Skip to main content

నల్ల కల్ల జోడు ( వాలెంటైన్ డే కద )

నల్ల కళ్లజోడు.
ఆ రోజు వలెంటైన్ డే !

సూటు, బూటు, నల్ల కళ్లద్దాలు, తలపైన టోపీ, పెట్టుకొని, బయలుదేరాను నేను, యాత్రా విశేషాలు చూద్దామని. అలా వెళ్లడమంటే నాకు చాల ఇష్థం. నన్ను నేను దాచుకొని, ఇతరులని దగ్గరగా చూడ వచ్చని.

వాళ్లు నలుగురు_____

ముంబయి మహా నగరం లోని నాలుగు కేంద్రాలనుంచి, తమ తమ ‘వలంటైన్’లతో సహా, ‘ గేట్ వే ఆఫ్ ఇండియా’కి వచ్చారు.

వారిలో మూడు జతలు, కొత్తగా పెళ్లైనవారు. మరొక జంట ప్రేమికలు. గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలు, చూడడానికి 120 రూపాయల టికెట్లు కొనుక్కొని, లాంచిలో బయలు దేరారు.నేను కూడా వాళ్లతో పాటు లాంచి ఎక్కాను.

సముద్రం మీద గంట సేపు లాంచిలో ప్రయాణం.

జంటలందరూ తోసుకొంటూ, లాంచీలో అంచులకుండే కర్ర బెంచీల మీద కూర్చొనేందుకు పోటీ పడ్డారు. నేను మాత్రం లాంచీ మధ్య భాగంలో వేసిన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొన్నాను. కర్ర బెంచీల మీద సీటు సంపాదించాక ఆ నాలుగు జంటలూ, కాసేపు సముద్రాన్ని చూసి, ఆ తరువాత ఎవరి ధోరణిలో వారు పడ్డారు.

భర్తల చేతులు, భార్యల నడుములు మీద, భార్యల చేతులు భర్తల భుజాల మీద, ఎదురెదురుగా కూర్చొని, ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకొంటూ, నాలుగు కళ్లూ రెండు, రెండు మనసులు ఒకటిగా చేసుకొనే ప్రయత్నంలో ఏవేవే స్వీట్ నథింక్స్ చెప్పుకొంటున్నారు.

ఇక ప్రేమికుల జంట సరే సరి ! వాళ్లు పెళ్లయిన వారిని మించి పోయారు. ఒకరినొకరు కలుసు కోవడానికి వచ్చిన అరుదైన అవకాశం వృధా కాకూడదనే, తొందరలో ఉన్నారు వాళ్లు. ప్రియురాలు ప్రియుని ఒడిలోనే ఒరిగింది. అతడామె పయ్యెద చాటున దాచిన అందాల్ని, తన సొంతం చేసుకోవాలని, తనకేసి, అదుము కొంటూ, లోకాన్ని మరచి కూర్చొన్నారు.

నేను కుర్చీలో కూర్చొని వాళ్ల ప్రణయ చేష్టలని కుతూహాలంతో చూస్తున్నాను ! ఆ రోజు ప్రేమికుల దినం ! విహార యాత్రకని వచ్చిన జంటలందరిదీ అదే కార్యక్రమం! చాల రొమాంటిక్ గా, హంసలా సాగుతున్న ఆ పడవ, మెల్లగా ఎలిఫెంటాస్ చేరింది.

అక్కడ చిన్న రైలుబండి ఉంది. దానికి రెండు వైపులా ఇంజను, మధ్యలో బోగీలు ఉన్నాయి. ఒక్కొక్క బోగీలో ఆరుగురు మనుషులు ఎదురెదురుగా కూర్చొనేందుకు సీట్లు ఉన్నాయి. కొండ మీద గుహలు చూసేందుకు వచ్చిన వారిని, ఆ కొండ దిగువకి చేర్చే రైలుబండి అది రాను పోను టికెట్టు పది రూపాయలు. దాదాపు 300 గజాల దూరం తీసుకెళ్తుంది.

నా పరిశీలనలో ఉన్న నాలుగు జంటలూ, రెండు కూపేలలో కూర్చొన్నారు. నేను వాళ్లలో ఒకనిలా ప్రక్కనే కూర్చొన్నాను. రైలు ప్రయాణంలో వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడం వల్ల అందరూ తెలుగు వాళ్లేనని అర్థమయింది.ఒక జంట మటుంగా నుంచి, ఇంకొక జంట డొంబివిలీ నుంచి, మరొక జంట పరేల్ నుంచి వచ్చారు. ఇక ప్రేమికుల జంట నవీ ముంబయి లోని వాశి నుంచి వచ్చారు.

ప్రవాసంలో ఒక తెలుగు వాడు, ఇంకొక తెలుగు సోదరుణ్ని, చూస్తే చెప్పలేనంత ఆనందం, ఆత్మీయత, కలుగుతాయి. అందుకే కాబోలు ఆ నాలుగు జంటలూ రైలు దిగీ దిగగానే కలిసి పోయారు నాకు కూడ కుతూహలం పెరిగి వాళ్ల వెనకాలే నడవ సాగాను.

కొండ ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. మెట్ల రెండు వైపులా దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలలో అన్నీ ఫేషన్ సామాన్లే ! సౌందర్య సాధనాలు, గాజులు, పూసల దండలు, బొమ్మలు, చిత్రాలు, బేగులు, టీ_షర్టులు, జీన్స్ దుస్తులు, 20 రూపాయల దగ్గర నుండి 2000 రూపాయల వరకు విలువ చేసే వస్తువులు అమర్చి ఉన్నాయి. చూసేవారికి కనువిందు చేస్తున్నాయి. కొందామని ధర అడిగిన వారికి మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నాయి.

అక్కడ ఎక్కువ అమ్మకం అయ్యేవి తినుబండారాలే! చిప్స్, చాట్స్, అరటి పళ్లు, రేగు పళ్లు, చింత పండు బొట్టలు, కారం అద్దిన మామిడి కాయ ముక్కలు, ఉప్పద్దిన దోసకాయ ముక్కలు, బఠానీలు, సెనగలు, వేరు శెనగ పప్పు పొట్లాలు, ఇంకా వాటర్ బాటిల్ లు.

నాలుగు జంటలు, అక్కడ ఆగి, తెగ పోటీ పడి కొన్నారు వాటిని. మెట్లమీద నుంచి నడుస్తూ, కబుర్లు చెప్పుకొంటూ, ఒక అమ్మాయి చిప్స్ పేకెట్ తీసింది. అంతే ! ఎక్కడ నుంచి చూసిందో, ఒక కోతి వచ్చి చిప్స్ పాకెట్టుని ఎత్తుకు పోయింది. “ హేయ్ ! హఠ్, హఠ్” అంటూ విదిలించిన మరొక అమ్మాయి చేతిలోని అరటి పండుని ఇంకో కోతి ఎత్తుకు పోయింది. అంతే తినుబండారాలన్నీ, బేగులలో చేరి పోయాయి అంత వరకూ నవ్వుతూ కేరింతలు కొడుతూ మెట్లు ఎక్కుతున్న వారందరూ సీరియస్ గా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. మోత్తం మీద 163 మెట్లు ఎక్కి, కొండ మీదకి వచ్చారు. అక్కడ ఎంట్రన్స్ టికెట్లు 5 రూపాయలు ఇచ్చి కొని, గుహల వైపు చూడడానికి వెళ్లారు.

నేను కొంత దూరంలో వాళ్ల మాటలు వింటూ, మౌనంగా ఎంజాయ్ చేస్తూ, వెనకాలే వెళ్లున్నాను.

మొదటి గుహలో మహేశ మూర్తి ఉంది. ఆ ఒక్క గుహలోనే మూర్తులున్నాయి. ఇంకా అర్థనారీశ్వర దుర్గ మూర్తులు ఉన్నాయి. జంట లన్నీ అక్కడ నుండి కదిలి, బయటి కొచ్చారు. ఇంకా రెండవ గుహ, మూడవ గుహ దగ్గరకి వచ్చారు. బయట మొదటి గుహ దగ్గర ఏదో అలజడి వినిపించింది.

ఆ జంటల లోని ప్రేమికుడు, తన దగ్గరున్న బైనాక్యులర్ తీసి అటువైపు చూసాడు.

”ఏంటండీ ! ఏమయింది ?"

“ఏం జరుగుతోంది అక్కడ ?"

“ఏదయినా గొడవ జరుగుతోందా ?”

ప్రశ్నల వర్షం కురిసింది. నింపాదిగా జవాబిచ్చాడతను. “ సైనికులు గొడవ చేస్తున్నారు. అయితే ఈ సారి వయలెన్స్ లేదు.

వాళ్ళలో ప్రతీ ఒక్కరికీ అర్థమయింది. సైనికులని పిలువబఢేవారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు! వలైంటైన్ డే భారతీయ సంస్కృతికీ, సాంప్రదాయానికీ విరుద్ధమని ఆ రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయం! దానికి నిరశన ప్రదర్శించేందుకు వారు వారి పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆ సైనికులు మొదట్లో దౌర్జన్యం ( వయలెన్స్ ) చేసే వారు, ప్రేమికుల మీద రాళ్లు విసిరే వారు, లాఠీ ఛార్జ్ చేసేవారు, బస్సులు, బళ్లు తగుల బెట్టేవారు.

అయితే ఈ మధ్య కోర్టులు ఇటువంటి వయలెన్స్ నిరశనలకి, తిరుగుబాట్లకి విరుద్ధంగా తీర్పులివ్వడంతో, వాళ్లు మధ్యే మార్గంగా నిరశన తెలియ జేస్తున్నారు.

“ వాళ్లు ఏం చేస్తున్నారు ?” జంట లందరి ముఖాల్లోనూ టెన్షన్ కనిపించింది.

“ నల్లని రంగు ముఖాలకి రాస్తున్నారు.” అన్నాడతను. బైనాక్యులర్ని వదిలి.

“ ఇప్పుడేం చేయాలి ? వాళ్లు ఇటు వైపే వస్తారు.ఈ కొండ చరియల్లో పారిపోవడానికి కూడా దారి లేదే !”

“ ఏం చేయాలి ?

“ ఎక్కడికి పోవాలి ?”

“ ఏది దారి ?!"

ఆ ప్రేమికుడు షడన్ గా అన్నాడు, “ఒక ఉపాయం ఉంది ! ఇప్పటి కిప్పుడే అమలు చెయ్యాలి.”

“ ఏం చేయాలి !!"

అతను తన బైనాక్యులరుకి ఉన్న ఎర్రటి తాడు విప్పేసి దాన్ని నాలుగు ముక్కలు చేసాడు.“ అమ్మాయి లందరూ ఈ తాళ్లు తీసుకొని అబ్బాయిల చేతికి రాఖీ లాగ కట్టాలి. ” అన్నాడతను.

“ రాఖీ కట్టాలా ?! అదెలా ??” అమ్మాయిలందరికీ సందేహం కలిగింది.

“ ఇందులో వీలు కాని దేముంది ! మాటుంగా అమ్మాయి డొంబివిలీ అబ్బాయికి, డొంబివిలీ అమ్మాయి మాటుంగా అబ్బాయికి, అలాగే పరేల్ అమ్మాయి వాశి అబ్బాయికి, వాశి అమ్మాయి, పరేల్ అబ్బాయికి, రాఖీ కడితే సరి పోతుంది కదా ?”

అతని పథకం వెంటనే అమలు జరిగింది. అమ్మాయిలు రాఖీలు కడుతూ ఉండగా, సైనికులు వచ్చేసారు !

“ క్యా హోరహా హై ఇథర్ !” చూసారు వాళ్లు. “ అరే ! రక్షా బంధన్ !ఆజ్ కా దిన్ క్యోం ?”

“ అరే భయ్యా ! హమ్ లోగ్ భాయి బహన్ హై! ఏ బాత్ ఆప్ లోగ్ కైసే సమఝేంగే ?"

“ ఠీక్ హై ! భాయిసాబ్ !” అంటూ వెళ్లి పోయారు వాళ్లు.

సైనికులు వెళ్లి పోగానే వాళ్ల ముఖాలలో ఆనందం తాండవించింది. పెద్ద అవమాన భారం నుండి తప్పించుకొన్నామన్న ఆనందం ! వాళ్లలో ఒకతను కాస్త దూరంలో నిల్చొని చూస్తున్న నన్ను పిలిచాడు.

“ ఏం కావాలి ?” తెలుగు లోనే ప్రశ్నించాను, వాళ్లు ఆనందించారు.

“ మా ఫొటో ఒకటి తీయండి.” ఒక కెమేరా నా చేతికిస్తూ, అన్నాడతను.

నల్ల కళ్లజోడు తీసి జేబులో పెట్టుకొని , ఫొటో తీయడానికి, కెమేరాలోంచి చూసాను.

ఎంత చక్కగా ఉన్నారీ జంటలు ! ఇది వరకు ఇలా కనిపించ లేదు ! అనుకొంటూ. ”

వాళ్లు అందరూ ఇప్పుడు స్పష్టంగా కనిపించడానికి, ఇంతకు ముందు కనిపించక పోవడానికి,కారణం నా మనసుకి కమ్మిన నల్ల పొరేనని, తెలిసాక నన్ను నేను దాచుకోవాల్సిన అవసరం కనబడలేదు ! నా ‘ కళ్ల జోడు తీసి జేబులోనే ఉంచేసాను.
*****************

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద