ఎస్టేటు ఏజెంటు ‘’ పటవర్థన్ ‘ , తన కెదురుగా కూర్చొని ఉన్న నవ దంపతుల వంక , ముఖం క్రిందకి దించి , కళ్లజోడు మీదుగా కనుబొమల మధ్యనుండే కోణంలోంచి చూసాడు .అలాంటి చూపుని సినిమాల్లో పేటెంటు చేసింది ఎవరోగాని , అది మాత్రం ముమ్మాటికీ దొంగచూపే !! నవ దంపతులయిన ‘రమ-అనిరుద్ధులకి ‘ మాత్రం ఆ ఏజెంటు తమ అవసరం తీర్చేందుకు వచ్చిన ఆపద్భాంవుడిలా , ఆ చూపులు తమ పైన కురిపించిన కరుణా కటాక్షాల లాగ కనిపించి-అనిపించాయి . “ మీకు ఇష్టమయితే నా కారులో రండి. ఇల్లు చూపించి అక్కడనుంచి దగ్గరలోనే ఉన్న లోకల్ ట్రైన్ స్థేషన్ దగ్గర దింపేస్తాను “అన్నాడు , పటవర్థన్ . అనిరుద్ధు,రమ అంగికారంగా తల ఊపి అతనితో పాటు, అతని కారులో ఎక్కారు . ఇల్లు చాల బాగుంది . పబ్లిక్ పార్కుకి చివర దానికి ఆనుకొనే ఉంది. పచ్చని పచ్చిక బయళ్ల మధ్య , ఒంటరిగా అందంగా కట్టించిన రెండు గదుల ‘రో హవుస్ ‘ అది. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మోడ్యులర్ కిచెన్, గదులలో వాడ్రోబ్, రోజంతా ఉండే నీటి కొళాయిలతో, మంచి సీనరీ ఫిట్టింగులతో ఆధునికంగా కూడా ఉంది. “లక్షరూపాయలు అడ్వా