బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—9
( దృశ్యము 40 )
( నైమిషారణ్యము. సూత పౌరాణికుడు, శౌనకాది మహామునులు ఉంటారు )
సూతుడు -- శౌనకాది ముని సత్తములారా ! శ్రీమన్నారాయణుడు , కశ్యప మహర్షి నిర్దేశము వలన, కర్తవ్యోన్ముఖుడై తపస్సు చేయుటకు ‘ వేంకటాద్రికి’ బయలు దేరెను.
శౌనక -- సూత మహర్షీ ! శ్రీమన్నారాయణుడు వేంకటాద్రిని చేరిన విధము, అతని కొరకు చిరకాల నిరీక్షణ చేయుచుంఢెడు, ఆదిశేష, పిపీలిక, తింత్రణీ వృక్షముల కోర్కె తీర్చి విధమును , మాకు తెలియ జేయుడు.
సూతుడు – మునులారా ! శ్రీనివాసుడు వేంకటాచలమును చేరిన విధము, సావధాన చిత్తులై వినుడు.
******************
( దృశ్యము 41 )
( అడవి. శ్రీనివాసుడు నడుస్తూ ఉంటాడు. అతనిని ఆకాశంలోంచి , గరుత్మంతుడు, ఆంజనేయడు ఇద్దరూ చూస్తారు )
( ముందుగా గరుడుడు శ్రీనివాసుని ఎదుటకు వచ్చి నిలుస్తాడు )
గరుడ -- ప్రభూ! నేను మీ భృత్యుడను, మీ వాహనమగు గరుడుడను ! నే నుండగా మీరు పాదచారులై, సంచరించుట, ఉచితము కాదు ! ప్రభూ ! మీరు నా వీపుపై విరాజమానులు కండు, నేను మిమ్ములను చిటికెలో ‘ వేంకటాచలమునకు’ చేర్చెదను !
విష్ణు --- గరుడా ! నేను నీ సేవ నొల్లజాలను !
( గరుడుడు చిన్నబోతాడు )
విష్ణు --- చింతింపకుము, ఇటుల మీ సురుల సేవలందుట వలన, నా పుణ్యమయ క్షయమగును ! నాకు ఇప్పుడు అపారమగు పుణ్య సంచయము చేయు నవసర మున్నది !
( ఇంతలో అక్కడకి ఆంజనేయుడు వస్తాడు )
ఆంజనే -- ప్రభూ ! శ్రీరామచంద్రా ! మీ భృత్యుడనగు నే నుండగా మీ కిట్లు కాలినడక లేల ? రండు, నా భుజములపై సేద తీరుడు ! మిమ్ము తక్షణము శేషాద్రిని చేర్చెదను !
విష్ణు --- ఆంజనేయా ! వాహనము నధిరోహించుట నాకు తగదయ్యా ! నేను నా తపము ముగియునంత వరకు, సురుల సాయమును ఒల్లజాలను !
గరుడ -- స్వామీ ! అటులయిన మీ రిటుల----
ఆంజనే -- మార్గాయాసమును పొందక ------
ఇరువురూ --- గమ్యమును చేరు ఉపాయము సెలవిండు !
విష్ణు -- మీ రిరువురూ, కొండ నెక్కు మార్గ మధ్యమున వెలసి, నా కొరకు కాలి నడకన వచ్చు, భక్తుల మార్గాయాసమును, శ్రమను, తగ్గంచుడు !! అదియే నేను ఆశించెడు సేవ ! నా భక్తుల సేవయే నా సేవ కాగలదు !
ఆంజనే -- ప్రభూ ! మీ ఆజ్ఞా ప్రకారము ----
గరుడ --- అటులనే చేయుదుము, కాని,-----
ఆంజనే ---- ప్రస్తుతము, మీ పాద పద్మములకు కలుగు----
గరుడ ---- కష్ట నివారణమునకు, ఏదియైన -----
ఇద్దరూ --- ఉపాయము సెలవిండు !
విష్ణు -- వినతాత్మజా ! అంజనీ పుత్రా ! -- అటులనే కానిండు ! మీ తృప్తి కొరకు, నేను పాదరక్షలను ధరింప సమకట్టితిని. నా కవి తెచ్చి ఇండు !
ఆంజనే --- ప్రభూ ! శ్రీ చరణములకు తగిన పాదరక్షలు---
గరుడ --- లభ్యమగు చోటు తెలిపి, మమ్ములను కృతార్థులను చేయుడు !
విష్ణు ---- వినుడు, ఇరువురు పంచములు శ్రావణ శనివారములు ఉపవాసముండి, కడుంగడు దారిద్ర్యమును అనుభవించుచు, నన్నే తలంచుచున్నారు ! వారు పాద రక్షలు చేయుటలో నిపుణులు ! ఒకరు కంచిలోను, మరొకరు కాళహస్తిలోను , ఉన్నారు ! నేను భాద్రపదమున కొండ పైకి చేరవలెను గదా ! అందుకని వారిరువురి కడకేగి, పాదరక్షలు చేయించి, వారి చేతనే నాకు సమర్పించునటుల చేయుడు !
గరుడ -- ప్రభూ ! నేను కంచి కేగి, ఆ మహాభక్తుని అన్వేషించి , స్వామి కార్యము నెరవేర్చెదను !
ఆంజనే -- స్వామీ ! నేను కాళహస్తి కేగి కార్యము పూర్తి చేసెదను.
విష్ణు -- గరుడా ! నీవు నా ఎడమ కాలి పాదముద్రలను తీసుకొనుము ! ఆంజనేయా , నీవు నా కుడికాలి పాద ముద్రలను తీసుకొనుము .
( ఆంజనేయుడు, తన కుడి చేతిని చాపి, శ్రీవారి, కుడి కాలుని తన అర చేతిపై పెట్టమని ప్రార్థిస్తాడు. విష్ణువు అలాగే చేస్తాడు . శ్రీవారి పాద ముద్ర అతని అరచేతిపై పడుతుంది )
ఆంజనే -- ప్రభూ ! నాకు అనుజ్ఞ నిండు, నేను పోయి వచ్చెదను !
( గరుత్మంతుడు స్వామి ఎదుట వంగి, తన వీపుపై ఎడమ కాలు పెట్టమంటాడు, విష్ణువు అలాగే చేస్తాడు. శ్రీవారి ఎడమ కాలి పాద ముద్ర అతని వీపుపై పడుతుంది )
గరుడ -- ప్రభూ ! నాకు సెలవిండు , పోయి వచ్చెదను !
విష్ణు -- నా ప్రియతమ భక్తులారా ! వెళ్లి రండు !
( ఇద్దరూ ఎగిరి వెళ్లిపోతారు.)
*********************
( దృశ్యము 42 )
( కాళహస్తిలో మారుమూల గుడిసె . ‘దాసు’ అనే హరిజన భక్తుడు, చెట్టు క్రింద కూర్చొని చెప్పులు కుట్టుతూ ఉంటాడు )
( అతని భార్య, ఒక పాత్రలో గోధుమ పిండి కలుపుతూ ఉంటుంది. వారి పిల్లలు, చాలీచాలని దుస్తులతో , చుట్టు ప్రక్కల ఆడుతూ ఉంటారు. చెట్టు మీదకు, ఆంజనేయుడు కోతి రూపంలో వస్తాడు. )
( దాసు చెప్పులు కుడుతూ, తన అరచేతితో నుదుట పట్టిన చెమటని తుడుచుకొంటాడు. )
దాసు ---- రామచంద్రా ! రామచంద్రా ! ( అంటూ నిట్టూర్పు వదలుతాడు )
భార్య -- ఉపవాసంతో ఆ చెప్పులు కుట్టక పోతేనేం ? ఇది వరకు కుట్టినవే చాన ఉన్నాయి ! కొనే వారెవరు ?
దాసు ---- నా రాముడు దయతలిస్తే, నా కేమి కొదవే ? చిటికెలో నా చింత తీరుస్తాడు !
( చెట్టుమీద ఆంజనేయుడు అదంతా చూసి, అతడే ఆ భక్తుడని తెలుసుకొంటాడు )
ఆంజనే --- ( తనలో) ఈ రోజే శ్రావణ శనివారము, ఇతడు ఉపవాసమున్నా, వృత్తి ధర్మాన్ని వదలక, ఆయాస పడినప్పుడల్లా, రామ నామ స్మరణ చేస్తూ, సేద తీరుతున్నాడు ! శ్రీవారి పాద ముద్రను ఇతనికే ప్రసాదించెదను గాక !
( కోతి చెట్టుపై నుండి దిగి, భార్య కలుపుతున్న గోడుమ పిండి తపేలాను, ఎత్తుకు పోతాడు )
భార్య --- అయ్యో, అయ్యో ! కోతి, పిండి తపేలాని ఎత్తుకు పోతోంది , చూడవయ్యా ! ( అని భర్తని పొడుస్తుంది )
దాసు -- కోతి అని చిన్న చూపు చూడకే ! ఆంజనేయల వారు అను ! పాపం దాని ఆకలి ఎలా తీరుతుంది ?
భార్య --- బాగుంది సంబరం ! కోతి ఆకలి తీరుస్తే, నా పిల్లల ఆకలి ఎలా తీరుతుంది ? నీకయితే ఉపవాసం, కూడు అక్కర లేదు ! పిల్లలు పస్తులెలా ఉంటారు ? అయినా నీతో చెప్పి ఏం లాభం ? ( అంటూ ఒక కర్ర తీసుకొని కోతి వెంట పడుతుంది. ఆమెను చూసి పిల్లలు కూడ ‘కోతి’ దగ్గరకి పరుగెడతారు )
( తల్లి పిల్లలని కోతి కొంత సేపు ఆడిస్తుంది. తరువాత తపేలాను అక్కడే వదిలి పారిపోతుంది. భార్య వెళ్లి ఆ తపేలాని తీసుకొంటుంది )
భార్య -- అమ్మయ్య ! పిల్లల నోటి కూడు, కోతి కాడికి పోకుండా దక్కింది ! అంతే చాలు---( అంటూ ఆ తపేలాలోకి చూస్తుంది. తపేలా లోని పిండి ముద్దపై, స్వామి కుడికాలి పాద ముద్ర కనిపిస్తుంది )
భార్య --- చూడయ్యా , చూడు ! పిండి మీద పాదం కొలతలు పడ్డాయి ! ( అంటూ చూపిస్తుంది )
దాసు --- అవునే, మనిషి పాదం గుర్తులేనే ! కుడి పాదం కొలతలు ! -- కోతి పట్టుకెళ్లిన పిండి తళికె మీద మనిషి పాదం గుర్తులు ఎలా వచ్చేయే !?
( చెట్టు మీద కోతి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి పలుకుతాడు )
ఆంజనే --- భక్తా ! శ్రీమహావిష్ణువు కుడికాలి గుర్తులవి ! నీ భాగ్య వశాన నీకు లభించినవి . ఆ కొలతలతో చక్కని పాదరక్ష నొకదానిని తయారు చేసి, యీ ఊరికి దక్షిణాన అడవి చివరన ఉండే శ్రీరామాలయం దిగువ మెట్ల దగ్గరకి తీసుకెళ్లు . స్వామి కటాక్షం వలన నీ కోరికలు తీరగలవు !
*****************
( దృశ్యము 43 )
( కంచి. మారుమూల ఒక గుడిశె, నంబి అనే భక్తుడు తన గుడిశె ముందు కూర్చొని, చెప్పులు కుడుతూ ఉంటాడు. అతని భార్య కొంచెం దూరంలో కూర్చొని, గోధుమ పిండి కలుపుతూ ఉంటుంది. )
( గరుత్మంతుడు విసురుగా వచ్చి, ఆ పాత్రను ఎత్తుకు పోతాడు )
భార్య -- అయ్యో, అయ్యో !--- మాయదారి పక్షి నోటికాడ కూడెత్తుకు పోయింది. ఓ, మావా ! ఇప్పుడేం చేయాలి ?
నంబి --- గరుడాళ్వారు వచ్చి తీసుకెళ్తే, అలా గావుకేకలు పెట్టకే ! అతను బెదిరి పోతాడు.
భార్య -- ఏమిటీ ! ఆ పక్షి గరుడాళ్వారా ? నీ భక్తి బుగ్గిపాలు కాను ! కూడు ఎత్తుకు పోయినందుకు ఏడవక, ఏం సంబర పడిపోతున్నావు ?! ( అంటూ కర్ర పట్టుకొని చెట్టెక్కి కూర్చొన్న గరుడ పక్షిని తరమడానికి వెళ్తుంది )
( గరుత్మంతుడు పిండి తపేళాని క్రింద పెట్టేసి, ఎగిరి పోతాడు. భార్య ఆ పాత్రని అందుకొంటుంది. అందుకొని ఆ పాత్రని చూస్తుంది. పిండి తళికె మీద శ్రీవారి ఎడమ కాలి ముద్ర ఉంటుంది )
భార్య --- (ఆశ్చర్యంతో ) ఓరి మావోయ్ ! చూడు యీ ఇసిత్రం ! పిండి మీద మనిషి కాలి కొలతలున్నాయి !!
నంబి -- ( వచ్చి, చూస్తాడు ) చూసావా, నేను చెప్తే విన్నావా , ఆ పక్షి గరుడాళ్వారు అని !? కర్ర పట్టుకెళ్లి అపచారం చేసావు, యీ పాద ముద్ర ఎవరి దనుకొన్నావు, ----
భార్య – ఎవురిదయ్యా ?
నంబి ---- ( భక్తితో ) సాక్షాత్తు ఆ శ్రీరంగనిది !!! చూసావా, పాద ముద్రలో శంఖ చక్రాలు ఎలా కనిపిస్తున్నాయో !?
భార్య ---- అవును మావా ! అపచారం అయిపోనాది !! ( లెంపలు వేసుకొంటుంది )
( ఇద్దరూ గాలిలో తిరుగుతున్న గరుడునికి నమస్కరిస్తారు )
నంబి --- గరుడాళ్వారు స్వామీ ! శ్రీవారి పాదముద్ర నిచ్చి, నన్ను ధన్యుణ్ని చేసారు ! యీ పాద ముద్రలు ఏం చేయాలో సెలవిచ్చి పుణ్యం కట్టుకోండి.
( గరుడుడు గాలిలో తిరుగుతూనే చెప్తాడు )
గరుడ --- నంబీ ! శ్రీవారికి ఆ ముద్ర కొలతలతో పాదరక్షను తయారుచెయ్యి ! దానిని తీసుకొని , శ్రీకాళహస్తికి దక్షిణాన ఉండే అడవి చివరన ఉంఢే శ్రీరామాలయము దిగువ మెట్ల దగ్గర ఉంచు ! నీకు స్వామివారి కరుణా కటాక్షం లభిస్తుంది ! ( అని వెళ్లిపోతాడు )
( భార్యా భర్తలిద్దరూ ఆనందంతో గెంతులు వేస్తారు, పాద ముద్రలను కళ్లకి అద్దుకొంటూ )
********************
( దృశ్యము 44 )
( కాళహస్తి. దాసు భార్యా పిల్లలతో, తన కుటుంబీకులతో ఉంటాడు )
( కుడికాలి చెప్పుని, ఒక బుట్టలో పువ్వుల మధ్య పెట్టి, దానిని తలమీద పెట్టుకొంటాడు. అతని వెనక అతని భార్యా పిల్లలు, వారి వెనక అతని కులస్థులు, దప్పు కొట్టుకొంటూ బూరలు ఊదుతూ, దారి తీస్తారు )
********************
( దృశ్యము 45 )
( కంచి. నంబి పూల తట్టలో ఎడమ కాలి చెప్పును పెట్ఠి, ఆ తట్టను తల మీద పెట్టుకొంటాడు )
( అతని వెనక అతని భార్య, అతని కులస్థులు, మేళతాళాలతో బయలుదేరుతారు )
*********************
( దృశ్యము 46 )
( ఒక అడవి చివర రామాలయం )
( పాదరక్షల తండాలు, రెండూ అక్కడికి చేరుకొంటారు. ఒకరి నొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు )
(.తట్టలు రెంఢూ ఒక దాని ప్రక్కన ఒకటి పెట్టి, చూస్తారు . ఆశ్చర్యం ! రెండూ ఒకలాగే ఒకరే తయారు చేసినట్లు ఉంటాయి . ఆనందంతో నృత్యం చేస్తారు )
గేయం -- శరణన్న చాలు, కరుణింతువని వింటి !
మా వైపు చూసావా స్వామీ !
మా బతుకులే పండగయ్యేను !!
( చెప్పులు, రామాలయం దిగువ మెట్ల దగ్గర ఉంచి, పొదల మాటున దాగి చూస్తూ ఉంటారు )
( ప్రవేశం విష్ణువు. వచ్చి నేరుగా రామాలయం లోనికి వెళ్తాడు. శ్రీరామునికి నమస్కారం చేస్తాడు )
విష్ణు ---- (పద్యము ) శ్రీ రాఘవం, దశరథాత్మజ మప్రమేయం
సీతా పతిం, రఘు కులాన్వయ రత్న దీపం
ఆజానుబాహు, మరవింద దళాయతాక్షం
రామం ! నిశాచర వినాశకరం నమామి !!
( విష్ణువు తిరిగి వచ్చి, దిగువ మెట్ల మీద నున్న చెప్పులను చూస్తాడు. చిన్నగా చిరునవ్వు నవ్వుకొని , వాటిని తొడిగి చూస్తాడు. సరిగ్గా సరిపోతాయి అవి ! )
( పొదలలో దాగి ఉన్న భక్తులు ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు )
దాసు – ఇదేమిటి, దేవునికని తెచ్చిన చెప్పులు------
నంబి ---- ఈ అయ్యవారు తొడిగేసేరేంటి !? పద, వెళ్లి అడుగుదాం !—
( ఇద్దరూ బయటికి వస్తారు. వారితో పాటు,వారి తండాల లోని వ్యక్తులు కూడా బయట పడతారు )
దాసు + నంబి --- అయ్యవారూ, అయ్యవారూ---
( విష్ణువు ఆగుతాడు )
దాసు --- అయ్యవోరూ ! మీరు తొడిగిన చెప్పులు, మీ కోసం కుట్టినవి కాదండి ! వాటిలో కుడికాలి చెప్పును, నేను----
నంబి --- ఎడమ కాలి చెప్పును నేను----
దాసు ---- కాళహస్తి నుండి ఊఁరేగించి----నేను-
నంబి --- కంచి నుండి ఊఁరేగించి నేను---
ఇద్దరూ -- తీసుకొచ్చాం---
విష్ణు ---- తలొక పాదరక్షనీ చేసి, పట్టుకొచ్చారన్న మాట ! అయినా బాగున్నాయి. రెండూ ఒక్కలాగే ఉన్నాయి ! నాకు సరిగ్గా సరిపోయాయి.---
దాసు --- అయ్యవోరూ ! వాటిని మేము---
నంబి --- దేవుని కోసం తయారు చేసామండి----
దాసు ---- మీరు, వాటిని తొడుగు కోవడం, దేవునికి అపచారమండి !
నంబి --- వాటిని విప్పేసి, పక్కనే పెట్టేయండి. -- మీ బాగు కోసమే చెప్తున్నామండి---
విష్ణు ---- మీరు తెచ్చిన చెప్పులు, నా కోసమే చేసినట్లున్నాయి ! -- పోనీ , నేనే మీ దేవుణ్ననుకోండి !
( దాసు, నంబి ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు. ఆ చెప్పులు అతనికి సరిపోయినట్లు ఉండడం వారికి ఆశ్చర్యం వేస్తుంది )
( ఇద్దరూ కూడ బలుకుకొని, విష్ణువుకు సాష్టాంగ పడుతారు )
( విష్ణువు వారివంక చిరునవ్వుతో చూస్తాడు )
విష్ణు --- దాసూ, నంబీ ! లెండి.
( ఇద్దరూ లేస్తారు )
విష్ణు --- మీకు పాద ముద్రలను పంపినది నేనే ! ఆంజనేయుడు,గరుత్మంతుడు తెచ్చి ఇచ్చారు, అవునా ?
( ఇద్దరూ మళ్లీ సాష్టాంగ పడతారు )
ఇద్దరూ --- అపరాధం అయిపోయింది, స్వామీ ! క్షమించండి.
విష్ణు ---- లెండి, ఇలాగే, ప్రతీ సంవత్సరం పిండి తళికెల మీద, నా పాద ముద్రలను, మీకూ, మీ తరువాత మీ కులాల వారికీ, ఇస్తాను ! వాటిని ఊఁరూరా, మేళతాళాలతో, ఊఁరేగించి తేచ్చి, ఏడుకొండల దిగువున ఉండే ‘ అలిపిరి’ మంటపంలో పెట్టండి. అర్థమయిందా ?
ఇద్దరూ --- అర్థమయింది, సామీ !!
( అంటూ ఒకరి వైపు మరొకరు చూసుకొంటారు . ఆశ్చర్యం ! వాళ్ల దుస్తులు మారి, చక్కటి దుస్తులుగా తయారవుతాయి. )
( వాళ్ల తండాలలో వారి ఆడంగుల మెడలు, ఆభరణాలతో నిండిపోతాయి. పిల్లల బట్టలు దర్జాగా తయారవుతాయి. మూటలలో ధన ధాన్యాలు వస్తాయి ! )
( వాళ్లు సంబరంతో ఒళ్లు మరచి, అవన్నీ చూసుకొంటూ ఉండగానే, విష్ణువు పాదరక్షలు తొడుగుకొని, చల్లగా జారుకొంటాడు )
( దాసు, నంబి విష్ణువు వెళ్లిపోయాక తేరుకొని, ఇటూ అటూ పరుగులిడి, వెతుకుతారు. అతనిని కానక, తమ తండాల దగ్గరికి, వస్తారు )
( ఆ తరువాత అందరూ కలిసి, స్వామి పాద రజాన్ని తీసుకొంటూ-- )
అందరూ – ఏడు కొండల వాడా ! స్వామీ ! ఎంకటేశ్వరుడా ! స్వామీ ! గోవిందా ! గోవిందా ! ( అంటూ ఎలుగెత్తి నామ స్మరణ చేసుకొంటూ, తమ తమ ఊఁర్లకి దారి తీస్తారు )
**************
( దృశ్యము 47 )
( శేషాచలం పైన చింత చెట్థు, దాని క్రింద, వల్మీకము )
( విష్ణువు స్నానం చేసి, వచ్చినట్లుగా. తన గిరజాల జుట్టు, తడి తుడుచుకొంటూ, వచ్చి, పుట్ట ద్వారం లోంచి, పుట్టలోకి ప్రవేశిస్తాడు )
పుట్టలోంచి ---- “ఓం , హ్రీం, హ్రీం, శ్రీం , శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః “
( విష్ణువు ఆ పుట్టను, చేతితో నిమురుతాడు. పుట్టలోని పిపీలకునికి, తన వెన్ను నిమిరినట్లు అనిపిస్తుంది. అతనికి వాణి కూడ లభిస్తుంది )
పిపీలిక -- ప్రభూ ! శ్రీనివాసా, వాసుదేవా, గోవిందా ! నీ స్పర్శతో నా జన్మ పులకించి, పోయింది.
విష్ణు ---- పిపీలికా ! నీవు కోరినట్లు, నీ ఇంటికి వచ్చాను. కొంతకాలం ఇక్కడే తపస్సు చేసుకోనిస్తావా ?
పిపీలిక – ఎంత మాట ప్రభూ ! ఈ అల్పజీవి పైన, మీ అవ్యాజ కరుణా కటాక్షాన్ని, వర్ణించేందుకు, నాకు మాటలు రావడం లేదు. ఆదిశేషుని కైనా సాధ్యము కాదేమో !---
( కొండ రూపంలో నున్న ఆదిశేషుడు, ఆ మాటలు వింటాడు )
ఆదిశేష -- నిజమే పిపీలికా ! స్వామి వారు సశరీరంగా మనతో నివసించుటకు విచ్చేసినారు ! అతని కరుణను చాటుటకు, నాకున్న నాలుకలు చాలవు !
విష్ణు -- ఆదిశేషా ! పిపీలికా ! మీ రిద్దరూ వినండి ! నేను కొంతకాలం, యీ చింత చెట్టునీడన వల్మీక మందే విశ్రమించి, తరుగని చింతయగు తపస్సును, చేయుటకు నిశ్చయించితిని ! నన్ను సేవించుటకు, గోపీనాథుడనే పేరుగల వైఖానస ఋషి, అతని భృత్యుడు, ‘రంగ దాసుడు’ రాగలరు ! వారికి తప్ప, మరెవరికీ యీ విషయము తెలియ కూఢదు !
పిపీలిక -- అటులనే ప్రభూ ! కాని, నా దొక చిన్న మనవి !
విష్ణు ---- ఏమది, పిపీలికా ?
పిపీలిక --- ప్రభూ ! మా లాగే, -- కృష్ణా గోదావరుల మధ్యస్థమగు. పిండారకమునందు, ఉగ్ర తపస్సులో మునిగి ఉన్న , ద్వారకా ఋషిని కూడా, కటాక్షింపక మానరు కదా !?
విష్ణు --- ద్వారకా ఋషి తపస్సు చేస్తున్న కొండకి కూడ వేంకటాద్రి యనియే పేరు ! వేంకటాద్రి ఎచట నుండునో వేంకటేశ్వరుడు అక్కడ ఉండ గలడు !
పిపీలిక ---- మహాభాగ్యము ప్రభూ ! ద్వారకా ఋషిని అనుగ్రహించే ముందు మీరు. ఆ కుంకుడు చెట్టు క్రింద కూడ, నా వల్మీకమందే అవతరించ వలెను !
విష్ణు --- ( నవ్వి ) అచట కూడ, నన్ను చీమల పుట్టయందే అవతరించు మందువా, నీ కెంత స్వార్థము పిపీలికా ?
పిపీలిక --- ప్రభూ ! వాహన మెక్కుతేనే పుణ్య క్షయం కలుగుతుందని మీ వాహన శ్రేష్టులకి సేవ నిరాకరించి, మీ భక్తితో ఉపవాసముంఢి తమ వృత్తి ధర్మాన్ని, నిర్వహించిన పంచములకు, ధన ధాన్యాలని అనుగ్రహించారు ! అప్పుడు మీ పుణ్య క్షయం కాలేదా ? ఎవరిని ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎందుకు నిరాకరిస్తారో మీ లీలలు తెలియుట ఎవరి తరము !! చిన్న సేవ నఢిగిన నేను స్వార్థపరుడినా ? నా వంటి అల్ప జీవిపై కూడ, , మీ కరుణా కటాక్షములు, నిరంతరము నిలువ గలవని, ప్రకటించుటకే, నేనట్లు పలికితిని !
విష్ణు ---- బాగున్నది ! బాగుగానే యున్నది, నీ లౌక్యము ! అయినను నీ కోరిక నేనెందుకు కాదన వలె ! అటులనే కానిమ్ము, సశరీర ధారినై రెండు చోట్ల అవతరించుట సాధ్యము కాదు గనుక, ద్వారకా తిరుమల యందు, శిలా రూపమున అవతరించెదను గాక ! ‘ త్రిపతి’ యగు నేను, నివసించు యీ వేంకటాచలము, ‘ తిరుమల ‘ యను పేరుతోను, ద్వారకా ఋషి తపము చేయు వేంకట గిరి ప్రాంతము‘ ద్వారకా తిరుమల’ యను నామధేయముతోను, వెలుగొంద గలవు గాక !
( ప్రవేశం వైఖానస ఋషి, రంగదాసుడు. వైఖానస ఋషి స్వామి మాటలు వింటాడు )
వైఖానస--- ప్రభూ ! దేవదేవా ! మీ కరుణ అపరంపారమైనది ! ద్వారకా ఋషిని అనుగ్రహించినట్లే, నన్ను కూడ, నేను మీకు పెట్టిన బాలాజీ యను పేరుతో విలసిల్లి, అనుగ్రహించెదరు గాక !
( విష్ణువు చిరునవ్వుతో తన సమ్మతిని తెలియ జేస్తాడు )
******************* ,

Comments
Post a Comment