బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—13
( దృశ్యము 68 )
( స్వామి పుష్కరిణి )
( విష్ణువు తన నుడుటి మీద గాయాన్ని, నీటితో తుడుచుకొంటూ ఉంటాడు )
( అతని వెనుక నుండి శ్రీ వరాహ స్వామి వస్తాడు. వచ్చి శ్రీనివాసుని భుజము మీద తన చెయ్యి వేస్తాడు . విష్ణువు అతనిని వెను తిరిగి చూస్తాడు )
వరాహ-- నీ వెవరవు ?
విష్ణు -- నేను వైకుంఠ వాసుడను ! వైకుంఠమున నా పేరు విష్ణుమూర్తి ! నా భార్య యగు లక్ష్మి నన్ను వీడిపోవుట వలన ఆమెను వెదకుచు, భూలోకమున అనేక పుణ్యక్షేత్రములు తిరిగి, చివరికు యీ వేంకటాచలమునకు నా తండ్రియగు ‘కశ్యప మహర్షి’ ఆదేశము వలన , వచ్చితిని ! ఇక్కడ నున్న చింతచెట్టు మూలమున నున్న పుట్టలో తపము నాచరించుచున్నాడను ! నా తండ్రి నాకు పెట్టిన పేరు ‘ శ్రీనివాసుడు’ ! ఇంకొక భక్తుడు పెట్టిన పేరు ‘బాలాజి’! స్వామీ మీరెవరు ?
వరాహ --- నేనును ఒకప్పుడు వైకుంఠవాసినే ! హిరణ్యాక్షుడను దానవుడు, వర గర్వముచే, అహంకరించి భూమి నంతయు తన బాహు మూలమున బంధించి, సముద్రమున ముంచివేయ ప్రయత్నించుట చూచి, నేను శ్వేతవరాహస్వామిగా నవతరించి, వానిని వధించి, భూమిని తిరిగి ప్రతిష్టించితిని ! అప్పటి నుండి ఇచ్చోటనే నివసించు చున్నాను !! భిన్న రూపముల వెలుగు నీవును, నేనును ఒకే జ్యోతి నుండి, వచ్చిన వారము ! అర్థమయినదా ?
( విష్ణువు ఆనందంతో వరాహ స్వామిని కౌగలించుకొంటాడు )
వరాహ ---- లోక రక్షకా ! శ్రీనివాసా !! మీ రిచట ఎంత కాలము నివసింతురు ?
విష్ణు -- కలియుగాంతము వరకు నివసించుటకు నిశ్చయించితిని !
వరాహ --- మీరు కలియుగమున మానవులను కష్టవిముక్తులను చేయుటకే ఇచటకు వచ్ఛి యుందురని తలంచెదను !
విష్ణు ---- అవును ! శ్వేత వరాహ స్వామీ ! గడిచిన యుగములలో, లోక కళ్యాణమునకు ఎన్నియో అవతారములు ఎత్తినను, అవియన్నియు ఒక లక్ష్యము కొరకే ఎత్తినాడను !! ఈ కలియుగమున మానవులను పాప పంకిలము నుండి తప్పించుటకు వేంకటాచల మందు, అర్చావతారమెత్తుటకు సంకల్పించితిని !
వరాహ --- శ్రీనివాసా ! ఈ ప్రాంతమంతయు నా పేరుపై, వరాహ ప్రాంతముగా పిలువబడుచున్నది ! మీరు ఇచట నివసించుటకు కొంత ద్రవ్యము చెల్లించ వలసి యున్నది !
విష్ణు --- నిజమే ! ప్రస్తుతము లక్ష్మి నన్ను వీడిపోయినందున మీకు ద్రవ్యము నెట్లు చెల్లించ గలను ?
వరాహ -- శ్రీనివాసా ! తాము మానవుల శుభమును గోరి ఇచట నివసింప దలచితిరి ! మీ భక్త సందోహము, మీకు చేయు నివేదనలోని మొదటి భాగము నాకు చెల్లించదనని మాట యిచ్చిన చాలును !
విష్ణు --- చాల సంతోషము ! అట్లే యగు గాక ! నా దర్శనార్థము వేంకటాచలమునకు వచ్చు భక్తులు, తొలుత స్వామి పుష్కరిణిలో స్నానమాడి, మిమ్ములను సేవించి, మీకు నివేదనలు సమర్పించి, మీ యనుగ్రహము పొందిన పిదుప, నా సన్నిధికి వచ్చి, తమ నివేదనలను సమర్పించెదరు ! అట్టివారి నివేదనలను నేను అత్యంత ప్రీతితో స్వీకరించెదను !
వరాహ -- తథాస్తు !
( ప్రవేశం వకుళమ్మ )
వరాహ-- వకుళమ్మా ! ఓ వకుళమ్మా !
వకుళ--- వరాహ స్వామీ ! తమరిచటనే ఉన్నారా ?
వరాహ --- వకుళమ్మా ! నేటితో మీరు నాకు సేవలు చేయనక్కర లేదు !
(వకుళమ్మ బిత్తర పోతుంది )
వరాహ -- ( నవ్వుతూ ) అవును వకుళమ్మా ! ఈ నాటి నుంచి మీరు నా సేవలు చేయనక్కర లేదు !
వకుళ -- అదేమి స్వామీ ! నేనేం అపచారం చేసాను ?
వరాహ -- అపచారము కాదు వకుళమ్మా ! మీ పుణ్యఫలము మీకు దక్కబోవు సమయము వచ్చినది ! ఇదుగో చూడుడు ! ఇతడే నీ కృష్ణుడు !!
( వకుళమ్మ శ్రీనివాసుని తేరిపార చూస్తుంది. ఆమెకు అతను శ్రీకృష్ణుని లాగే కనిపిస్తాడు )
వరాహ -- ఇప్పుడితడు శ్రీనివాసుడను పేర వైకుంఠము నుండి వచ్చి, చింత చెట్టు క్రింద వల్మీకములో నివసించుచున్నాడు ! తలమీద గాయమయి బాధపడుచున్నాడు ! కనుక నేటినుంచి, నాకు బదులుగా, ఈతనికి తగిన సేవలందించుచు మాతృవాత్సల్యము తీర్చుకొనుము ! ( అని వెళ్లిపోతాడు )
విష్ణు -- అమ్మా, వకుళమ్మా ! నీవే ద్వాపరమున నన్ను పెంచిన యశోదమ్మవు ! గుర్తు వచ్చినదా ?
వకుళ --- వచ్చినది ! కన్నా ! వచ్చినది. నీ లీలలలో ఏది ముందు తలచుకోవాలో తెలియక సతమతమవుతున్నాను ! నాయనా ! నా శ్రీనివాసా ! నీకీ తలపైన గాయమేమిటి ? పద ! ముందు మందు వేసి కట్థు వేస్తాను ! ( అంటూ శ్రీనివాసుని తీసుకొని వెళ్తుంది )
**********************
( దృశ్యము 69 )
( నైమిశారణ్యము )
( సూత పౌరాణికుడు శౌనకాది మునులు ఉంటారు )
సూత --- ముని పుంగవులారా ! ఆ విధముగా శ్రీనివాసుడు, శేషాచలము చేరి, వల్మీకము నందు ఉగ్ర తపస్సు చేసి, తపో ఫలము నందుకొను సమయమున వైఖానసాదులను బయటకు పంపి, గోరూపము ధరించిన బ్రహ్మ వలన సకల దేవతల , బల , వీర్య , తేజో, జ్ఞాన , సంపదలను తపః ఫలముగా పొంది, గొల్లవాని కుఠార ఘాతమును నిమిత్తముగా చేసుకొని, బయటపడి, స్థిర నివాసమునకై వరాహ స్వామి అనుజ్ఞ పొంది, వకుళా మాత కోరిక తీర్చు నెపము , ఆమెను తల్లిగా స్వీకరించిన వాడయ్యెను !
శౌనక --- సూతమహర్షీ ! శ్రీనివాస స్వామి సశరీరముగా వేంకటాద్రి యందు విహరించెనందురా ?
సూత --- వేంకటాచల విహారము చేయుట వలననే ఆయన వేంకట రమణుడు అయునాడు !
1 ఋషి -- సూతమహర్షీ ! వకుళా మాత పూర్వ జన్మమున యశోదయని మీరు చెప్పినారు కదా !
సూత --- అవును, ఆమె శ్రీకృష్ణుని బాల్య లీలలు మాత్రమే చూడగలిగినది. తన కుమారుని, వివాహ వేడుక చూడవలెనను, కోరిక బలీయమయి ఆమె మరల జన్మమెత్త వలసి వచ్చినది.
2 ఋషి --- సూత మహర్షీ ! ద్వాపరమున శ్రీ కృష్ణ భగవానుడు, అష్ట భార్యలను వివాహమాడినను, యశోదా మాత ఒక్క కళ్యాణమైనను, చూడలేక , ఆ కోరికతో వకుళ మాతగా జన్మించెనని తెలిసినది. అటులైన యీ జన్మమందు ఆమె ఎన్ని కళ్యాణములు ఛూసినది ?
సూత --- పద్మావతీ పరిణయాన్ని!, స్వామి సశరీరముగా ఉన్నప్పుడు , అతను కోరుకొన్న కోడల్ని, తెచ్చుకొని ఆనందించినది.
3 ఋషి -- స్వామి అర్చావతారము దాల్చిన తదుపరి, ఎన్ని కళ్యాణములు జరిగినవి ?
సూత -- గోదా దేవితో ఒకటి, బీబీ నాంచారితో ఒకటి, రెండు కళ్యాణములు జరిగినవి.
4 ఋషి -- సూతమహర్షీ ! మాకా కళ్యాణ వేడుకలు, వినుటకు కుతూహలముగా నున్నది !
సూత --- మునిసత్తములారా ! స్వామి కళ్యాణ గాథలను, శ్రవణానంద కరముగా వినుడు.
*****************
( దృశ్యము )
( సుధర్ముని అంతఃపురము. )
( రాజు సుధర్ముడు, రాణి మనోరమ, సుధర్ముని కొడుకు ఆకాశరాజు, కూర్చొని ఉంటారు )
( ప్రవేశం తొండమానుడు. అతని నడుముకి దొండ తీగలు చుట్టబడి ఉంటాయి. తొండమానుడు వచ్చి, తన చేతికి ఉన్న రాజముద్రికను తీస్తాడు )
తొండ --- రాజ దంపతులకు నమస్కారము ! యువరాజు ఆకాశరాజుల వారికి నమస్కారము ! ( అని వారికి నమస్కారం చేస్తాడు )
సుధర్ముడు-- యువకుడా ! ఎవరు నీవు ? ఏమి ఆశించి వచ్చావు ?
తొండ --- మహారాజా ! నా నడుమునకు, యీ దొండతీగలను చుట్టి పంపిన నా తల్లి, మీకు కపిల తీర్థముందు గల దొండ పందిరిని జ్ఞాపకము చేయమన్నది ! అదిగాక, ఈ రాజముద్రికను కూడ ఈయమన్నది. ( అని ఉంగరాన్ని రాజుకి ఇస్తాడు )
( సుధర్ముడు ఆ రాజముద్రికను తీసుకొని, చూస్తాడు. అతనికి నాగకన్యక ఉదంతం జ్ఞాపకానికి వస్తుంది. వెంటనే ఆసనం నుండి లేచి, ఆ యువకుని కౌగలించుకొంటాడు. )
సుధర్ముడు--- దేవీ ! ఈ యువకుడు, నాగకన్యక యందు నాకు కలిగిన కుమారుడు. ( అని ఆకాశరాజుతో ) కుమారా ! వీడు నీ తమ్ముడు !
( అని పరిచయం చేస్తాడు. యువకుడు మనోరమకు పాదాభివందనం చేస్తాడు )
మనోరమ-- ( వానిని లేవనెత్తి ) కుమారా ! నీ పేరేమిటి ?
తొండ --- మాతా ! నన్ను కన్నతల్లి, నాకు పెట్టిన పేరు దొండ తీగలకు సంబంధించినది !
మనోరమ--- అంటే ఏమిటి కుమారా ?
తొండ --- మాతా ! నా పేరు తొండమానుడు !
ఆకాశరాజు--- తొండమానుడా ! చిత్రమైన పేరు, -- నీవు నా కనిష్థ భ్రాతబన్న విషయము అర్థమయినది ! రమ్ము ! ( అంటూ తొండమానుని కౌగలించుకొంటాడు )
( మనోరమ వారిద్దరనీ తృప్తిగా చూస్తుంది. రాజుకి చూపిస్తుంది )
మనోరమ-- చూసితిరా స్వామీ ! వీరిరువురు రామ లక్ష్మణుల వలె నున్నారు కదా !
సుధర్ద్ముడు-- ( అనందంతో కళ్లు చెమ్మగిల్లగా ) అవును దేవీ !
మనోరమ--- అటులయిన , మీ వాగ్దానమును నెరవేర్చు సమయము వచ్చినది.
సుధర్ముడు-- వాగ్దానమా ? అది ఏది దేవీ !
మనోరమ--- ఈ యువకుడైన తొండమానుడును, నా కుమారుడు ఆకాశరాజునకును, రాజ్యము చెరి సగము పంచి ఇత్తునను, మీరు మీ ప్రణయసఖి, నాగకన్యకకు ఇచ్చిన వాగ్దానము !
సుధర్ముడు--- లేదు దేవీ ! నేనా వాగ్దానమును మరువ లేదు ! నీ యభిప్రాయము కనుగొనుటకు, అటుల ప్రశ్నించితిని. కుమారా , ఆకాశరాజా ! నీవేమందువు ?
ఆకాశరాజు-- తండ్రీ ! మీ ఆజ్ఞ, దానికన్న ముందు మీరిచ్చిన వాగ్దానము, నాకు శిరోధార్యములు !
******************
( దృశ్యము 71 )
( ఆకాశ రాజు గది )
( రాజు అతని భార్య ధరణీదేవి, మంత్రి, పురోహితుడు, మరో ఇద్దరు జ్యోతిష పండితులు కూర్చొని ఉంటారు )
ఆకాశరాజు-- మహామాన్యులారా ! ఎన్నెన్ని బోగాలు, భాగ్యములు ఉన్నా, అవన్నీ సంతానంతో సరితూగవు !-- నా భార్య ధరణీదేవిని, ‘ఇంకా సంతానం కలుగలేదా అన్న ప్రశ్న నిరంతరము రేయింబగళ్లు, స్వప్న సుషుప్తులలోను, వెంటాడి వేధించు చున్నది.—ఈ నాలుగు మాటలతో నేను నా మనోవ్యధను సరిగా చెప్పలేక పోయినా, పండిత ప్రకాండులయిన ,మీకు, అర్థం చేసుకోగలరని తలస్తాను ! నాకు సంతతి కలిగే ఉపాయం చెప్పి, పుణ్యం కట్టుకోండి !
( ఇంతలో అక్కడికి ఒక రాజభటుడు వస్తాడు )
భటుడు --- మహారాజులకు అభివాదములు ! శ్రీ శుక మహర్షులవారు, బయట తమ ప్రవేశానికి అనుమతి అడుగుతున్నారు.
( ఆకాశరాజు దిగ్గున ఆసనం నుండి లేస్తాడు. అందరూ అతనిని చూసి లేస్తారు )
ఆకాశరాజు-- శుక మహర్షుల వారికి, నా సభ యందు ప్రవేశానుమతియా ? ఎంత మాట ! అమాత్యా !!
మంత్రి -- ప్రభూ !
ఆకాశరాజు --- మీ రతనికి ఎదురేగి, సగౌరవముగా నిచటకు, తోడ్కొని రండు !
మంత్రి -- అటులనే ప్రభూ !
( మంత్రి భటునితో పాటు బయటికి వస్తాడు. ఆకాశరాజుతో పాటు అందరూ ద్వారం వంక చూస్తూ ఉంటారు)
( మంత్రి శుకమహర్షిని వెంట పెట్టుకొని వస్తాడు. మహర్షి లోపలికి రాగానే ఆకాశ రాజు చేతులు జోడించి )
ఆకాశరాజు--- శుక మహర్షీ ! మీ రాకతో నా రాజప్రాసాదము పావనమయింది ! మేము ధన్యుల మయ్యాము ! రండు, ఆశీనులు కండు ! ( అంటూ తన ప్రక్కనే ఉన్న ఆసనం పైన కూర్చో పెట్టుకొంటాడు )
( శుకమహర్షి కూర్చొన్న తరువాత, రాజు తరువాత తక్కిన వారు కూర్చొంటారు )
( ధరణీదేవి లేచి వచ్చి, శుక మహర్షికి నమస్కరిస్తుంది )
ధరణి -- శుకమహర్షుల వారికి, ఈ అభాగిని అయిన ధరణీ నమస్కరిస్తున్నది !
శుక --- ( లేవనెత్తి ) పుత్రీ ! విశాల సామ్రాజ్యమునకు మహారాణివి ! నీవు అభాగినివి ఎట్లయినావు ?
ధరణి –ఎన్ని సంపదలున్నను, పుత్రవతి కాని స్త్రీ , పుణ్య స్త్రీ ఎట్లగును మహర్షీ ?
శుక -- అదియా నీ మనోవ్యధ !
( చిరు నవ్వుతో ఆమె వంక చూసి. కూర్చోమని సైగ చేస్తాడు . ఆమె తన ఆసనంపై కూర్చొంటుంది )
మంత్రి -- మహర్షీ ! ఇది ఈ రాజదంపతులకే కాదు, మాకును తీరని మనోవ్యద !
పురోహిత--- మహర్షీ ! మహారాజుల వారును, మహారాణీ వారును, అధుగ దలచు కొన్నది----
1 పండిత-- బ్రహ్మర్షులయిన తమ రాక వల్ల సానుకూలమయింది !
2 పండిత-- వేదవ్యాస పుత్రులయిన తమకు తెలియని ధర్మ సూక్ష్మములు ఉపాయములు లేవు ! పుత్రార్థులయిన ఈ రాజదంపతులకు---
1 పండిత-- ఇష్ట కామ్య సిద్ధి కలిగే ఉపాయం సెలవివ్వండి.
శుక---ఆకాశరాజా ! మీ దంపతుల జాతక చక్రములను ,జ్యోతిర్విదులైన యీ పండితులు పరిశీలించినారు కదా !
ఆకాశరాజు—అవును మహర్షీ !
శుక--- మీకు సంతతి కలుగదని ఎవరైనా చెప్పారా ?
ఆకాశరాజు--- దైవజ్ఞులయితే కలదనే చెప్పారు-- కాని---
శుక -- కాలము కలిసి రానందువల్ల కలుగుట లేదు, అంతేనా ?
ఆకాశరాజు--- ( ఆనందంతో ) అటులయిన మాకు పుత్రప్రాప్తి కలదా మహర్షీ !
శుక --- పుత్రుడే కావాలన్న తపన దేనికి మహారాజా ?
ఆకాశరాజు--- ‘ అపుత్రస్య గతిర్నాస్తి’ అని ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా , మహర్షీ ?
ధరణి --- (ఉద్వేగంతో ) లేదు, మహర్షీ ! పుత్రుడే పుట్టాలన్న కోరిక నాకు లేదు ! నాకు కావలసినదల్లా నన్ను, ‘ అమ్మా’ అని పిలిచే సంతానము !.
శుక--- పుత్రీ ! నీ మాతృత్వ కాంక్ష నాకు విశదమయినది ! నీ కోరిక తప్పక నెరవేరగలదు !
ఆకాశరాజు + ధరణి ---- నిజమా మహర్షీ !
శుక --- రాజ దంపతులారా ! వినుడు. మీ రాజ్య సరిహద్దులందు గల వేంకటాచలము కామితార్థములిచ్చు కొండ ! ఆ పర్వత రాజమును దర్శించిన పిదుప, పుత్రకామేష్టి యాగమును చేయుము ! తొల్లి త్రేతా యుగమున , మిథిలా నరేశుడయిన జనక మహారాజునకు, సీతాదేవి లభించినట్లు, ఈ యాగము వలన నీకు పుత్రికా రత్నము లభింపగలదు !!
ధరణి --- నిజమేనా మహర్షీ ?
శుక -- అవును పుణ్యవతీ ! అయోనిజయైన ఆ బాలిక సామాన్యురాలు కాదు, వాక్సుద్ధి కల ఆ బాలిక, ఏ నాడు, తన నోటితో ‘ సోదర’ శబ్దమును, ఉచ్ఛరించునో ఆ నాడే నీ గర్భము ఫలించి, పుత్రోదయము కూడ కాగలదు ! -- నేను యీ వార్త తెలుపుటకే మీ నగరికి విచ్చేసినాను ! ఇక నాకు సెలవిండు !
( అని లేస్తాడు, అందరూ అతనికి నమస్కరిస్తారు )
*******************

Comments
Post a Comment