Skip to main content

Posts

Showing posts from December, 2012

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక --1)

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక --1) ఈ ధారావాహిక గురించి పరిచయ వాక్యాలు. ఈ రచన వ్రాసి పుష్కర కాలం దాటింది ! మొదట దీనిని స్త్రీ పాత్ర లేని ( అప్పట్లో స్త్రీ పాత్రధారులు లభించేవారు కారు ) నాటకంగా వ్రాసి, ఆంధ్ర ప్రదేశ్ నాటక కళా అకాడమీ నాటక పోటీలకి పంపాను. అయితే ఈ నాటకం వారు గిరి గీసిన మూడు ప్రధాన విషయాలు --- ౧) వరకట్న దురాచారం ౨) సమ సమాజ స్థాపన ౩) కుల మత సామరస్యం-- దేనికీ సంబంధించినది కాదని, పోటీకి అనర్హమైనదిగా ప్రకటించి తిరిగి పంపారు. ఆ తరువాత ఒక ప్రవాసాంధ్ర నాటక సమాజానికీ, మరొక ప్రసిధ్ధ నాటక సమాజానికీ పంపాను. దీనిలో స్త్రీ పాత్ర లేక పోవడం చప్పగా ఉందనీ, హాస్యం శ్రుతి మించిందనీ, ఏ ప్రధాన విషాయానికీ అద్దం పట్టలేదనీ వారు ప్రదర్శనకి అంగీకరించ లేదు.   దానితో నిరాశ చెంది దీనిని మార్పులు చేర్పులు చేసి నవలగా మలచాను. ఈ నవలని ‘ చతుర’,‘ స్వాతి’. ‘ఆంధ్ర భూమి’.‘ ప్రజా డైరీ’ మాస పత్రికలకి ప్రచురణార్థం పంపాను. కాని పంపన ప్రతీ చోటినుండి ఇది శాఖా చంక్రమణం చేసి తిరిగి వచ్చి నన్ను చేరింది. పత్రికా సంపాదకులు ఎందికు స్వీకరించలేదో తెలియ జేయరు, కాని ‘ ఆంధ్ర భూమి’ మాత్రం చిన్న కామెంట్