Skip to main content

బాలాజీ అర్చావతార విశే ష దృశ్యార్చన----- 2

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --2

( దృశ్యము--- 3 )

(వైకుంఠానికి బహిద్వారము. ‘జయ_ విజయు’లనే కాపలా భటులు కాపలా కాస్తూ ఉంటారు.)

( పాత్రలు--- జయ, విజయులు, వాయువు )

( వాయువు ప్రవేశానికి సంకేతంగా గాలి బలంగా వీస్తుంది. జయ,విజయులు ఆ వేగానికి ఇటూ అటూ ఒరుగుతారు. దావారం తలుపులు ఇంకా తేలికైన వస్తువులు కంపిస్తాయి. కాసేపటికి వాయువు మానవ రూపంలో ప్రవేశిస్తాడు )

వాయువు ------ జయ- విజయులారా ! నేను వాయువును !!

జయుడు ----- ఆర్యా ! మీ రాకయే మీ పరిచయాన్ని-----

విజయుడు ---- డంకా మీద దెబ్బలా చాటి చెప్పింది.

వాయువు ----- ( సంతోషంతో మీసం మెలివేసి, నవ్వుతూ ) మేము ప్రభువుల వారి దర్శనానికి విచ్చేసినారము. మా రాకను తెలియజేసి----

జయుడు --- ఆర్యా ! క్షమించండి, మేము ఈ వీధి వాకిలికి కాపలా దార్లము.

విజయుడు ---- లోపలి వాకిలికి, ఆదిశేషుడు స్వయముగా కాపలాకు నియమింప బడినాఢు !

జయుడు ---- అనంతుడైన ఆ ఆదిశేషుని కాదని-----

విజయుఢు ---- అణువు కూడ శ్రీవారి దర్శనానికి పోజాలరు.

ఇద్దరూ ---- కావున , తమరు తిరుగుదారి పట్టి, సమయాంతరమున విచ్చేసిన బాగుండును

వాయువు ---- హు ! కాపలాదార్లు ఎవరయితేనేం గాక !! మేము అశేష బల సంపన్నుల మయిన వాయు దేవులము !! అణువు కన్న సూక్ష్మము , మేరువు కన్న ఉన్నతము, అయిన రూపము పోందగల వారము. మమ్ములను--(నవ్వి)- ఎవరు అడ్డగించ గలరు ?

విజయుడు --- అది కాదు వాయుదేవా !—

జయుడు ---- మా మాట కాస్త ఆలకించండి---

వాయువు ---- ఏది కాదో, ఏది అవునో ఆదిశేషునితోనే తేల్చుకొనెదము ! మీరు తొలగి దారి ఇవ్వండి.

ఇద్దరూ ---- చిత్తం మహానుభావా ! అటులనే కానివ్వండి.

( జయ- విజయు;లు తొలగి దారి ఇస్తారు. వాయువు లోపలికి వెళ్తాడు. )

********************

( దృశ్యము-- 4 )

( వైకుంఠానికి లోపలి ద్వారము. ఆదిశేషుడు ద్వారం ముందు తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటాడు)

( పాత్రలు --- వాయువు, ఆదిశేషుడు )

( ప్రవేశం--- వాయువు )

వాయువు ---- ఆదిశేషా ! నేను వాయువును ! అయినను, నీకీ కాపలా కాయు దుర్గతి ఏమి?

ఆదిశేష ---- ప్రభువులు, ఏకాంతాన్ని అభిలషించి నన్ను కాపలాకి పంపారు. ఇక్కడ దుర్గతికి తావు లేదు వాయుదేవా ! ఏల ననగా ఇది వైకుంఠము ! గతులు తప్పిన వారికి సద్గతి కలిగించు దివ్య థామము ! నేను చేయునది స్వామి కార్యము !

వాయువు ---- అటులనా ! సరి, సరి ! నే నొక కార్యవిశేషము చేత, శ్రీవారి దర్శనమునకు వచ్చితిని. (నవ్వి) నీది స్వామి కార్యము, నాది స్వకార్యము !!

ఆదిశేష ----- వాయుదేవా ! దర్శనమునకు ఇది సమయము కాదు. ప్రభువులు ఏకాంతము కోరి, నన్ను సైతము బయటికి పంపి కాపలా కాయమన్నారు ! అర్థం చేసుకొని మరలి పోవుట మంచిది !

వాయువు ---- మరలిపోవుట, తిరుగుదారి పట్టుట, ఆగిపోవుట ---- వాయువు సహజ లక్షణములు కావని నీకు తెలియదా ఆదిశేషా ?

ఆదిశేష----- ఆగిపోవుట , తిరుగుదారి పట్టుట నీకు సహజ గుణము కాదేని, ప్రక్కదారి పట్టుము ! లేకున్న పాతాళమునకు పొమ్ము ! అంతియే గాని లోనికి పోవుట మానుకొనుము.

వాయువు ---- పుష్ప సుకుమారులైన శ్రీవారి భార్యలకు, కాంతునితో ఏకాంతమునకు, నిముష - నిముషము విషముతో బుసలు కొట్టే నీవు అక్కర లేదేమో గాని, మేము కాకపోము !! -- నందన వన కుసుమ సౌరభాలను లలిత లలితముగా తరలించి, తోడ్కొని పోయి, వారిని ఆహ్లాద పరిచెదను, నన్ను పోనిమ్ము !

ఆదిశేష ----- వాయుదేవా ! ఎవరి సహజ గుణములు, ఎవరి సామర్థ్యములు వారివి ! ఇప్పుడా ప్రసక్తి దేనికి ? శ్రీవారి ఏకాంతమునకు భంగము కలగ కూడదనేది వారి ఆజ్ఞ !!

వాయువు ---- హు ! ఆజ్ఞ అట ఆజ్ఞ !! విష పురుగువయిన నిన్ను బయటికి పంపినంత మాత్రమున, మరి వేరెవరినీ లోనికి పంపననుట--- కడుంగడు దుస్సాహసము !!

ఆదిశేష ---- ఏమంటివి ? నేను విషపురుగునా !? కావచ్చు, పురుగునే కావచ్చు ! కాని నా కొక భౌతిక కాయమనునది ఉన్నది !! అశరీరుడవైన నీకు నాతో పోలిక ఏమి ?

వాయువు ---- ఏమంటివి ? నేను అశరీరుడనా ?! శత సహస్ర శరీరధారుల కన్న మిన్నయైన బల సంపద కల వాడను !! సంకల్పమాత్ర శరీరుడను !! నా తోనా నీ ప్రగల్భములు ?!

ఆదిశేష ---- ఏమి ? సంకల్ప మాత్ర శరీరుడవా ? సువర్లోకమున స్వేచ్ఛా శరీరము పొందు వరము ఎవరికి లేదు ? ఇందులో నీ గొప్పతన మేమున్నది ?

వాయువు ( కోపముతో ) ఏయ్ ! పురుగా !! నన్ను లోనికి పోనిస్తావా లేదా ?

ఆదిశేష ---- ఏయ్ ! నలుసా ! వీలు కాదని పలుమార్లు పలికితిని, పో ! పొమ్ము !

వాయువు ---- ఓరి ! ఏమీ నీ అహంకారము !! నేను నలుసునా ? సరి ! నా దెబ్బ రుచి చూచిన వెనుక, ఆ మాట అనగలుగుదువేమ ! చూచెదను గాక ! ( అంటూ తొడ చరిచి, ఆదిశేషునితో యుద్ధాన్ని ప్రకటిస్తాడు )

ఆదిశేష ---- అటులనే గానిమ్ము ! నీ బల సామర్థ్యములు ఎంత క్షుద్రములో బయట పెట్ఠెదను గాక ! (అంటూ బుసలు కొడతాఢు )

( ఇరువురికీ బాహా బాహి యుద్ధం మొదలవుతుంది. వాయువు ప్రభంజనానికి, ఆదిశేషుని బుసలకి వైకుంఠం కంపిస్తుంది )

********************

( దృశ్యము -- 5 )

( పాత్రలు--- శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి, భుదేవి )

( వైకుంఠము. శ్రీమహావిష్ణువు తన దేవేరులతో ఉంటాడు. వారి ఏకాంతానికి వైకుంఠం లోని కలకలం అంతరాయం కలిగిస్తుంది )

విష్ణు ---- దేవీ ! ఏమి యీ వైపరీత్యము !

శ్రీదేవి ---- ఆనందాద్రి దగ్గరి ప్రకృతి వైపరీత్యము వైకుంఠ ద్వారానికి వచ్చినట్లుంది. ప్రభూ !

భూదేవి ----- స్వామీ ! ఆదిశేషునికి, వాయువుకు నడుమ యుద్ధము వాటిల్లినది.

విష్ణు ----- వైకుంఠ ద్వారము ముందరా వారి యుద్ధమా ? సత్వరము ఈ సమస్య పరిష్కరించెదము గాక ( శ్రీ మహావిష్ణువు లేచి బయటికి దారి తీస్తాడు )

**********************

( దృశ్యము 6---- వైకుంఠము లోపలి ద్వారము. వాయువు ఆదిశేషుల యుద్ధం సాగుతూ ఉంటుంది)

( పాత్రలు--- వాయువు, ఆదిశేషుడు, శ్రీ మహవిష్ణువు )

( శ్రీ మహావిష్ణువు ప్రవేశంతో ఇద్దరూ పోట్లాట ఆపుతారు. ఆదిశేషుడు ఉలికి పడుతాడు )

ఆదిశేష ------ ప్రభూ ! మీ ఏకాంతము, భంగమయినందుకు, యీ దాసుడు చింతిస్తున్నాడు. నన్ను క్షమించండి.

వాయువు ----- ప్రభూ ! ఇతడు నా ఆశయము, నా శక్తి సామర్థ్యములను గుర్తించక నన్నెదరించి పోరుకు పురి గొల్పినాడు. అయినను, నా వలన మీ ఏకాంతమునకు భంగము కలిగినందులకు నన్ను క్షమించండి.

విష్ణు ---- భంగమయిన దేదో అయినది ! మీ ఇరువురి బాలబలములు తేల్చుకొనుటకు, ఇది సరియైన స్థలము కాదు.

వాయువు ----- సరియైన స్థలము చూపి నన్ను అనుగ్రహింపుడు.

ఆదిశేష --- నిజము ప్రభూ ! మీ భవన ప్రాంగణమందు పోరుకు తలబడుట పొరపాటే అయినది. సరియైన స్థలమును చూపి అనుగ్రహించండి.

విష్ణు ----- ఓహో ! మీరిరువురు పోరాటానికే సంకల్పించినారన్న మాట ! అయితే వినండి, భూలోకంలో ఆనందాద్రి మీ పోరాటానికి సరియైన రంగస్థలము !

వాయువు --- (సంతోషంతో ) ప్రభూ ! సరియైన స్థలమును చూపి నన్ను కృతజ్ఞున్ని చేసారు, ఆ స్థలము నాకు చిర పరిచితము ! నా బలము అక్కడ ద్విగుణీకృతమగుట నిక్కము !

ఆదిశేష ------ వాయుదేవా ! నీ బలము శత సహస్రములైనను, దానిని నిలువరించు సామర్థ్యము గల అనంతుడను నేను ! ( విష్ణువుతో ) ప్రభూ ! మీ ఆజ్ఞ అయినచో నే నీతని పీచమడగించ గలను !

విష్ణు----- తథాస్తు ! అటులనే కానిండు.---- ఆదిశేషా ! నీవు నా క్రీడాద్రి అయిన ఆనందాద్రిని నీ విరాట్రూపముతో చుట్టుకొని యుండుము ! వాయుదేవుడు ఆ పర్వతముపై నీ పట్టును సడలించి, ఎగుర వేయగలిగిన యెడల-------

వాయువు ----- అట్లు చేయునెడల, నేను జయించినట్లు, అంతేనా ప్రభూ ?

విష్ణు ---- అవును ఓడినవారు నా ఆజ్ఞను పాటించక తప్పదు.

ఆదిశేష ---- ప్రభూ ! ఈ దాసునకు మీ ఆజ్ఞ పాటించుటకు, గెలుపు ఓటము;లతో సంబంధము లేదు.

విష్ణు --- తథాస్తు !!

*************************

( దృశ్యము—7 )

( భూలోకంలోని ఆనందాద్రి రణ రంగం. ఆదిశేషుడు ఆనందాద్రిని చుట్టుకొని పడుకొని ఉంటాడు. వాయువు అక్కడికి చేరుకొంటాడు )

( ఆదిశేషుడు, వాయువు )

( ప్రవేశం-- వాయువు )

వాయువు ----- ( తనలో ) ఏమిది ! నా కన్న ముందుగా ఇతనీ చోటికి ఎలా రాగలిగాడు ! సరి, సరి ! వేగ మెక్కువ అయినంత మాత్రమున బలమెక్కువ కాదు గద !!! ( ప్రకాశంగా ) ఓరీ ! అనంతా ! నేను ఆయువు పట్టునైన వాయువును. నిమేష మాత్రమున నీ పట్టు సడలించి యీ గిరి రాజమును ఎగర వేయ గలను.

ఆదిశేషు ---- వాయువా ! నేను నీ ఆయువును ! ప్రగల్భములు వీడి పోరుకు సిద్ధము కమ్ము !

( ఇద్దరికీ పోట్లాట ప్రారంభ మవుతుంది )

***********************

( దృశ్యము—8 )

( బ్రహ్మలోకం-- కొంతమంది ఋషులు, దేవతులు, బ్రహ్మదేవును దగ్గరకు వస్తారు. )

దేవతలు ---- బ్రహ్మదేవా ! నమో నమః !!

ఋషులు ---- సృష్టికర్తా ! నమో నమః !!

బ్రహ్మ ---- సురులారా ! ఋషులారా !! మీ రాక మాకు సంతోష దాయకము. వచ్చిన కారణము ---

1 దేవత --- విధాతా ! మీ సృష్టికే వైపరీత్యము సంభవించే సంఘటన భూమి మీద జరుగుతోంది.

1 ఋషి --- అవును పద్మసంభవా ! పెద్ద ప్రమాదం వాటిల్లనుంది.

బ్రహ్మ --- మహా మహితాత్ములారా !! విషయము విస్తారముగా సెలవీయుడు.

2 దేవత --- ఆనందాద్రి దగ్గర-----

2 ఋషి ---- ఆదిశేషునకు, వాయువునకు తీవ్ర పోరాటము జరుగుచున్నది.

3 దేవత ---- ఆ పోరుకు జగత్సర్వమూ ----

3 ఋషి ---- తల్లడిల్లిపోతుంది----

బ్రహ్మ ----- అటులనా ! రండు, వారి పోరాటమును శాంతింప చేసెదను గాక !

( బ్రహ్మ , దేవతలు ఋషులు నిష్క్రమిస్తారు )

*******************

( దృశ్యము – 9 )

( భూలోకంలోని ఆనందాద్రి. బ్రహ్మ, దేవతలు, ఋషులు వస్తారు )

( ఆదిశేషు, వాయువుల పోరాటం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. )

( పాత్రలు---బ్రహ్మ, దేవతలు, ఋషుల గుంపు ఇంకా ఆదిశేషుడు, వాయువు )

బ్రహ్మ ------ వాయుదేవా ! ఈ పోరాటం ఆపండి. యీ ప్రాంతం లోని అలజడిని ఆపండి.

వాయువు --- ( నమస్కరించి ) బ్రహ్మ దేవా ! మీకు నా వందనములు ! మీ రెంత చెప్పినను నే నీ పోరాటమును ఆపజాలను.

బ్రహ్మ ---- ( ఆదిశేషునితో ) అనంతా ! యీ పోరాటానికి అంతే లేదా ?

ఆదిశేషు ---- బ్రహ్మదేవా ! నా స్వామికి పుత్రులైన మీ ఆజ్ఞ నాకు శిరోధార్యమే !-- అయినను నేను నా ఓటమిని అంగీకరించ జాలను.--- వాయువు ఆపినచో, నేనును ఆపగలను.

బ్రహ్మ ---- సరి, సరి ! ఈ తగువు ఇంతటితో తీరునట్లు లేదు ! దేవతలారా , ఋషి సత్తములారా !! రండు, కైలాసపతి కడ కేగి విన్నవించెదము గాక !!!

( బ్రహ్మ , దేవతలు, ఋషులు నిష్క్రమిస్తారు )

*********************

Comments

  1. I am Dr. Rajasekhar from Telugu wikipedia. Can we talk about the Balaji play, which you have uploaded to our site. My mobile no. 9246376622.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద