అతడు.ఈశ్వరాంశ సంభూతుడు. అతని పుట్టుక , తనకి మృత్యువు అని తెలిసిన ఒక రాక్షసైడు మాతృగర్భంలోఉండగానే , తల్లిని బంధిస్తే, వారం రోజులలోనే గర్భం నుండి బయటపడి, తన తేజంతో ఆ రాక్షసుని భస్మీపటలం చేసిన అపర రుద్రుడు! దత్తాత్రేయునికి తమ్ముడు.! అత్రి అనసూయల పుత్రుడు ۔ అతని పేరు “దూర్వాసుడు”. పుట్టుక తోనే కోపిష్టి.!
అతని మనస్సు ఆ రోజు అతలాకుతలంగాఉంది. “బధరిలో’ అలకనందని దాటి, గోవిందఘట్టం వైపు,ఉన్మత్తుడిలా అడుగులు వేస్తు న్నాడతను, తనకి తొలిసారి కనిపించిన ఋషి కన్యని వివాహమాడి గార్హ్యస్ద్య జీవితాన్ని ప్రారంభించడానికి!!
కఠోరతపాన్ని విడిఃచి పెట్టి , అతనలా కన్యకాన్వేషణలో పడడానికి ప్రబల కారణాలున్నాయి. వాటిలో మొదటిది “వపువ” సౌందర్యం.! అతని తపోభంగం కలిగించి, అప్సరసల లోతన ఆధిక్యతని నిరూపించుకోవాలనే పట్టుదలతో, అతని మనసుని రాగరంజితం చేయాలని తలచిందామె! కోపంతో పక్షివి కమ్మని శపించినా, ఆమె రూపం మాత్రం అతని మనసులో ముద్రించుకుపోయింది. అందుకే కాస్త మెత్తబఢి, ఆమె శాపవిమోచనాన్నిఅర్దించిన మీదట “ అంద చందాలు అవివేకులనే ఆకర్షిస్తాయి. నీవు నీ రూప సౌందర్యాలను ఒక అవివేక మానవకాంతకు దానమిస్తే తిరిగి అలకా పురికి పోగలవు. అని చెప్ఫి తన తపో భూమిని వదలి, సూక్ష్మబదరికి వెళ్లాడతను.
సూక్షబదరిలో, యమనియమాలతో మనో శరీరాలని నియంత్రించి, తపోధీక్షకు పూనిన అతనికి, మరొక అవాంఛనీయ సంఘటనఎదురయింది, “ సాహసిక తిలోత్తమల” రతిక్రీడల రూపంలో! “బలిచక్రవర్తి” కొడుకు ‘సాహసికుడు’, అప్సరాంగన ‘తిలోత్తమ’ సౌంధర్యనిధులు! ఒకరి బాహుబంధంలో ఇంకొకరు బంధించబడి, మితిమీరిన తమకంతో పరిసరాలని మరచి, కలహంసలలా, రతిపారవశ్యంలో, ” ఆహ్లాద రావాలు” చేస్తూండగా, అతనికి తిరిగి తపో భంగమయింధి. కోపంతో వారిని రాక్షసులని కమ్మని శపించాడతను. ‘తిలోత్తమ’ బాణాసురినికి కుమార్తెగా "ఉషా” నామధేయంతో జన్మించగా, ‘సాహసికుడు’ గార్ధభాసురినిగా మారాడు.
ఆ సంఘటనలే అతని అశాంతికి కారణాలయ్యాయి. వివాహమాడి, కొన్నాళ్లు కాపరం చేసాక, తిరిగి తపోవృత్తి చేయవచ్చున ని తలచిన అతను, అక్కడనుండి కదలి, కన్యకాన్వేషణలో పడ్డాడు. పక్షి రూపంలోని ‘వపువు’, గార్ధభరూపంలోని ‘సాహసికుడు’, దూర్వాసుని మనస్థితిని గమనించారు. కామాతురుడైన అతనికి శృంగభంగం చేయ సమకట్టారు. ఆముక్కోపికి ఇంకొక కోపిష్టి అవివేకి అయిన కన్యని జతచేస్తే బాగుంటుంధని తలచి,అతనికంటే వేగంగా ముందుకు కదిలి, వధువుని వేతికేందుకు వేళ్లారు.
పక్షి (రూపంలోని) ‘వపువు’ ప్రయత్నం ఫలించింది. గోవింద ఘట్టం దగ్గర లోయలోని పుష్పవనంలో, పువ్వులుఏరుతూ కనిపించిందొక మునికన్య. ఆమె మందమతి కావడంవలన శరీరమయితే వికసించింది గాని ‘ బుద్ధి వికసించలేదు. పక్షి వపువు, గార్దభుడు ఇద్దరూ ఆమెని సమీపించి పలకరించారు. ఆమె పేరు , “కధళి” అని, ఔర్వుడనే ముని కూతురనీ తెలుసు కొన్నారు. ‘వపువు ‘ ఆమెకి తన సౌందర్యాన్ని సమర్పించింది, శాప విముక్త అయింది. ఆమెకి కాబోయే భర్త, ఆమెను వెతుకుతూ వస్తున్నాడని, శివాంశలో పుట్టింన అతను స్వయంగా శివులాగే ఉంటాడని చెప్పింది. గార్దభం మీద కూర్చుని అతనికి ఎదురు వెల్లమని చెప్పింది. కదళి ఆమె మాటలు నమ్మింది, గార్ధభాన్నిఎక్కింది.
ఎదురుగా వస్తున్న కదళిని చూసాడు దూర్వాసుడు. ఆమె జిగి బిగి యౌవనం, రూపం అతనిని ఆకర్షించాయి. ఔర్వముని కూతురని తెలుసుకొని, వివాహ ప్రస్తావన తెచ్చాడు. ‘కదళి అంగీకరించింది. అక్కడికక్కడే ఇద్దరూ, పూలమాలలు మార్చుకొని, గాందర్వవిధిలో వివాహం చేసుకొన్నారు.
ఆతరువాత ఇద్దరూ, గార్ధభాన్నిఎక్కి దూర్వాసుడు యోగశక్తితో నిర్మించిన కుటీరాన్ని చేరుకొన్నారు.
*************************
ఆ మిధునానికి అది మొదటి రాత్రి !
‘కదళీ సౌందర్య రసాస్వాదనలో పడ్డాడు దూర్వాసుడు, అర్థచంద్రుని లాంటి ఆమె నుదుటినీ, ఆద్దాల లాంటి చెక్కిళ్లనీ ముద్దు పెట్టుకొన్నాడు. అరురారుణమైన ఆమె పెదవులని తన పెదవుల మధ్య బిగించి వాటి మధురిమలని జుర్రుకొన్నాడు. కదళికి శృంగారమంటే తెలియదు. అతను చేసినట్లే ఆమె కూడ చేసింది. అతనికామె ప్రతిచర్య ఆనందాన్ని కలిగించింది. చూపులకి, ‘బాలలాఉన్నా బిగి కౌగిలిలో చేరేసరికి, ‘ప్రౌఢగా’ అయిందని అనుకొన్నాడు. అతని కళ్ల ముందు, తిలోత్తమా-సాహసికుల ప్రణయచేష్టలు కనపడ్డాయి. కదళి ప్రతీకదలికలోను వాటిని సాకారం చేసుకొన్నాడు. ఆమెను పూర్తిగా ఆక్రమించి! ‘’తిలోత్తమా – సాహసికుల’ ప్రేమిక మిధునాల పరవశత్వాన్ని ప్రత్య.క్షంగా తెలుసుకొన్న దూర్వాసుడు, గార్ధభరూపంలోని ‘సాహసికుని’ పూర్తిగా క్షమించాడు. అతనికి,,బాలకృష్ణుని చేతిలో మరణం సంభంవించి శాపవిముక్తి కాగలదని ఆశీర్వదించాడు.
గార్ధభుడు సంతోషంతో పరుగుపెట్టాడు.
****************************
మరునాడు తెల్లవారింధి. కదళి నిదురలేవలేదు. అలసిపోయి ఉంటుందనుకొన్న దూర్వాసుడు పనులన్నీ తానే చేసాడు, ఆమెను లేపి ఆహరం తినిపించాడు, భోజనం అయ్యాక ఆమె ‘పవళింపు సేవ’ కావాలంది! అపరాహ్ణవేళ అలాంటివి కూడదంటే అలిగింది, కొరికింది, బాల్యచేష్ట అనుకొన్నాడు ఆమె కోరినట్లే రతికార్యాన్ని నెరవేర్చాడు. అలసిన శరరంతో, కదళి మళ్లీ నిద్రపోయింది.
అతడు రాత్రి వంట చేసాడు. భోజనం అయ్యాక కదళి తనని తాను అలంకరించుకొంది. పూవులతో చిన్న చిన్నమాలలు కట్టి, చేతులకి, భుజాలకి, నడుముకీ చుట్టింది. నిడుపాటి కేశాలని దువ్వి పుష్పాలతో అలంకరించిది. శరీరానికి చందనలేపనం చేసి, అత్తరు పూసుకొంది. తన అలంకరణ పూర్తి అయ్యాక, అతనిని పిలిచి మెడలో మాల వేసింది. చిన్నచిన్న పూదండలతో అతని చేతులని, కాళ్లనీ భుజలనీ, నడుమునీ కట్టింది. అతను ముందు కాస్త బెట్టు చేసినా, ఆమె సౌందర్యం అతనిని చేష్టలుడిగేలా చేసింది. తమకంతో ఆమెను దగ్గరకు తీసుకొన్నాడు, ఏదీ!ఈరోజు రెండవరోజే కదా! అని సమాధానపడ్డాడు, ఆమెకి అనుకూలంగా స్పందించాడు.
అలా మూడు రాత్రులు గడిచేయి, కదళి ప్రవర్తనలో ఏ మార్పూ కనబడలేదు. దూర్వాసుఢు ఆందోళనకి గురి అయ్యాడు. కామాతురుడైన తాను ముందువెనుకలు చూడకుండా ఒక కామినీ పిశాచాన్ని కట్టుకున్నానని వాపోయాడు. ఆమెకి ‘హితోపదేశం’ చేసి, సంసార స్త్రీలు నడుచుకొనే ప్రవర్తనావళి భోధోంచాడు.
కధళికి అవేవీ తలకెక్కలేదు. అలిగి, రోదించి, సాధించి అతనితో తన అవసరాలు తీర్చుకొంది. దినదినానికి దుర్భరమవుతున్న ఆమె ప్రవర్తనకి విసిగెత్తిన అతడు, కోపంతో ఆమె వంక దృష్టి సారించాడు.అంతే! బూడిద కుప్పగా మారిపోయింది. కదళి. ఆమె రూప సౌందర్యాలు, ‘వపువను’ చేరుకొన్నాయి. తను లేని సమయంలో వివాహమాడి, భర్తతో కాపరానికి వెళ్లిన కూతురిని చూఢడానికి వచ్చాడు., ఔర్వఋషి. సంయమేంద్రియుడైన అతడు అల్లుని కధనాన్ని విన్నాడు. కొంత ఊహించి, మరికొంత తర్కించి సమాధాన పడ్డాడు.
“దూర్వాస మహర్షీ1’ మీకు తగిన భార్య ద్వారకలో ఉంది ద్వారకకి వెళ్లి, శ్రీకృష్ణుడు తన అష్టమహిషిలతో, పదారువేల గోపికలతో ఎలా సరస సల్లాపాలు చేస్తున్నాడో చూసి రండి. అతని చెల్లెలు “యోగమాయ”ను అర్ధించి వివాహం చేసుకోండి ఆమె మాత్రమే మీతో గార్హస్థ్య జీవితం గడపగలదు,” అని చెప్పి, నా కుమార్తెను బూడిద చేసినందుకు ప్రతిగా మీరు అంబరీషుని చేతిలో ఘోరావమానం పొందక తప్పదు” అని శపించి, “నిగ్రహానుగ్రహ శక్తియక్తులు కలిగిన మీరు, మీ శక్తిని సద్వినియోగం చేయండి శక్తిని నాశనానికి కాక నిర్మాణానికి, సృష్టికి ఉపయోగపడేలా చేయండి,” అని హితవు పలికాడు.
******************************
దూర్వాసుడు యోగమాయను వివాహమాడాడు.
యోగమాయ అతనికి ఇష్టసఖి అయింది. అతనిని తన మాయాజాలంలో ముంచి, అతనిలోని శమదమాలను, మజ్జిగ చిలికి వెన్నలా, బయటికి తీసి, అతని వ్యక్తిత్వాన్ని సంస్కరించింది.
వినయ ప్రవర్తన గల ఇల్లాలై అతని నైష్టిక కార్యక్రమాలకి ఛత్రం పట్టింది. మనోహర. రూప సంపద గల ప్రియరాలై, రతికేళిలో అతనిని అలరించి, అతని మూడోపురుషార్థాన్ని సార్థకం చేసింది .మంత్రణిలా మంతనాలు చేసి అతని మనో బుధ్ధివికాసానికి దోహదం చేసింది.
కాగి, చల్లారి మీగడ తరకలు కట్టిన పాలలా శాంతించిన అతని మనస్సు తన గతాన్ని సింహావలోకనం చేసుకొంది. ఒక అప్సరాంగన అశ్లీల అంగాంగప్రదర్శన, మరొక ప్రేమిక మిధునపు అనన్య మన్మథకేళి కలగజేసిన అలజడి, ఆ పైన ఉచ్చృంఖల శృంగార జీవితాన్ని ఆశించిన భార్య, ఇవన్నీ తనలాంటి మహర్షిని సైతం పతనానికి దారితీయించి, మృగాన్ని చేసాయి. యోగమాయతో సరసమైన శృంగారజీవితం ధర్మభధ్ధమైన దాంపత్య జీవితం తన లోని కామాన్ని దమించి, క్రోధాన్ని శమింపచేయగలిగింది.
కామం పురుషార్ధాలలో ఒకటి ఎందుకయిందో అతనికి అర్థమయింది. ఆ గత జీవితమథనంలో అతనికి ఔర్వఋషి చేప్పిన మాటలు గుర్తుకి వచ్ఛాయి.శక్తిని నాశనానికి కాక, నిర్మాణానికి ఉపయోగించాలని అనుకొన్న అతను, తన మొదటి భార్య పేరు అజరామరమయ్యేలా ఒక వృక్ష జాతిని సృష్టించాడు.
********************
రూపంలో స్త్రీ—పురుష జననాంగాలని పోలి, దైవ నివేదనకి అర్హత పొందిన, త్రిమధురాలలో ఒకటిగా గుర్తింపు పొంది, రసిక జనులకు ఇష్టమైన భోగ్యవస్తువై, క్షుధార్తులకు చిటికెలో తృప్తి కలిగించే ఆహారమై, మధురాతి మధురమైన-- ఆ ‘కదళీ ఫలం”, దూర్వాసుని ప్రేమ కానుక.
కదళీ ఫలాన్ని దానమిచ్చిన వారికి, నైవేద్యమిచ్చిన వారికి, వారికి, ఆ మహర్షి ఆశీస్సులు లభిస్తాయట!! కాబట్టి శృంగార ఫలమైన “కదళికి” జయహో!!
***************************
రచన:: ఎ. శ్రీధర్. ***
{ఈ కధ పౌరాణిక ఇతివృత్తం. ముక్కోపి అయిన దూర్వాస మహాముని కధలని, ఎన్నెన్నో పురాణాల నుండి సేకరించి శృంగార నేపథ్యంలో మలిచిన ప్రయత్నం నాది. నా దృష్టిలో, ప్రియురాలి స్మృతి కోసం ప్రజా థనాన్ని వెచ్చించి తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ కన్నా, ప్రియురాలి స్మృతికోసం ప్రజా బాహుళ్యం కోసం కదళీఫలం సృష్టించిన దూర్వాసుడే గొప్ప ప్రేమికుడు. కాని నేనేదో ఆమహర్షికి ద్రోహం చేసానన్న భ్రమతో ఈ కథని ప్రచురించ నిరాకరించింధి ఒక పత్రిక.
అందుకే దీనిని వెబ్ లో పెట్టాను. దీనిని చదివి పాఠకులే స్వయంగా నిర్ణయింవుకోవడం మంచిది.-----------ఇట్టు మీ శ్రీధర్.}

కథ కు సంబంధించినంతవరకు నిజా నిజాలు సామాన్యులకు తెలియవుకాబట్టి దూర్వాసుడు ముక్కోపిఐన మహాముని కాబట్టి ఏమన్నా సమస్యలొస్తాయని భావించిఉండవచ్చు.
ReplyDeleteకథా రచన, కథనం మాత్రం చాలా బాగుంది.
ఆసక్తి కరమైన నడక, అవసరమైనంత వరకే పదాల పొందిక చివరిదాకా చదివించాయి.అభినందనలు.
మాస పత్రికలకు పంపిచూడండి.
kadhanam chala baagundandi. marichipotunna telugu padaalatO paatu, konni kotta padaalu nErchukunna. inthakee kadalee phalam konukkovalante market lO emani adagali?
ReplyDelete