బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --3
( దృశ్యము 10 )
( కైలాసం --- బ్రహ్మ, దేవతలు, ఋషి సమూహాము ప్రవేసిస్తారు )
( శివ శంకరుడు ధ్యాన మగ్నుడై ఉంటాడు )
( పాత్రలు -- బ్రహ్మ, దేవ ముని సమూహము, ఇంకా శంకరుడు )
బ్రహ్మ ---- ఓం నమశ్శివాయ---
దేవతులు --- ఓం నమశ్శివాయ---
ఋషులు ---- ఓం నమశ్శివాయ---
( శివుడు ధ్యాన ముద్రనుండి బయట పడి, వారి నందరినీ చిరునవ్వుతో చూస్తాడు )
బ్రహ్మ ----- మహాదేవా ! మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు----
దేవతలు,/ఋషులు ---- మేమందరము క్షంతవ్యులము----
బ్రహ్మ ----- అనంత, అనిలుల మహాపోరాటము భూలోకము నందు సమస్యగా ఘనీభవించినది. మీ జోక్యము లేనిదే శాతించేలా లేదు.
శివ ---- బ్రహ్మ దేవా ! మీరు, దేవతలు, మరియు ఋషుల ప్రతినిధులై మా ముందు వచ్చినందుకు, మేము చాల సంతసించితిమి. రండు, వారి పోరును ఆపి, లోక కళ్యాణమును జరిపించెదము గాక !!
( శివుడు, బ్రహ్మ, తదితర దేవ ఋషి సమూహములు అందరూ నిష్క్రమిస్తారు. )
******************
( దృశ్యము---11)
( భూలోకంలోని ఆనందాద్రి. ఆధిశేషుడు, వాయువుల పోరు జరుగుతూనే ఉంటుంది. )
( శివుడు, బ్రహ్మ, దేవ, ఋషి గణాలు ఇంకా మేరువు ప్రవేశిస్తారు )
( శివుని చూసిన ఆదిశేషుడు, వాయువు కాసేపు పోరాటాన్ని ఆపి, అందరికీ నమస్కరిస్తారు )
శివుడు ఆదిశేషుని దగ్గరకు వెళ్తాడు )
శివుడు ------ ఆదిశేషా ! మీ సర్ప జాతితో సంబంధము శివ, కేశవులకు చిర పరిచితము, అవునా ?
ఆదిశేష ----- అది ఏమి ప్రశ్న మహాదేవా ! మీరు పన్నగ భూషణులు, మా జాతికి మీరి ఇచ్చిన గౌరవము, నే నేట్లు విస్మరించ గలను )
శివుడు --- మంచిది అనంతా ! ఆ గౌరవము నీ కున్నది కనుకనే, చనువుతో నిన్నొక మాట అడగ దలచుకొన్నాను. నాతో పాటు, నీవు చుట్ట చుట్టుకొని బిగించి పట్టుకొని యున్న, ఆనందగిరి తండ్రి ; ‘మేరువు’ కూడ వచ్చినాడు.; ( అని మేరు పర్వతుని వంక చూపిస్తాడు శివుడు )
శివుడు --- ( మేరువుతో ) మేరు నగేంద్రా ! మీరు మీ కుమారుడు, ఆనందుని, అతనిని చుట్టి పట్టి, వాయువు తాకిడి నుంచి కాపాడుచున్న ఆధిశేషుని చూచినారు కదా ?
మేరువు ----- ( ఆదిశేషునికి నమస్కరించి ) అనంతా ! నేను నా కుమారుడు ఆనందుని, హరిసేవకే అంకితము చేసినాడను. వైకుంఠము నందు శ్రీవారికి క్రీడాద్రియై, అతడు ధన్యుడయ్యాడని తల పోసాను. ఇంతలో శ్రీవారి చిత్తము మారి, గరుత్మంతుని చేత, వానిని భూలోకమున స్థాపింపజేసి, వానికి ; గరుడాద్రి’ అని కూడ పిలిచేటట్లు, చేసినారు, ఇప్పుడు శ్రీవారి అపరావతారమైన మీరు వాని రక్షణకు పూనుకొని, మీ పేరు మీద వాడు, ‘శేషాద్రి’ అని కూడ పిలువబడే భాగ్యమును పొందినాడు.
ఆదిశేష ----- ( సంతోషంతో ) ఆనందుడైనా, ఆదిశేషుడైనా -- మేము శ్రీవారి దాసానుదాసులము ! పగవారి నుండి, మమ్ము మేము కాపాడుకొనుట మా ధర్మము !! ఇందులకు మీరు నన్నింతలా కొనియాడ నక్కర లేదు.
శివుడు ---- అనంతా !
ఆదిశేష ---- ( నమ్రతతో ) ఆజ్ఞ ! మహాదేవా !!
శివుడు ----- నేను వాయువుతో కూడ మాట్లాడి, పోరును స్థగితము చేసి, శ్రీ హరిని న్యాయ నిర్ణయమునకు పిలిచెదను. నీవు ఆనందునిపై, నీ పట్టును కాస్త సడలించుము.
ఆదిశేష --- మహాదేవా ! మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము ! అటులనే చేసెదను. ( అంటూ ఆనందగిరిపై తన పట్టును సడలిస్తాడు. )
(ఆదిశేషుడు తన పట్టు సడలించడం చూస్తాడు వాయువు. అతనిలో ఒక దురాలోచన కలుగుతుంది )
వాయువు ----- (తనలో ) శేషుడు తన పట్థు సడలించినాడు. ఇదియే సరియైన సమయము ! శ్రీ హరి న్యాయ నిర్ణయమునకు వచ్చు లోపల, నే నీ ఆనందుని ఎగుర వేసెదను గాక !
( వాయువు ఉన్నట్లుండి విజృంభించి తన బలాన్నంతా ఉపయోగించి ఆనంద గిరిని లేపుతాడు. పట్టు వదిలిన ఆదిశేషుడు, క్రిందకు జారి పోతాడు. గాలిలో ఎగిరిన ఆనందుని చూసి, మేరువు తల్లడిల్లుతాడు. చేతులు జోడించి, వాయువును వేడుకొంటాడు )
మేరువు ---- వాయుదేవా ! నాకు పుత్రభిక్ష పెట్టుము. నా కుమారునిపై నీ పగ అర్థము కాకున్నది !! అయినను నేను ఈర్ష్యాద్వేషములతో గాక, నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. నా పుత్రుని కాపాడుము !
( వాయువు మేరువు ప్రార్థన విని, ఆనందుని, మరో క్రోసెడు దూరంలో, జాగ్రత్తగా క్రిందకు దింపుతాడు )
వాయువు ---- ఓ మేరు నగేంద్రా ! నీ కోర్కెను మన్నించి, నీ కుమారునికి ప్రాణభిక్ష పెట్టాను. సంతోషమే కదా ?,
మేరువు --- ధన్యోస్మి, వాయుదేవా ! నేనును, నా కుమారుడును నీకు ఋణపడి ఉండగలము !!
ఆదిశేష ---- ( దీనంగా శివుని వంక చూస్తాడు. ) మహాదేవా ! చూచితిరి కదా యీ అన్యాయము !! మీ మాట మన్నించి నా పట్టు సడలించుట వలన, నే నీనాడు పరాజితుడ నయినాను !!!
శివుడు --- శేషూ ! చింతింపకుము ! వాయువు మనసులోని దురాలోచన, శ్రీవారి సంకల్పమే అయి యుండనోపును !! న్యాయ నిర్ణయ సమయమున , నేను నీకు సహాయము చేసెదను .( అని శివుడు, బ్రహ్మను, తక్కిన వారిని ఉద్దేశించి చెప్తాడు ) బ్రహ్మాది దేవతలారా ! ఋషులారా ! జరిగినదంతయు శ్రీ హరి సంకల్ప ప్రకారమే జరిగినది. ఇప్పుడు అందరము కలిసి, అతనిని ఉద్దేశించి, తదుపరి కార్యక్రమమును అడిగి తెలుసు కొనెదము గాక ! రండు--- శ్రీ హరిని ధ్యానింపుడు.
( శివుడు , దేవతలు, ఋషులు అందరూ నారాయణుని ప్రార్థిస్తారు )
అందరూ --- ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !
( దేవతల స్తోత్రము ముగియగానే శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రవేశిస్తాడు అతనికి అందరూ నమస్కరిస్తారు.)
విష్ణు ------- ఆదిశేషా ! యుద్ధం మగిసినట్లే కద !
ఆదిశేష ----- ముగిసినది మహాప్రభూ ! మీ భృత్యుడు ఈ యుద్ధమున వంచితుడైనాడు.
విష్ణు ----- ఆదిశేషా ! యుద్ధమనిని కేవలము బాహుబల ప్రదర్శన కాదు. బుద్ధి బలము కూడ కావలె ! నీ పని వాయువు తాకిడి నుంచి, అనందుని రక్షణ , అవునా ?
ఆదిశేష --- అవును ప్రభూ
విష్ణు ---- నీ విధిలో నీవు అప్రమత్తత పాటించక పోవుట వలననే, ఓటమిని ఎదుర్కొన్నావు !
ఆదిశేష --- ప్రభూ ! నేను మహాదేవుని ఆజ్ఞ శిరసా వహించి-----
విష్ణు ---- ఆగు అనంతా ! శివునాజ్ఞ పాటించి పట్టు సడలించానంటావు, అంతేనా ?
ఆదిశేష ------ అవును ప్రభూ !
విష్ణు ----- శివునకు, నాకు అభేదము తెలియని వాడవా నీవు ?
ఆదిశేష ---- స్వామీ, అటులయిన -----
విష్ణు --- నా సంకల్పము, శివ సంకల్పము అభిన్నమైనవి కావు. వెయ్యి సంవత్సరముల పాటు, ఆనంద గిరిని, స్థిరముగా నొక చోట నిలుపుట, తరువాత క్రోసెడు దూరమునకు దానిని తరలించుట , ఇదియే లోక కళ్యాణార్థమై మా సంకల్పము !!!
ఆదిశేష ---- ప్రభూ ! మీరు అసురులనే కాక, ఆశ్రితులను కూడ వంచించ గలరన్న మాట !
విష్ణు ---- కర్తవ్య నిర్వహణలో కఠోర నిర్ణయములకు లోబడక తప్పదు. అనంత సృష్టికి కర్తయైన విధాతనైనా, పాలన కర్తనైన నాకైనా, సంహార క్రియా శీలుడైన శివుని కైనా, ప్రకృతి నియమములు పాటించుచూ, లోక కళ్యాణము చేయుటయే కర్తవ్యము !! ఆ విధి నిర్వహణలో అసురులు, ఆశ్రితులు కాగలరు ! ఆశ్రితులు ఉపేక్షితులు కాగలరు.!
( ఆదిశేషుడు ఖిన్నుడై తల వంచుకొంటాడు )
శివుడు ---- ఆదిశేషా ! నా వలన నీవు ఓటమిని పొందడం, విధి నిర్ణయమని తెలిసినది కదా ! నీవు వెయ్యి సంవత్సరములు అనిలుని తాకిడిని నిరోధించి, ఆనంద గిరిని, ఆ గిరికి ఆవలి ప్రాంతాన్ని, కాపాడావు ! జరిగిన మహత్కార్యాచరణలో యీ ఓటమి చాల స్వల్పమయినది అనంతా ! అర్థం చేసుకొని ఆనందించు !!
ఆదిశేష --- మహాదేవా ! మీ ఓదార్పుతో నా మనసు నిర్మల మయినది ---- ( విష్ణువితో ) ప్రభూ ! నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను, నియమము ననుసరించి, మీ ఆజ్ఞా పాలన చేయువాడను . ఆజ్ఞాపించండి.
విష్ణు ---- ఆదిశేషా! ఇప్పుడు నీవు నా ప్రియమైన అనుచరుడవని అనిపించు కొన్నావు !! నీవు పర్వతాకారములో యీ ప్రాంతమందే శయనించి , భవిష్యత్తులో కూడ వాయు ప్రకోపములను నిలువరించి, లోక కళ్యాణము చేయవలెను !
ఆదిశేష ---- ( దుఃఖంతో ) ప్రభూ ! దేవ దేవా !! మీ సన్నిధి నుండి నన్ను బయటకు పొమ్మనుట తగునా ?
విష్ణు ---- అనంతా ! నీవు నా అనుచరుడవని, ఆజ్ఞాబద్ధుడవని, భావించితిని. నీకు ఇష్టము లేకున్న పోనిమ్ము !
ఆదిశేష ---- అంతమాట అనకండి ప్రభూ ! నేను మీ దాసానుదాసుడను, మీ ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను, కాని -----
విష్ణు ---- నీకు అభయ మిస్తున్నాను అనంతా ! నీ సేవకు మారుగా ఏదైన వరము కోరుకొనుము.
ఆదిశేష ---- ప్రభూ ! మీ సన్నిధి లోని సేవా భాగ్యమునకు దూరము చేసి, వరాన్ని ఇస్తామనడంలో ఔచోత్యం నాకు అర్థమవడం లేదు !!
బ్రహ్మ ------- ఆదిశేషా ! శ్రీ మహావిష్ణువు లీలలు ఎవరికి అర్థము కాగలవు ? వరము అడుగుమని అనుగ్రహించిన మీదట, అడుగుటయే నీ పని !!
శివుడు ---- అనంతా ! నిధి కన్న, సన్నిధి చాల సుఖమని, నిధిని నిరసించిన, నువ్వు నాకు చాల సంతృప్తిని కలిగించినావు. నా మాట మన్నించి, నీ పట్టు సడలించి భంగ పడినావు. -- కనుక శ్రీ హరి కన్న ముందు నేనే నీకు వరమీయ సంకల్పించితిని ! వినుము ఆనందగిరిని చుట్టి పరుండిన , నీ వాల భాగము నందు గల, ‘శ్రీశైలము’ నందున, మల్లికార్జున రూపంతో, భ్రమారాంబా సమేతముగ వెలిసి, నీకును, భూలోక వాసులకును సన్నిధి నీయుటకు సంకల్పించితిని !!!
ఆదిశేష ---- ధన్యోస్మి ! పన్నగ భూషణా ! ధన్యోస్మి !
( దేవతలు, ఋషులు బ్రహ్మ,విష్ణువుతో సహా అందరూ కలిసి ముక్త కంఠంతో )
అందరూ ---- సాధు ! సాధు ! సదాశివా !! సాధు, సాధు !!! మీరు అభిలషించిన మల్లికార్జున రూపము మమ్ములని తరింప జేయును గాక ! శ్రీశైలమునకు మీ రాక కొరకు, మేము చంద్రుని కొరకు చాతక పక్షుల వలె ,ఎదురు చూసెదము !!
బ్రహ్మ ---- శివ శంకరా ! నీ కరుణ అపరంపారమైనది !!! మీ యీ నూతన రూపము వినూత్న శోభలనందు గాక !!
విష్ణు ---- చంద్రశేఖరా ! మీ శ్రీశైల క్షేత్ర ప్రశస్తి ఆచంద్ర తారార్కమగును గాక !! ( ఆదిశేషునితో ) ఆదిశేషా ! శివ శంకరుని అవ్యాజ కరుణను గాంచితివి కదా ! నేను మాత్రము నీకు దూరమయి నివసింప గలనా ! నీ శిరోభాగమున నేను శ్వేత వరాహ రూపమున, భూదేవితో కలిసి, --- మరియు నీ శరీర మధ్య భాగము నందు గల, అహోబిలమందు నృశింహ రూపమున నెలకొని, నీకు నా సాన్నిధ్యాన్ని ప్రసాదించ గలను.
బ్రహ్మ ------ ఆదిశేషా ! నీవు భాగ్యశాలివి ! నీ వాల భాగమున కైలాస పతిని, శిరో_మధ్య భాగములందు, వైకుంఠ వాసుడు, నివాసము చేయగల వారు. ఇక నీకు తృప్తి కలిగినట్లే కదా !?
ఆదిశేష ----- స్వామీ ! ( అని విష్ణుపాదాలు పట్టుకొని వదలక విలపిస్తాడు )
విష్ణు ------ ఇది యేమి అనంతా ! నీ కింకను తృప్తి కలుగనే లేదా ??
ఆదిశేష ----- ప్రభూ ! మీ పరిపూర్ణావతార శ్రీ చరణములను , నా శిరస్సుపై మోపి కనికరింపక, తదితర భాగములందు , అంశావతార రూపమున సన్నిధి నిచ్చుట న్యాయమా ?! ప్రభూ ! ( విష్ణు పాదాలు పట్టుకొనే విలపిస్తాడు. )
విష్ణు ---- ఆదిశేషా ! నివు అత్యాశకు లోనగుచున్నావు.
ఆదిశేష ---- అత్యశ కాదు మహాప్రభూ ! అడియాస ! నా శిరస్సుపై మీ పురుషోత్తమ దివ్య రూప శ్రీచరణములను నెలకొల్పు, వరమిచ్చి, నన్ను కృతార్థునిగా చేయండి.
విష్ణు ----- భూలోక వాసుల శ్రేయమును కోరి, నిన్ను పర్వతాకారమున నిలిపి, నేనును కైలాస పతియును, నీ సేవలకు మారుగా వరముల నిచ్చితిమి/
ఆదిశేష ---- ప్రభూ ! దాసుని ఆంతర్యము తెలిసి కూడ, అరకొర వరము లొసగి, నన్ను తప్పు బూనుట, మీకు పాడి కాదు. ఈ భృత్యుడు మీ చరణ స్పర్శ లేనిదే మనజాలడు.
బ్రహ్మ ----- ప్రభూ ! మీ లీలలు మీకే తెలియ గలవు ! అడిగిన వరమిచ్చి, అనంతుని తృప్తి పరచుట, కరుణా సముద్రులైన మీకు సాధ్యము కానిదా ?
విష్ణు ---- బ్రహ్మదేవా ! అటులనే కానిండు ! ఆదిశేషా ! నీవు అడిగినట్లే , నీ శిరస్సు శ్రీ వేకటేశ్వర రూపమున వసించి, నీ కోరిక తీర్చగల వాడను. కాని, కొంత కాలము నీవు నిరీక్షింపక తప్పదు.
ఆదిశేష ---- ( సంతోషంతో ) ధన్యోస్మి ! ప్రభూ ! ధన్యోస్మి !
*************

Nice and interesting. Waiting for next post.
ReplyDelete