుండి అవన్నీ పొందాలంటే అతను తనని తాను మార్చుకోక తప్పదు. మీరు చూస్తూ ఉండండి..
గోవిందయ్య --- నువ్వు ధైర్యంతో నిలబడి ,దానిని ఒక యఙ్ఞం లాగ నిర్వహించవమ్మా, నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది !
( అశోక్ మధ్య ద్వారం నుండి ప్రవేశిస్తాడు )
అశోక్ --- ఏమిటీ, ఏదో యఙ్ఞం అంటున్నారు ?
గోవిందయ్య – (గతుక్కుమంటాడు తరువాత సర్దుకొని) మరేం లేదురా అబ్బాయ్ ! మన ప్రక్క వీధిలో గాయత్రీ యఙ్ఞం నిర్వహిస్తున్నారు, అమ్మాయితో నేను ఆ విషయమే చర్చిస్తున్నాను.
అశోక్ ---- మీ ఇద్దరి మధ్య ఏ యఙ్ఞం నడుస్తోందో నాకు అర్థమయింది నాన్నగారూ ! ( అని భావుకతతో ) ఒక యజమానిగా నేనీ ఇంటి సుఖ సంతోషాలకి ఎలాంటి లోటు కలగనివ్వను. ఇది నా ప్రతిఙ్ఞగా తీసుకోండి నాన్నగారూ, నేనీ రోజు నుండి ఒక వృక్షంగా మారిపోతాను.
ఆశ --- ఏమంటున్నారండీ, వృక్షం లాగ మారడమేమిటి ?
అశోక్ --- ( గోలెంలో ఉన్న ఒక మొక్క దగ్గర నిలబడి ) అవును ఆశా ! నిజమే చెప్తున్నాను. ఈ మొక్కలని చూసావా ఆశా, ఇవి కార్బన్ డయాక్సైడ్ లాంటి విష వాయువులని