Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 16

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 16

(ద్ర్రుశ్యము ౭౯ )

( వేంకటాచలం. నారాయణ వరం మధ్యనున్న అరణ్యం. శ్రీనివాసుడు, గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటాడు. )

( దారిలో రెండు పులులు, ఒకదానితో ఒకటి దెబ్బలాడుకొంటూ ఉంటాయి. గుర్రం ఆ ద్రుశ్యం చూసి, ముందుకి వెళ్లడానికి, మొరాయిస్తుంది. )

( శ్రీనివాసుడు గుర్రం ఆపి, ఆ ద్రుశ్యాన్ని చూస్తాడు. వెంటనే క్రిందకి దిగి, ఒకే ఒక బాణంతో, పులులు రెండింటినీ హతమారుస్తాడు. ఆ తరువాత శ్రీనివాసుడు తిరిగి గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్తాడు )

( దారిలో కొన్ని జింకలు పరుగెడుతూ కనిపిస్తాయి. ఆ జింకలను తరుముతూ , ఒక మత్తగజం వస్తుంది. )

( శ్రీనివాసుడు జింకలను రక్షించే నిమిత్తం గుర్రాన్ని, మత్తగజం వెనుక పరుగెత్తిస్తాడు. ముందుగా ఏనుగు, దాని వెనుక శ్రీనివాసుడు, ఆకాశరాజు ఉపవనం లోకి ప్రవేశిస్తారు . చిత్రంగా ఏనుగు మాయమవుతుంది !)

( ఉపవనంలో, ఒక పూల చెట్టు గట్టుపైన, పద్మావతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. శ్రీనివాసుడు గుర్రం దిగుతాడు. పద్మావతి అతనిని చూస్తుంది. శ్రీనివాసుడు ఆమెను తదేకంగా చూస్తాడు. పద్మావతి సిగ్గుపడి క్రీగంట చూస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని, తన్మయత్వం చెందుతారు )

( ఇంతలో అక్కడకి చెలికత్తెలు వస్తారు. ఉపవనంలో చొరబడిన పరాయి పురుషుని చూసి, చెలికత్తెలు భయాశ్చర్యాలకు లోనవుతారు )

౧ చెలికత్తె-- ఎవరయ్యా, నీవు ? ఉపవనంలో ఎలా చొరబడ్డావు, రాకుమారితో ఏం పని ?

( చెలికత్తె మాటలకు పద్మావతి తెప్పరిల్లుతుంది. శ్రీనివాసుడు కూడ ఈ లోకంలోకి వస్తాడు. )

శ్రీనివాస --- నా పేరు శ్రీనివాసుడు, నా నివాసం వేంకటాచలం ! నే నొక మత్తగజాన్ని తరుముతూ, ఈ వనంలోకి ప్రవేశించాను.

౨ చెలికత్తె-- మత్తగజమా ! ఏదీ, ఆ మత్తగజం ? ఏమయ్యా ఆ గజము మా తోటలో కనిపిందదేమి ?

శ్రీనివాస---- అదే నాకు అర్థం కాలేదు ! ఆమ మత్తగజము అడవిలో నానా భీభత్సము చేసి, జింకలను బెదర గొట్టి , మీ తోటలోకి వచ్చి, మాయమయింది ! వచ్చిందో లేదో మీ రాజకుమారినే అడుగు !

౩ చెలికత్తె--- సఖీ ! నిజంగా ఆ మత్తగజం--- వచ్చిందా , లేక ఇతను అబద్ధాలు ఆడుతున్నాడా ?

( పద్మావతి తల ఆడించి అవును, కాదు అన్నట్లు జవాబిస్తుంది. మాట్లాడదు. ఆమె హరిని చూసింది ! మత్తగజాన్ని చూడనేలేదు.)

౩ చెలికత్తె—మత్తగజం వచ్చిందటే సఖీ ? ( శ్రీనివాసుని వ్యంగ్యంగా చూపిస్తూ--) వచ్చి ఈ జింకని బెదరగొట్టింది ! ( అంటూ పద్మావతి వైపు సైగ చేస్తుంది )

౨ చెలికత్తె-- ఇతని నివాసం వేంకటాచలమట ! ఆ కొండ మీద ఉండే గారడీ రాయుడు అయి ఉంటాడితను. ఆ ఏనుగు --- మాయ అయి ఉంటుంది.

౧ చెలికత్తె— (గుర్రాన్ని చూస్తుంది ) ఈ గారడీ రాయుడికి, గుర్రం వాహనం కూడ ఉందే !

౩ చెలికత్తె-- దానికేంలే ! -- అయినా ఓ శ్రీనివాసా ! ఎలా వచ్చావో, అలాగే తిరిగి వెళ్లు.

శ్రీనివాస-- ఎలా తిరిగి వెళ్లగలను , నీ మనసంతా ఇక్కడే ఉంటే ?

౧ చెలికత్తె -- ఏమిటీ ! నీ మనసంతా ఇక్కడే ఉందా ? ఏనుగు లాగ ఇదీ మాయేనా ?

శ్రీనివాస--- నీకు మాయలాగ ఉంటే, మీ రాకుమారినే అడుగు ! ఆమె నా మనసుని దొంగలించింది.

( ఆ మాటలకి ఉలిక్కిపడి, పద్మావతి అతనిని క్రీగంట చూస్తుంది. ఆమెకు వ్రుద్ధ బ్రాహ్మణుని మాటలు గుర్తుకి వస్తాయి.“’పురుషోత్తముడైన వరుడు నిన్ను వెతుకుతూ వచ్చి,వరిస్తాడు. నీ పెళ్లికి దేవతలే పెద్దలవుతారు” అని. చెలికత్తెలు, పద్మావతిని కుదిపి, అడుగుతారు )

౨ చెలికత్తె-- ఏమమ్మా , రాకుమారీ ! --- అతని మనసు పారేసుకొన్నాడట ! అది నీవు దొంగలించావట ! ఏమమ్మా, నిజమా ?

పద్మావతి--- ఏమోనే ! నా మనసు మనసులో ఉంటే కదా !

౩ చెలికత్తె-- ఇదేం చోద్యమే ! ఇద్దరి కిద్దరూ మనసు పారేసుకొన్నారు ! ఏది ఎవరి దగ్గరుందో, ఎవరు ఎవరిది దొంగలించారో తెలియదు ! ( చెలికత్తెలు కిలకిలా నవ్వుతారు )

౧ చెలికత్తె-- ముందీ గారడీ రాయుడిని ఇక్కడనుంచి, తరమండే ! ఇతను మన రాకుమరికి ఏదో చేసాడు, ఇంకాసేపుంటే ఎత్తుకుపోతాడేమో !!

౨ చెలికత్తె-- ఇదుగో గారడీరాయా ! నీవు వచ్చిన దారినే వెనక్కి వెళ్తావా, లేక నీ పని రాజభటులకు అప్పజెప్పి, పట్టించమంటావా ?

శ్రీనివాస--- అలాగే వెళ్లి వస్తాను. మీ రాకుమారి సెలవిస్తే---

( చెలులు పద్మావతి వంక చూస్తారు. శ్రీనివాసుడు కూడ, ఆమె వంక చూస్తాడు )

పద్మావతి--- వెళ్లమనడానికి మనసొప్ప్డడం లేదే ! -- రాక తప్పదని ఆ గారడీ రాయునితో చెప్పండే ! వచ్చినందుకు చిహ్నంగా--- ఏదైనా ఇచ్చి, వెళ్లమనవే !

( చెలికత్తెలు, విస్తుపోతూ వారివంక చూస్తూ ఉంటారు. )

( శ్రీనివాసుడు, తిరిగి తిరిగి చూస్తూ, గుర్రం ఎక్కి, వెళ్తాడు.)

( ఆ గుర్రం కదలగానే, అక్క్డడ ఒక నారాయణుని విగ్రహం కనిపిస్తుంది. అందరూ దాని కేసి చూస్తారు. పద్మావతి పరుగు పరుగున వెళ్లి, ఆ బొమ్మని అందుకొంటుంది.)

పద్మావతి--- చెలీ ! చూసావా ! ఎంత చక్కని రూపమో !

౧ చెలికత్తె-- అవునమ్మా ! రాకుమారీ ! ఎంతో చక్కని శిల్పం !!

( పద్మావతి పాట అందుకొంటుంది. ఆమె సఖులు ముగ్గురూ పాటకి అనుగుణంగా అభినయిస్తారు )

పాట--- ’ ఎంత చక్కని రూపమిది ? ఎవరు చెక్కిన శిల్పమది !

********************

( ద్రుశ్యము ౮౦ )

( ధరణీదేవి అంతఃపురం )

( పద్మావతి మంచం మీద పడుకొని ఉంటుంది ! తల్లి ధరణీ దేవి మంచం ప్రక్కనే ఆసనం మీద కూర్చొని ఉంటుంది. చెలికత్తెలు పద్మావతి నుదుటి పైన చల్లని నీటితొ ముంచిన పట్టీలు వేస్తూ, మారుస్తూ సపర్యలు చేస్తూ ఉంటారు )

( పద్మావతికి విషజ్వరం సోకింది )

ధరణీదేవి-- ఇదేం విషజ్వరమో ! ఎంతకీ తగ్గడం లేదు !! ( అంటూ పద్మావతి నుదుటి మీద చెయ్యి వేస్తుంది. )

ధరణీదేవి-- అబ్బ ! చెయ్యి కాలిపోతోంది ! ఆమ్మా పద్మావతీ !!

( పద్మావతి మెల్లగా కళ్లు విప్పుతుంది )

ధరణీదేవి --- తల్లీ ! ఎలాగుందమ్మా, నీ కేం కావాలి ?

పద్మావతి-- అమ్మా ! నాకా బొమ్మ కావాలే ! ( అంటూ తన మంచానికి ఒక ప్రక్కగానున్న నారాయణుని ప్రతిమని చూపిస్తుంది )

ధరణీదేవి--- అయ్యో, అదేమిటమ్మా ! అది నీ దగ్గరే ఉంది కదా ?

( ఒక చెలికత్తె వెంటనే ఆ బొమ్మని తెచ్చి, పద్మావతి పక్క పడుకో బెడుతుంది )

( పద్మావతి పక్కకు ఒత్తిగిల్లి, బొమ్మని ఒడిలోకి తీసుకొని కళ్లు మూసుకొంటుంది. ధరణీదేవి ఆ ద్రుశ్యం ఆశ్చర్యంగా చూస్తుంది )

ధరణీదేవి -- ఆ బొమ్మ ఎలా వచ్చిందే ? పద్మకి ఎక్కడ దొరికింది ?

౧ చెలికత్తె -- మహారాణీ ! మమ్మల్ని మన్నించండమ్మా ! మీకు -- ఆ రోజు తోటలో కనిపించిన గారడీరాయుడు గురించి, చెప్పాము కదమ్మా ! ఈ బొమ్మ అతను వెళ్లిన చోట కనిపించింది.

౨ చెలికత్తె--- బొమ్మ సంగతి మీతో చెప్పనందుకు క్షమించండమ్మా !

౩ చెలికత్తె--- మహారాణీ ! చిత్రమేమిటంటే అతను వచ్చినందుకు చిహ్నంగా ఏదైనా ఇచ్చి వెళ్లమని రాకుమారిగారే అడిగారమ్మా !—అతను ఆ బొమ్మనిచ్చి వెళ్లారమ్మా !

౧ చెలికత్తె-- రాకుమారి ఆ బొమ్మని పట్టుకొని ఎంతో సంతోషంతో, ఆట-- పాట -- ఆడారమ్మా ! అంత వరకు బాగానే ఉన్నారు !

౨ చెలికత్తె-- మర్నాటి నుంచే ఈ మాయ రోగం వచ్చింది.

౩ చెలికత్తె-- ఆమె సపర్యలలొ, మేమేమీ లోపాలు చేయలమ్మా !

౧ చెలికత్తె--- తినకూడని పదార్థాలు తినిపించి---

౨ చెలికత్తె-- తాగకూడని పానీయాలు తాగించి---

౩ చెలికత్తె --- తిరగకూడని చోట్లు చూపించి---

౧ చెలికత్తె--- చెప్పకూడని మాటలు చెప్పి---

౨ చెలికత్తె--- చేరకూడని ----

ధరణీదేవి-- అబ్బబ్బ ! ఇంక ఆపండే మీ సోది---

( చెలికత్తెలు సోది ఆపుతారు. ఆమె ఆ మాటలు అంటూ ఉండగా ఒక పరిచారిక వచ్చి, ధరణీదేవికి నమస్కరిస్తుంది )

,పరిచారిక--- మహారాణీ వారికి నమస్కారం ! ఒక ఎరుకల సాని సోది చెపుతానంటూ వచ్చి, మీ అనుమతి కోసం, నిల్చొందమ్మా !

ధరణీదేవి-- ఎరుకల సానా ! సోది చెప్తుందా , అదెందుకే ఇప్పుడు ?

( ధరణీ దేవి ఆ మాట అనగానే, పరిచారిక వెనక్కి తిరుగుతుంది. పద్మావతి గభాలున ముందుకి తిరిగి అ<టుంది )

పద్మావతి-- అమ్మా ! --రమ్మనవే ! -- ఆ ఎరుక లెరిగిన స్వామిని, అదే ఆ ఎరుకల సానిని !

( పద్మావతి మాటలు విని పరిచారిక ఆగుతుంది. ధరణీ దేవి ఆశ్చర్యంతో పద్మావతి వంక చూస్తుంది. తరువాత తేరుకొని , పరిచారికతో చెప్తుంది )

ధరణీదేవి-- సరే ! ఆ ఎరుకల సానిని దగ్గరుండి, తీసుకురావే !

( పరిచారిక బయటికి వెళ్తుంది. ఎరుకల సానిని తెస్తుంది )

( శ్రీనివాసుడే ఎరుకల సాని రూపంలో అక్కడకి వస్తాడు. ఛెతిలో సోదె గంపలో. సోదె పలక , అందులో గవ్వలు, పసుపు కుంకుమల లాంటివి, ఉంటాయి. ఎరుకల సాని సంకలో ఆరేళ్ల పిల్లవాడు కూడ ఉంటాడు. ధరనీ దేవి ఆ ఎరుకల దానిని చూస్తుంది )

ధరణీదేవి--- ఓ సోదె ఎరుకతా ! ఇటురమ్ము—

( ఎరుకత మహారాణీని , ఆమె ఆంతఃపురంలోని వైభవాన్ని చూసి , భయపడుతుంది )

ధరణీ దేవి-- భయపడకే ఎరుకతా ! నా మనసులో అభిప్రాయాన్ని గురించి సరిగ్గా చెబితే బహుమానం ఇస్తాను. ( అని పిలిచి, ఒక ఆసనం మీద కూర్చోమంటుంది.)

ఎరుకత-- నాకీ ఆసనాలేలమ్మా ! ( అని క్రిందనే కూర్చొంటుంది ) ఓ దొరసానమ్మా ! తానము సేసి, పట్టుకోక కట్టి, రవిక తొడిగి, పసుపు, కుంకుమ గంధము అలంకరిౙచుకొని, నగలన్నీ పెట్టూకొని, నీ కులదేవతకు మొక్కుకొని రావాలమ్మా ! అప్పుడే నీ కడుపులో మాట ఏదో నిజంగా చెబుతా !

( ధరణీదేవి లోపలికి వెళ్తుంది, స్నానం చేయడానికి , ఆమెతో పరిచారొక కూడ వెళ్తుంది )

( పద్మావతి, ఆమె ముగ్గురు చెలికత్తెలు ఉంటారు )

౧ చెలికత్తె-- ఓసీ, ఎరుకతా ! సోది చెప్పడానికి స్నానమాడి రావాలా ? ఇంతకీ నువ్వు స్నానమాడి వచ్చావా ?

ఎరుకత--- చేసానమ్మా ! ఉదయాన్నే స్వామి పుష్కరిణిలో తానం చేసాను.

౨ చలికత్తె- స్వామి పుష్కరిణా ? అదెక్కడుందే ?

ఎరుకత --- వేంకటాచలం మీదనుందమ్మా ! దాని ఇసయమే తెలియదంటున్నావు ! గొప్ప మహిమ గల తీరతమమ్మా !

( వేంకటాచలం మాట విని పద్మావతి పక్కకు ఒత్తిగిల్లి, ఎరుకత ముఖం చూస్తుంది )

౩ చెలికత్తె-- అబ్బ, అంత మహిమ గలదా ? ఏమిటే దాని గొప్ప ?

ఎరుకత --- ఆ తీరతం గొప్ప చెప్పడం నా తరం కాదమ్మా, ఆదిసెసుడే చెప్పాలమ్మా !

( పద్మావతి మంచం పైన లేచి కూర్చొంటుంది. చెలికత్తెలు ఆమెకి సాయం పట్టి, కూర్చోపెడతారు. పద్మావతి ఎరుకల దాని ముఖం చూస్తుంది. ఆమెకి ఎరుకతె ముఖంలో శ్రీనివాసుడు కనిపిస్తాడు )

పద్మావతి--- స్వామి తీర్థం మహిమ ఆదిశేషు నోటివెంట కన్నా, స్వామి నోటంట వింటేనే బాగుంటుంది !నువ్వే చెప్పు !

ఎరుకత--- అలాగేనమ్మా ! చిన్నదొరసానీ ! ఇదుగో నా బుడతడు (అని తన కొడుకుని చూపిస్తుంది ) ఆకలి గొని ఉన్నాడమ్మా ! వాడికింత అన్నం పెట్టించు తల్లీ !

( పద్మావతి చెలికత్తెల వంక చూస్తుంది.ఒక చెలికత్తె లోనికి వెళ్లి, వెండి గిన్నెలో పరమాన్నం తెచ్చి పెడుతుంది )

౧ చెలికత్తె-- ఏయ్ ! బాబూ , నీ పేరేమిటి ?

బుడతడు--- మనమదుడు !—

౨ చెలికత్తె--- ఏంటే, నీ పేరు మన్మథుడా ?

( బుడతడు తల ఊపుతాడు. పరమాన్నం నోట్లో పెట్టుకొంటాడు )

బుడతడు --- యీ అన్నం బాగులేదు , తియ్యగుంది !

౩ చెలికత్తె -- పరమాన్నం బాగులేక పోవడ మేమిటి ? తియ్యగా కాక మరెలాగుంటుంది ?

ఎరుకత-- వాడికి తీపి బువ్వ పడదమ్మా ! ఎప్పుడూ చెరుకు గడలు దగ్గరుంచుకొని , ఆటితో బాణాకర్ర చేసుకొని , తిరుగుతాడమ్మా ! అందుకే తీపి పడదు !

పద్మావతి--- పిల్లడికేం కావాలో అడిగి పెట్టండే !

౧ చెలికత్తె --- సరే ! బాబూ నీ కేం కావాలమ్మా ?

బుడతడు-- పేమ !!

౨ చె౩లికత్తె-- పేమా. ఓహో ప్రేమా ! -- అదికూడా తింటారా ?

( బుడతడు తింటానన్నట్లు తల ఊపుతాడు )

ఎరుకత--- అదికాదమ్మా ! పేమతో పెడితే గంజి నీళ్లైనా తాగుతాడమ్మా ! లేకపోతే తీపి బువ్వ కూడా తినడు.

( ఇంతలో ధరణీదేవి స్నానం చేసి వస్తుంది. పరిచారికతో పాటు. పద్మావతి మంచం మీద కూర్చొని ఉండడం చూసి, విస్తుపోతుంది. పద్మావతి ఆమెను గమనించదు )

పద్మావతి-- ఎరుకతా ! స్వామి పుష్కరిణి మహిమ చెప్తానన్నావు ! మా అమ్మ వచ్చేలోగా ముందది చెప్పు !

ఎరుకత--- పెద్ద దొరసానమ్మ ---- వచ్చేసినారమ్మా !

( పద్మావతి ధరణీదేవి వంక చూస్తుంది. ధరణీదేవికి పిల్ల మాట్లాడడమే గొప్పలాగుంది. త్రుప్తిగా ఆఆమె వంక చూస్తుంది )

ధరణీదేవి-- ఎరుకతా ! ముందు అమ్మాయి అడిగిన్దే చెప్పు. మా రాజ్యంలోని వేంకటాద్రి మీద ఉండే, స్వామి పుష్కరిణి కధ మాకే తెలియదు ! ఈ రోజు నీ మూలంగా తెలుసుకొంటాము.

ఎరుకత-- అలాగేనమ్మా ! ఏంకటాద్రి అంటే సామాన్యమైన కొండ కాదు ! పాపాలు పోగొట్టే కొండ ! అలాంటి కొండ మీద వరాహస్వామి కెదురుగా ఉండే స్వామి పుష్కరణిలో, నూట ఎనిమిది తీరతాల నీరు వ్చ్చి కలుస్తుంది. కపిల తీర్థం, సక్ర తిర్థం, చక్రతీర్థం, అగ్ని తీర్థం, ఆఆకాశ గంగ, పాపనాశనం, వైకుంఠ, జాబాలి, తుంబురు, సనక సనందన, దేవ, కుమారధార, తీరతాలు అందులో కొన్ని ! ఆ స్వామి పుష్కరిణీ గొప్ప చెప్పేందుకు రెండు కథలు చెప్తాను .

పద్మావతి-- ఎరుకా ! ఏమిటా కథలు ?

ఎరుకత-- చెప్తానమ్మా, ఇనుకో మరి !—

******************

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద