బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—10
( దృశ్యము 47 )
( వేంకటాచలం దిగువ కపిల తీర్థము )
( మాధవుడు ఆ తీర్థ స్నానం చేసి, బయటికి వచ్చి, కొండకు నమస్కరిస్తాడు)
మాధవ --- ఓ వేంకటాచలమా ! దర్శన మాత్రమున నా పాపములు దహించిన నీ వెంతటి మహిమాన్వితమగు గిరి రాజమవో కదా !! ( పద్యము )
సీ-- శృంగార రాయుని చెలువు మీరిన కొండ / ఫణిరాజ పేరిట పశిడి కొండ
పుష్ప జాజుల, విష్ణు పూజింపగల కొండ / కల్ప వృక్షము లెల్ల గలుగు కొండ
చిలుకలు, కోవెలలును చేరి యాడెడి కొండ / మృగజాతి కండ్లను మెలగు కొండ
ఘోర దురితము లణచు, కోనేర్లు గల కొండ/ ఘనమైన మోక్షంబు గలుగు కొండ
అమర వరులకు నాధారమైన కొండ / ఆళ్వారులకు ప్రత్యక్షమైన కొండ
అలరు జూచిన బ్రహ్మాండమైన కొండ / యేను పొడగంటి శ్రీ వేంకటేశు కొండ.
( అని ఆ కొండను పొగిడి, ఆ తీర్థం ఎగువన ఒక గుహను చూస్తాడు. ఆ గుహలోకి వెళ్తాడు )
( ఆ గుహలో కపిల మహర్షి కూర్చొని ఉంటాడు. మాధవుడు అతనిని చూసి, నమస్కారం చేస్తాడు. ముని కూడ కళ్లు తెరచి మాధవున్ని చూస్తాడు )
కపిల --- నీవు పుండరీక పుత్రుడవు మాధవుడవేనా ?
మాధవ -- అవును మహర్షీ ! ఈ వేంకటాచల ప్రభావము వలన,నా సంచిత పాపములన్నియు దగ్ధమయినవి ! నా తండ్రికి నేను చేసిన అపచారము మాత్రము నన్ను వదిలి పోక, పితృ ఋణము తీరకున్నది ! ఈ క్షేత్రములోని తీర్థములను అందుకే ఆశ్రయించి, కాలం గడుపుతున్నాను.
కపిల --- మాధవా ! నేను కపిలుడను, యీ కొండ మీద నా పేరు మీద నున్న ‘కపిల తీర్థము’ లో స్నానము చేయుట వలన , నీ పితృ ఋణము కూడ నేటితో తీరినది . ఈ జన్మలోనే కాదు, నీవు గత జన్మలో చేసిన ప్రారబ్ధ జనిత పాపములన్నియు, స్వామి పుష్కరిణిలో స్నానమాడినందున పోయినవి ! నీవు పూర్తిగా పునీతుడవైనావు !!
(కపిలముని మాటలతో మాధవుడు పులకితుడవుతాడు )
మాధవ -- కపిల మహర్షీ ! మీరు కద్రుమ ప్రజాపతికి, దేవమాత వలన, సాక్షాత్తు విష్ణు అంశతో పుట్టిన వారని, భృగు మహర్షి భార్యయగు ఖ్యాతికి తమ్ములని విన్నాను ! మీ దర్శనముతో నాకు విష్ణు దర్శనము కూడ అయినది మహర్షీ ! నాకీ జన్మ రాహిత్య మెప్పుడు ? నా భవితవ్యము ఎటుల నుండును !
కపిల --- మాధవా ! నీవు మరు జన్నమున ఆకాశ రాజు అను పేరుతో, పిలువబడి, మహాలక్ష్మి అంశతో అయోనిజగా పుట్టిన పద్మావతికి, తండ్రివై, ఆమెను యీ వేంకటాచలేశ్వరుని కిచ్చి, కన్యాదానము చేసి తరించ గలవు ! నీకీ విషయము తెలియ జేయుటకే నేను దర్శన మిచ్చితిని ! ( అంటూ కపిలుడు అంతర్థాన మవుతాడు )
మాధవ -- ఆహా ! ఏమి నా భాగ్యము ! మరు జన్మమునందు నేను శ్రీ మహావిష్ణువునకు మామగారిని కాగలనా ! ఏమి భాగ్యము !! ఇక యీ జన్మము నాకేల ? ఈ గుహయందే సమాధిని పొంది, జన్మావశేషము గడిపి వేయుదును గాక !!
( మాధవుడు కపిలముని కూర్చొన్న చోటనే, పద్మాసనము వేసుకొని కూర్చొంటాడు )
*********************
( దృశ్యము 48 )
( చోళరాజు సువీరుని భవనము )
( చోళరాజు సువీరుడు, అతని భార్య , కొడుకు సుధర్ముడు, కోడలు మనోరమ ఉంటారు )
( సుధర్ముడు, మనోరమ నవదంపతుల వేషంలో. మెడలో పూల దండలతో ఉంటారు )
సువీరుడు -- కుమారా , సుధర్మా ! పాండ్య రాజును నీ శక్తియుక్తులతో మెప్పించి, అతని గారాల పుత్రిక మనోరమను అర్థాంగిగా చేసుకొని వచ్చిన నిన్ను గాంచి, నా మనము ప్రసన్నత చెందినది !
( మహారాణి కోడలుని దగ్గరకు తీసుకొని , ఆమె నుదుటిని ముద్దాడుతుంది )
రాణి -- కుమారా ! పాండ్యరాజు పుత్రిక పుష్పించిన లత వలె, పేరుకు తగ్గట్లు, మనోహరంగా ఉంది. ఈమెను, ఈమెతో పాటు ----
సువీరుడు --- చోళరాజ్య రమారమను కూడ చేపట్టి, ఏలుకొనెదవు గాక !
సుధర్ముడు -- తండ్రీ ! ఇప్పటి నుండి, ఇబ్బడి భారము నాపై మోపుట, మీకు భావ్యము కాదు !
సువీరుడు -- కుమారా, సుధర్మా ! బుద్ధి కుశలత గల మంత్రులు, శూర వీరులైన సేనానులు నీకు బాసటగా ఉంటారు. నాలో తపము నాచరించ వలెనన్న కోరిక బలీయమైనది ! సరియైన సమయము రాలేదని ఇంత వరకు దానిని అణిచి వేసితిని, ఇక ఆగుట నా వలన కానేరదు !
రాణి -- అవును, కుమారా ! ( అని కోడలు చేయి పట్టుకొని ) మనోరమా ! నీవు మెట్టిన యీ చోళ రాజ్యము, చంద్ర వంశము వారిది. వారి పూర్వీకులు శ్రీకృష్ణ, రుక్మిణీ దేవులకు అత్యంత ప్రీతి పాత్రులైన పాండవులు ! శ్రీ కృష్ణుని అనుంగు సోదరి అయిన సుభద్ర వలె, నీవు నీ భర్తను ప్రేమించి పరిణయ మాడినావు ! నీవు నీ పతి ప్రేమ పూర్వక సపర్యలతో పాటు., అంతఃపుర భాద్యతలు కూడ స్వీకరింపుము !
మనోరమ -- అత్తయ్యగారూ ! పాదాల పారాణితో మీ గడప త్రొక్కాను ! అది ఇంకా ఆరక ముందే, మీరు నన్ను ఒంటరి దాన్ని చేసి ,వెళ్లి పోతాననడం భావ్యం కాదు !
సుధర్ముడు--- అమ్మా ! నా గురించి కాక పోయినా మీ కోడలు ముచ్చట్లు తీర్చుట కైనను, మీరును నాన్నగారును మాకు తోడుగా నుండక తప్పదు.
( సువీరుడు, రాణి ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు )
సువీరుడు--- అటులనే కుమారా ! ఆరు నెలల కాలము నీ కడ గడిపిన పిమ్మట , మేము వానప్రస్థమునకు పోయెదము !
( అని రాజు సువీరుడు రాణితో పాటు వెళ్లిపోతాడు )
సువీరుడు--- మనోరమా ! పితృపాదులు ఎట్టకేలకు ఆరు నెలలపాటు ఉండుటకు అంగీకరించినారు. వారిని మరికొంత కాలము నిలుపుట, --- నీ చేతులలోనే కలదు !
మనోరమ-- ( చేతులు చూసుకొని ) నా చేతుల లోనా , ఎటుల స్వామీ ?
సుధర్ముడు-- చేతులలో అంటే చేతుల్లో కాదు, చేతలలో అని అర్థం !
మనోరమ --- చేతలా ! ఎటువంటి చేతలు ? మీరు చెప్పినట్లయిన తప్పక ఆచరించెదను !
సువీరుడు--- చెప్పమంటావా ప్రియా ! ( నవ్వుతూ ) అవి ప్రణయ చేష్టలు ! వాటిని ‘తూ.చ’ తప్పకుండా, ఆచరించినట్లయితే, మా తల్లి తండ్రులను--- తాతలుగా మార్చి, వారి వాన ప్రస్థమును ఆపగలవు !
మనోరమ --- ( సిగ్గుతో ) పొండి, స్వామీ !
***********************
( దృశ్యము 49 )
( వేంకటాచలం లోని కపిల తీర్థము )
( యువరాజు సుధర్ముడు , వేటాడి వచ్చి, అలసట తీర్చుకోడానికి, కపిల తిర్థం లోని నీరు త్రాగుతూ ఉంటాడు.)
( కపిల తీర్థం పైన ఉన్న కొండ చరియపై, ఒక దొండపాదు ఉంటుంది.)
( ఆ పైనుంచి ఒక భటుడు క్రిందకు దిగుతాడు. యువరాజుకి నమస్కారం చేసి, అతను ముఖం తుడుచుకోడానికి అంగ వస్త్రాన్ని ఇస్తాడు. సుధర్ముడు దానితో ముఖం తుడుచుకొంటాడు )
భటుడు -- యువరాజా ! వేంకటాచలం పైకి వచ్చే యాత్రికులకి, క్రూర మృగ బాధ లేకుండా, మీరీ రోజు, వేటలో , చాల సమర్థతతో, ఎన్నో మృగాలను కడ తేర్చారు !
సుధర్ముడు--- అవును, వేట వినోదం కోసం కాక, ప్రజా రక్షణ కొరకు చేస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది ! యాత్రికులను ఇబ్బంది పెట్టే పులులు, భల్లూకాలు ముగిసినట్లే కదా ?
భటుడు --- యువరాజా ! మీ ప్రచండ పరాక్రమానికి, రణ నీతికి, శత్రు రాజులే భయకంపితులై పారిపోగా, యీ అడవి మృగాలు ఒక లెక్కా ?( ఆగి ) యువరాజా! యీ వేటలో మీరు చాల అలసి పోయారు, కాస్త విశ్రాంతి చాల అవసరం !
సుధర్ముడు--- ఈ కపిల తీర్థంలోని నీరు , త్రాగినంత మాత్రమున, సేద తీర్చు గుణము కలది ! నా కిప్పుడు అంతగా అలసట అనిపించుట లేదు !
భటుడు -- యువరాజా ! కొండ చరియపైన దొండ పందిరి దగ్గర ఎంతో చల్లగా, ప్రశాంతంగా ఉంది ! మీకు అక్కడ విశ్రమించడానికి తగిన ఏర్పాట్లు చేసాను.
( సుధర్ముడు పైకి వెళ్లి, అక్కడనుంచి కొండ యొక్క రమణీయ ప్రదేశాలను చూస్తాడు )
సుధర్మడు--- నీ వన్నది నిజమే! ఇచట కాస్త విశ్రమించి తిరిగి బయలు దేరుట మంచిది ! నాకు ఏకాంతము కావలెను ! నీవు దూరమున నుండి నేను పిలుచునంత వరకు, రాక వేచి యుండుము !
భటుడు ---అటులనే ప్రభూ ! మీ విల్లంబులను, ఖడ్గమును విశ్రామ స్థలమందే ఉంచినాడను .
సుధర్ముడు--- సరి , సరి ! నీవు సెలవు తీసుకొనుము.
( భటుడు నమస్కరించి వెళ్లిపోతాడు. రాజు అక్కడే నిలబడి, ప్రకృతి సౌందర్యం చూస్తూ ఉంటాడు.)
( ఒక పాము ప్రవేశిస్తుంది ! సుధర్ముడు దానిని చూస్తాడు. ఆ పాము నుంచి రక్షణ ప్రయత్నం చేస్తూ ఉండగానే, ఆ పాము చక్కని నాగకన్యగా మారిపోతుంది. )
( సుధర్ముడు ఆమె చక్కదనాన్ని చూసి మైమరుస్తాడు ! ఆ కన్యక కూడ లేచి నిలబడి, తల వంచుకొని, అతనిని క్రీగంటి చూపులతో చూస్తూ మోహ పరవశురా లవుతుంది.)
సుధర్ముడు--- సుందరీ ! ఎవరు నీవు ?
నాగకన్య-- రాజా ! నేను నాగ కన్యను ! ధనంజయుడనే నాగరాజు నా తండ్రి.
సుధర్ముడు—సుందరీ ! నీ సౌందర్యము నా మనము నాకట్టుకొన్నది ! -- సుందరియగు కన్య వీర పురుషుని సొత్తు, అనునది ఆర్యోక్తి !!
నాగకన్య-- మీరనునది ఆర్యోక్తి కాదు, చతురోక్తి ! సుక్షత్రియ వంశజుడైన వీర పురుషుడే నా పతి కాగలడని నా తండ్రి చెప్పినాడు !
సుధర్ముడు-- సుందరీ ! నేను చంద్రవంశపు మూల పురుషులైన పాండవుల వంశజుడను ! మా పూర్వీకుల కీర్తి ప్రతిష్టలు జగద్విదితములు !! మీ పితృపాదులన్నట్లు , నేను వీర పురుషుడను కూడ ! నీకు సమ్మతియైన నిన్ను యీ క్షణమే గాంధర్వ వివాహము చేసుకొనెదను !
నాగకన్య-- ఆర్యా ! మీరు సుక్షత్రియులే గనుక వివాహ ప్రస్తావన తెచ్చినారు గనుక, నాదొక విన్నపము !
సుధర్ముడు-- ఏమది సుందరీ ?
నాగకన్య-- మీతో వివాహము నాకు సమ్మతమే కాని--- నా సంతానమునకే రాజ్యార్హత కలుగ వలెను !
సుధర్ముడు-- సుందరీ ! నాకు పాండ్యరాజు పుత్రికయగు మనోరమా దేవియందు ‘ ఆకాశరాజు’ అను పేర ఒక కుమారుడు కలడు ! జ్యేష్ట పుత్రుడు ఉండగా, కనిష్ఠునకు రాజ్యము నిచ్చుట ధర్మ విరుద్ధము గాన, నే నటుల చేయజాలను !!
నాగకన్య-- అటులయిన రాజ్యమును చెరి సగము పంచి ఈయవలెను !
సుధర్ముడు--- సుందరీ ! నీవు అడిగినది ‘కలియుగ ధర్మము’ ప్రకారము న్యాయమే గనుక అటులనే చేసెదను.
నాగకన్య-- ఆర్యా ! -- అటులయిన-- నేను , మీ పత్ని నగుటకు--- ( అని రెండు చేతుల లోను ముఖాన్ని దాచుకొంటుంది )
సుధర్ముడు-- ( ఆమె చేతులను విడిపించి -- ) సుందరీ ! నీ సమ్మతము తెలిసినది కనుక నీ ముఖ సందర్శనము నాకు దూరము చేయకుము ! మరి యేవియైన కోరికలున్నచో సత్వరము తెలియ జేయుము.
నాగకన్య-- ఆర్యా ! నాగకన్యను గనుక, నేను మీ అంతఃపురమున నుండజాలను ! నా ముఖము చూడ నిచ్చగించు నపుడెల్ల, మీరే ఇటకు రావలెను !
సుధర్ముడు--- అటులనే కానిమ్ము !
నాగకన్య-- నాకు పుత్ర సంతానమే కలదని దైవజ్ఞులు చెప్పినారు ! కనుక నేను నా కుమారుని నా కడనే పెంచి, పెద్ద చేసి యుక్త వయసు వచ్చిన వెనుక, మీ కడకు పంపెదను !
సుధర్ముడు-- సుందరీ ! నా కుమారుని మోము శైశవ ప్రాయము నుండి, చూడక నే నతనిని, పోల్చుకొనుట ఎట్లు ?
నాగకన్య-- ప్రభూ ! మీరు వివాహమునకు ముందే పుత్రోత్సాహము ప్రకటించుచున్నారు !!
సుధర్ముడు-- అవునవును ! ప్రస్తుత కర్తవ్యమదియే కదా !
( అని దొండ పందిరి నుండి, రెండు దొండ తీగలు లాగి, వాటిని మాలలుగా చేస్తాడు. ఒక మాలను నాగకన్యకకు ఇచ్చి, తానొకటి తీసుకొంటాడు )
సుధర్ముడు-- సుందరీ ! క్షేత్ర రాజమైన ఈ వేంకటాచలము సాక్షిగా, పరమ పావనము, పాపనాశనము , తీర్థరాజమైన యీ ‘కపిలతీర్థము’ సాక్షిగా నేను , నిన్ను గాంధర్వ విధిని, నా పత్నిగా స్వీకరించుటకు, వివాహమాడుచున్నాను !!!
( అని ఆమెకి ఎదురుగా నిలబడి, తన తల వంచుతాడు )
నాగకన్య-- స్వామీ ! త్రికరణ శుద్ధుగా మీకు అర్థాంగి నగు భాగ్యము కొరకు, నేను కూడ మిమ్ములను గాంధర్వ విధిని వివాహమాడుచున్నాను !
( అని తన చేతిలోని మాలను అతని మెడలో వేస్తుంది . మళ్లీ వారు దండలు మార్చుకొంటారు )
( ఇద్దరూ దొండ తీగల మాలలను వేసుకొని, ప్రక్క ప్రక్కగా నిలబడతారు ! సుధర్ముడు ఆమె ఎడమ చేతిని , తన కుడి చేతిలోకి తీసుకొంటాడు )
నాగకన్య-- స్వామీ ! ఈ దొండ తీగల సంబంధము చాల అపురూపముగా నున్నది !
సుధర్ముడు-- అవును సుందరీ ! ఇది మనకు మాత్రమే పరిమితము !!
నాగకన్య-- ఏమంటిరి స్వామీ ! ఇది మనకు మాత్రమే పరిమితమా ?
సుధర్ముడు-- అవును సుందరీ ! దొండ తీగల మాలలతో, మనకు గాక మరెవరికి కళ్యాణము జరుగ గలదు ?
నాగకన్య-- అటులయిన, మీరు మీ పుత్రుని పోల్చుకొనుట సులభమే కాగలదు ! వాని నడుముకు ఈ దొండ తీగలను చుట్టి, వానిని మీ కడకు పంపగలను !
సుధర్ముడు-- చక్కని ఆలోచన సుందరీ ! ఇదుగో ఈ రాజముద్రికను కూడ నీవు వానికి ఇచ్చి పంపుము !
( అని తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆమెకు తొడుగుతాడు )
నాగకన్య--అటులనే స్వామీ ! రండు మృగయా వినోదము చేత మీరు చాల అలసి ఉన్నారు, విశ్రమించెదరు గాక !
సుధర్ముడు-- విశ్రమించుట , ఎచట సుందరీ, నీ బాహు బంధములోనా ?
నాగకన్య-- బాహుబంధములో కాదు, నాగబంధములో---!!!
( అని కిల కిలా నవ్వుతుంది. సుధర్ముడు కూడ ఆమెతో పాటు నవ్వుతాడు. ఇద్దరూ ఆ దొండ పందిరి క్రిందకు దారి తీస్తారు )
******************

mee prayatnam abhinamdaneeyamu
ReplyDelete