Skip to main content

ఖర్జూరం - శృంగారానికి సరియైన నిర్వచనం

ప్రభవ నామ సంవత్సరం.( క్రీస్తు పూర్వం—907 )
రాత్రి రెండవ ఝాము ముగిసింనే దానికి సంకేతంగా----
గొల్లకావిడి, పడమట వాలింది. సప్తర్షి మండలం నభో మధ్యానికి చేరుకుంది. పూర్ణ చంద్రుడు జేగీయ మానంగా తన శీతల కిరణాలను వెదజల్లుతున్నాడు. ఆకాశం,నిర్మలమైన నక్షత్రకాంతులతో చూడ ముచ్చటగా ఉంది.
ఆరాత్రి! “వైశాఖ పూర్ణమి!
భారత దేశపు వజ్రాల గని అయిన, “పన్నా” కి చేరువగా నున్న ప్రదేశంలో, నలువైపులా వృక్ష పరివేష్టితమైన, విశాలమైన సరోవరంలో____
విశ్వమానవ జనావళికి, శృంగార రస భరిత సందేశాన్ని ఇవ్వడానికా! అన్నట్లు- ఒక చరిత్రాత్మిక ఘటన ప్రాదుర్భవించింది.
అదే! “హేమావతీ—సోమదేవుల” కలయిక!!
*********************************************************************************************************** హేమావతి అపురూప సౌందర్యవతి. స్దిరయై భూమిపై సంచరించే విద్యుల్లత ప్రాణాలతో వెలసిన బంగారు బొమ్మ! బంగారానికి కాఠిన్యమనే దుర్గుణం ఉంది. ఈ కొత్త బంగారం అత్యంత సుకుమారం. ఆమెనే గాని శశాంకుడు ఒకసారి ఆలోకించే పక్షంలో రోహిణీ కాంతపై శీత కన్ను వేయక మానడు.” అని అనుకొంటూ ఉంటారు, సౌందర్యమర్మజ్ఞులైన రసికులు.
యథాతథంగా అదే జరిగింది ఆ రోజు రాత్రి!!
గ్రీష్మ తాపంతో కొంత, మదన తాపంతో మరికొంత పీడితురాలైన హేమావతి, స్వేదంతో తడిసిన కంచుకాన్ని విప్పి విసిరేసింది. మెత్తని అంగ వస్త్రంతో బాహుమూలాల్ని, స్తన ద్వయాన్ని, వీపునీ తుడుచుకొంది..స్వేదమయితే ఆరింది గాని, తాపం మాత్రం తీరలేదు.
ఏం చేయాలా?” అని తలపోసి, “ కొలనులో ఈత కొధితే!” అన్న ఆలోచన వచ్చి, జాగు చెయ్యకుండా తనఇంటి దిడ్డి ద్వారం నుండి బయటపడి, బహు వృక్షావృతమయిన కొలను చేరుకొంది.
కొలను గట్టుపై, వలువలు విడిచి. అంగ వస్త్రాన్ని శరీర లతపై అలవోకగా చుట్టుకొని, కొనలు ముడివేసి, జలకన్యలా, కొలనులో దూకింది.
చాలసేపు ఈదులాడి అలసిన, ఆ అలరుబోడి, అలసట తీర్చు కొనేందుకు, జలస్తంభన విద్యతో, నీటిపై వెల్లకిలా పడుకొని, అరమోడ్పు కనులతో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ తేలియాడ సాగింది.
అలా తేలియాడుతున్న ఆమె తనులతా సౌందర్యాన్ని, తన వెలుగులో వీక్షించిన చంద్రునికి. మదన తాపమెక్కి, చెమట పట్టేసింది.!! అంతో చంద్రుడు మానవ రూపంలో, ఆ కొలను గట్టు చేరుకొని, “సుందరీ!” అని పిలిచాడు.
హేమావతి, పురుష కంఠ స్వరాన్ని గుర్తించింది. ఏ మాత్రం చలించకుండా బదులిచ్చింది. ఓ! పురుష పుంగవుడా! నీవు ఎవరివైనా సరే, నా ప్రశాంతతను భగ్నం చేయక, వెను తిరిగి వెళ్లిపో! దానికి విపరీతంగా ఏమైనా చేసావా! శపించ వలసి వస్తుంది.”
“సుందరీ!! నన్ను శపించి శిలగా మార్చగలవని తెలుసు. కాని నిదానించి చూసి విషయం తెలుసుకో!! నేను సోమ దేవుణ్ని!!” అన్నాడు చంద్రుడు. అతను అసత్యమాడలేదు, ‘ సోముడు. సోమదేవుడు’ అనేవి, అతని పేర్లే కదా మరి
కాని ఆ పేరుని పలకడంలోనే తన, చాతుర్యమంతా ఇమిడి ఉంది! అదేమిటంటే, “సోమదేవుడు”. ఆమె భర్త పేరు. ఆపేరు విని ఆమె స్తభ్ధురాలయింధి.
చంద్రుడు ఆ అవకాశాన్ని తీసుకొని, కొలనులో దిగాడు. ఆమె చుట్టూ. ప్రదక్షిణాలు చేస్తూ. ఈదులాడసాగాడు. హేమావతి ఆ అలజడికి తేరుకొంది. “నీవు సోమదేవుడవా?! ఇంకా జీవించే ఉన్నావా?! నీవు మరణించివని, నన్ను పదేళ్ల క్రితమే విధవని చేసారు.......” అంది. ఆమెకు ఆరేళ్ల వయస్సులోనే వివాహమయింది. ఆ మరుచటి సంవత్సరమే, సోమదేవున్ని, కాపాలికులు ఎత్తుకుపోయారు. తమ తాంత్రిక సాధన కోసం, ఆ బాలున్ని బలి చేసారు. భర్త ముఖమైనా చూసి ఎరుగని హేమావతి బాల వితంతువు అయింది.
అలాంటిది, ఈ రాత్రి, అకస్మాత్తుగా!!
చంద్రుడు చనువు పెంచుకొన్నాడు.. ఆమె వామ హస్తాన్ని అందుకొని అన్నాడు. “నన్ను తంత్రిక గురువు చంపలేదు.ఇంకొక బాలుని మృత దేహం దగ్గర నా గుర్తులు విడచిపెట్టి, నా గురించి వెతకకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తరువాత నన్ను తన ప్రియ శిష్యునిగా మలచుకొన్నాడు. కొన్ని రోజులుగా, ఇక్కడికి దగ్గరగా ఉన్న చిట్టడవిలో, నా గురువు సాధన చేస్తున్నాడు. నేను అనువైన సమయం కనిపెట్టి, నిన్ను కలుసుకొనేందుకు మీ ఇంటి వైపు వచ్చాను. నీవు దిడ్డి ద్వారం గుండా ఈ కొలనుకు రావడం చూసి, ఇక్కడకు వచ్చాను. అని నమ్మబలికాడు.
హేమావతి అతని చేతులలో వాలింది. అతడామెను హృదయానికి హత్తుకొని, కొలను బయటకి తీసుకువచ్చాడు. ఆమె ఒంటిని అంటి పెట్టుకొని ఉన్న అంగవస్త్రాన్ని తొలగించాడు, తరువాత తన వలువలు కూడ విడిచాడు. ఆమె సిగ్గుల మొగ్గ అయి, తన సర్వాంగాలతోను అతనికి దగ్గరకి చేరి అతనిని కౌగలించుకొంది. అతడామె అంగాంగాలను చుంబించి ఆమెను మత్తులో ముంచాడు.
హేమావతి తన అధరాలతో, ఆ అమృతాంశునికే అమృతాన్ని అందించింది!! ఇరువది ఏడు నక్షత్ర కాంతల అధరామృతములను చవి చూసిన ఆ సుధాంశుడు, హేమాచతి అధరాలను, కుతూహలంతో అందుకొని, ఆస్వాదించి, ఆహా!ఏమి రుచి!!” అనుకొన్నాడు. ఆ రుచిని చవిచూసిన అతను, అంతటితో ఆగక, తన ప్రతి బింబంలాంటి ఆమె ఫాల భాగాన్ని పరిశీలించి తన పెదవులతో ఆమోదముద్ర వేసాడు. ఆ దిగువన ఉన్న ధనస్సులలాంటి ఆమె కనుబొమలను, జిహ్వతో స్పశించి సరిదిద్దాడు. ఆమె కనులలో తన ప్రియమైన కలువభామలను వీక్షించాడు, వాటిపై కూడ పెదవులతో ఆమోదముద్ర వేసాడు. ఆ కలువల కొలనుల నడుమ, నిటారుగా సంపంగి మొగ్గలా నిలిచిన నాసికను , నాలుకతో తడిచేసి కాంతులు వెదజల్లేలా చేసాడు. ఆ తరువాత ఆలుచిప్పలాంటి చిబుకాన్ని, శంఖం లాంటి మెడని చేతి ముని వేళ్లతో చక్కదిద్దాడు.
ఆమె మెడ దిగువన చూపు మరల్చలేకపోయాడా చుక్కలరేడు.!! హేమావతి స్తనద్వయాలు, సుతిమెత్తని సర్ణకలశాలలాగ, వాటి అగ్రభాగాన. ఠీవిగా, నిటారుగా తామరపువ్వు బొడ్డులా నిలిచిన చూచుకాలను ఆశ్చర్యంతో, విస్ఫారిత నేత్రాలతో, నమ్మలేనట్లు తడిమి, తడిమి, చూసాడు. స్తనాలపైన చూచుకాలు సురకాంతలకు ఉండవు!! మనవ కాంతయైన హేమావతి, వద్ద వాటిని చూసు అతడు ముగ్ధుడవుతే, అతని ముచ్చట చూసిన హేమావతి, కంపనతో కూడిన స్వరంతో చెప్పంది. “స్వామీ! ఆ చూచుకాలు ఇప్పటి వరకు అణిగి,మణిగి ఉండేవి, మీ కర స్పర్శతో, ప్రేరణ చెంది, నిటారుగా నిలబఢ్డాయి....” అని. చంద్రుడా ఛనుమొనలను చప్పరించి వాటి కాఠిన్యాన్ని ప్రశంసించాడు. ఆ పిమ్మట ఆమె సన్నని నడుము, లోతైన పొట్ట, అక్కడ కేంద్ర బిందువు లాంటి, నాభి పైన అతని దృష్టి పడింది. హేమావతి ఆ చూపుల వేడిని భరించలేక, అతని తలని, తన చేతులతో అదిమిపెట్టి తన పొట్టలో దాచేసుకొంది. ఇంకేముంది!! చంద్రుడా! సురతోపచార కుశలుడు, హేమావతి పరిపుష్టభోగక్షమాంగి, ఇక వారి విశృంఖల ప్రణయానికి, ఆ సరోవర తీర తరులు సాక్షులై భాగస్వాములయి నిలిచాయి
బ్రాహ్మీ ముహూర్త సమయానికి, చంద్రునికి, తన స్థితి తెలిసింది. “సుందరీ! గురుదేవుల సాధన మూగిసే సమయమయింది. నేను బయలుదేరాలి.” అన్నాడు లేచి నిలబడి, తన దుస్తులు ధరిస్తూ.హేమావతి కూడ తన దుస్తులు ధరించింది. “స్వామీ! నాతో పాటు ఇంటికి రండి. మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు,” అంది.
ఇది సనయం కాదు దేవీ! వచ్చే అమావాస్య నాటికి నా గురువు తన సాధన ముగించి, నాకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. ఆ రోజు నీతౌ వచ్చి, అందరికీ విషయమంతా వివరిస్తాను. అంతవరకు ఈ రహస్యాన్ని కాపాడాలి. ఈ లోగా, ఇలాగే ఈ సరోవర తీరాన కలుసుకొందాం” అని ఆమెను కొసరి, ముద్దాడాడు. తణి సుఖాల డోలికలో ఊగులాడించిన, ఆ పురుషుని మాటలను హేమావతి మనస్ఫూర్తిగా నమ్మింది. మరిచటి రోజు వస్తానని మాట ఇచ్చింది.

బహుళ పాడ్యమి రోజు.
హేమావతి ఆలస్యంగా నిద్ర లేచింది. ఆమె శరీర మంతా నొప్పులు, పాలిండ్లయితే- ముట్టుకొంటే చాలు నొప్పి పెడుతున్నాయి, అయినా ఆది తీయని బాధ అనిపించింది. శరీరాన్ని కర్పూర తైలంతో మర్దన చేసుకొని, స్నానం చేసాక హాయిగా అనిపించింది. కురులకు సాంబ్రాణి పొగ పెడుతూ ఆలోచించింది. రాత్రి సోమదేవునికి ఎలా స్వాగతం చెప్పాలా! అని. ముందు రోజు రాత్రి జరిగినదంతా తలచి, తలచి మధురోహలతో మురిసిపోతూ, ఆ రోజు రాత్రకి రూపకల్పన చేసింది.
తండ్రి ననుకదేవునితో, సరోవర విహారానికని చెప్పి, ఒక గూటి పడవ తెప్పించింది. తన అలంకార సామగ్రిని. ఆభరణాలని రహస్యంగా ఆ పడవలోనికి చేర్చింది. పడవగూటిపై లేలేత కొబ్బరిమట్టలను పరచింది. లోపల మెత్తని పట్టుపరుపు దిండ్లు అమర్చింది. వాటిని మల్లెలతో మరుగు పరిచింది. సుమలతలు, హారాలతో ముఖద్వారాన్ని అలంకరించింది.
రాత్రి మొదటి—ఝాముకే పడవని చేరి, తణి తాను అలంకరించుకొంది. సోమదేవుని ప్రశంసలు పొందిన తన శరీర భాగాలకు, మూఖ్యంగా పాలిండ్లపై చూచుకాలకు బంగారు తొడుగులు తొడిగింది. నాభిలో వజ్రం పొదిగింది. చేతులకి గాజులు పాదాలకు స్వర్ణమంజీరాలు తొడిగింది. చెవులకు గుత్తులు గుత్తిలుగా వ్రేలాడే కర్ణాభరణాలు తగిల్చింది. నాసికను వజ్రపు బేసరితో సొగసులీనేలా చేసింది. పొడవైన అలివేణిని జడబంధంలో బిగించి, సువర్ణ నాగర పుష్పాలతో అలంకరించింది. పట్టు పీతాంబరాలు ధరించింది అలంకరణ పూర్తి అయి, వాసక కజ్జిక వలె తన మనోహరుని కోసం ఎదురు తెన్నులు చూడసాగింది.
చంద్రుడు కూడ, తన హేమ సుందరిని, సంధించేందుకు త్వరపడి అరుదెంచాడు. ఆమె స్వాగత సత్కారాలకు ముగ్ధుడయ్యాడు. తమకంతో ఆలింగనం చేసుకొన్నాడు.
ఆమె మెడలోని మరకతమాలలను గ్రుచ్చుకొంటున్నాయని తీసేసాడు. చెవి తమ్మలను మూద్దాడాలని మాణిక్య కర్ణాభరణాలను తొలగించాడు. నాలికతో తుడిచేందుకు అడ్డమని వజ్రపుబేసరిని ప్రక్కన పెట్టేసాడు. చనుమొనలు చూడాలని ఉరోజ బంధాన్ని, వాటికి తొడిగిన బంగారుతొడుగులని తన పెదాలతో ఏరి పడేసాడు. నాభిలో పొదిగిన వజ్రాన్ని, మునివేళ్లతో చక్కిలిగింతలు పెట్టి జారిపోయాలే చేసాడు. చీనాంబర బంధం మునిపళ్లతో విప్పాడు. కౌగిలికి ప్రతిబంధకమని గాజులు తీసేసాడు/ పెనవేసుకోడానికి అడ్డుపడుతున్నాయని పాదాలకున్న సర్ణమంజీరాలని జార్చేసాడు. మెత్తని మల్లెలతో నిండిన పాన్పుపై ఆమెను పరుండ బెట్టాడు. చంద్రుని యధచ్ఛగా తన హృదయాంతర సీమళోనికి ఆహ్వనించి ఆనందించింది. విశాల శీతల సరోవరంలోని గూటిపడవ, ఆ ప్రేమిక మిధునాన్ని తనలో దాచుకొని, నీటి అలలపైన ఊయలలూగించింది. తీర ప్రాంతాలలోని తరులు తల పంకించి ప్రణయ గీతాలు పాడాయి.
బహళ చతుర్దశి!!
నిజాన్ని బట్టబయలు చేసాడు. చంద్రుడు.
హేమావతి తన రెండు చేతులతో,ముఖాన్ని దాచుకొని రోదించింది. వంచనతో నా కన్యాత్వాన్ని దోచుకొన్నావు. జారుడవైనా చోరుడవైనా దేవుడివి కాబట్టి, నిన్నే దోషాలు అంటవు. కాని నా పరిస్థితి ఏమిటి?” అంటూ.”
“సుందరీ! దుఃఖించకు. నిన్ను గాంధర్వ విధిని పరిణయమాడి, పక్షం రోజులు నీతో కాపురం చేసినట్లు, ని తల్లి తండ్రుల ఎదుట, గ్రామ పెద్దల ఎదుట నేను సాక్ష్యం చెప్తాను. నీ గర్భవాసాన నాతో సరితూగగల బల పరాక్రమ తేజస్వి అయిన పుత్రుడు జన్మిస్తాడు. వానిని నిర్భీతితో ప్రసవించు, పెంచు. నా పుత్రడు మరో కర్ణుడులా కాకుండా, నేను వానిని అన్ని వేళాలా రక్షణ నిచ్చి,ఒక విశాల సామ్రాజ్యానికి రాజుని చేస్తాను. వాడు మహారాజు అయ్యాక, మనకి మన పాప కర్మలకి.... నిష్కృతి కలిగిస్తాడు.” అని ఓదార్చాడు చంద్రుడు. అంతేకాదు తన మాటని గ్రామస్థులందరి దగ్గరా ఋజువు చేసేందుకు ఆ ప్రాంత వాసులు ఎన్నడూ చూసి ఎరుగని ఒక వృక్షాన్ని ఆ గ్రామానికి స్వాగత తోరణాలులా కనిపించేలాగ రహదారికి రెండు ప్రక్కలా సృష్టించాడు. అలా ఏర్పడినవే ఖర్జూర వృక్షాలు.
మహారాజు చంద్రవర్మ ఆ విశాల సరోవరానికి నలువైపులా, నలువైపులా ఇరువది రెండు యజ్ఞకుండాలు నిర్మించి, ఏక కాలంలో యజ్ఞం చేయించి, జననీ జనకుల ఋణం తీర్చుకొన్నాడు. తరువాత అదే యజ్ఞవాటికలను, గర్భగృహాలుగా మార్చి, ఎనుబది ఐదు దేవాలయ సముదాయానికి రూపకల్పన చేసాడు. అతను కొన్నిటిని కట్టించగా, అతని వారసులు తక్కిన వాటిని కట్టించి పూర్తిచేసారు. అలా ఏర్పడినవే, ఖజురహో దేవాలయలు.
మాతంగేశ్వర, ఖండరీయ మహాదేవ, విశ్వనాధ, లక్ష్మణ, జగదంబ, వారాహ, చిత్రగుప్త, మందిరాలు వాటిలో కొన్ని, కొన్ని సంధార శైలిలోను, మరికొన్ని నిరంధార శైలిలోను నిర్మింపబడ్డాయి.
శృంగారానికి కొత్త నిర్వచనాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని చాటి చెప్పుతూ, విశ్వ మానవాళిని ఆకర్షిస్తూ, నేటికీ నిలిచి ఉన్నాయి.
**********************************************************************************************************************************************************************

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద