Skip to main content

కబంధ హస్తాలు ( ముంబాయి మోసాలు )

ఎస్టేటు ఏజెంటు ‘’ పటవర్థన్ ‘ , తన కెదురుగా కూర్చొని ఉన్న నవ దంపతుల వంక , ముఖం క్రిందకి దించి , కళ్లజోడు మీదుగా కనుబొమల మధ్యనుండే కోణంలోంచి చూసాడు .అలాంటి చూపుని సినిమాల్లో పేటెంటు చేసింది ఎవరోగాని , అది మాత్రం ముమ్మాటికీ దొంగచూపే !!

నవ దంపతులయిన ‘రమ-అనిరుద్ధులకి ‘ మాత్రం ఆ ఏజెంటు తమ అవసరం తీర్చేందుకు వచ్చిన ఆపద్భాంవుడిలా , ఆ చూపులు తమ పైన కురిపించిన కరుణా కటాక్షాల లాగ కనిపించి-అనిపించాయి .

“ మీకు ఇష్టమయితే నా కారులో రండి. ఇల్లు చూపించి అక్కడనుంచి దగ్గరలోనే ఉన్న లోకల్ ట్రైన్ స్థేషన్ దగ్గర దింపేస్తాను “అన్నాడు , పటవర్థన్ .

అనిరుద్ధు,రమ అంగికారంగా తల ఊపి అతనితో పాటు, అతని కారులో ఎక్కారు .

ఇల్లు చాల బాగుంది . పబ్లిక్ పార్కుకి చివర దానికి ఆనుకొనే ఉంది. పచ్చని పచ్చిక బయళ్ల మధ్య , ఒంటరిగా అందంగా కట్టించిన రెండు గదుల ‘రో హవుస్ ‘ అది. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మోడ్యులర్ కిచెన్, గదులలో వాడ్రోబ్, రోజంతా ఉండే నీటి కొళాయిలతో, మంచి సీనరీ ఫిట్టింగులతో ఆధునికంగా కూడా ఉంది.

“లక్షరూపాయలు అడ్వాన్సు కట్టాలి.ఇల్లు ఫర్నిచర్తో సహా నెలకి అయిదువేల రూపాయలు అద్దె.” చెప్పాడు పటవర్థన్ . అనిరుద్ద్ రమ కళ్ల లోకి చూసాడు. “ చాల బాగుందండీ !మనం మన సామాను తీసుకొని నేరుగా వఛ్ఛేయ వచ్చు. అద్దె కూడ రీజనబుల్ గా ఉంది.” రమ ఉత్సహంతో అంది. అనిరుద్ధ్ కి ఇల్లు నచ్చింది. వెంటనే చెక్ బుక్ తీసి అక్కడి కక్కడే లక్షా అయిదువేలకి చెక్కు వ్రాసి ఇచ్చేసాడు. పట్ వర్థన్ ఇల్లు తాళం వేసి, తాళం చెవులు అనిరుద్ధ్ చేతి కిచ్చాడు. తరువాత వాళ్లని తన కారులో రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లి దింపాడు
****************************

అనిరుధ్, ఒక చిన్న మెటాడోర్ లో తన పర్సనల్ సామాన్లని తీసికొని మర్నాడే ఆ ఇంటికి వచ్చేసాడు. రమ రావడానికి ఇంకా సమయం ఉంది. దుస్తులు వాడ్రోబులోను పర్సనల్ సామాన్లను కప్-బోర్డులలోను నీటుగా సర్దేసి తరువాత హోటలు నుంచి తెచ్చిన డిన్నర్-పేక్ ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి, దాని కెదురుగా ఉన్న కిటికీ తలుపులు తెరిచాడు.

ఆ కిటికీకి ఎదురుగా పార్కులో సిమెంటు బెంచీ మీద కూర్చొని అటువైపే చూస్తోంది ఆమె, కిటికీ తెరవగానే కనిపించింది. అనిరుధ్ ఆమె వంక క్షణం చూసాడు. తరువాత తన డిన్నర్-పేక్ ని విప్పి, మళ్లీ చూసాడు. ఆమె అటువైపే రెప్పవాల్చకుండా చూస్తోంది.

అనిరుధ్ బయటకి వచ్చాడు, ఆమె అతనిని చూసి నవ్వింది. ఆమె కళ్లు చాల నీలంగా ఉన్నాయి. “ నమస్కారం ! నా పేరు నీలిమ “ అంది. ఆమె అనిరుధ్ తన దగ్గరకి రాగానే.
“ అలాగా ! నమస్కారం, నాపేరు అనిరుధ్!” అన్నాడు.

“ ఈ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదే ! మీరు కొత్తగా వచ్చారా ?” అంది, నీలిమ.

“అవును నేను ఈ రోజే వచ్చాను, నా భార్య రమ మూడు రోజుల తరువాత సామాన్లు తీసుకొని వస్తుంది.”

“ఆవిడకి సెలవు దొరకలేదా ?”

“ లేదు, మీరిక్కడికి రోజూ వస్తూఉంటారా ?”

“ అవునండి. రోజూ మూసి ఉండే కిటికీలు, తలుపులుకేసి చూస్తూనే ఉంటాను. ఈ రోజు మీ రాక వల్ల అవి తెరచుకొన్నాయి. నా కోసారి ఇల్లు చూపిస్తారా?”

“ ష్యూర్ ! రండి,” అంటూ అనిరుధ్ ఇంటి వైపు అడుగులు వేసాడు, నీలిమ అతని ప్రక్కనే అడుగులు వేస్తూ ఉండగా.

‘ నీలిమ చాల అందంగా ఉంది’ అనుకొన్నాడు అనిరుధ్ దారిలో.
*****************************

రమ మూడు రోజుల తరువాత తన సామాన్లతో ఆ ఇంటకి వచ్చింది. దారి పొడుగునా ఒకటే ఆలోచన! ‘ అనిరుధ్, ఫోనెందుకు చేయలేదు ? సెల్ ఆఫ్ చేసి ఎందుకు కూర్చొన్నాడు? మాటా-మంతీ లేకుండా, మూడు రోజులుగా ఏం చేస్తున్నాడబ్బా! తనే వెర్రిది, అతని కోసం ఊరికే కలవర పడుతోంది’. అనికొంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది. అనిరుధ్ ఇంట్లో లేడు ! ‘ఆఫీసులో కూడా లేడని చెప్పారే ! ఏమయింది ఇతనికి ?’....

“ మేడం ! నమస్తే ! గుడ్ మార్నింగ్ ! నేను లోపలికి రావచ్చా ?” నీలిమ అడిగింది ద్వారం దగ్గర నిలబడి.

“ గుడ్ మార్నింగ్ ! ఎవరు మీరు ? సరే, లోపలికి రండి.”

“ నా పేరు నీలిమ, మీరు ఈ రోజే వస్తారని అనిరుధ్ గారు చెప్పారు లెండి.”

“అతనితో మీకు పరిచయం అయిందా ?ఎక్కడున్నారతను?” ఆతృతతో అడిగింది రమ.

నీలిమ నవ్వింది. “మూడురోజుల క్రితం చూసానతనిని. ఆ తరువాత కనిపించలేదు. మీరు ఈ రోజు వస్తారని ఆయనే చెప్పారు. మీరిద్దరూ కలిసే వస్తారని అనుకొన్నాను”

“ అవునా ! అతను మూడు రోజులుగా కనిపించడం లేదా ?” అడిగింది రమ.

నీలిమ నవ్వింది. ఆ నవ్వులో ఏదో వెటకారం, రహస్యం !
**************************

మరో మూడు రోజుల తరువాత, రమ అన్న ‘ విష్ణువర్ధన్ ‘ వచ్చాడు, ఆ ఇంటికి. లోపలికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించలేదు. ‘ చెల్లి, భావగారు ఏమయ్యారు ? ఇంట్లో కూడ లేరే !’ అనుకొన్నాడు. ‘దగ్గర్లో షాపింగ్ కి వెళ్లారేమో ! ఇక్కడే కూర్చొందాం !’ అనుకొంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొన్నాడు. టేబిల్ కి ఎదురుగా ఉన్న కిటికీ తెరచుకొని ఉంది. ఆ కిటికీలోంచి పార్కలో బెంచీ మీద కూర్చొని ఉన్న నీలిమ, కన్నార్పకుండా అటువేపే చూస్తోంది. ‘నేనీ ఇంట్లోకి దూరడం చూసిందేమో, చెల్లీ, భావగారూ ఈమెను కాపలా పెట్టారేమో! వీళ్లు ఎక్కడికి వెళ్లారో ఈమెను అడిగితే సరి !’ అనుకొని, ఆమె దగ్గరకి వెళ్లాడు. “ గుడ్ ఈవెనింగ్ మేడం! మీరు ఈ పరిసరాల్లోనే ఉంటున్నారా ?” అడిగాడు.

“ అవునండి ! గుఢ్ ఈవెనింగ్ ! మీరు అనిరుధ్ రమలకి ఏమవుతారు ?”

“ వాళ్లు మీకు తెలుసా ?”
“ ఈ మధ్యనే పరిచయమయింది. గత రెండు దినాలుగా వాళ్లు కనిపించడం లేదు”

“ రెండు రోజులుగా లేరా? ఎక్కడికైనా వెళ్లారా ?... పిక్నిక్ కి వెళ్తే తలుపులు తాళం వేసి ఉండాలే !”

“ తాళం నా దగ్గర ఉందిగా !” అంది నీలిమ.

“ మీ దగ్గర ఉందా ?”

“ అవును, ఎందుకంత ఆశ్చర్యం ! ఈ ఇంటిని కాస్త కనిపెట్టి ఉండమని వాళ్లే నాకు తాళాలు ఇచ్చి వెళ్లారు. మీరు రావడానికి ముందే తాళాలు తీసి.... లోపల బోరుకొట్టి ఇలా వచ్చాను.”

“అంటే రాత్రిళ్లు ఇక్కడే ఉంటున్నారా ?”

“అవును ఒంటరిగానే పడుకొంటున్నాను. థేంక్ గాడ్ ! ఇవాళ మీరు వచ్చారు.”అంటూ నీలిమ లేచి ఇంటి వైపు అడుగులు వేసింది.
**************************

ఆ ఇంటి క్రింద నుండే నేలమాళిగలో బందీలై పడి ఉన్నారు వాళ్లు ముగ్గురూ ! అనిరుథ్, రమ, విష్ణువర్థన్ !!

వాళ్ల ముందు మూడు కాగితాలు ఉన్నాయి, ఎదురుగా ఒక కిరాతకుడు నిల్చొని ఉన్నాడు.

“ ఊ !! సంతకాలు చేయండి. అలా చేస్తే మీరిచ్చిన అడ్వాన్స్ డబ్బే కాక ముగ్గురికీ మూడు లక్షలు కేష్ దొరుకుతుంది. మీ సామాన్లు తీసుకుపోవడానికి వెహికల్ కూడ అరేంజ్ చేస్తాను. లేకపోతే ఇక్కడే సజీవ సమాథి అవుతారు. మీ గురించి ఇంకా ఎవరైనా వస్తే వాళ్లు కూడ......” అన్నాడా కిరాతకుడు కర్కశంగా.

*******************************

మరో పదిహేను రోజుల తరువాత !

ఆ ఇంటి ముందు ఒక కారు, దాని వెనుకగా ‘ మూవర్స్& పేకర్స్ ‘ వాళ్ల వేను నిలబడి ఉన్నాయి. దాంట్లో సామాన్లు పేక్ చేసి లోడ్ చేస్తున్నారు కూలీలు.

కారులో వెనుక సీట్లో కూర్చొని ఉన్నారు అనిరుథ్, రమ , విష్ణువర్థన్లు. వాళ్ల చేతుల్లో పొడుగాటి కవర్లు, వాటిలో లక్ష రూపాయలు నగదుతో ఉన్నాయి. అనిరుథ్ ఇచ్చిన లక్ష అయిదువేల రూపాయల చెక్ అతనికే తిరిగి ఇవ్వబడింది. వాళ్ల సామాన్లు వెనక ‘ట్రక్’ లో ఫ్రీగా పేక్ అయ్యాయి.

వాళ్లు ముగ్గురూ ఆనందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా “ కిడ్నీలు “ ఇచ్చిన డోనర్లు. కిడ్నీ రేకెట్ కబంధ హస్తాలలో చిక్కి మోసపోయిన నిర్భాగ్యులు.
***************************

“ భావా !ఇప్పుడేం చేద్దాం !?” అడిగాడు విష్ణు.

“ మనం కంప్లయింట్ ఎలాగూ ఇవ్వలేం ! కనీసం మనలా మరికొంతమంది మోసపోకుండా చెయ్యగలం “ అనిరుథ్ జవాబిచ్చాడు.

“ ఎలా చేస్తావ్ భావా?”

“”మనం ఎలా మోసపోయామో, కథలాగ వ్రాసి అన్ని పత్రికలకీ పంపిద్దాం.ఇంకా బ్లాగుల్లో వ్రాసి ఇంటర్నెట్ లో పెడదాం. ఇంకా పటవర్థన్ , నీలిమ లాంటి ఏజెంట్ల ఫైనాన్షియల్ ఎసెట్స్ చెక్ చేయమని, ఇన్ కంటాక్స్ వాళ్లకి ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాద్దాం.”

. “ నీలిమ లాంటి నీలికళ్ల సుందరి వలలో పడవద్దని పేంపట్లు పంచి పెడదాం. అంది రమ

విష్ణువర్థన్ సరేనన్నట్లు తల ఊపాడు.
****************************

Comments

  1. మామయ్యగారు మీ స్ఫూర్తితో నేను కూడా ఒక బ్లాగ్ మొదలుపెట్టా. చూసి ఎలా ఉందొ చెప్పండి
    http://charan-dropsofwater.blogspot.com/

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద