Skip to main content

భాగ్య తంత్రం - 1

భాగ్య తంత్రం అంటే భాగ్యాన్ని మార్చుకోవడానికి చేసే ఒక త్రాంత్రిక క్రియ. తంత్రం అంటే ఏవేవో క్షుద్ర పూజలు, బలులు అనుకోకండి. నేను చెప్పేది చాలా సులువైన ప్రక్రియే, కాదు చాల తక్కువ ఖర్చుతో చేయగలిగే క్రియ! ఇలాంటి తంత్రాలు చాల నిరపాయకరమైనవే కాక ఎంతో సులభమైనవి కూడ! వాటిలో ఒకటి నేను ఆచరించి లబ్ధి పొందినదే కాక ఇతరులతో చేయించి బాగుందనే ప్రశంశలు పొందింది,

దీని పేరు నవగ్రహ కలశ స్థాపనా తంత్రం! కావలసిన సామగ్రి_

చంద్రుని కోసం ఒక జత వేండితో చేయంచిన నాగుపాములు. వీటిని చాల చిన్నవిగా ఒక సెంటీమీటరు సైజులో చేయిస్తే చాలు. వెండి వైరుతో ఒక దానితో ఒకటి పెనవేసుకొన్నట్లు చేయిస్తే చాలు.

కుజుని కోసం నవ రంధ్రాలు గల రాగి రేకు. కేవలం ఒక స్క్వేరు ఇంచి సైజు రాగి రేకు చాలు. ఆ రేకు మీద తొమ్మిది కన్నాలు పొధిపిస్తే చాలు.

బుధుని కోసం అయిదు గవ్వలు కొద్దిగా పసుపు రంగులో ఉన్నవయితే మంచిది.

గురుని కోసం మూడు ఇత్తడితో చేయించిన త్రిభుజాకారపు రేకులు చిన్న ఇత్తడి రేకుతో చేయించవచ్చు. ఒక సెంటీమీటరు సైజు చాలు.

శుక్రుని కోసం ఆరు వెండితో చేసిన పాంకోళ్లు. ఇవి కూడా చాల చిన్న సైజులో అర మిల్లీమీటరు సైజులో చేయించవచ్చు.

శని కోసం ఎనిమిది ఇనుప రేకుతో చేయించిన త్రిశూలాలు. ఇవి కూడాఒక సెంటీమీటరు సైజు చాలు. ఒక డబ్బా రేకుని కత్తెరతో కత్తరించుకోవచ్చు.

రవి కోసం ఒక గాజు సీసా, పైన చెప్పిన వన్నీ వేసుకోవడానికి.

రాహు-కేతువుల కోసం గంగాజలం. ఆ సిసాలో పోయడానికి.

సామగ్రి విషయం తెలిసింది కదా! ఇక ప్రక్రియ తెలుసలకొందాం!

ఈ పని చేయడానికి వారం రోజులు పడుతుంది. ఆదివారం నుండి శనివారం వరకు ఏదో ఒక ఆదివారంనాడు మొదలుపెట్టండి. ఆదివారం ఉదయం గాజు సిసాలో గంగాజలం పోయండి. ఆదివారం రాత్రి ఆ సీసాని మంచం క్రింద తల పెట్టుకొనే చోట ఉంచి, అందులో చంద్రునికి సంబంధించిన నాగుపాముల జతని పడేయండి తరువాత ఒక రూపాయి కాసుని తలగడ క్రింద, పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత మూత బిగించి రాత్రంతా అక్కడే ఉంచండి.

సోమవారం ఉదయం దానిని తీసి పూజ గదిలో గాని వేరే పవిత్రమైన స్థలంలో గాని ఉంచండి. తలగడ క్రింద దాచిన రుపాయిని కూఢ ఒక డబ్బాలో వేసి జాగ్రత్తగా దాచండి. సోమవారం రాత్రి ఆ సీసాలో తొమ్మిది రంధ్రాలు కల రాగిరేకుని ఆ గంగాజలంలో పడేయండి. తిరిగి మూత పెట్టి మంచం క్రిందఎప్పటిలాగే ఉంచండి. తలగడా క్రింద ఒక రుపాయి బిళ్లని పెట్టి పడుకోండి. మర్నాడు ఉదయం సీసాని, రూపాయిని ఇదివరకులాగే జాగ్రత్త చేయండి.

మంగళవారం రాత్రి ఆ సీసాలో అయిదు గవ్వలు పడేసి, మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి కాసుని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఎప్పటిలాగే ఊదయాన్నే సీసాని, రూపాయిని ఇదివరకులాగే జాగ్రత్త చేయండి.

బుధవారం రాత్రి ఆ సీసాలో మూడు ఇత్తడితో చేసిన త్రిభుజాకారపు ముక్కలని పడేసి మూతబిగించి మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి కాసుని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత ఉదయాన్నే సీసానీ, రూపాయినీ జాగ్రత్తచేయండి.

గురువారం రాత్రి ఆ సీసాలో ఆరు వెండి పాంకోళ్లు పడేసి మూత బిగించి మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి కాసుని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత ఉదయాన్నే సీసానీ,రూపాయినీ ఎప్పటిలాగే జాగ్రత్త చేయండి.

శుక్రవారం రాత్రి ఆ సీసాలో ఎనిమిది ఇనప త్రిశూలాలు పడేసి మూతబిగించి మంచం క్రింద పెట్టండి. మూత బిగించి మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి బిళ్లని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత ఉదయాన్నే సీసానీ, రూపాయిని ఎప్పటి లాగే జాగ్రత్ర చేయండి.

అంతే! నవ గ్రహ కలశం తయారయి పోయింది. శనివారం ఉదయానికే దానిని పూజ గదిలో గాని లేక ఇంకేదైనా ఎత్తైన జాగాలో ఉంచండి.

పూజలు పునస్కారాలు ఏమీ చేయనవసరం లేదు. ఆ కలశం తన పనిని తాను చేస్తుంది!

Comments

  1. sir, yii kalasam life emtakalam umtumdi. diinivalla cedu eemi jaragadu kadaa ? ilaa ceyadamvalana debts numdi bayatapada galanaa please answer sir

    ReplyDelete
  2. ma nanamma chani poy 4mnths aithuindi,ma nanna gariki ki ee bhagyatantram patinchadaniki mruthashoucham varthistnda leda telupandi pls,alage ma nanna gariki chetilo udyogam ledu mariyu konni aarthika ibbandulatho sathamatham avthunaru,ee bhagyatantram patinchadam valana andulo nundi byta padagalara telupandi pls

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద