Skip to main content

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు.

(శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది)

(వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు)

రాజా రాం : ఒహోయ్! చెంచులూ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా?
అందరూ : చూసాము ,చూసాము నాయకా! [[నందానా]]
రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా?
అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]]
రాజా రాం : పదం అందు కొండి చెంచులూ!
అందరూ : ----[[అవునవును ]]
రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు!
అందరూ: ----[[అవునవును, నెనర్లు ]]
రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు)
అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]]
రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల!
అందరూ : ---[[అవునవును, వెన్నెల--]]
రాజారాం :  ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు!
అందరూ :----[[అవునవును, డింగిడీలు ]]
రాజా రాం : పిల్లలకి ప్రేమ పూర్వక ఆశీస్సులు!
అందరూ :  అవునవును, ఇప్పుడు ప్రార్థన సేయాలి నాయకా!
రాజా రాం : అయితే పదం అందుకోండర్రా! (అంటూ ప్రార్థన మొదలు పెడతాడు)
ఎలుక వాహనుడా................ ||నందానా|| / ఏనుగు ముకపోడా ........ ||నందానా||
ఏడేడు లోకాల ............... ||నందానా|| / ఏలరా సల్లంగా ................ ||నందానా||
తిలింగ దేశము మాదండి .... ||నందానా||/ శ్రీకొండ మల్లయ్య మా అయ్య .. || నందానా ||
వెండి కొండకు పుట్టిన బొట్టి........ ||నందానా||/ బమరాన్బ మాయమ్మా ...... ||నందానా||
చెంచులము మేమయ్య ............ ||నందానా||/మమ్ములను ప్రేమిస్తే .......... ||నందానా||
గుండె చించి పెడతాము ............ ||నందానా|| /మోసము చేసేస్తే............... ||నందానా||
చించి చెండాడుతామండి  ........... ||నందానా||
మాగూడానా పుట్టింది......||మా లచ్చిమి || /తామర కన్నుల బొట్టి...  ||మా లచ్చిమి||
మనువాడిన దొర .......... ||నారసిమ్మ || /దేవాది దేవుడే ................ ||నారసిమ్మ ||
మా జాతికల్లుడు............. ||నారసిమ్మ || /అందరూ మమ్మల్ని ....... ||నందానా||
సల్లంగా సూడండి ......... || నందానా ||/ ఆసీస్సులియ్యండి ............. ||నందానా||

(ప్రవేశం  చెంచు జాతి జానపదుల పెద్ద ఉంటాడు)


 పెద్ద: ఓహోయ్! చెంచులూ!ప్రార్థనలు సేసార్రా?/అందరూ : సేసాము ఏలికా--కత సెప్పుమరి! 

పెద్ద: కత మెదలెట్టాలంటే చెంచిత రావాలి కదర్రా!/ అందరూ : అవునవును. ఏలికా!

పెద్ద :మరేదిరా అది? ఒహోయ్! చెంచితా!! / అందరూ : ఒహోయ్! చెంచితా!! (పిలుస్తారు)


( చెంచిత గజ్జలు గల్లుగలూమంటూ  ఉంటే వస్తుంది )

చెంచిత: సేప్పేవి, శ్రీ రంగ నీతులు... || నారసిమ్మ||
దూరేవి దొమ్మరి గుడిసేలూ..............|| నారసిమ్మ ||
మానుకోరా అంటే వినడోయమ్మా .... || నారసిమ్మ ||
సిగ్గు మాలిన కతలు సేప్పుతాడమ్మా ... || నారసిమ్మ ||

పెద్ద: వూరు భామ ...||నందానా||/ఎవ్వారి భామవే చెంచితా ....||నందానా||
చెంచిత : వినరో నరసిమ్మ...||నందానా||/ఉండు గూడెం మాది.....||నందానా||
చేతిడే ముద్దమ్మ........||నందానా||/ చెయ్యెత్తి దానాలు............||నందానా|
వడ్డిచ్చే తల్లి వడ్డిచ్చె తల్లి... ||నందానా|| ||నందానా||

పెద్ద: ఉండు గూడెం పిల్ల లచ్చిమి... ||నందానా|
చెయ్యెత్తి దానాలు చేసేటి లచ్చిమి.. ||నందానా||
కెందామర కళ్ళ ,ఓ లచ్చిమి ...... ||నందానా||
చూపుల్తో తూపులేసే లచ్చిమి.. ||నందానా||
విద్దె దానం చేసావా లచ్చిమి............ ||నందానా||

చెంచిత : విద్దె నాకోడలు నరసిమ్మ .. ||నందానా||
అది నా మాట వినదురో నరసిమ్మ ........... ||నందానా||
నా కొడుకేమీ ఎరుగడు............... ||నందానా||/జపమాల తిప్పెను ... ||నందానా||
మాయమాటలు నేర్పి నా కోడలు . ||నందానా||
కూనిరాగాలు పాడి నా కోడలు .... ||నందానా||/ఏరు కాపరమెట్టింది... ||నందానా||

అయినా జోలెనిండా కాసులు.... || నారసిమ్మ ||
బొజ్జనిండా కూడు ....|| నరసిమ్మ |
పెట్టేటి నేనుండ, || నరసిమ్మ ||/విద్దె ఊసేందుకురా ...|| నరసిమ్మ ||

ఓహోయ్! చెంచులూ! మీరే సేప్పండ్రా!....||నందానా||
రూకలుంటే నూకలొస్తాయా లేదా?....... || అవునవును ||
నూకలుంటే కొకలొస్తాయా లేదా ?.......... || అవునవును, నూకలేడితేనే పిల్లనిస్తారు ||
కొకలోస్తే పాకలొస్తాయా లేదా?................ || అవునవును ||
ఇయ్యన్ని ఇచ్చేటి నేనుండగా............ || నందానా ||
నా కోడలెందుకురా నేనుండా .................... || నందానా ||

పెద్ద: ఎంత పెద్ద జాణవే చెంచితా............... || నందానా ||
నాలుగు ముకముల నలువ ........................ || నందానా ||
నంగనాచి కాదె నీ కొడుకు  బ్రమ్మ ..................|| నందానా ||
మనుషుల తల రాతలు ............................... || నందానా ||
మార్చి రాస్తుంటాడే చెంచితా ...................... || నందానా ||
వేదాలు సదివినా, శాస్త్రాలు చదివినా ................ || నందానా ||
అదృష్ట రేకలు ఒకలాగా రాయడే........................ || నందానా ||
అరువది ఎనిమిది మనుషులలో..ఒకరికి............. || నందానా ||
మంద బుద్ది నిస్తాడే చెంచితా........................... || నందానా ||
ఆటిజం రోగమని పెద్దలంటారే................................. || నందానా ||
ఎందుకిస్తాడని అడగవే చెంచితా............................. || నందానా ||

చెంచిత : నా కొడుకు, నా కొడుకని దుమ్ము పోయకురా..... || నందానా ||
ఆడు నీ కొడుకు కాదేటి .. నారసిమ్మ ........................... || నందానా ||
కూన తప్పు సేస్తే పిలిచి సెప్పాల............................... || నందానా ||

పెద్ద : అలాగా, ఓహోయ్! బ్రమ్మయ్యా!......................... || నందానా ||

చెంచిత:  ఓహోయ్! బ్రమ్మయ్యా! అయ్య పిలుస్తున్డాడు..... || నందానా ||

రాజా రాం : అమ్మ నాన్నల్లారా  కోటి డిన్గిడీలు............. || నందానా ||
పిలిసారా నన్ను , తప్పు పట్టారా నన్ను......................... || నందానా ||
తలరాతలు నేను సోయంగా సేయను............................. || నందానా ||
నే సదివిన వేదాలు నియమాలు పెడతాయి...................... || నందానా ||

పెద్ద : ఏంటిరా, కొడకా సాకులు సేప్తున్డావు......................... || నందానా ||
చెంచిత : నువ్వు వేదాల నియమాలు వింటావా................... || నందానా ||

రాజా రాం : అవునమ్మ, అవునయ్యా...నియమాలు గట్టివి.... || నందానా ||
మానవులు ఎన్నడూ మంచినే సేయ్యాల................... || నందానా ||
వాటి లెక్కల బట్టి తల రాత రాయాలి!............................... || నందానా ||
ముందు జన్మల సేసే కర్మలని బట్టి ..................................... || నందానా ||
జన్మ ఫలితాలు ఉంటాయే  తల్లీ!.................................... || నందానా ||
సూక్ష్మ మెరుగక నన్ను నిందిస్తారు............................... || నందానా ||
తలరాత తిప్పేటి యత్నమూ సేయరే ....................................||నందానా||

మంచిని నేర్పాల, మంచిగుండాల ............... ||అవునవును ||
ఆలోచన సేయాల, ఆచరిన్చాలా.................. ||అవునవును ||
ఆటిజం రోగులని అక్కున చేర్చాలా ............... ||అవునవును ||
నేర్పుగా నాలుగు మాటలు సేప్పాలా................ ||అవునవును ||
పేమతో సేప్పుతే  నేర్సుకొంటారే ....................... ||అవునవును ||
అందుకే తల్లి, సదువుకోవాలే........................... ||అవునవును ||
విద్దేనింటికి పిల్సి బొట్టు పెట్టావే.......................... ||అవునవును ||
విద్దె లేని వాడు వింత పశువో యమ్మ ..................... ||అవునవును ||
వస్తానే వస్తాను పనులెన్నో ఉన్నాయే......................... ||అవునవును ||
(అంటూ రాజా రాం వెళ్ళిపోతాడు )

పెద్ద :తిలింగ దేశము మాది, యజమానులారా ........... || నందానా ||
చెంచులము మేమయ్య యజమానులారా ................... || నందానా ||
వేదాలు శాస్త్రాలు తెలియవు మాకు ............. || నందానా ||
పురాణాలు సెప్పేటి పస లేదు మాకు .......................... || నందానా ||
శ్రీరంగ నీతులే సేప్తాము మేము, శ్రీ రంగ నీతులే తెలుసయ్య మాకు || నందానా ||
యజమానులారా, యజమానులారా...దండాలు దండాలు ..... ||యజమానులారా ||

(అందరూ చేతులు జోడించి ప్రేక్షకుల నుండి సెలవు తీసుకొంటారు)


***********

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద