Skip to main content

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు.

ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం.

నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది.

పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒక టెక్నికల్ స్నేగ్ ( సాంకేతిక లోపం ) ఏర్పడిందనీ, దానిని రిపేరు చేయమనీ ఆ ఆదేశం !

ఆ ఇంజను, స్పీడు పెంచాలని నాచ్ తీసుకొన్నప్పుడల్లా, ఇంజను ట్రిప్ ( ప్యుజు పోవడం లాంటిది ) అవుతోందనేది ఆ ఇంజను నడిపిన డ్రైవరు ఎదుర్కొంటున్న సమస్య !

నేను నాకు ఉన్న సాంకేతిక పరిఙ్ఞానంతో, చెయ్యకూడని సాహసం ఒకటి చేసాను. ట్రిప్ చేసే పరికరాన్నే బైపాస్ చేసేసాను. ఆ ఇంజనుని, ‘దుర్గు ’ వరకు వెళ్లేందుకు అనుమతించాను, దుర్గులో వేరే ఇంజనుని తగిలించమని చెప్పాను.

అయితే ఆ ఇంజను దుర్గు వెళ్లేలోగానే అంటే (ఇంకా ఆరు కిలోమీటర్లు ఉందనగా )పవర్’హౌస్ స్టెషను దాటే సరికి. ఇంజనులో పొగ రావడం మొదలయింది. నేను బైపాస్ చేసిన ఉపకరణమే కాలిపోవడం మొదలయింది. ఆ ఇంజను డ్రైవరు ఇంజను పవరుని ఆపేసి, ఆ ఆరు కిలో మీటర్ల దూరాన్ని అలాగే రోలింగులో లాగించేసి, దుర్గులో నిలిపాడు.

అక్కడ నా ఆదేశం ప్రకారం ముందుగానే తయారుగా ఉన్న ఇంజనుని ఆ ఇంజను మీదనే తగిలించి, రవాణా చేసేసారు.ఆ ట్రైను మా రైల్వే పరిథి దాటి సెంట్రల్ రైల్వే పరిథి లోకి వెళ్లిపోయింది. ఆ ఇంజను యొక్క హెడ్’క్వార్టర్ సెంట్రల్ రైల్వే కావడం దాని కారణం.

మర్నాటి ఉదయం ఎనిమిది గంటలకి డ్యూటీ ఆఫ్ అయిన నేను ఈ వివరాలన్నీ కంట్రోల్ ద్వారా విన్నాను. ఏ ఆపదా రాకుండా ఆ ఇంజను నిర్ణీత స్థానం వరకు పని చేసినా, కీలకమైన ఉపకరణాన్ని బైపాస్ చేసిన నాకు శిక్ష తప్పదని నాకు భయం వేసింది. విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి అది ! అన్నయ్యగారికి పోన్లో విషయం చెప్పాను. అతను నాకు ‘వెంటనే పుట్టపర్తి వెళ్లిపోమనీ, తక్కిన వన్నీ ‘ బాబాగారి’ మీదనే వదిలెయ్యమని చెప్పారు. నేను ఆఫీసుకి వెళ్లి పుట్టపర్తికి పాస్ తీసుకొని, నా భార్యతో సహా ఆ రాత్రికే నాగ్’పూరు మీదుగా ప్రయాణం కట్టాను .

పుట్టపర్తి చేరుకొని శ్రీ సత్యసాయి బాబా గారి దర్శనం ఛేసుకొన్నాం. శ్రీ సాయిని కొన్ని గజాల దూరం నుండి చూసాను. మనసులోనే నా విన్నపాన్ని విన్నవించుకొన్నాను.

తరువాత ఏమయిందో నాకు తెలియదు. నా ప్రయాణం ముగించుకొని, తిరిగి అదురుతున్న గుండెలతో, నా ఆఫీసుకి వెళ్లాను. పరిస్థితి మామూలుగానే ఉంది ! నా ఆశ్చర్యానికి అవధులు లేవు ! నా ఆతృత కొలదీ ఆ ఇంజను ఏమయిందోనని, బిలాస్’పూరు కంట్రోల్ నుండి, సెంట్రల్ రైల్వే నాగ్’పూరు కంట్రోలరుని సంప్రదించాను.

నాకు తెలిసిన దేమిటంటే, నేను బైపాస్ చేసిన రోజుకి ముందే ఆ ఇంజను అప్పటికే లక్ష కిలోమీటర్ల పైన ప్రయాణం చేసిందట ! అందువల్ల పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్’కి డ్యూ అయిపోయిందట ! దుర్గుని దాటి దానిని అనుమతించనందుకు, నాకు ధన్యవాదాలు తెలిపాడు !
ఆ విధంగా నేను చేసిన ఒక డర్టీ తప్పు పనిని, ఒప్పుగా మార్చి , శిక్షకి బదులు, ప్రశంసలు ఇప్పించడం శ్రీ భగవాన్ సత్య సాయి బాబా గారి మహిమ కాక మరేమిటి !

ఆ తరువాత నేను ఆపీసర్ని కూడా అయ్యాను !!

Comments

  1. మీరు చెప్పిన విదానం చూస్తుంటే అదొక సాంకేతికపరమైన సమస్య అని తెలుస్తున్నది..! మరెందుకుస్ అరి అనవసరపు పలాయనవాదం.. బాబాలు..మహత్యాలంటూ..??

    ReplyDelete
  2. నా టపాపై మీ స్పందనకి ధన్యవాదాలు.
    మీరు అన్నట్లు సమస్య సాంకేతికమే ! ఏబై వేల రూపాయలు విలువ చేసే ఉపకరణాన్ని, నేను నా తొందర పాటు చర్య వల్ల కాలిపోయేలా చేసాను..సమయానికి దానిని గమనించి ఉండక పోతే ఇరవై ఆరు కోట్లు విలువ చేసే, ఎలక్ర్టిక్ ఇంజను కాలి బూడిద అయ్యేది ! దానికి కనీస శిక్ష, అధికారులు దయతలచి అనుమతించే ఐఛ్ఛిక పదవీ విరమణ !
    భయం, ఆందోళన, ఆర్తి, నన్నువెన్ను తట్టగా, ‘ నీవే తప్ప నితః పరం బెరుంగ---’ అన్న విధంగా ఆశ్రయం కోసం పలాయనం చిత్తగించాను !
    నేను స్వామి దగ్గరకి వెళ్లి, ప్రశాంతి నిలయంలో ఆయన దర్శనం మాత్రం చేసుకొన్నాను, అతనికి సమర్పించినది, శుష్క నమస్కారమే !
    ‘పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్,’ ఓవర్ డ్యూ అయిన ఇంజనుని, పేసింజర్ సర్వీసుకి అనుమతించడం చాల పెద్ద పొరపాటు.అది అధిష్టానం చేసింది ! అంత పెద్ద తప్పు దగ్గర నేను చేసిన తప్పు , మరుగున పడి నా సమస్య దూదిపింజలా ఎగిరిపోయింది !
    స్వామి దగ్గరకి వెళ్లకుండా ధైర్యంగా నిలిచి ఉంటే, సమస్య తీరిపోయేది కదా ? అని మీరు అడగ వచ్చు. నిజమే ! ఖచ్చితంగా తీరేది !
    అయినా ఒక చిన్న మాట చెప్పనా ?
    కష్టం, దుఃఖంతో ఆర్ద్రత చెంది, బరువెక్కిన మనస్సనే వస్త్రాన్ని, నమ్మకమనే దండెం మీద, ప్రార్థన అనే క్లిప్పులు పెట్టి, సూర్యరశ్మి అనే దేవుని ముందు ఆరబెడితే, ఆ భారం తీరి, మనస్సు శుభ్రమవుతుంది. అలా చేయక పోయినా అది ఆరుతుంది, కాని గాలికి క్రింద పడి, ధూళి ధూసరితమయి మరింత మురికి కూడా అయే అవకాశం ఉంది !
    నేను ఆశ్రయం కోసం వెళ్లకుండా నిల్చిఉంటే, భయాందోళనలతో నిండిన మనస్సుతో , నా విధి నిర్వహణలో మరిన్ని తప్పులు ఖచ్చితంగా చేసి ఉండే వాడిని అంగీకరిస్తారా ?.

    ReplyDelete
  3. ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా ?.. చేయాల్సిన తప్పు చేశావు, తప్పు ఒప్పుకుని శిక్ష కి సిద్ధం కాక.. తప్పుని ఒప్పు చేయమని బాబా కాళ్ళ మీద పడటానికి పుట్టపర్తి పొయావా ?... ఆ ఇంజన్ అప్పటికే సర్వీసింగ్ కి రెడీ గా ఉంది కాబట్టి తప్పించు కున్నావ్... ఇందులో నువ్వు తప్పు చేసి బాబా శరణు జొచ్చిన తర్వ్వాత బాబా నీకు చేసిన ఉపకారం ఏమీ లేదు.... అందుకని.. ఇలాంటి చచ్చు విషయాలు చెప్పి నీ తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకోకు... వీలైతే ఆ యాభై వేల రూపాయలు వెనక్కి కట్టు.. ఇంక ఆఫీసర్ వి అయ్యావా.. అక్కడ కూడా ఇలాంటి యవహారాలేనా ?

    ReplyDelete
  4. మంచి పని చేశారు, తప్పో,ఒప్పో మీ నమ్మకం మీది. అది నేరం కానపుడు, 'ఎదవ అనైతిక అసభ్య నాస్థికుల' కామెంట్లు పట్టించుకోనవసరం లేదు. :)
    'ఓవర్ ఆయిలింగ్' కాదు 'ఓవర్ హాలింగ్'(Overhauling) అని సరిచేసుకోండి. నా చిన్నప్పుడు ఇలానే ఓవరాయిలింగు అంటే నవ్వి, హైస్కూల్ టీచర్ సరిచేసినట్టు గుర్తు.

    ReplyDelete
  5. @శ్రీ కాయ గారికి, క్షీరగంగకి సుస్వాగతం ! నా తప్పుకి చీవాట్లు పెట్టి బుధ్ధి చెప్పినందుకు ధన్యవాదాలు ! ఈ నాటితో నా పాప పరిహారం అయినట్లే భావిస్తాను. ఇది కూడా సాయి పైన టపా వ్రాయబట్టే జరిగింది కాబట్టి, దీనిని సాయి కరుణగా భావిస్తాను.

    @శ్రీ శంకర్ గారికి, క్షీర గంగకి సుస్వాగతం ! మీరు ఓవర్ ఆయిలింగ్ విషయంలో సూచించిన పొరపాటుకి ధన్యవాదాలు. ఇటుపైన తప్పక దిద్దుకొంటాను. మీ సద్విమర్శకు ధన్యవాదాలు

    ReplyDelete
  6. $శ్రీధర్ గారు

    మీ అనుభవాన్ని నిజాయితీగా జరిగిందిజరిగినట్లుగా రాసి పంచుకున్నారు. అందుకు ధన్యవాదాలు.

    #కష్టం, దుఃఖంతో ఆర్ద్రత చెంది, బరువెక్కిన మనస్సనే వస్త్రాన్ని, నమ్మకమనే దండెం మీద, ప్రార్థన అనే క్లిప్పులు పెట్టి, సూర్యరశ్మి అనే దేవుని ముందు ఆరబెడితే, ఆ భారం తీరి, మనస్సు శుభ్రమవుతుంది. అలా చేయక పోయినా అది ఆరుతుంది, కాని గాలికి క్రింద పడి, ధూళి ధూసరితమయి మరింత మురికి కూడా అయే అవకాశం ఉంది !

    అధ్బుతంగా చెప్పారు.

    కొందరు మూర్ఖుల కళ్ళకి ఒకవైపు అహం, మరో వైపు అజ్ఞానం అనే ధూళి,మురికి నిండి ఉన్న చపలమాయలు వాస్తవాన్ని చూడలేరు. Snkr గోరు చెప్పినట్లు మీరు అలాంటి వ్యాఖ్యలు అసలు పట్టించుకోనవసరంలేదు.:)

    అన్నట్లు మీ బ్లాగు పేరు "క్షీరగంగ" చాలా బావుంది :)

    ReplyDelete
  7. $ రాజేష్ గారికి, క్షీర గంగకి సుస్వాగతం ! మీ స్పందనకి ధన్యవాదాలు. క్షీర గంగలో ‘పరిభూత సురత్రాణం’ అన్న చారిత్రిక కథ చదవండి. మీకు తప్పక నచ్చుతుంది.

    ReplyDelete
  8. నేనిక్కడ కామెంట్ చేసి వెళ్లాక తిరిగి ఇటువైపు చూడలేదు..మళ్లీ ఇప్పుడే చూస్తున్నాను. మీరు ఉదహరించిన ఈ కామెంట్ " కష్టం, దుఃఖంతో ఆర్ద్రత చెంది, బరువెక్కిన మనస్సనే వస్త్రాన్ని, నమ్మకమనే దండెం మీద, ప్రార్థన అనే క్లిప్పులు పెట్టి, సూర్యరశ్మి అనే దేవుని ముందు ఆరబెడితే, ఆ భారం తీరి, మనస్సు శుభ్రమవుతుంది. అలా చేయక పోయినా అది ఆరుతుంది, కాని గాలికి క్రింద పడి, ధూళి ధూసరితమయి మరింత మురికి కూడా అయే అవకాశం ఉంది !"

    ఇవన్ని చెప్పుకోవడానికి..బానే ఉంటాయి..ఇలాంటి పోలికలతో..మాటల గారడితో ఎదుటివారు చేసిన మాటలను ఎదుర్కోవాడానికి చూస్తున్నారు కాని " what's the truth " ని గమనించట్లేదు.అలాంటి ఉపమానలన్నీ చప్పట్లు కొట్టంచ్కోవడానికి బానే ఉపయోగపడతాయి. మీరావిషయంలో గొప్పవారే. ఇక మరో మీ మాటనఎ చుద్దాం.." నేను ఆశ్రయం కోసం వెళ్లకుండా నిల్చిఉంటే, భయాందోళనలతో నిండిన మనస్సుతో , నా విధి నిర్వహణలో మరిన్ని తప్పులు ఖచ్చితంగా చేసి ఉండే వాడిని అంగీకరిస్తారా ?. "

    ఈ విషయంలో అది మీ మానసిక పరిస్థితినిబట్టి అదారపడి ఉంటుంది..! నాలాంటి వారికైతే ఎటువంటి ఆందోళనలు..భయాలుండవు..అందుకు కారణం మానసిక దృడత్వం..! మనం మానసికంగా దృడంగా లేకపోవడం మూలానే బయటనున్న ఏదొ ఒక " శక్తి " మీద ఆదారపడటం చేస్తాము..అందులో భాగమే బాబాలను ఆశ్రయించడం. నేనింతవరకు ఏ బాబాలను ఆశ్రయించలేదు..నాకు పలాన విదంగా జరగాలని ఎవరినీ వేడుకోవట్లేదు..ఎక్కడికి వెళ్లడం లేదు..మనం చేసే పనిమీద శ్రద్ద, చిత్తశుద్ది, అంకితభావం.. చేసే పని మీద ఇష్టం ఉంటే చాలు మాస్టారు.ఇక మీ స్పెక్యులేషన్ చాలా బాగుంది మాస్టారు.." కాని గాలికి క్రింద పడి, ధూళి ధూసరితమయి మరింత మురికి కూడా అయే అవకాశం ఉంది !" ఇవన్ని ఎవరి ఊహలు..? మీ ఊహలు..!! మీ ఊఃహలకు..ఎవరు బాద్యులు..? మీలోని స్పెక్యులేషన్‌ ఎదుటివారి మీదకు ప్రయోగించి దానికి విరుగుడు కూడ మీరు చెప్పుకునే స్థితికి మీరొచ్చారు. మీ పోలికలు..ఉపమానాలు చాలా బాగున్నాయి మాస్టారు..హ హ హ హ. అసలు అనవసరం కూడ మీ నమ్మకాల్లో మాలాంటి వారు జోక్యం చేసుకోవడం. ఒక చోట కొందరు " ఫిక్స్ " అయిపోయి..కొన్ని " ఫిక్సడ్ " అభిప్రాయాలు ఎర్పర్చుకొని వాటి చుట్టూ వాదనలు తయారు చేసుకొనే వారితో సంభాషణలు కూడ మాలాంటి వారికి అంత మంచిది కాదనుకుంటాను.
    మిమ్మల్ని సమర్థిస్తూ కామెంట్స్ వ్రాసిన ఒక సోదరుడు ఉదహరించినట్లు..నాలాంటి వారు మూర్ఖులై ఉండొచ్చేమోగాని...! మూడత్వం వున్న మనిషిని ఎంతమాత్రం కాను. మా ఆలోచనలు వారికి నచ్చకపోవడం వలన మేము అజ్ఞానలం అయిపోతామా..? ఎవరికి వారు వారికి తెలిసిందే " వాస్తవం " అని అనుకొనే రోజులివి..! వాటికి ఎటువంటి " ప్రమాణికాలు" ఉండవు..మరెలా నిర్ణయిస్తారో..ఎదుటివారు " పలాన" లాంటి మనుషులనీ..?

    ReplyDelete
  9. శీ కమల్ గారికి,
    మీ ధైర్యానికీ ,స్థైర్యానికీ జోహార్లు ! మీ పరిచయం పదిలంగా నేను కాపాడుకోవాలని అనుకొంటున్నాను.. పై పోస్టుపై కాక ,‘ క్షీరగంగ’ లోని ఇంకేదైనా పోస్టు పైన మీ స్పందనని తెలియజేయండి.

    ReplyDelete
  10. :) Well said, Sir.

    ReplyDelete
  11. Sai ram sir very nice divine experence. Very happy to read thank youverymuch sir

    ReplyDelete
  12. Ohm sri sathya sai baba,

    Thanks for sharing your experience Shridhar garu.I am also one of the devotee of sri sathay sai baba and i am blessed with baba. I am living happily because of Baba's books and his blessings.

    Thanks,
    Janakiram.N

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని