Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 15

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 15

( దృశ్యము 75 )

( అగ్ని లోకం )

( వేదవతి తపస్సులో ఉంటుంది. ప్రవేశం, అగ్ని దేవుడు )

అగ్ని --- అమ్మా, వేదవతీ ! నీవు నిరంతరం స్మరించే శ్రీహరి సేవ చేసే భాగ్యం లభ్యమయింది !

( వేదవతి కళ్లు తెరచి చూస్తుంది. ఆమె కళ్లల్లో కాంతులు చోటు చేసుకొంటాయి )

వేదవతి--- నిజంగానా, తండ్రీ ?

అగ్ని ---అవును, ముందు నిస్వార్థ భావంతో నీ సేవలందించి, నీ జీవితాశయాన్ని తరువాత తెలియజేసి, అర్థించడం మంచిదని నా అభిప్రాయం, నీవేమంటావు ?

వేదవతి--- హరిసేవా భాగ్యాన్ని మించిన తపస్సేముంది తండ్రీ ! ఇంతకీ నేను చేయాల్సిన సేవ ఏమిటి ?

అగ్ని ---- శ్రీమహావిష్ణవు యీ త్రేతాయుగమున, శ్రీరామచంద్రునిగా అవతరించుట , నీకు తెలిసినదే కదా ?

వేదవతి--- అవును, అతను తన అవతార లీలా విశేషం వల్ల, పంచవటిలో వాసం చేస్తున్నారనీ, అక్కడే ‘ ఖర-దూషణాదులను’ సంహరించారనీ, రావణుని సోదరి, శూర్పణఖ , అతనిని కామించి, లక్ష్మణుని చేత పరాభవం చెందిందనీ విన్నాను.

అగ్ని ---- వేదవతీ ! శూర్పణఖ తన పగ తీర్చుకొనేందుకు, పన్నాగం పన్ని, శ్రీరామచంద్ర పత్ని అయిన సీతా మహాలక్ష్మి సొగసును తన అన్న రావణుని కడ, వర్ణించి చెప్పినది.

వేదవతి--- అయ్యయ్యో ! ఆ రావణాసురుడు ఉత్త కామాంధుడే !! సీతా మహాలక్ష్మికి అపచారము చేయునేమో ?

అగ్ని --- అవును వేదవతీ ! ఆ కామాంధుడు, ఆ సీతాదేవిని మాయతో అపహరించి, తన పుష్పక విమానములో ఎక్కించి, లంకకు తీసుకొని పోవుచున్నాడు.

వేదవతి--- ( ఆందోళనతో ) తండ్రీ ! ఆ సాధ్వీమణిని ఎలా రక్షించాలి ?

అగ్ని --- అది నీ వల్లనే సాధ్యమవుతుంది ! నీకు, సీతామహాలక్ష్మికి రూప సామ్యమున్నది గనుక, ఆ సీత స్థానమున, నీవు లంకకు పోయినట్లయిన, ఆమెను రక్షింప గలవు !

వేదవతి--- తండ్రీ ! సీతామహాలక్ష్మిని కాపాడేందుకు, నేను, ఏ త్యాగమైనను, చేయుటకు సిద్ధముగా నున్నాను ! కాని అదెట్లు నెరవేరును ?

అగ్ని -- చాల సంతోషం వేదవతీ ! నేను నిన్ను తీసుకెళ్లి, రావణాసురుని దారిలో సంధించి, నీవే శ్రీరామ పత్నివని, అతను తీసుకొని వెళ్తున్న వనిత, మాయా సీత అని చెప్తాను ! శ్రీరామచంద్రుడు అసలు సీతవైన నిన్ను, నా దగ్గర దాచాడని చెప్పి, నిన్ను అప్పగించి, ఆమెను నాతో తీసుకు పోతాను ! రమ్ము, సత్వరముగా బయలుదేరుము.

( వేదవతి బయలుదేరుతుంది )

********************

( దృశ్యము 76 )

( సూత పౌరాణికుడు, శౌనకాది మునులు ఉంటారు )

సూతుడు -- మునులారా ! వేదవతి కథను విన్నారు కదా ! శ్రీహరిని పతిగా పొందుటకు, ఆమె చేసిన తపస్సు, శ్రీమహాలక్ష్మికి ఆమె చేసిన సేవల ఫలితముగా, ఆమె పద్మావతిగా జన్మించి, ఆకాశరాజుకి పుత్రిక అయినది.

శౌనక--- సూతమహర్షీ ! చోళ రాజపుత్రిక అయిన పద్మావతి, వేంకటాచల రమణుడైన శ్రీనివాసుని, ఏ విధముగా కలిసి, కళ్యాణము చేసుకొనినది, మాకు విన కుతూహల మగుచున్నది !

1 ఋషి -- మహర్షీ ! లోకోత్తరమైన ఆ కళ్యాణ గాథను, మీ నోట వినుటకు మనము ఉవ్విళ్లూరుచున్నది !

2 ఋషి -- పద్మావతీ , శ్రీనివాసుల కళ్యాణము కడు రమణీయమని విన్నాము !

3 ఋషి -- కథా కథన సామర్థ్యమున సాటిలేని మేటి అయిన, మీ నోట ఆ వృత్తాంతము వినుట ----

4 ఋషి -- కడుంగడు కమనీయమగునని మా తలపు !

సూతుడు--- మునులారా ! మీరన్నది నిజమే ! కమనీయమే కాదు, కామితార్థము కూడ నిచ్చునట్థి, ఆ కళ్యాణమునకు, నాంది పలుకుటకై, కలహభోజనుడైన నారదుడు కూడ, కుతూహలముతో, వృద్ధ బ్రాహ్మణ వేషమున, పద్మావతి మనమున రాగబీజము నాటుటకై, చోళరాజ్యమునకు వెడలినాడు.

********************

( దృశ్యము 77 )

( ఆకాశరాజు కోటలో ఉపవనము )

( పద్మావతి ఒక పూలచెట్టు నీడ, గట్టుపైన కూర్చొని ఉంటుంది )

( ప్రవేశం నారదుడు. వృద్ధ బ్రాహ్మణ వేషంతో )

నారద ---- అమ్మా, పద్మావతీ ! ( అని పిలుస్తాడు )

( పద్మావతి అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలి బ్రాహ్మణుని చూచి, భయపడుతుంది )

నారద -- భయపడకమ్మా, పద్మావతీ ! నేను వృద్ధ బ్రాహ్మణున్ని ! నీవా రాకుమారివి ! నీకు, నేనేం అపకారం చేయగలను ?

ఫద్మావతి--- ( తేరుకొని ) భూసురోత్తమా ! మీరెవరు ? నాతో ఏమి పని ?

నారద --- నీకు జ్యోతిషం చెప్పడానికి వచ్చాను. ఏదీ,-- నీ చెయ్యి ఒకసారి , చూపించు !

పద్మావతి--- జ్యోతిషమా ! నాకా --- ఎందుకు ?

నారద--- ఎందుకేమిటి తల్లీ ! నీ ముఖ కవళికలు చూస్తే, భయము ఇంకా తగ్గినట్లు లేదు ! విను నీవు ఆకాశరాజు పుత్రికవు , పద్మావతివి, అవునా ?

పద్మావతి--- అవును.

నారద -- నీ కొక తమ్ముడున్నాడు, పేరు -- వసుధానుడు, అవునా ?

పద్మావతి--- ఇవన్నీ అందరికీ తెలిసినవే ! ( అని కిలా కిలా నవ్వుతుంది )

నారద--- అమ్మయ్య ! ఎంత సేపటికి నవ్వావమ్మా ! వెన్నెల వెదజల్లినట్లుంది !

( పద్మావతి సిగ్గు పడుతుంది )

నారద -- ఏమ్మా ! నేను అడిగింది, నువ్వు ఇవ్వనే లేదు ?

పద్మావతి--- ఏమడిగారు మీరు ?

నారద -- నీ చెయ్యి ఒకసారి చూపించ మన్నాను.

పద్మావతి -- నా చెయ్యి చూసి, ఏం చెప్తారు ?

నారద -- అన్నీ చెప్తాను. నువ్వెవరివో చెప్తాను ! నీకు రాబోయే వరుడు ఎలాంటివాడో చెప్తాను ! చూడు--- నీ చెలికత్తెలు కూడ దగ్గరగా లేరు, చప్పున చూసి, చెప్పవలసినవి చెప్పి, చల్లగా జారుకొంటాను.

( పద్మావతి తన చెయ్యి చూపిస్తుంది. నారదుడు ఆమె చెయ్యివంక పరీక్షగా చూస్తాడు )

నారద -- తల్లీ ! ఏమి హస్తమమ్మా నీది ! భర్తృ కారకుడైన శుక్రుడు, మీనరాశిలో పరమోచ్ఛలో ఉన్నాడు ! కంకణ ప్రాప్త సమయమయింది ! పురుషోత్తముడైన వరుడు, నిన్ను వెతుకుకొంటూ వస్తాడు ! దేవతలే నీ పెళ్లికి పెద్దలవుతారు !

పద్మావతి--- నిజమా ? !

నారద -- అవును (పద్యము )

ఆ.వె-- పూర్వ పుణ్యమునను, పురుషోత్తముని చేయి
బాల రుక్మిణమ్మ బట్టినట్లు, హరియె
పాణి బట్టు, నాశ్చర్య పడబోకు,
కమలనేత్రి, నిన్ను గాంచి వచ్చు,
అమరులెల్ల వచ్చి, ఆశీర్వదింపుచున్
పెండ్లి చేతురమ్మ, భామ వినుము !,

పద్మావతి -- మరి నా గురించి చెప్తానన్నారు !

నారద -- నీ గురించా తల్లీ ! చెప్పేందుకు చాలా ఉంది ! విను ---

( ఇంతలో చెలికత్తెలు అటువైపు వస్తూ ఉంటారు. నారదుడు అది చూసి-- )

నారద -- వస్తానమ్మా ! వచ్చిన పని అయిపోయింది ! ( అంటూ వెళ్లిపోతాడు )

1 చెలి- రాకుమారీ ! ఎవరతను ?

పద్మావతి – ఎవరో, పాపం ! వృద్ధ బ్రాహ్మణుడు !

2 చెలి -- మీ చెయ్యి చూసి, ఏం చెప్తాడమ్మా ?

( పద్మావతి మాట్లాడదు )

3 చెలి -- మీ పెల్లి గురించి ఏమైనా చెప్పారా ?

( పద్మావతి అవునన్నట్లు తల ఊఁపుతుంది )

1 చెలి -- ఏయ్ ! పదవే ! అతన్నే వెతికి పట్టుకొందాం . రాకుమారి ఎలాగూ చెప్పదు !

2 చెలి -- అవునే ! పద, కాస్త పరుగెడితే, చాలు,-- పాపం ముసలాడు, ఎలాగూ వేగంగా వెళ్లలేడు !

3 చెలి -- పదండే !

(చెలులు నారదుడు వెళ్లిన వైపు పరుగెడుతారు. నారదుడు ఇటు, ఆటు తిరిగి, వారిని ఆట పట్టిస్తాడు. చివరికి అంతర్థానమవుతాడు )

( చెలికత్తెలు అతనిని వెతికి అలిసిపోతారు. పద్మావతి దగ్గరకు వస్తారు )

౧ చెలి- అబ్బ ! ముసలి బాపడు ఎంత వేగం పరుగెత్తాడే ?

పద్మావతి--- ఆ భూసురుని ముసలి, ముతక అనకండే !

౨ చెలి --- ఏమమ్మా ! మాకన్న ఆ భూసురుడే , ఎక్కువయ్యాడా నీకు ? ఇంతకూ ఏం చెప్పాడేంటి జోస్యం ?

పద్మావతి-- పోవే ! నేను మీతో చెప్పను.

*********************

( ద్ర్ర్ర్రుశ్యము ౭౮ )

( చోళరాజు అంతఃపురం. ధరణీ దేవి, ఆకాశరాజు ఉంటారు )

ధరణి --- మహారాజా ! ఈ వార్త విన్నారా ? ఈ రోజు మన పద్మావతికి----

ఆకాశ ---- ఏమయంది, పద్మావతికి ?

ధరణి -- ఆబ్బ ! ఎంత ఆత్రుత ? మీ కూతురుకేమీ కాలేదు లెండీ ! చెప్పేది వినండి, ఈ రోజు మన ఉద్యానవనానికి, ఒక వ్రుధ్ధ బ్రాహ్మణుడు వచ్చి, అమ్మాయి చెయ్యి చూసి, ---

ఆకాశ్ -- అదా సంగతి ! ఏం చెప్పాడేమిటి ఆ భూసురుడు ?

ధరణి -- మన పద్మావతికి పురషోత్తముడైన వరుడు, తనంత తానే, వెతుకుకుంటూ వస్తాడట ! ఆమె పెళ్లికి దేవతలే పెద్దలవుతారట !

ఆకాశ --- ఆహా ! ఎంత చల్లని వార్త చెప్పావు ! మొన్న ఉగాదికి రోజున, మన రాజ సభకి వచ్చిన దైవజ్ఝ్ఝులు కూడ ఇవే మాటలు చెప్పారు. చూడబోతే పద్మావతికి, కళ్యాణ యోగం పట్టినట్లే !

ధరణి --- ఆమె పెళ్లి ఎంతో, వైభవంగా చెయ్యాలండీ ! ఆఆ పెళ్లికి శుక మహర్షుల వారిని, తప్పక పిలవాలి !

ఆకాశ --- అవును దేవీ ! అతనిని తొలి పిలుపు పిలిచేందుకు, మన తొండమానుని, పిలువ నంపుదాం.

******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద