Skip to main content

సర్ణాంధ్రలో సంక్రాంతి --- ఒక ప్రహసనం

స్వర్ణాంధ్రలో సంక్రాంతి

స్వర్ణాంధ్ర అంటే వర్తమాన స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాదు. వర్తమాన స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఎంత నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉందో అందరికీ తెలుసు. నేను చెప్పే స్వర్ణయుగం 500 సంవత్సరాల క్రిందట అంటే 1510 లో శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలనకి వచ్చినప్పటి కాలంలో సంక్రాంతి జరుపుకొన్న, ఒక ఊర్లో పిల్లల గురించి. ఆ పిల్లల విషయం నీ కెలా తెలుసు అని అడగకండి. ఎందుకంటే ఇది కలలో చూసిన కథనం, కాకపోతే కల్పితం. ఇంకా ఎక్కువగా నిలదీస్తే మిమ్మల్ని నవ్వించాలని, మీతో సరదాగా సంక్రాంతి సంబరాలని పంచుకోవాలని చేసిన ప్రయత్నం. మీరు మెచ్చుకొన్నా, నొచ్చుకొన్నా, తిట్టినా, దీవించినా, దేనికైనా సిద్ధం!


ఒక ఊఁర్లో తొమ్మదిమంది పిల్లలు ఆడుకోవడానికి ఆరు బయటికెళ్లారు. వాళ్లలో ఆడా-మగా ఇద్దరూ ఉన్నారు. ‘ భువన-విజయం’ ఆట ఆడాలని అనుకొన్నారు. ‘భువన విజయం అంటే శ్రీ కృష్ణదేవరాయల సభా భవనం. తన ఆస్థానంలోని అష్టదిగ్గజాలతో రాయలవారు సాహిత్య చర్చలు చేసే స్థలం.


ఇంకేముంది, వాళ్లలో చిన్నదే అయినా చురుకైనది, పొడగైనది అయిన అమ్మాయి శ్రీ క్రష్ణదేవ రాయల వేషం కట్టింది. ఆమె కోసం ఒక ఎత్తైన బండరాయి తెచ్చి సింహాసనంలాగ అమర్చారు, తక్కిన పిల్లలు. ఆ రాయికి కుడి-ఎడమ వరసలలో నాలుగేసి రాళ్లని అష్ట దిగ్గజాలకోసం అమర్చారు. కుడి వరసలోని మొదటి రాయి మీద అల్లసాని పెద్దనగా ఒక అబ్బాయి, ఎడమ వరుసలోని తొలి రాయి మీద ధూర్జటిగా ఒక అమ్మాయి, పెద్దన ప్రక్కగా ముక్కుతిమ్మనగా ఒక అబ్బాయి, ధూర్జటి ప్రక్కన పింగళి సూరనగా ఒక అమ్మాయి కూర్చొన్నారు. ముక్కు తిమ్మన్న ప్రక్కన రామరాజ భూషణుడిగా ఒక అబ్బాయి, అతని ప్రక్కన అయ్యల రాజు రామ భద్రునిగా ఒక అమ్మాయి, వాళ్లకి ఎదురుగా, మల్లయ్య గారి మాదన్నగాఒక అబ్బాయి, చివరికి తెనాలి రామునిగా ఒక అమ్మాయి ఆటాడేందుకు సిద్దమై కొలువు తీరారు.


“ భువన విజయం సభా కార్యక్తమం మొదలు పెట్టండి.” శ్రీ కృష్ణదేవరాయలు ఆనతి అయింది.


దిగ్గజాలు ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. ఎలా మొదలు పెట్టాలో తెలియక, చివరికి తెనాలి రామలింగని వైపు చూసారందరూ, ‘ నువ్వే ఏదో ఒకటి చెయ్యి’ అన్నట్లు. తెనాలి రామలింగ కవి లేచి నిలబడి, “ ప్రభూ !! ఇంతకు ముందు జరిగిన సభా కార్యక్రమాలలో వరుసగా దిగ్గజాల వంతు వచ్చి నాతో పూర్తి అయింది. ..ఈ రోజు మీ తోనే మొదలు పెట్టడం భావ్యం !” ఆన్నాడు. బంతి వచ్చి తన ఒడిలోనే పడేసరికి రాయలవారికి చెమట పట్టింది. ఏం చెయ్యాలో తెలియక, “ అటులనా, రామకృష్ణ కవీ! అయిన నేనొక సమస్య నిచ్చెదను. పూరించెదరు గాక ! “ అని కాసేపు ఆలోచించి, ఆ రోజు పెరటిలో తన అక్కా-బావల మద్య జరిగిన సంభాషణ గుర్తుకి వచ్చి దానినే సమస్యగా ఇచ్చింది ఆ అమ్మాయి! “ సమస్యని సావధాన చిత్తంతో వినండి. సంక్రాంతి పండగకి అత్తవారింటికి వచ్చిన అల్లుడు, భార్యామణితో ఏకాంత సంభాషణ చేయగోరి, చిట్టచివరికి పెరట్లో ఆమెను సంధించాడు. ఆ చారుకేశి ‘ నాథా! నా కోసం మామిడి పిందెలు తెచ్చి ఇస్తేనే నేను మీతో మాట్లాడేది,’ అని షరతు పెట్టింది. అకాలంలో అవి ఎలా దొరుకుతాయి ప్రియే! అని బ్రతిమలాడినా లాభం లేక పోయింది. ఆ అల్లుని సమస్య మీ కథా నాయకులకి ఎదురయితే వాళ్లేం చేస్తారో చెప్పి చిక్కుముడి విప్పండి.


పెద్దనామాత్యుడు లేచి, ‘ ప్రభూ! ఇదే సమస్య నా ప్రవరాఖ్యునికి ఏర్పడితే అతడు వెంటనే సిధ్దుని దర్శించి తన సమస్యని విన్నవించుకొంటాడు. సిద్ధుడు ఎన్నెన్నో ప్రదేశాలు చూసిన వాడవడంవల్ల, హేమంత శిశిరాలు లేక కేవలం గ్రీష్మమే గల ప్రదేశం (ఎడారి లాంటిది ) ఒకటి ఉందనీ అక్కడికి వెళ్లి మామిడి కాయలు తెచ్చుకోమని అంజనం ఇస్తాడు. ప్రవరుడు కాళ్లకి అంజనాన్ని రాసుకొని ఆ ప్రదేశానికి వెళ్లి వాటిని తెచ్చి తన ప్రియభామకి ఇస్తాడు. అని చెప్పి కూర్చొంటాడు.


ధూర్జటి లేచి, “ ఫ్రభూ! నా నాయకుడు శివాలయానికి వెళ్లి, హే ! పరమేశ్వరా! నీవు కంచిలో ఏకామ్రేశ్వరుడిగా పేరు పొందావు నీవు పార్వతిని సంధించిన స్థలం నిత్య వసంతంతో అలరారే మామిడి చెట్టు క్రిందనే కదా, ఆ చెట్టుకాయని నా ప్రియభామ కోసం ప్రసాదించు అని దానిని తన భక్తితో సాధించి తెస్తాడు," అని చెప్పి కూర్చొంటాడు.


పింగళి సూరనకవి లేచి నిలబడి, “ ఫ్రభూ ! నా నాయకుడు సింహవాహనా దేవి అనుగ్రహంతో అష్ట సిద్ధులు పొందిన వాడు కదా, నేరుగా మామిడి చెట్టు దగ్గరకే వెళ్లి, నా ప్రియభామ కోసం ఒక కాయని రాల్చమని ఆ చెట్టునే ఆదేశిస్తాడు. అది రాల్చిన కాయని తీసుకెళ్లి ఇస్తాడు “ అంటాడు.


ముక్కుతిమ్మన లేచి, ‘ ప్రభూ !నా నాయకుడు చతుర సంభాషణా పరుడు. మామిడికాయ అడిగిన ప్రియభామ ఇంగితాన్ని అర్థం చేసుకొన్నవాడై ప్రియే ! మామిడికి, చింతకి రుచిలో తేడా లేదు, నీ జిహ్వకి రెండూ హితకారులే కనుక చింతకాయలు తెచ్చి ఇస్తాను, అవి ఈ అకాలంలో కూడ తిరుపతి కొండ పైన నాలుగు శాఖలతో నిత్య వసంతం గల ఒక చింతచెట్టుకి కాస్తాయి అని నమ్మబలికి వాటిని తెచ్చి ఇస్తాడు.” అని సమస్యని తన నాయకుడైన శ్రీ కృష్నుని పరంగా చెప్పాడు.


రామ భద్ర కవి లేచి, “ ఫ్రభూ ! నా నాయకుడు కూడ చాతుర్యంలో ముక్కుతిమ్మన గారి కన్నయ్యకి ఏ మాత్రం తీసిపోడు. అకాలంలో దొరికే ఫలాల కోసం ఆశ పడక పుష్యమాసంలో లభించే రేగు కాయలతో సరి పెట్టుకోమని ఆమెకి నచ్చజెప్పి ఒప్పిస్తాడు.” అంటాడు.


రామరాజ భూషణుడు లేచి, “ఫ్రభూ ! మూడు మాసములు జాప్యం చేస్తే లభించే మామిడి కాయల కోసం నా నాయకుడు ఇన్ని పాట్లు పడడు. తన నాయికకి రామాయణ, భారత, భాగవత, ఇంకా వసు చరిత్రలు చెప్తూ కాలయాపన చేసి అవి దొరికే సమయం వరకు కాలం గడిపేస్తాడు” అంటాడు.


మల్లయగారి మాదన లేచి, “ ప్రభూ ! నా నాయకుడు కార్తీకం నుండి మాఘం వరకు దొరికే ఉసిరి కాయలు తెచ్చి ఇచ్చి తన పబ్బం గడుపుకొంటాడు” అని చెప్పి కూర్చొంటాడు.


చివరికి తెనాలి రామ కృష్ణుని వంతు వచ్చింది. “ప్రభూ ! నా నాయకుడు పరిభ్రమణలు, మాయలు మంత్రాలు, ప్రత్యామ్నాయాలు, కథలు చెప్తూ కాలయాపనలు చేయడు. మామిడికాయలు ఇంట్లోంచే తెచ్చి ఇస్తాడు. “ అంటాడు.


అందరూ ఆశ్చర్యంతో రామలింగని వైపు చూస్తారు. రాయలవారు అడగనే అడుగుతారు. "ఎలా తేగలవు రామకృష్ణా!” అని.


“ ఏముంది ప్రభూ ! మాఇంటి అటక మీద మా బామ్మ పెట్టిన ‘ఆవకాయ జాడీలో చెయ్యి పెడితే చాలు, కావలసినన్ని దొరుకుతాయి.” అన్నాడు. అంతే ! సభ భంగమయింది. అందరూ రామ కృష్ణుని చుట్టు ముట్టి “ నా కోసం తెచ్చిపెట్టవూ?” అని అభ్యర్థనలు చేస్తారు.


ఇదండీ ! సంక్రాంతి ప్రహసనం ! బ్లాగర్లందరికీ శుభా కాంక్షలు.

Comments

  1. బాగుంది.మీకూ,మీ కుటుంబానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. mavyya garu... bagundi... ending bagundi....

    ReplyDelete
  3. nice one especially the ending.


























    thans for ur valuable comments
    happy pongal to all.

    ReplyDelete
  4. Hi,
    This is Bhagavanulu from Chennai. Just now. Read your Blog. Simply Superb. I felt that after a long time, I read "Mullapudi" mark humorous story. This is also heart touching. Expecting some more from your powerful pen.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద