మొసలి కొలను మ్యూజియం--- 35 (ఆఖరు భాగం) “ కేసు పరిశోధన పూర్తయి పోయింది , టు నాట్ త్రీ ! వాట్సన్ తిరుగు లేని సాక్ష్యాలతో పట్టుబడ్డాడు. విదేశాలలో అతనికి ఇంకెవరైనా స్పాన్సర్లు ఉన్నారేమో కనిపెట్టాలని, ఆ లగేజీని షిప్పింగు పోర్టు దగ్గర పట్టుకొన్నాం ! అది ఇంకెవరి పేరా కాక, తన పర్సనల్ లగేజ్ గా తన చిరునామాకే పంపడం వల్ల ఈ దోపిడీకి పూర్తి భాద్యత తనదేనని ఋజువయింది ! వాట్సన్ దొంగతనం కోసం నియమించిన ఏజెంట్లు కూడ, పట్టుబడ్డారు. ఎంకన్నను పొడిచినట్లు, బొమ్మలను ఎత్తుకు పోయినట్లు అంగీకరింఛారు.ఇంద్ర నీల్ కూడా ఇనస్పెక్టరే గనుక ఎన్నో విలువైన సాక్ష్యాలను ఇచ్చాడు. అందుకే ఊరుకొన్నాను. అంతే కాక, ఇంద్ర నీల్ ఎంతో ఆతృతతో వెళ్ల వలసిన చోటు ఒకటుంది ! అక్కడకే వెళ్లి ఉంటాడు,” అన్నాడు గోపాల్రావు. “ రామా రామ ! ఎక్కడికి వెళ్లాడు సార్ ?” “ ఆస్పత్రికి, వీలయినంత త్వరగా వెళ్లి, ‘ తులజని’ కలియడానికనే అనుకొంటున్నాను. అతని ఆతృత అలాంటిది మరి ! మనం అక్కడే అతనిని కలవ వచ్చు.” “ రామా రామ ! అయితే రేపు మీరు గోవా వెళ్లడం లేదా ?” “ తప్పకుండా వెళ్తాను, వాట్సన్ ని,