బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8
( దృశ్యము 29)
( మధురలో కృష్ణాలయము. పూజారి, వైఖానస సాంప్రదాయానికి చెందిన గోపీనాథుడనే ఋషి ఉంటారు)
( వైఖానస ఋషి గర్భగుడి ద్వారం ముందు నిల్చొని ఉంటాడు. పూజారి హారతి ఇస్తూ ఉంటాడు )
( ప్రవేశం-- విష్ణువు. నుధుటి మీద ఒకే ఒక నిలువు నామంతో సామాన్య బాలకునిలాగ ఉంటాడు )
( అతను ప్రవేశిస్తూ ఉండగానే , వైఖానస ఋషి అతనిని చూస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకొంటాయి )
( వైఖానసునుకి అతను ‘బాల కృష్ణుని’ లాగ, కనిపిస్తాడు.)
( విష్ణువు కృష్ణుని విగ్రహానికి నమస్కరించి మధురాష్టకం చదువుతాడు )
విష్ణు ------ శ్లోకం-- అధరం మధురం, వదనం మధురం, /నయనం మధురం, హసితం మధురం,
హృదయం మధురం, గమనం మధురం, / మధురాధిపతే రఖిలం మధురం
వచనం మధురం, చరితం మధురం/ వసనం మధురం, వలితం మధురం
చలితం మధురం, భ్రమితం మధురం / మధురాతి పతే రఖిలం మధురం.
(విష్ణువు మధురాష్టకం చదువుతున్నంత వరకు వైఖానస ఋషి, విష్ణువు ముఖాన్ని, కృష్న విగ్రహాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు )
విష్ణు ----- వేణూర్మధురో, రేణూర్మధురో / పాణీర్మధురో, పాదౌ మధురో
నృత్యం మధురం, సఖ్యం మధురం / మధురాధి పతే రఖిలం మధురం
గీతం మధురం, పీతం మధురం / భుక్తం మధురం, సిప్తం మధురం
రూపం మధురం, తిలకం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
( వైఖానసునికి విష్ణువు ముఖంలో, కృష్ణుని యొక్క రక రకాల రూపాలు కనిపిస్తూ ఉంటాయి )
విష్ణు ---- కరణం మధురం, తరణం మధురం / హరణం మధురం, రమణం మధురం
నమితం మధురం, శమితం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
గుంజా మధురా, మాలా మధురా / సలిలం మధురా, వీచీ మధురా
సలిలం మధురం, కమలం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
( పూజారి హారతి ఇస్తూ ఉండగా వైఖానసుడు ఆ హారతి వెలుగులో విష్ణువు ముఖం చూస్తాడు )
విష్ణు ---- గోపీ మధురా, లీలా మధురా / యుక్తం మధురం, ముక్తం మధురం
దృష్టం మధురం, శిష్టం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
గోపా మధురా, గావో మధురా / యష్టిర్మధురో, సృష్టిర్మధురా
దళితం మధురం , ఫలితం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
( హారతి కళ్లకి అద్దుకొన్నాక, వైఖానసుడు, విష్ణువుని పలకరిస్తాడు )
వైఖానస ---- బాబూ ! నా పేరు గోపీనాధుడు, వైఖానస సాంప్రదాయ వాదిని ! యీ ఆలయ సమీపంలోని కుటీరంలో ఉంటాను. వైష్ణవ సాంప్రదాయాలు, పూజలు, సమయాచారాలు, ఆగమానుసారంగా చేయగల, చేయించగల సామర్థ్యం నాకు ఉంది ! నా కంటికి మీరు ఆ మధురాధిపతి లాగ, బాల కృష్ణుని లాగ కనిపిస్తున్నారు ! కృష్ణున్ని సశరీరంగా పూజించాలనే వింత కోరిక నాది !! --ఈ రోజు మిమ్మల్ని చూసాక , నా అవయవాలు అదిరి, నా కోరిక తీరుతుందేమోనన్న ఆశ చిగురించేలా సూచనలిస్తున్నాయి !!-- ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా ?!
విష్ణు ---- వైఖానస ఋషీ ! నే నిప్పుడు చాలా అలిసిపోయి ఉన్నాను. దయచేసి ఆ వివరాలేవీ అడగకండి.
( వైఖానసుడు పూజారి ముఖాముఖాలు చూసుకొంటారు. పూజారి వైఖానసుని ఒక ప్రక్కగా తీసుకెళ్తాడు )
( విష్ణువు అక్కడే ఒక రాతి స్తంభానికి చేరబడి కూర్చొంటాడు )
పూజారి ---- వైఖానస ఋషీ ! చూసారా, ఆ యువకుని నిర్లక్ష్య పూరిత సమాధానం ! మీరేమో అతనిని చూసి, ఎన్నడూ స్పందించిన విధంగా స్పందించి, మీ చిరకాల వాంఛను కూడా సిగ్గుపడ కుండా చెప్పుకొన్నారు. దానికతడు --
వైఖానస --- పూజారిగారూ ! అతని చాల అలసిపోయి ఉన్నాడు----
పూజారి ---- ఎంత అలసిపోతే మాత్రం పేరు చెప్పడానికేం ?
వైఖానస --- పూజారిగారూ ! అతనిలో నాకు నా ఆరాధ్య దైవం కనిపించాడు ! --- నా దైవం బాల కృష్ణుడు ఎంతో అల్లరివాడు ! అల్లరి పెట్టి శోధించడం అతనికి పరిపాటి !!
పూజారి ---- అయితే ఏం చేస్తానంటారు ?
వైఖానస ---- అతనిని తీసుకెళ్లి, నా ఇంట ఆతిథ్యమిస్తాను.
పూజారి ---- మంచిదే ! ఎవరి పిచ్చి వారికే అనందం !! అతనిని ఏమని పిలుస్తారు ?
వైఖానస ----- అతను, నా బాలకృష్ణుడే !! గనుక ‘ బాలాజీ ‘ అని పిలుస్తాను ! ( అంటూ ఉద్వేగంతో విష్ణువు దగ్గరగా వెళ్తాడు )
వైఖానస --- బాలాజీ !! నాతో రండి, నా కుటీరంలో విశ్రాంతి తీసుకోండి.
విష్ణు ---- ఏమని పిలిచారు, బాలాజీ అనా ?
వైఖానస ---- అవును బాబూ ! అడ్డుపెట్ట వద్దు ! మిమ్మల్ని ఆ పేరుతో పిలువ నివ్వండి ! మీ అసలు పేరు, చిరునామా వివరాలు అడుగను ! నా కుటీరంలో అతిథిగా మీ ఇచ్చవచ్చినంత కాలం ఉండి, నన్ను తరింప చేయండి ! రండి--- బాలాజీ ! రండి !
( బాలాజీ చెయ్యి పట్టుకొని లేవ దీస్తాడు . విష్ణువు మంత్ర ముగ్ధునిలా అతనిని అనుసరిస్తాడు )
*******************
( దృశ్యం 30 )
( వైఖానసుని కుటీరంలోని ఒక గది. విష్ణువు ఆ గదిలోని మంచంపేన పడుకొని ఉంటాడు )
( మహర్షి కశ్యపుని సూక్ష్మ శరీరం ఆ గదిలోకి ప్రవేశిస్తుంది. పడుకొని ఉన్న విష్ణువును తట్టి లేపుతుంది )
( విష్ణువు పడుకొనే ఉంటాడు, అతని ఆత్మ లేస్తుంది. కశ్యపుని చూసి ప్రశ్నిస్తుంది )
విష్ణు---- మహర్షీ మీ రెవరు ?
కశ్యప ---- నేను కశ్యపుడను ! నీవు శ్రీనివాసుడవు ! గతించిన యుగాలలో నీ విభూతి ఎన్నో అవతారాలు ఎత్తింది ! ఆ అవతారాలలో కొన్నిటికి నేను నా భార్య అదితి, మా భాగ్య వశాన తల్లి తండ్రుల మయ్యాము !! జ్ఞప్తికి తెచ్చుకో ! నీవు రాముడవు, నేను దశరథుడను, నీవు కృష్ణుడవు, నేను వసుదేవుడను !
విష్ణు ---- లేదు ! జ్ఞప్తికి రావడం లేదు ! మీరు నాకు గతంలోని జనకులని చెప్పారు !! ఇది ఏ జన్మ ? యీ జన్మలో నే నెవడను ??
కశ్యప--- ఇది నీకు మరో జన్నకాదు ! మరో అవస్థ ! నీ పేరు చెప్పానుగా, శ్రీనివాసుడని !
విష్ణు ----- నే నెవరో, నా జ్ఞాపకాలేవో మరిచి పోయిన అవస్థ నాకు ఎలా వచ్చింది !
కశ్యప ---- సప్తర్షులు చేసిన సత్రయాగ ఫలితాన్ని, నిర్ద్వంద్వంగా ఎలాంటి రక్షణ, పరిరక్షణ లేకుండా స్వీకరించడం వల్ల, నీకీ అవస్థ కలిగింది !
విష్ణు--- అయితే నేను శ్రీనివాసుడనా ?
కశ్యప --- అవును, నీవే శ్రీ మహావిష్ణువువి ! వేంకటాచలం పైన అవతరించి, వేంకటేశ్వరుడవు కానున్నావు !
విష్ణు ---- వేంకటాచలమా ! నేనా కొండపై నివసించాలా , ఎందుకని ?
కశ్యప ------ శ్రీనివాసా ! మందుగా నిన్ను నువ్వు తెలుసుకో !
( అంటూ కశ్యపుడు శ్రీనివాసుని తలపై ‘ హస్త దీక్ష’ ఇస్తాడు )
( శ్రీనివాసునికి గతం గుర్తుకి వస్తుంది. భృగు మహర్షి వచ్చి తన్నడం, లక్ష్మి అలగడం, నారదుఢు కలహాన్ని రెచ్చగొట్టడం, ఆదిశేషుని తపస్సు వగైరా ఘట్టాలు జ్ఞాపకానికి వస్తాయి. )
కశ్యప ---- శ్రీనివాసా !
విష్ణు ---- నన్నా పేరుతో పిలువకండి. ‘సిరి’ , నా నుండి విడివడిన తరువాత నేను శ్రీనివాసుడను ఎట్లు కాగలను ?
కశ్యప ----- కాదు వత్సా ! నీవు ఎప్పుడూ శ్రీనివాసుడవే ! సిరి నిన్ను వదిలి వెళ్ళలేదు, కొంత కాలం పాటు ఎడమయింది ! అదీ లోక కళ్యాణం కోసం !
విష్ణు ----- ఆమె కనిపించదేమి , ఎక్కడుంది ?
కశ్యప ---- ఆమె కనిపించదు. ఎందుకంటే నీ కన్న ముందుగా కర్తవ్యోన్ముఖురాలు అయింది. తపస్సులో కాలం గడుపుతోంది !
విష్ణు ----- కర్తవ్యమా ! ఆమె ఉన్ముఖురాలు, నేను విముఖుడనా ! -- తండ్రీ మీ మాటలు నాకు అర్థం కావడం లేదు .
కశ్యప ---- శ్రీనివాసా ! నీవు సప్తర్షులు చేసిన యజ్ఞ ఫలాన్ని, స్వీకరించావు కదా ! ఆ ఋషుల సంకల్పాన్ని సఫలం చేసేందుకు, వేంకటాచలంపై అవతరించ వలసి ఉంది .అదియే నీ కర్తవ్యము ! నిన్ను శరణు వేడు భక్తుల భోగభాగ్యములను కాపాడు భారము లక్ష్మిది . అది ఆమె కర్తవ్యము !
విష్ణు ----- తంఢ్రీ ! సప్తర్షుల సంకల్పమును నే నెటుల సఫలము చేయగలను ? అది వేంకటాచలము పైననే ఎందులకు జరుగ వలెను ?
కశ్యప ---- ఎందుకంటే, వేంకటాచలం పాపాలు పోగొట్టే కొండ ! దానికి ఇంకా చాల పేర్లు ఉన్నాయి !
విష్ణు ------ తండ్రీ, ఎన్నో పేరులు గల ఆ కొండ విశిష్ఠతను చెప్పండి .
కశ్యప ---- శ్రీనివాసా ! కృత యుగానికి ముందు, నీ ఆజ్ఞ పైన వైకుంఠము నందు యుండెడు, క్రీడాద్రిని, గరుత్మంతుడు తెచ్చి, భూమిపై నిలుపుట వలన అది ‘ గరుడాద్రి’ అయినది ! ఆ గరుడాద్రి పైన ధర్మదేవత తపస్సు చేసి, తఫః ఫలితమును ఆ కొంఢకే ధారపోయుట వలన అది ‘వృషాద్రి’ అయినది ! వృషభుడనే రాక్షసునకు, నారసింహుడు ప్రత్యక్షమై, అతని కోర్కెపై దానిని కోరికలు తీర్చే కొండగా చేయుట వలన అది 'వృషభాద్రి’అయినది ! త్రేతాయుగమున అంజనా దేవి తపస్సు చేసి, పుత్రప్రాప్తి పొందుట వలన అది ‘ అంజనాద్రి’ అయినది ! వాయు ప్రకోపము నుండి ఆదిశేషుని వల్ల రక్షింపబడుట చేత అది ‘ శేషాద్రి’ అయినది !
విష్ణు ---- వేంకటాద్రి పాపాలు పోగొట్టే కొండ అని మీరు చెప్పారు ! ఆ పేరు దానికి ఎలా వచ్చింది ?
కశ్యప ---- ఎంతో మంది తపోధనులు తపస్సు చేసి, ఫలితములు ధార పోయుట వలన ఆ కొండ పాపములను పోగొట్టే కొండ అయింది ! ఆ కొండకి పశ్చిమాన నందనమనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ‘ పురంధరుడనే విద్వాంసుడు, తన పుత్రుడు ‘మాధవుడు,’ పుత్ర వధువు ‘ చంద్రలేఖలతో నివసిస్తూ ఉండేవాడు---
******************
( దృశ్యము 31 )
( నందన నగరంలో పురంధరుని ఇల్లు. పురంధరుడు, అతని కొడుకు మాధవుడు ఉంటారు )
పురంధర ---- మాధవా !
మాధవ ----- ఏమిటి నాన్నగారూ ?
పురంధర ------ సాయంత్రం కొండ మీదకి వెళ్లి, హోమ సమిధలు తీసుకొని రావాలి.
మాధవ ---- అలాగే నాన్నగారూ ! నేను నా భార్య చంద్రలేఖను కూడా తీసుకొని వెళ్తాను.
( చంద్రలేఖ ప్రవేశం. వచ్చి మామగారికి పాదాలకి నమస్కరిస్తుంది )
పురంధర ---- ( ఆశీర్వదించి ) ఏమమ్మా , ఇది నీ సలహాయేనా ? భర్తతో కలిసి. వాహ్యాళికి వెళ్దామనుకొంటున్నావా ?
చంద్రలేఖ ---- అవును మామయ్యగారూ ! మీరు అనుమతి నిస్తే----
పురంధర ----- అలాగే వెళ్లి రండి.
( అదే సమయానికి పెరట్లోంచి ఒక ‘గేదె’ అరుస్తుంది. )
పురంధర ------ మాధవా ! ఈ మహిషం అరుపు అపశకునం లాగ కనిపిస్తోంది. మీరు ఇవాళ వెళ్లక పోతేనేమి ?
మాధవ ---- నాన్నగారూ ! అలాగయితే నేను ఒంటరిగా వెళ్లి, హోమ సమిధలు తీదుకు వస్తాను.
( చంద్రలేఖ ముఖం ముడుచుకొంటుంది. పురంధరుడు ఆమెను చూస్తాడు )
పురంధర ---- వద్దులే మాధవా ! నీ భార్యను తీసుకొని వెళ్లు. దుఃశకున పరిహారానికి నారాయణ నామ స్మరణ చేసి వెళ్లు .
మాధవ ---- నాన్నగారూ, వెళ్లేది పవిత్రమైన పర్వతం మీదకి ! అక్కడ కూడ అనర్థాలు కలుగుతాయంటారా ?
పురంధర ----- మాధవా ! నేను నీకు అన్ని శాస్త్రాలు నేర్పాను. శాస్త్రాలు తెలిసిన వాడివి కనుక నేను నీతో వివాదానికి దిగను. కాని ఒక్కమాట ! శాస్త్రాలు తెలుసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టడం తెలివైన పని!
( మాధవుడు మౌనంగా నిలుచుండి పోతాడు )
పురంధర ----- మంచిదే, అలాగే కానియ్యండి, ఇద్దరూ కలసే వెళ్లి రండి !
******************* .
( దృశ్యము 32 )
( కొండ దగ్గర తోట . మాధవుడు, చంద్ర లేఖ వన విహారం చేస్తూ ఉంటారు )
( మాలిని అనే యువతి అక్కడ చితుకులు ఏరుతూ ఉంటుంది )
( మాధవుడు మాలినిని చూస్తాడు. ఆమె రూపం అతనిని ఆకట్టుకొంటుంది. మాధవుడు ఆమె దగ్గరకు వెళ్తాడు )
మాధవ ---- సుందరీ , నీ పేరేమిటి ?
మాలిని ----- మాలిని.
మాధవ ----- పేరు చాలా బాగుంది ! నువ్వెక్కడ ఉంటావు ?
మాలిని ----- నగరం శివార్లలో నండి. నా కెవ్వరూ లేరండి. తోడుగా ఉండే అయ్య కాలం చేసాడండీ ! ఇలా ఈ అడవిలో చితుకు లేరుకొని, మద్యం కాచుతూ, మాంసం అమ్ముకొంటూ, బ్రతుకుతున్నానండి !
( చంద్రలేఖ వచ్చి మాలిని మాటలు వింటుంది )
చంద్రలేఖ ---- అంటే, నువ్వు పంచమురాలివా ?
మాలిని ---- అదేంటమ్మా, నేను మా అయ్యకు ఒక్కర్తే కూతురు నండి ! ఇప్పుడు ఒంటరిదాన్ని !
చంద్రలేఖ ---- అంటే చదువు, సంస్కారం, సామాన్యమైన తెలివి తేటలు కూడ లేవన్నమాట ! ( విసురుగా భర్త చెయ్యి పట్టుకొని ) దానితో మీకేం మాటలండీ ? మామయ్యగారు హోమ సమిథలు తెమ్మన్నారు మరచి పోయారా ?
మాధవ ----- అలాగే, చంద్రలేఖా ! పద ! ( అంటూ వెనక్కి, వెనక్కి చూస్తూ వెళ్తాడు )
( మాలిని కూడా అతని వైపు మనోహరంగా చూస్తుంది, కన్ను గీటి నవ్వుతుంది. )
******************
( దృశ్యము 33 )
( మాలిని గుడిసె ముందు నులక మంచం )
( మాధవుడు , మాలిని మంచం పైన ప్రక్క ప్రక్కనే కూర్చొని ఉంటారు )
( మాధవుడు ఆమెతో పాటు మద్యం త్రాగుతూ, మాంసం తింటూ, కనిపిస్తాడు )
(ఒక బ్రాహ్మణ బాలకుడు ఆ దృశ్యాన్ని, చూస్తాడు. పరుగు పరుగున నగరం వైపు వెళ్తాడు )
*****************
( దృశ్యము 34 )
( నందన నగరంలోని ఫురంధరుని ఇల్లు. పురంధరుడు కూర్చొని ఉంటాడు )
( ప్రవేశం ఒక బ్రాహ్మణ బాలకుడు పరుగు పరుగున వస్తాడు )
బాలకుడు ---- పురంధరాచార్యా ! నమస్కారములు !
పురంధర ----- విషయమేమిటి వత్సా ! పరుగు పరుగున వచ్చావు ?
బాలకుడు ---- ఆచార్యా ! మాధవుల వారు నగరం చివర, మాలిని అని ఒక కడజాతి స్త్రీ ప్రక్కన కూర్చొని , ఆమెతో పాటు మద్య- మాంసాలు సేవిస్తున్నారు !
( ఆ మాటలు వన్న పురంధరుడు స్థాణువులా నిలుచుండి పోతాడు. చంద్రలేఖ ఇంట్లోనుంచి వస్తుంది )
పురంధర ---- వత్సా ! నువ్వు చెప్పినదంతా నిజమేనా ?
( బాలకుడు అవునంటూ తల ఊపుతాడు )
చంద్రలేఖ ----- మామయ్యగారూ ! ఆ రోజు కొండకి వెళ్లవద్దని, మీరెంత చెప్పినా వినక, ఇంత అనర్థం తెచ్చి పెట్టుకొన్నాను ! ఆ మాలిని అతనికి ఆ రోజే పరిచయమయింది ! --- కాని ---ఇంతకి దిగజారి పోతారనుకోలేదు !! ( ఏడుస్తుంది )---- ఎవరితో చెప్పుకోను, మామయ్యగారూ ! మీ అబ్బాయి నా ముఖం కూడ చూడడం మానేసారు !
( పురంధరుడు ఆమెని ఓదారుస్తాడు )
********************
( దృశ్యము 35 )
( మాలిని గుఢిసె )
( మాలిని, మాధవుడు నులక మంచం మీద కూర్చొని మాంసం తింటూ, మద్యం త్రాగుతూ ఉంటారు )
( ప్రవేశం పురంధరుడు. ఆ దృశ్యాన్ని చూస్తాడు. మాధవుడు తండ్రిని చూసి, దిగ్గున లేచి నిల్చొంటాడు )
పురంధర ---- అర్థమయిందిరా ! అంతా అర్థమయింది !! నువ్వు పూర్తిగా--- పతితుడివి, భ్రష్టుడివి అయ్యావు ! ఇక నువ్వు నా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు ! నేను నిన్ను వెలి వేస్తున్నాను .
( పురంధరుడు కోపంతో వెళ్లిపోతాడు )
********************
( దృశ్యము 36 )
( శేషాచలం కొండ )
( మాధవుడు కొండ దిగువ మాలిని కోసం చితుకులేరుతూ ఉంటాడు )
( కొండ మీదనుంచి వస్తున్న ఒక తపస్వి అతనిని చూస్తాడు )
తపస్వి ----- మాధవా ! ఎంత దుస్థితికి దిగజారావు ?
మాధవ ----- మహానుభావా ! ఎన్నో పాపాలు చేసాను. కట్టుకొన్న ఇల్లాలిని , కన్న తండ్రిని కడగండ్ల పాలు చేసాను. నేర్చుకొన్న పాఠాలని కొరగానివి చేసుకొన్నాను.
తపస్వి ---- మాధవా ! చేసిన దానికి నిజంగా చింతిస్తున్నావా ?
మాధవ ---- అవును స్వామీ ! నాకు మార్గమేదైనా చూపించండి .
తపస్వి ------ మాధవా ! నాతో ఈ కొండ మీదకు రా ! అక్కడ కొంత మంది మునులు తపస్సు చేస్తున్నారు. వారి నడిగి సందేహ నివృత్తి చేసుకో !
( తపస్వి, మాధవుని తీసుకొని మునుల దగ్గరకు తీసుకొని వెళ్తాడు. మాధవుడు ఆ మునులకు, పర్వతానికి నమస్కరిస్తాడు )
మాధవ --- ( పద్యం ) సీ- విప్ర జన్మంబంది, విధి వంచితుడనైతి / వేద విద్యలు నన్ను విడిచి జనియె,
జనకుని మసటలు జవదాటి చరియిస్తి / కర్మ దూరుడనైతి, కాలవశత.
జాతి ఛండాలుడనైతి, జాయను బాపి / నీచురాలి పొందు నెంచుకొంటి,
లొల్లను ద్రావుచు, లోకదూరుడనైతి / చేసిన తప్పులు చెప్ప సిగ్గు,
ఆ. వె. వేడుచుంటినయ్య, వేంకటాచలపతీ,
పాప సంచయమును పారద్రోలి
బ్రతుకు నిల్పి, నన్ను బ్రోచు భారము నీది;
ఆదుకొనగ వయ్య అద్రిరాజ !
( పద్యం ముగియగానే చిత్రంగా అతని శరీరాన్ని, మంటలు చుట్టుముట్టుతాయి ! చిట పట లాడుతూ మండి, తిరిగి చల్లారి పోతాయి )
మునులు ----- మాధవా ! నీ పాపములను దహించిన యీ కొండ, నీవు సంభోధించినట్లే ‘ వేంకటాద్రి ‘ నామముతో ప్రఖ్యాతి నందును గాక !
******************
( దృశ్యము 36 )
( వైఖానస ఋషి కుటీరంలోని గది )
( కశ్యపుఢు , శ్రీనివాసుడు ఉంటారు )
కశ్యప ------ శ్రీనివాసా ! ఆ విధముగా మాధవుని పాపములను దగ్ధము చేసి, అతనిని పునీతుడను చేసిన పర్వతము పేరు. ‘ వేంకటాద్రి’ గా ప్రసిద్ధి పొందింది !
విష్ణు ----- తండ్రీ ! ఆ పర్వతానికి నారాయణాద్రి అనే పేరెలాగ వచ్చింది ?
కశ్యప ----- శ్రీనివాసా ! గుర్తుకి తెచ్చుకో ! నారాయణుడను విప్రుడు, ఆ పర్వతము పైన, పూర్వాభిముఖముగా కూర్చొని, వెన్నెముక నిటారుగా నుంచి, కంటి చూపులను భ్రూమధ్యమందు నిలిపి, చాలకాలము నీ గురించి తపస్సు చేసాడు ! కొంత కాలానికి అతనికి శ్రీమహావిష్ణువు కనిపించి, వరాలని అనుగ్రహించాడు .
*******************
( దృశ్యము 37 )
( గరుడాద్రి కొండ )
( నారాయణుడు అనే విప్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్ష మవుతాడు )
విష్ణు ----- నారాయణా ! నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. వరాలను కోరుకో !
నారాయణ ---- శ్రీ హరీ ! నీ దర్శన మాత్రమున , భక్తుల కోర్కెను తీర్చే పరమాత్మ స్వరూపంగా, యీ పర్వతం పైన అవతార మెత్తి, యీ పర్వతమునకు నా పేర, నీ పేర నారాయణాద్రిగా పిలువ బడేలా వరమియ్యి !
******************** .
( దృశ్యము 38 )
( వైఖానస ఋషి కుటీరము )
( కశ్యపుడు, శ్రీనివాసుడు ఉంటారు )
కశ్యప ---- శ్రీనివాసా ! నారాయణునికి ఇచ్చిన వరం అనుగ్రహించే సమయం ఆసన్నమయింది ! నీవు ఆ కొండను నివాసంగా చేసుకో !
విష్ణు ---- అటులనే తండ్రీ ! అక్కడకు వెళ్లి నేనేం చేయాలి ? లక్ష్మి అక్కడకు ఎలా వస్తుంది ?
కశ్యప ----- శ్రీనివాసా ! ఆ శేషాద్రి పైన, చింత చెట్టు క్రింద, పిపీలకుడు తయారు చేసిన వల్మీక భవనంలో నివసిస్తూ తపస్సు చెయ్యి. నిన్ను చూసీ చూడగానే భక్తుల పాపాలు నాశన మవాలంటే, నువ్వు అమోఘ తపోబల సంపన్నుడవు కావాలి ! కనుక భక్తులందరి వంతు తపస్సు నీవే చేయాలి ! లక్ష్మీదేవి కూడ నిన్ను చేరే భక్తుల భోగ భాగ్యాలను కాపాడేందుకు తపస్సు చేస్తోంది. మీ ఇద్దరి తపస్సు ఒక కొలిక్కి వచ్చేసరికి, మీ కలయిక తప్పక జరుగుతుంది ! అలా జరగాలంటే నీవు ఇంకొక పని కూడ చేయాలి !
విష్ణు ---- ఆనతినీయండి తండ్రీ !
కశ్యప ---- నీకు లక్ష్మీ ప్రసన్నమయి, ఆ కొండపై బహు కుటుంబీకుడవై, వర్థిల్లాలంటే , ఆ కొండ చరియల్లో నుండి, పారే ‘ దేవ తీర్థంలో’ శ్రవణా నక్షత్రయుత ఇందువారము నాడు, స్నానం చెయ్యాలి.
విష్ణు ---- తండ్రీ ! ఆ శుభముహూర్తం గురించి వివరంగా చెప్పండి !
కశ్యప ---- రాబోయే భాద్రపద మాసం, సోమవారం, ద్వాదశి తిథి, శ్రవణా నక్షత్రము సిద్ధయోగము నాడు, నీవు శేషాద్రిని చేరి, దేవ తీర్థంలో స్నానమాడి, పునీతుడవై , చింతచెట్టు క్రిందనున్న, వల్మీకమును నివాస స్థానము చేసుకొని, ప్రతీ నిత్యమూ జప, హోమ, తర్పణాది క్రియలను ఆచరిస్తూ, తపస్సు చేయుము !
విష్ణు ----- తండ్రీ ! తపస్సు ఎవరి నుధ్దేశించి చేయవలెను ! ఎంత కాలము చేయవలెను ! తపోఫలమును ఎవరు సమర్పించెదరు ?
కశ్యప ----- ముక్కోటి దేవతలను, నీలో నిలుపుకొన్న నీవు, వారందరి బల, వీర్య, తేజస్సులను పొందుటకు, వారి ప్రతినిధివై, లోక కళ్యాణము చేయుట కొరకు, ప్రతీ ఒక్కరి నిమిత్తము తపము చేయవలెను ! నీ తపో ఫలమును బ్రహ్మ తెచ్చి ఇచ్చునంత వరకు, తపము చెయ్యవలెను. ఇక కాలమందువా, అది ఎవరి వశమో నీకే తెలియగలదు !
( కశ్యపుని శరీరం మాయమవుతుంది. శ్రీనివాసుని ఆత్మ తిరిగి శరీరాన్ని చేరుకొంటుంది )
( అప్పుడు పాన్పుపై పడుకొని ఉన్న విష్ణువు లెచి కూర్చొంటాడు, తనని తాను చూసుకొంటాడు )
విష్ణు ---- ఓహో ! కశ్యప మహర్షి నాకు స్వప్న నిర్దేశము చేసెనా ? స్వప్నమందైనను, తండ్రి ఆజ్ఞ ఆజ్ఞయే కదా !! సత్వరము శేషాచలము చేరెదను గాక !
( గది తలుపులు తెరచుకొని బయటకు వెళ్లిపోతాడు )
*********************
( దృశ్యము 39 )
( వైఖానస కుటీరము )
( వైఖానస ఋషి ప్రాతః కాల కృత్యాలను తీర్చుకొని, విష్ణువు పఢుకొన్న గదికి వస్తాడు )
వైఖానస ----- బాలాజీ, బాలాజీ ! లేచిపోయారా బాలాజీ ?
( గదిలో బాలాజీని కానక ఆశ్చర్య పోతాడు )
వైఖానస ---- బాలాజీ ఎక్కడకు వెళ్లినట్లు ? బహుశా గది బయట కాల కృత్యల కోసం వెళ్లారేమో !!
( వైఖానసుడు ఇల్లంతా కలయ తిరుగుతాడు, బాలాజీని కానక, దిగులుతో , తిరిగి, గదిలోపలికి వస్తాడు )
( ఆ గది మధ్య మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చొన్న కశ్యప ఋషిని చూస్తాడు )
వైఖానస ---- మహాత్మా మీరెవ్వరు ! ఎప్పుడు వచ్చారు ? యీ గదిలో బాలాజీ అనే యువకుడు ఉంధాల్సింది. ఆయనను మీరు చూసారా ?
కశ్యప ----- వైఖానసా రా ! ఇలా వచ్చి కూర్చో !!
( వైఖానసుడు మంత్ర ముగ్ధునిలాగ వచ్చి కూర్చొంటాడు )
కశ్యప ----- నేను కశ్యప ఋషిని .
వైఖానస ----- ( లేచి సాష్టాంగ నమస్కారం చేసి )--- కశ్యప మహర్షీ ! ఏమి నా భాగ్యము !! నా ఆరాధ్య దైవమైన బాలకృష్ణుని జనకులు వసుదేవుల వారా మీరు ? నేడు చాల సుదినము !! ఇక వాసుదేవుల వారిని కూడా చూడవచ్చును.
కశ్యప ----- పిచ్చివాడా ! నీవు ముందు వాసుదేవుడినే చూసావు. ఆ తరువాతనే నన్ను చూసావు !
వైఖానస ----- (విస్మయంతో ) మహర్షీ ! ఏమిటి మీరంటున్నది ! ఆ ‘బాలాజీ’ నా ‘బాలాజీయేనా’ ? ఆయనే వాసుదేవ కృష్ణుడా ?
కశ్యప ---- అవును, నీ బాలాజీ , యీ బ్రహ్మీముహూర్తానికి లేచి వెళ్లిపోయాడు. నేనే వెళ్లమని నిర్దేశించాను !
వైఖానస --- ( దిగులుగా ) మహర్షీ ! నేనేం అపరాధం చేసాను ? నా దైవాన్ని అర్చించే భాగ్యం నాకు లేకుండా పోయింది !!
కశ్యప ---- వైఖానసా ! చింతించకు , స్వామిని సశరీరంగా అర్చింవాలనే నీ కోరిక, తీరే సమయం రానుంది ! నీ ఇంటికి వచ్చిన ‘ బాలాజీ ‘ పేరు శ్రీనివాసుడు ! అతనిని ఆ పేరుతోనే అర్చించు. కాని ‘మధురలో’ కాదు ! వేంకటాద్రి యందు !
వైఖానస --- బాలాజీ అదే శ్రీనివాసుల వారు, అక్కడికే వెళ్లారా ?
కశ్యప --- అవును. వేంకటాద్రి పైన, చింతచెట్టు క్రింద, వల్మీకంలో స్వామి తపస్సు చేయనున్నాడు ! అతని తపస్సుకు అంతరాయం కలుగకుండా చూస్తూ, సాధనను సులభం చెయ్యి ! పూజ అర్చన కైంకర్యాదులతో నీ కోరిక తీర్చుకొని తరించు ! యీ పనిలో ‘రంగదాసుడనే’ భృత్యుడు నీకు తోడవుతాడు !
వైఖానస ---- మహర్షీ, రంగదాసుడు నాకు ఎక్కడ లభింపగలడు ?
కశ్యప ----- కొండ దిగువన, నిన్ను వెతుకుతూ వస్తాడు .
వైఖానస --- అటులనే మహర్షీ ! నేను యీ నాడే వేంకటాద్రికి బయలుదేరి వెళ్లెదను .
( కశ్యపుడు మాయమవుతాడు )
******************
పౌరాణికము

Comments
Post a Comment