బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన –5
( దృశ్యము----- 13 )
( బ్రహ్మ లోకం. బ్రహ్మ ఒక ఆసనం మీద కూర్చొని ఉంటాడు. ప్రక్కనే మరొక ఆసనం ఖాళీగా ఉంటుంది.)
( కొంత మంది ఋషులు అతనికి ఎదురుగా కూర్చొని ఉంటారు. బ్రహ్మ వారితో శాస్త్ర చర్చ చేస్తూ ఉంటాడు )
1 ఋషి ------ బ్రహ్మ దేవా ! సృష్టికి, ప్రతి సృష్టిని విశ్వామిత్ర మహర్షి చేసాడంటారు ! నిజమేనా ?
బ్రహ్మ ----- అవును, విశ్వామిత్రుడు, వశిష్ఠునితో సమానమైన బ్రహ్మర్షి అవాలని ఘోర తపస్సు చేసి, తనని వశిష్ఠుడు గుర్తించాలనే తపనతో ప్రతిసృష్టిని చేసాడు !
2 ఋషి ---- అతను బ్రహ్మర్షి ఎప్పుడయ్యాడు ?
బ్రహ్మ ----- గాయత్రి దర్శనం తరువాత ! గాయత్రి విశ్వామిత్రుని తపోబలం, సంకల్పం నుండి జన్మించిన, సత్త్వగుణ ప్రధానమైన దేవతగా, ప్రసిద్ధి పొంది, బ్రాహ్మణులకు ఆరాధ్య దేవత అయింది !
3 ఋషి ----- బ్రహ్మ దేవా ! గాయత్రీ దేవి రూపాన్ని విశ్వామిత్రుడు ఏ విధంగా ఊఁహించాడు !
బ్రహ్మ ----- చాల అధ్భుతంగా ఊఁహించాడు ! 5 ముఖములు, 8 భుజములు. ముఖములలో మొదటిది ముత్యపు రంగు, రెండవది ప్రవాళపు రంగు, మూడవది బంగారు రంగు, నాల్గవది నీలపు రంగు, అయిదవది ధవళము. ఆ విషయాన్నే శ్లోకంలో ఇలా వర్ణించాడు !
శ్లోకం ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయై ముఖై స్త్రీక్షణై
ర్యుక్తా విందు నిబద్ధ రత్న మకుటాం, తత్త్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం ! వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదా
శంఖం చక్ర మథార వింద యుగళం హస్తైర్వహంతీం భజే !!
( శ్లోకం నడుస్తూ ఉండగానే, భృగు మహర్షి ప్రవేశిస్తాడు. శాస్త్ర చర్చలో ఉన్న బ్రహ్మను, మునులను చూస్తాడు. )
( బ్రహ్మ ఋషులు అతనిని గమనింపరు )
భృగుడు ---- ( తనలో ) ఓహో ! వీరందరును చర్చలో మునిగి, నన్ను గమనింపరైరి ! విషయం సత్త్వగుణ ప్రధాన దేవత అయిన గాయత్రీ దేవిని గురించి ! --- సరి సరి, ఇదియే మంచి సమయము ! ఈ బ్రహ్మ సత్త్వగుణ పరీక్ష చేసెదను గాక !!
(భృగుడు మునుల ప్రక్క నుండి వెళ్లి, బ్రహ్మ ప్రక్కన ఖాళీగా ఉన్న ఆసనం పైన కూర్చొంటాడు. )
( బ్రహ్మ భృగుని చూస్తాడు. అతనికి కోపం వస్తుంది )
బ్రహ్మ ------ ఓ భృగూ ! నీవు నాకు వందనాదులు చేయక, స్వాతిశయము కలవాడవై, సర్వజ్ఞడవను గర్వమున, నా ప్రక్కనున్న సరస్వతీ పీఠము పైననే. ఆశీనుడవైనావు !! నీ చర్య బ్రాహ్మణ విరుద్ధముగా నున్నది ! ---నీవును, నీ వంశము వారును, ఏడు పురుషాంతరముల పిమ్మట, దారిద్ర్యమును అనుభవింతురు గాక !! ( అని శపిస్తాడు )
భృగుడు ----- ఓ బ్రహ్మా ! నీవు రజోగుణము కలవాడవు ! నీవు సృష్టికర్త నన్న అహంకారముతో, నన్ను పలుకరింపక, గౌరవించక, -- నిష్కారణముగ నా వంశము వారిని శపించితివి ! -- నా వంశమున బ్రహ్మ ద్వేషులు, అనాచార పరులు మాత్రమే నీ శాపమునకు గురి యగుదురు గాక !! సదాచార పరులు పరోపకారము చేయువారు నీ శాపమునకు గురి కాకుందురు గాక !!! -- నీవు నన్ను అగౌరవము చేసినందున , నీకు భూలోకమున దేవాలయాదులు పూజలు లేకపోవును గాక !!!
( అని ప్రతి శాపము ఇచ్చి నిష్క్రమిస్తాడు )
**********************
( దృశ్యము-- 14)
( కైలాసంలోని ఒక తోట)
( తోట బయట ‘ కాలభైరవుడు’ కాపాలా కాస్తూ ఉంటాడు)
( భృగు మహర్షి ప్రవేశించి కాలభైరవుని చూస్తాడు )
భృగుడు ------ కాలభైరవా ! నేను సప్తర్షుల పనుపున బృహత్కర్య నిర్వహణకై వచ్చితిని ! మహా దేవునితో మాట్లాడవలె !!
కాలభైరవ ----- మహర్షీ ! మీరు కాసేపు వేచి ఉండండి. నేను వారికి మీ రాక నెరిగించి, ప్రవేశమునకు అనుమతి నడిగి వచ్చెదను. ( అని కాలభైరవుడు లోపలికి వెళ్తాడు )
******************
( దృశ్యము --15)
( కైలాసం లోని తోటలోపలి రమ్యమైన లతా నికుంజము )
( కాలభైరవుడు అక్కడికి వస్తాడు. పార్వతీ దేవి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంటుంది. శివుడు ఆమె తొడపై, తల పెట్టి పడుకొని, ఆమె ముఖంలోకి చూస్తూ ఉంటాడు )
( పార్వతి శివుని జటాజూటము లోని, చిన్న పాయను తీసుకొని, జడ అల్లుతూ ఉంటుంది. జడ బిగించి లాగిన ఆమె, అల్లరికి శివుడు గుటక వేస్తాడు ! పార్వతి నవ్వుతుంది )
శివుడు ----- దేవీ ! నీ మందహాసమునకు కారణమేమి ?
పార్వతి ----- ప్రభూ ! ఏమియును లేదు !
శివుడు ---- కాదు, ఏదియో ఒకటి ఉన్నది !
పార్వతి ----- మరేమీయు లేదు ప్రభూ ! ఇప్పుడు గుటక వేసితిరి కదా ! మీ కంఠమున కాలకూట గరళము నిగళమగుట నుండి, ఎట్లు కాపాడుచున్నారో నని నవ్వుకొంటిని.
శివుడు ----- ( పరిహాసముగా ) దేవీ ! నేనా విద్యను నీ దగ్గరనే నేర్చితిని !
పార్వతి ------ ( ఆశ్చర్యంతో ) ఏమి స్వామీ ! నా కడనా ?
శివుడు ----- అవును దేవీ ! నీ అధరములందు మధు రసములను దాచుకొని, దానిని బయటికు చింద నియ్యక, కెంపు రంగు ద్వారములను ఎట్లు ఏర్పరిచితివో. --- అటులనే నేను కూడ గరళ నిగళము కాకుండా గళములో నీలి రంగు తెరలను ఏర్పరచుకొన్నాను !!
( శివుని మాటలకు పార్వతి కిల కిలా నవ్వుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన కాలభైరవుడు తన్మయత్వంతో తను వచ్చిన పని మరచిపోతాడు )
*********************
( దృశ్యము 16—దృశ్యము 14 లాగే ! కైలాసం లోని తోట బయటి గేటు )
( భృగు మహర్షి కాలభైరవుని రాకకు ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి విసుగెత్తుతుంది )
భృగుడు ------ ఎప్పడనగా వెళ్లిన , యీ కాలభైరవుడు ఇంకా రాడేమిటి ! అయినను వాని రాకకై నే నెందుకు ఎదురు చూడాలి ? పరీక్షించడానికి వచ్చి, ఇలా నిరీక్షిస్తూ కూర్చొంటే ఎలాగ ? -- లోపలికి వెళ్లి చూసి వచ్చెదను గాక ! ( భృగువు లోపలికి వెళ్తాడు )
**********************
( దృశ్యము 17 )
( కైలాసం లోని రమ్యమైన లతా నికుంజము , దృశ్యము 15 లాగే ! )
( భృగుని రాక కాలభైరవుడు చూస్తాడు )
కాలభైరవ ------ ( తనలో ) అయ్య బాబోయ్ ! మహర్షి విషయం మరచే పోయాను. ఇతను నారి సంధించి వదిలిన బాణంలాగ దూసుకొని వచ్చేస్తున్నాడు ! శివ శంకరునకీ విషయం చెప్పే వ్యవధి కూడా లేదు ! ఇప్పుడు కర్తవ్యమేమిటి ?---- ( ఆలోచించి ) ఆ ! అవును ! ప్రక్కకు తిరిగి పారిపోవడమే మంచిది !! (కాలభైరవుడు పారిపోతాడు )
( పార్వతీ పరమేశ్వరులు ప్రణయ సల్లాపాలలో ఉంటారు. పార్వతి కిల కిలా నవ్వుతుంది. శివుడు ఆమె నవ్వులో అందాన్ని, చూసి పరవశుడవుతాడు ! )
( భృగువు ప్రవేశిస్తాడు )
( భృగువు , ఉమా మందహాసాన్ని చూసి మైమరిచి పోతాడు ! అతని నోటి నుంచి ఆమె మందహాసాన్ని స్తుతిస్తూ, కవిత్వ ధార వెలువడుతుంది )
భృగుడు --( శ్లోకం ) సహాదరేణ యోవ లక్ష పారిజాత మాలయా
గలస్థలీ విభూషయా, ధ్వనిం వినైవ భాషతే,
మహేశ పుణ్య యోషితో మనోజ్ఞ హాస ఏషమే
విభూతయే ప్రకల్పితాం , విధూతయేచ పాప్మనాం !!
తల్లీ ! కంఠాభరణమై ప్రకాశించు , ధవళ వర్ణము గలిగియున్న పారిజాత పుష్పమాలలతో కూడి, ఆదరము గల్గి, ధ్వని లేకుండునట్లు, సంభాషించుచున్న మహేశ పత్నివగు నీ మందహాసము, నా ఐశ్వర్యమునకు, పాప ధ్వంసమునకు కారణమై , నన్ను రక్షించు గాక !
( భృగుని స్తోత్రానికి పార్వతీ పరమేశ్వరులు ఉలిక్కి పడతారు. పార్వతి నాథుని తలని పైకెత్తి, లేచి పోతుంది జరిగిన రస భంగానికి శివునికి కోపం వస్తుంది. )
శివుడు ----- ఓయి భృగూ ! నీవు అనుమతి లేక, నా కేళీవనమున ప్రవేశించి, సమయా సమయములు పాటింపక నా ప్రణయ దేవత, ఏకాంతములో నా కొసగిన మందహాసమును, వర్ణించి, రసభంగము చేసితివి ! నేను నిన్ను ఉపేక్షింప జాలను ! నా త్రినేత్రాగ్నిలో నిన్ను భస్మము చేయగలను.
భృగుడు ------ రుద్రా ! నే నామెను మాతగా భావించి , ఆమె మందహాసమును వర్ణించితిని. కవి హృదయము తెలియని నీ కది తప్పు అయినది ! నీ త్రినేత్రాగ్ని నన్నేమియు చేయజాలదు !
( శివుడు భృగుని మాటలకు మండి పడతాడు )
శివుడు ---- ఓయీ ! భృగూ !! నీ అహంకారము మితి మీరినది ! ఇక ఉపేక్షించుట తగదు. ( అంటూ శివుడు తన త్రినేత్రమును తెరుస్తాడు )
( అతని మూడో కంటి నుండి అగ్ని జ్వాలలు వెడలి, భృగుని వైపు వెళ్తాయి )
( భృగుడు భయ పడక తన ఎడమ కాలికున్న కన్ను తెరచి, ఆ మంటలకి ఎదురుగా పెడతాడు )
( అతని కాలికి ఉన్న జలనేత్రం నుండి, జలధారలు పడి శివుని త్రినేత్రాగ్ని చిత్రంగా వెనకకి మరలుతుంది !!)
భ్రుగుడు ---- శివా ! చూసితివి కదా ! నీ త్రినేత్రాగ్ని ప్రకోపము !! -- బ్రహ్మ హత్యా పాతకము నుండి, నీవీ విధమున బయట పడితివి !!
శివుడు ----- భృగూ ! నిజము పలికితివి ! బ్రాహ్మణుడ వగుట చూచి, నా త్రినేత్రాగ్నిని, నేనే మరల్చినాడను ! కాని ఇది నీ జలనేత్ర ప్రభావము కాదు !-- జల ప్రభావము వలన అగ్ని తిరోగమనము చెందుట కాంచితివా ? అయినను నీతో చర్చలేల !! బ్రాహ్మణుడవన్న అహంకారమునకు లోబడిన నీకును, నీ జాతికిని, బుద్ధి చెప్పవలె !! ---- “భూలోకమున నీ బ్రాహ్మణ జాతి కలియుగమున 6000 సంవత్సరముల నాటికి, నామ మాత్రమగుదురు గాక !!” (అని శపిస్తాడు )
భృగుడు ----- “ శివా ! నీవును కలియుగమున ఆకార స్వరూపునిగా కాక, లింగ రూపమున, శిరస్సునందు అభిషేకాదులతో పూజలందుదువు గాక ! “ (అని ప్రతి శాపం ఇచ్చి, వెళ్లి పోతాడు )
*************************

Comments
Post a Comment