Skip to main content

నారి కేళం--'నారీ కేళి' నుండి ఫలించిన ఫలం.


కుబేరుని రాజధాని అయిన అలకాపురిలో రాకుమారుడు నలకుబేరుని మందిరం. ఆ మందిరంలోని శయన కక్ష్యం, అత్యంత సుందరం. ఆ కక్ష్యానికి నలుదిశలా నాలుగు ప్రధాన ద్వారాలు. ద్వారములు. ద్వారబంధములు, తలుపులు.సర్వమూ ,సువర్ణఖచితములు. సుమశోభిత అలంకారాలతో సుసజ్జితములు.

గవాక్షములు సరేసరి! వృత్తాకారంలో అలంకరింపబడి, పూలదండలలా కన్పడుతున్నాయి. ఆ ప్రాసాద మధ్యంలో పెద్దపడవలాంటి పందిరిమంచం, వాటి పైన స్వర్ణకాంతులీనే పట్టు ఆవరణముల మధ్య మృదువైన హంసతూలికా తల్పము, దిండ్లు అమర్చబడి ఉన్నాయి.

పారిజాత, సౌగంధికా పుష్పసౌరభాలు ఆ ప్రదేశాన్నంతా ఆవరించి మత్తు గొలుపుతున్నాయి.

పర్యంకము పైన నలకుబేరుడు కూర్చొని ఉన్నాడు.ఇంద్రునితో, చంద్రునితో,మన్మధునితో సరి తూగే సుందర యువకుడతడు. సాక్షాత్తు రంభయే భార్యయైనను, అతడు నిత్యనూతన యక్షిణీ కాంతల పరిష్వంగమూ కోరువాడు.

రాజ్యము అతనిది, యక్షులు అతని పరిపాలిత ప్రజలు. సుందరులైన యక్షిణీ కాంతలు కనుసన్నలలో మెలగువారు. అదుపాజ్ఞలు వర్తించని, సర్వస్వతంత్ర సుందర మధుకరుడయిన అతనికి, సౌందర్య సుమ నివాళులిచ్చే స్త్రీలకు కొదవేమున్నది!

ఆ రోజు యక్షకన్నియ—“విలాసిని:” వంతు.

విలాసిని అద్భుత సౌందర్యరాశి! పౌత పోసిన శరశ్చంద్రచంద్రిక!!, అలకాపురికి దిగిన భారతీ తేజోంశము!!, మూర్తీభవించిన ప్రసన్నత!! కుబేరుని కులదైవమైన మాహేశ్వరుని ఆమె అర్చించు సమయమున, నిత్యమూ తన తలపై మోయు “గంగపై” నిరసనతో చూసాడట,,ఆ విరూపాక్షుడు,, పూజ చేసే విలాసినిని చూసిన పిమ్మట!! అప్పటి నుంచి విలాసినీ యక్షిణి, సాధనా మంత్రము ఇలాగయింది.

“ఓం విరూపాక్ష విలాసినీ, ఆగచ్ఛానాగచ్ఛ హ్లీం ప్రియా, మే భవ, ప్రియా మే భవ క్లీం స్వాహా!” అని.

నలకుబేరునికి ఈ విషయం తెలుసు, అందుకే ఆ మంత్రాన్ని మనసులోనే స్మరించాదు. అంతే! అందెల రవళిని, మనసు ఝల్లుమనేలా విన్యాసం చేస్తూ అరుదెంచింది విలాసిని.

“తొందరెందుకు ప్రియా!ఎలాగూ వచ్చి మీఒడిలో వాలోదాన్నే కదా! అంతలోనే మంత్రజపం దేనికి” అంది. ఆ గదికే వెలుగునిచ్చేలాంటి చిరునవ్వుతో!

“దేవీ! నిరీక్షణ అసహనమయిపోయింది. అందుకే మంత్రంతో నీకు బంధం వేసి......”

“మంత్రంతో వేసే బంధనాలకు నేను పడను, ప్రియా!”

“మరి, దేనితో వేయాలి దేవీ?”

“తంత్రంతో స్వామీ!” అంది విలాసిని, అని, తన చమత్కారానికి తానే సిగ్గు పడింది.

అలాగా! అంటూ ఆమె చేయి పట్టుకొని, తెల్లని వెండిమబ్బు వచ్చి, చంద్రుణ్ని చాటు చేసినట్లు, నలకుబేరుడు విలాసినిని కౌగిలిలోనికి తీసుకొన్నాడు.

“విలాసినీ! ఇంత జాప్యం ఎందుకు చేసావు?”

మీకు ఇష్టమైన అలంకరణని చేసుకోవాలని ప్రయత్నం చేసిఎన్నో యాతనలు పడ్డాను. అంతలోనే మీరు మంత్రపాశం వేసి లాగేసారు, దాంతో ఏ వన్నె చిన్నెలు లేకుండానే వచ్చేసాను,లోపాలకు భాద్యత వహించాల్సింది మీరే!”

“అటులనా! అయిన నీ అలంకరణ చూడవలసినదే సుమా!” అంటూ ఆమెని ఎత్తుకొని తీసుకెళ్లి పర్యంకం పైన పడేసాడు, నలకుబేరుడు. విలాసిని సిగ్గుతో ముఖం దాచుకొంటూ బోర్లాపడింది. అతడామెని వెల్లకిలా త్రిప్పే ప్రయత్నం చేయలేదు, కారణం విలాసిని పృష్టభాగ సౌందర్యం! జఘనాలపైకి జాలువారే దీర్ఘకేశాలని మూడు ముడతలుగా ముడిచి, వర్తులాకారంలో తలపైకి కట్టింది.అంతవరకు కేశాలతో కప్పబడి ఉండే ఆమె పొడవాటి మెడ శంఖాకారంలో కన్పిస్తోంది. పయోధరాన్ని ముడివేసి బిగించిన సన్నని పట్టుతాడు తప్ప ఆమె వీపుపై మరే ఆచ్ఛాదన లేదు. మెడ క్రిందనుండి విశాలమై, మృదువైన చంద్రశిలా పలఖం లాంటి ఆమె వీపు, నడుము దగ్గరకు వచ్చేసరికి, కృశించి, కోల్పోయిన తన వైశాల్యాన్ని ఖఘనాల పైకి పరిచింది.. ఆ జఘనాల మీదకి సడలిన పట్టులంగా, వాటి ఉన్నత వర్తులాల మధ్య కనీ కనపడని చీలికని కనువిందు చేయగా, తమకంతో చూసాడతను. వెంటనే మనసు నిలవరించుకోలేక వాటిని ముద్దాడాడు.

విలాసిని తన వీపు పైన అతని అధర స్పర్శకి బెదిరి సన్నగా వణికి. గగుర్పాటుని సెలయేటి అలల్లా మేనికంపనలతో ప్రదర్శించింది. నలకుబేరుడు ఆ కదలికల్ని వరుసగా చుంబించాడు. పరవశాన్ని భరించలేక అమె వెల్లకిలా తిరిగి అతనికి మరింత కనువిందు చేసింది.

మనోహరమైన ప్రదేశం. మత్తు కలిగించే పరిమళాలు, మెత్తని పర్యంకము. రతీ మన్మథుల వంటి జంట! అతడా, సురతోపచార కుశలుడు! ఆమెయా పరిపుష్టభోగ క్షమాంగి! వారి శృంగారం ఊహాతీతమే కదా, మరి!

మరునాటికి విలాసిని లభించదన్న ఆరాటంతో నలకుబేరుడు ఆమెను మరీ-మరీ సంధించాడు. మరో మండలం రోజుల వరకు. తన వంతు రాదన్న తలపుతో, విలాసిని అతనికి కొసరి,కొసరి అందించింది. వారిద్దరి మదనకేళీ విలాసాలకు సిగ్గు పడి, ఆ రేయి ప్రొద్దుచాటుకి చేరుకొంది.


అదే సమయానికి, విలాసినీ మంత్రం రెండుసార్లు వినిపించింది.

మొదటిసారి, గంభీరమూ—గాద్గదికమూ అయిన కంఠస్వరంతోనూ రెండవసారి, శైశవమూ—చపలమూ అయిన కంఠస్వరంతోనూ వినిపించింది.


“ఓం విరూపాక్ష విలాసినీ ఆగచ్ఛానాగచ్ఛ హ్లీం ప్రియా మే, భవ, ప్రియ మే భవ క్లీం స్వాహా!!” అంటూ!


విలాసిని తొట్రుపడుతూ లేచి పర్యంకంపై కూర్చొంది.

“విలాసినీ!! నీకు భూలోకంలో సాధకులెవరైనా ఉన్నారా?”

“ ఆవును స్వామీ!!” విలాసిని దీనంగా బదులిచ్చింది “వారిరువురినీ తలచుకొంటేనే, నాకు తల బ్రద్దలవుతోంది. ఇక వారి కోర్కెలను నే నెలా తీర్చగలను?”

“తలపులలోనే తలలు బ్రద్దలు చేసే వారెవరు దేవీ?”

“మీరు వినలేదా స్వామీ! గాంభీర్యమూ—గాద్గదికమూ అయిన మొదటి గొంతు, ఒక కాపాలిక తాంత్రికుడు, “అనంగరంగునిది “ వార్థక్యపు తొలిమెట్టులో ఉన్న ఆ భీకరాకారుడు నా మంత్రజపం చేసి నన్ను పొందగోరుతున్నాడు. ఇక రెండవ వాడు ప్రాయమైనా రాని పదునాలుగేళ్ల బాలకుడు. ఎక్కడో తాళపత్ర గ్రంధాలలో ఉన్న నా మంత్రాన్ని చూసి జపిస్తున్నాడు. నా సమస్య చిత్రాతి చిత్రంగా ఉంది కదా!”

“నీ సమస్య విచిత్రమైనదే దేవీ! కాని దానికి పరిష్కార మార్గం ఉంది. నిన్ను మంత్రశక్తితో పిలుస్తున్న ఆ సాధకుల కడకు, వారి వారి వయోపరిధిలోనే వెళ్లి దర్శనమిచ్చి తప్పించుకో “
“అంటే?”
ఏముంది! అనంగరంగును కడకు, వృధ్ధనారీ రూపంలోనే వెళ్లు. వృద్ధురాలివి,వ్యర్ధురాలివని ఛెప్పి అతడు నిన్ను పొమ్మంటాఢు. ఇక ఆ బాలునికి, బాలికగా దర్శనమియ్యి.”


“ స్వామీ! మంచి ఉపాయం చెప్పి నన్ను ధన్యురాలిని చేసారు. మీ కిదే నా బహుమతి!” అంటూ ఆమె అతని చెక్కిలిని ముద్దాడింది.

**********************************

అనంగ రంగడు కాపాలిక సాంప్రదాయానికి చెందిన తాంత్రికుడు. కాపాలికులు, శివుణ్ని, రుద్రభైరవ రూపంలో ఆరాధిస్తారు. ఆ ఆరాధనలో,”ఫంచ మకారాలు” వారికి ముఖ్యం. మత్స్యం, మాంసం, మదిర, మగువ, మైథునం ఇవే పంచమకారాలంటే! వాటిలో చివరి రెండూ స్త్రీ సాధకురాలు అంటే “భైరవి” దొరికితేనే సాధ్యమవుతాయి. అందుకే “భైరవి” కోసం వాళ్లు పడరాని పాట్లు పడతారు.

సాధారణంగా అలాంటి ఉగ్ర సాధనకి ఏ పడతీ ఒప్పుకోదు. అందువల్ల వాళ్లు పసి వయసులోని ఆడపిల్లలని అపహరించి క్రమక్రమంగా తమ అడుగుజాడలలోనికి మలచుకొంటారు. అందు వల్లనే వాళ్లు దుర్గమారణ్యంలో, గుహలలో మానవ సంచారం లేని చోట తమ సాధనా స్థలాన్ని ఎంచుకొంటారు ..అజ్ఞానంతో, అనాగరికతతో, దారిద్ర్యంతో దుర్భర జీవితాన్ని గడుఫుతారు, వారి లక్ష్యమల్లా, వారి భైరవీ సాధన మాత్రమే!

అనంగరంగడు కాస్త వివేకం కలవాడు. మానవ కాంతలు దుర్లభమని తెలుసుకొన్న అతను, యక్షిణీ కాంతను తన లక్ష్యసాధనకిఎంచు కొన్నాడు. ఆ యక్షిణే విలాసిని! ఆ రోజే అయిదులక్షల మంత్ర జపం పూర్తిచేసి ధ్యానంలో కూర్చొన్నాడు, ఆమె సాక్షాత్కారానికి ఎదురుచూస్తూ.

విలాసిని మంత్రపాశ బద్ధయై, అనంగరంగని ముందు ప్రత్యక్షమయింది, తన సౌందర్యాన్ని కనుమరుగు చేస్తూ, వృద్ధ స్త్రీ వేషంలో. కటువైన స్వరంతో అడిగింది,” అనంగరంగా! అలకాపురి నుండి నన్నెందుకు రప్పించావు.? నీకేం కావాలి?” అని.

అనంగరంగడు తృప్తితో ఆమెవంక చూసాడు. వృద్ద స్త్రీ వేషంలో ఉన్నా విలాసిని, అతని కంటికి తన లక్ష్యసాధన పూర్తిచేయడానికి వచ్చిన భైరవిలాగ కనిపించింది. “ధేవీ! విలాసినీ!! నేను నిన్ను,”భైరవి” రూపంలో ఆరాధించడానికి పిలిచాను. నాతో సహకరించి, నా సాధనని పరాకాష్ట దశకి తేవాలి. నా కుండలినీ శక్తిని జాగ్రుతం చేసి నన్ను ధన్యుణ్ని చెయ్యి,

అనంగరంగా! నేను అబలను, అశక్తురాలను. పైగా వృద్ధురాలను., నీ లక్ష్య సాధనకి వ్యర్థురాలిని కాగలను.”

“ దేవీ!! నీవు నా కోసం భైరవిగా మారితే చాలు! నేను నిన్ను అసాధ్యమయిన కోరోకలు కోరను నీవు అబలవు, అశక్తురాలవు. వృద్ధురాలవు అయినా—ఆఢదానివి అంతే చాలు.”

విలాసిని మరోసారి దారి లేక అంగీకరించింది.

**********************************

అనంగరంగుని జీవిత లక్ష్యమయిన,” భైరవీ సాధన “ మొదలయింది.

విలాసిని వృద్ధనారీ రుపంలో.అతని గుహలోపల ఒక శిలాఫలకం పైన కూర్చొని ఉంది. ఆమె మెడలో పెద్ద పూలమాల. చేతులకీ .చెవులకీ కూడ పూవులే ఆభరణాలు, అంతెందుకు. పయోధరాలు. జఘనాలకు కూడ సుమ పరిధానాలే అమరాయి. ఆమె కేశాలు ఎలాంటి పాశబంధాలు లేక విప్పుగా వీపంతా పరచుకొని ఉన్నాయి.

అనంగరంగుడు ఆమెను తాంత్రిక సహస్రనామాలతో, పూవులు- అక్షింతలతో అర్చించాడు. విలాసినికి ఇదంతా వింతగా ఉంది. అర్చనానంతరము, దోరగా వేచిన మత్స్యాన్ని, మాంసాన్ని నైవేద్యంలా తినిపించాడు. ఆమె కుతూహలంతో ఆసక్తితో ఆరగించింది. ఇప్పపూల సారాయిని ఆకుదొన్నలతో ఆమె అధరాలకి అందించి త్రాగించాడు. సోమరసం కన్న సారాయమే కమ్మగా ఉందని తలచిన ఆమె ప్రీతితో తాగి, మత్తకాశిని అయింది.

“అనంగరంగా!! పూజ ముగుసునట్లే కదా!!”

“ అయినది భైరవీ!! ఇక నీ కటాక్షమే మిగిలింది. “

“ కటాక్షమా!! అంటే?!”

“సెలవిచ్చెదను భైరవీ !! “అంటూ అతడామె వీపు వెనకకి వెళ్లాడు. ఆకు దొన్నెలోని ఒక లేహ్యాన్ని
తెచ్చి, ఆమె ముఖాన్నివెనకకి వంచి, చిబుకాన్నిఎత్తి పట్టుకొని, ఆమె అధరాలకి రాసాడు. ఆమె కుతూహలంతో చప్పరించింది. “” ఏమిటిది ? అనంగరంగా!! “ అని అడిగింది.

”ఇది మదనభైరవీ లేహ్యం, “శిలాజిత్తుతోను, సహస్ర మహువా పుష్ప మకరంద రసంతోనూ చేయబడింది , భైరవీ!! మరొక్కసారి.”...అంటూ మరల మరల ఆమె అధరాలకు రాసాడు. ఆమె జిహ్వను బయటకు తీసి చప్పరించింది. అనంగరంగడు ఆ లేహ్యన్ని తన పెదవులకి రాసుకొని, ఆమె జిహ్వకు అందించాడు. విలాసిని సందేహించలేదు, అతని అధరాలను అందుకొంది. అతనామెకి అభిముఖంగా కూర్చొని. ఆమెను పీఠంపైనుంచి లేవనెత్తి, తన అంక పీఠం మీద కూర్చోపెట్టుకొన్నాడు. ఆమె వారించలేదు. ఆమెకదంతా వినోదంగా ఉంది.

అనంగరంగడు ఆమెకి మరల మత్స్యాన్ని, మాంసాన్ని, మదిరనూ అందించాడు. ఆమెను తన సర్వాంగాలతోనూ దగ్గరగా తీసుకొని హత్తుకొన్నాడు.“”భైరవీ!! కటాక్షించు, కర్కాటక బంధంలో నాతో కలిసి పో!! అన్నాడు.

విలాసిని అప్పటికే వివశురాలయింది. మదిర లోపలికి చేరి మత్తకాశని అయింది“అనంగరంగా!! కర్కాటక బంధం అంటే ఏమిటి?”అని అడిగింది
.
“భైరవీ!! నీ చేతులు నా మెడమీద వెయ్యి.” అంటూ ఆమెను ఆ భంగిమకి అనుకూలంగా మార్చుకొని బిగికౌగిలిలో బిగించాడు.””భైరవీ!! ఇదే కర్కాటక బంధం!!”

”కామకేళిలో ఇలాంటి బంధాలు కూడా ఉంటాయా? అమాయకంగా అడిగింది, ఆ అలకాపురి సుందరి.

“ అవును భైరవీ!! మా భూలోకంలో, వాత్సాయనుడనే మహర్షి, ఇలాంటి బంధలెన్నింటినో కల్పించి వాటిని గ్రంధస్తం చేసాడు. తరువాత కాలంలో కొంతమంది, శిల్పాచార్యులు దేవాలయ ప్రాకారాల పైన ఆ భంగిమలను శిలలతో మలచి, అందరికీ అందుబాటులో ఉండేలా చేసారు. ఇక్కడకి దగ్గరగా, నీలకంఠ మహదేవ మందిరం ఉంది. అక్కడ వాటిని చూడవచ్చు.”


“నాకు చూపిస్తావా?”

“ తప్పక చూపిస్తాను భైరవీ!! రేపటి భైరవీ సాధన అక్కడే చేసుకొందాము. “

“రేపుకూడాసాధిస్తావా,అనంగరంగా!అయినా ఈ కామకేళిని “ సాధన” అనిఎందుకు పిలుస్తున్నావు?”

“భైరవీ!! ఈ కామకేళిలో స్కలనం ఉంఢదు. రేతస్సును ఊర్థ్వ ముఖంగా లేపి, మెధడులో ఉండే కామకేంద్రం వైపు తీసుకెళ్లాలి.ఆ ప్రయత్నంలో కుండలినీ శక్తి జాగృతమవుతుంది. దానివల్ల సమాథి స్థితి లభిస్తుంది. అందుకే దీనిని సాధన అని అన్నాను. “భైరవీ!! రేపు మాత్రమే కాదు, ఈ సాధన నవరాత్రులు జరగాలి. ఆ పైన నిన్ను కష్టపెట్టను, నీ కటాక్షంవలన నాకు లభ్ధి కలిగి తీరుతుంది.అలా కలగనప్పుడు ఈ జీవితానికి ఇంతే అని సరిపెట్టుకొంటాను, కాని నిన్ను మరల కష్టపెట్టను.”

అనంగరంగా!! పురుషులే తప్ప స్త్రీలు ఈ సాధనకి అనర్హులా?”

“ స్త్రీలు సమర్పణ ద్వారా ఈ సాధనా పలితాలు పొందగలరు భైరవీ!!”


“ సమర్పణ అంటే ఏమిటి?”

“ భైరవీ!! ఒకే పురుషునికి తన తనువును, మనసుని, తన సర్వస్వాన్నీ సమర్పించడం ద్వారా! దానినే మా లోకంలో పాతివ్రత్యం అంటారు. “

“అలాగా!! మానవ కాంతల గురించి నీ ధగ్గర చాలా విషయాలు తెలుసుకోవాలి.,ఈ నవ రాత్రులూ వచ్చి నీకు సహకరిస్తాను.”

“ధన్యున్ని, భైరవీ!! అంటూ అతడామె బుగ్గలను ముద్దాడాడు.”

ఆమె సమర్పణనే లక్ష్యంగా పెట్టుకొని అతనికి పూర్తిగా సహకరించింది.

*******************************

“ ఓం విరూపాక్ష విలాసినీ.......” అంటూ తననే ధ్యానిస్తున్న ఆ బాలకునికి, పన్నెండేళ్ల బాలికలా దర్శనమిచ్చింది విలాసిని, పట్టుపరికిణీ, జాకెట్టు, రెండు జడలతో!

“ హే!! బాలకా!! నా పేరే విలాసిని!! నన్నెందుకు పిలుస్తున్నావు?”

“”నువ్వేనా విలాసినివి!! నువ్వింకా చాల పెద్ద దానివని దుర్గా దేవి విగ్రహంలాగ ఉంటావని అనుకొన్నాను.”అన్నాడా బాలుడు.

“ నేను ఎలాగైనా మారగలను. నువ్వు బాలుడవు గనుక నేను బాలికలా వచ్చాను. నాతో ఏమవసరమో చెప్పు.”

ఏమీ లేదు. మంత్రజపం చేస్తే నువ్వు వస్తావో రావో అని, వస్తే ఎలాగుంటావో చూడాలని పిలిచాను. నువ్వు చాలా ముచ్చటగా ముద్దులొలుకుతూ ఉన్నావు. నాతో ఆడుకొంటావా?ఎన్నో ఆటలు నేర్పుతాను. మా అమ్మని, చెల్లాయిని కూడ చూపిస్తాను.”

“ నీకు చెల్లాయి కూడా ఉందా?”

“ అవును, చాల పెంకిది,ఎప్పుడూ అమ్మ ఒళ్లోనే ఉంటుంది. పాలు తాగుతూ ఉంటుంది.”

“అమ్మఒళ్లో పాలు తాగుతుందా? “ విలాసినికి ఆ విషయం, విస్మయం కలిగించింది.

అవును రా!! చూపిస్తాను. “అంటూ ఆమెను తమఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలుని తల్లి,పాపాయిని చేతుల్లోకి తీసుకొని, గట్టిగా గుండెలకి హత్తుకొని, తన కంచుకాన్ని వదులు చేసి, చనుబాలు త్రాగిస్తోంది. ఆ శిశువు తన చిట్టి చేతులతో తన తల్లి స్తనాలను పట్టుకొని, అరమోడ్పు కనులతో తృప్తిగా ఫాలు త్రాగుతోంది. ఆ మాతృమూర్తి కూడ ఫిల్లకు ఫాలిస్తూ, తన్మయత్వంతో కనులు మూసుకొని ఆనందాన్ని అనిభవిస్తోంది. ఆ మాతా శిశువుల అనుభూతి ఎలాంటిదో విలాసినికి తెలిసి పోయింది.

బాలుడు ఆమెను తల్లికి ఫరిచయం చేయబోయాడు. విలాసిని వారింఛింది, “నేను నీకు మాత్రమే కనిపిస్తాను. ఇంకెవరికీ కనిఫించను, “ అంటూ.
“ ఎందుకని??”
“ నువ్వుఒక్కడివే నన్ను ధ్యానించావు గనుక!!”
“అయితే ఫద! మనమిద్దరం ఆడుకొందాం.”
“ అలాగే! ఈ ఒక్క రోజే నీతో ఆటలాడుతాను. రేఫటి నుంచి, మా రాజుగారి భవనానికి వెళ్లిపోవాలి”.
మరి రావా??”
“ రాను, రాలేను. నువ్వు పెరిగి బాగా పెద్దవాడివి అయేంతవరకు, నా మంత్రమే కాదు, ఇంకే మంత్రమూ జపించకు. పెద్దయ్యాక వివేకంతో నిర్ణయం తీసుకో.””
***********************************
“విలాసినీ!! ఎందుకలా ఉన్నావు?” తనంత తానుగా కౌగిలిలోనికి తీసికొన్నా స్ఫందించని, ఆమెని చూసి అడిగాడు నలకుబేరుడు.
“ స్వామీ!! మానవకాంతలు ఎంత పుణ్యవంతులు!! స్త్రీ వివిధ దశలలో, శిశువుగా, బాలగా,, షౌడశిగా, పత్నిగా, ఫ్రౌఢగా, మాతగా శృంగార రసానుభూతులను ఫొందే భాగ్యము వారికే కదా సొంతం!! నిత్య యవ్వనవతులైన నా వంటి వారికి ఆ అనుభవం ఎలా లభిస్తుంది!? “ అంది విలాసిని, భూలోకంలోని తన అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ.
నలకుబేరునికి కోపం వచ్చింది, ““ఛీ!! మూర్ఖురాలా!! జనన మరణాలు, జరా రుగ్మతలు గల జాతితో యక్షుల న్యూనాధిక్యాలు పోల్చి మన జాతికి తలవంపులు తెచ్చావు. నీవు ఆ భూలోకంలోనే స్థావరంగా జన్మించు.. నీకు మతి ఫోగొట్టిన ఆ మానవుల దురాగతాలకు బలి అయి నీకు జ్ఞానోదయమయ్యక తిరిగి యక్షలోకానికి మరలి రా!!” అంటూ ఆమెను శఫించాడు.
శాపమిఛ్చిన తన మనోభవుని ప్రార్థించ నిచ్చగించక విలాసిని తన ఆరాధ్య దైవమైన విరూఫాక్షుణ్ని శరణు వేడింది. శివుడామెను నారికేళ వృక్షంగా జన్మనెత్తమని, తన కెంతో ప్రియమైన ఆ వృక్ష ఫలాన్ని మానవులు తనకి నివేదన చేసేందుకు బలి చేస్తారని ఆ విధంగా ఆమె త్వరలోనే విముక్తురాలు కాగలధని అనుగ్రహించాడు.
ఆ విధంగా విలాసిని ‘ నారీ-కేళికి’ స్ఫందించి “నారికేళంగా” జన్మ నెత్తింది.
“నారికేళంగా” శివునికి సమర్ఫింఫబడి విముక్తురాలయింది.
*****************************************

Comments

  1. మొత్తానికి తాంత్రిక విద్యా విధానాన్ని కథా రూపంలో బాగా వివరించారు.

    ReplyDelete
  2. నమస్కారం!దుర్గేశ్వర రావు గారూ!మీకామెంట్ నాకు చాల ఉత్సాహాన్ని ఇచ్చింది.ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Sridaher garu i want to translate this story in to english. give me permission.

    ReplyDelete
    Replies
    1. శీ గణేష్ గారికి, నమస్కరించి వ్రాయునది,
      మీరు ఎంతో అభిమానంతో అడిగాక నాకు అభ్యంతరం ఎందుకు ఉంటుంది ? తప్పకుండా అనువదించండి. బహుశా మీ పేరు నేను స్వాతిలో చూశానేమో ! అదే విధంగా నాబ్లాగులో పాతా పోస్టులు ,‘కదళి’. ఖర్జూరం’ కథలు కూడా చదవించండి. పై కథలన్నీ కలగలపి వ్రాసిన కదంబం , చిలక రథంలో సరదా షికారు (౮ భాగాలు) కూడా చదవండి. ఆ తరువాత ఏది అనువదించాలో నిర్ణయించుకోండీ. --- ఎ.శ్రీధర్

      Delete
  4. Sridhar garu me too want to translate this story into Tamil. Glad to have your permission :)

    Then may I know how to write in Telugu font. How to download telugu font

    ReplyDelete
    Replies
    1. I am glad to give permission for translation in TAMIL. baraha free telugu typing software will help you in this matter. You can type in Tamil also with baraha ! THANKS for asking ---- Sridhar.A

      Delete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద