Skip to main content

Posts

Showing posts from July, 2014

పుణ్య శ్లోకస్య చరిత ముదాహరణ మర్హతి

స్వస్తి శ్రీ నందన నామ సంవత్సర  కార్తీక బహుళ అష్టమి గురువారం  తేదీ  06.12 2012 , విజయనగరం జిల్లా , బొబ్బిలి మండలం లోని , `కలువరాయి’ గ్రామంలో , ఇంకా తెల్లవారి కాక ముందే , `ఔషసి  విచ్చుకోక ముందే , క్రొత్తగా నిర్మించిన `అరుణాచల రమణ ఆశ్రమం ‘దగ్గర , `వెల్లువలా’ పోటెత్తిన జనం , గొప్ప కోలాహలంతో ,`జయనాదాలు ‘ చేస్తూ , తమ గ్రామంలోనే 133 సంవత్సరాల క్రిందట , అంటే శ్రీ బహుధాన్య నామ సంవత్సర బహుళ అష్టమి భానువారం నాడు జన్మించి , ఆ  గ్రామానికి ఖండాంతర ఖ్యాతి తెచ్చిన ఒక మహానుభావుని విగ్రహాన్ని , అతని గురుదేవుల విగ్రహంతో పాటు స్థాపించారు. విగ్రహాలు రెండింటి  స్థాపన జరిగాక , ఆనంద పారవశ్యంతో  చెమ్మగిల్లిన కన్నులు తుడుచుకొంటూ ఉండగా ఒక అపరిచిత వ్యక్తి హస్త  స్పర్శ  నా  భుజంపై పడింది. నేను వెనుతిరిగి చూసాను. ``నమస్కారమండి ! నా పేరు చైతన్య , బొబ్బిలి నుండి వచ్చాను , `ఉపాధ్యాయునిగా  పని చేస్తున్నాను . విగ్రహ స్థాపన సమయంలో మీ స్పందనను చూసాక , ఆ మహర్షులు ఎవరో మీకు బాగా తెలుసునని అనిపిస్తోంది !  విగ్రహ రూపం  లోని  ఆ  మహర్షులు  ఎవరు , వారి చరిత్రలు  ఏమిటి ?’’ ``నిజమేనండి నాకు  ఆ  పుణ్య శ్లోకుల  చరిత్