“క్షీర గంగ” అనే శీర్షిక పెట్టి , దాని క్రిందన “”విరిసిన హరి విల్లు” అని ప్రశీర్షిక పెట్టడం ఏమైనా బాగుందా ఆనే సందేహం రావచ్చు! దానికి నా సమాధానం ఏమిటంటే---“కామధేనువు” అనేది, ఈ సమాజం లోని 97 శాతం ప్రజలకు ప్రతినిధి అయితే తక్కిన 3శాతం ఎవరు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దానికి ఈ క్రింది విధంగా వివరించ వచ్చు.
పాడినిచ్చే స్తన్య జీవులు
ఇంధ్రియ సుఖాన్నిచ్చే వేశ్యలూ:
పంట పండించే వ్యవసాయ శ్రామికులూ
తదితర జీవితావసర వస్తువుల్ని ఉత్పత్తిచేసే కార్మికులూ
జనాభాలో నూటికి 97శాతం మంది అందరూ పశువులే!11
ఈ పశువు లన్నిటి సమిష్టి రూపమే “కామ ధేనువు!!!
సమాజంలో మిగిలిన ముగ్గురూ పశుపతులు: ధన పతులూ: ఉద్యోగ పతులు ఋషులయిన నాడే----
కర్మాగారాలు ఆశ్రమ వాటికలవుతాయి.
శ్రమ యజ్ఞమయి పవిత్రత సంతరించుకుంటుంది. అది సాధ్యమా! అసాధ్యమయితే ఏం చేయాలి అన్న ప్రశ్నకు ఈ పశువులేం చేయాలి? అన్న ప్రశ్నకు కూడా ------
“”విరిసిన హరి విల్లు “” లాంటి ఈ ప్రపంచంలో స్పందించే ప్రతీ హృదయమూ ఇచ్చే నివాళే సమాధానం కావాలి.
అదేనండీ, ఈవివరణ!! దీనిని ఆధారంగా చేసుకొని నేను వ్రాయబోయే భావ జాలానికి ప్రతీ ఒక్కరికీ ఆహ్వానం!!!
భవధీయుడు
అయలసోమయాజుల శీధర్ ( ఏ. శ్రీధర్ )
శ్రీధర్ గారూ!
ReplyDeleteబ్లాగు లోకానికి హృదయ పూర్వక స్వాగతం. మీరు రాయబోయే పౌరాణిక రచనల కోసం ఎదురు చూస్తుంటాను.
సుస్వాగతం !మీ రచనలకు , మీ భావాలకు ఇది చక్కని వేదిక.
ReplyDeleteఅభినందనలు !
తెలుగుకళ - పద్మకళ
http://telugukala.blogspot.com
శ్రీధర్ గారూ !
ReplyDeleteమంచి వేదికను ఎన్నుకున్నారు. మీకిదే మా స్వాగతం.
బ్లాగ్లోకానికి సుస్వాగతం.
ReplyDeleteబ్లాగులోకానికి ఇదే మా స్వాగతం. ఆధ్యాత్మికంగా మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోవడానికి మీకు ఇది మంచి ప్రదేశం. మీ పౌరాణిక రచనలకోసం ఎదురు చూస్తూ ఉంటాము. :)
ReplyDeleteWelcome to the wonderful land of teleugu blogspot. infact you were looking for such type of platform for a long type. this is a long cherished dream coming true. we hope you earnestly contribute to this spot and keep updating we readers.
ReplyDeletewith regards,
JOGA RAO/INDRANI KARRI, BHILAI