బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 20
( దృశ్యము 90 )
( కరివీర పురము—కొల్హాపూరు )
( శ్రీ మహాలక్ష్మి ఒక సంపెంగ చెట్టు దగ్గర తిన్నె మీద కూర్చొని ఉంటుంది. ఆమె పాదాల మీద సూర్య కిరణాలు పడతాయి ఆ తరువాత ఒక శ్లోకం వినబడుతుంది )
శ్లోకం-- లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, శ్రీ రంగ ధామేశ్వరీం,
దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం,
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ, బ్రహ్మేంద్ర గంగాధరాం,
త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం !
( లక్ష్మి కళ్లు తెరిచి, తన పాదాల చెంత, పడిన సూర్యకిరణాలని చూసి, చిరునవ్వు నవ్వుతుంది )
లక్ష్మి--- సూర్య నారాయణా ! ఈ స్తోత్రము నీ నోట కడు రమ్యముగా నున్నది ! వచ్చిన కారణమేమి ?
( సూర్యుడు ప్రత్యక్ష్యమవుతాడు )
సూర్య ---- తల్లీ ! నీ కొరకు సప్తాశ్వ రథమును తెచ్చాను.
లక్ష్మి ---- సప్తాశ్వ రథమా ! అది ఏల సూర్యనారాయణా ?
సూర్య ----మాతా ! నేడు వైశాఖ శుద్ధ సప్తమి, సోమవారము---
లక్ష్మి --- విళంబినామ సంవత్సరం, ఉత్తరాయనం, అయితే ఏమంటావు ?
సూర్య --- అది కాదు తల్లీ ! రాబోయే దశమి నాడు , శ్రీవారికి-- పద్మావతీ దేవితో వివాహం కానున్నది ! శుభలేఖ నీ కడకు రాలేదా తల్లీ ?
లక్ష్మి --- ( చిన్నబోతుంది ) గరుడుడు శుభలేఖ ఇచ్చి వెళ్లుట నిజము ! -- అయినను -- ఈ -- వివాహమునకు నేను రావలయునా పద్మమిత్రా ?
సూర్య --- మాతా ! మీరు రాకున్న , శ్రీవారు ఈ వివాహమునకు, తరలి వెళ్లనే వెళ్లరట !
( సూర్యుని మాటలకు లక్ష్మి కాస్త తెప్పరిల్లుతుంది. కించిత్తు గర్వం కూడా కలుగుతుంది )
లక్ష్మి --- అలాగని నీతో చెప్పారా ?
సూర్య --- అవును తల్లీ ! నాతోనే కాదు, ఆహ్వానము నందుకొని వచ్చిన దేవ, ద్విజ, ఋషి సమూహము లందరితో చెప్పిరి.
లక్ష్మి --- అటులనా ! కడు విచిత్రముగా నున్నదే ! దేవతా సమూహము లనగా--ఎవరెవరు వచ్చారు ప్రభాకరా ?
( లక్ష్మి కుతూహలానికి సూర్యుడు లోలోపల నవ్వుకొంటాడు )
సూర్య --- తల్లీ ! ఆహ్వానము నందుకొని తొలుదొల్తగా, హంస వాహనము మెక్కి, సరస్వతీ, బ్రహ్మలు వచ్చారు. ఆ పైన ---
లక్ష్మి --- ఊ ! ఆ పైన ---
సూర్య --- తూర్పు దిక్కునుండి, ఐరావతము నెక్కి, శచీ దేవితో పాటు , ఇంద్రుడు---
లక్ష్మి --- ఊ ! ఆ తరువాత ?
సూర్య -- ఆగ్నేయ దిశనుండి, మేషవాహన మెక్కి, స్వాహా దేవితో పాటు, అగ్ని దేవుడు, దక్షిణ దిశనుండి, మహిష వాహన మెక్కి, ఇళా సతితో పాటు యముడు—
లక్ష్మి --- ఆ పిమ్మట !
సూర్య --- నైరుతి దిశనుండి నర వాహన మెక్కి, కాళీకా ప్రియుడు నిరుపతి, పడమటి దిశనుండి, మకర వాహన మెక్కి, పద్మినితో పాటు వరుణుడు, వాయువ్య దిశనుండి, కృష్ణమృగ వాహనముపై మోహినీ సతితో వాయువు, ఉత్తర దిశనుండి, అశ్వ వాహనముపై ధనాధిపతి కుబేరుడు----
లక్ష్మి --- మరి, ఈశన్య దిశ నుండి ఎవరూ రాలేదా ?
సూర్య --- రాకేమి తల్లీ ! నంది వాహనముపై, గౌరీదేవితో పాటు, ఈశ్వరుడు, వారి వెనుకగా మూషిక వాహనుడు గణపతి, ఆ వెనుక నెమలి నెక్కి, కుమారస్వామి, ప్రమధ గణాలు సేవించగా-- కైలాసమే కదిలి వచ్చినట్లు, వచ్చారు.
( లక్ష్మి ముఖం మరల చిన్నబోతుంది )
లక్ష్మి --- ఆహా ! సకల దేవతా సమూహములు, సాక్షియగు, వివాహ వైభవము నందుటకు, పద్మావతి ఎంత భాగ్యశాలియో గదా !!
సూర్య --- మాతా ! శ్రీవారు దేవతా సమూహములను, వివాహ వేడుకకు పిలిచినది, పద్మావతీ దేవి కొరకు కాదు !
లక్ష్మి ----( కాస్త ఉత్సాహంతో ) మరెవరి కొరకు ఛాయాపతీ ?
సూర్య --- వకుళా మాత కొరకు.
లక్ష్మి --- వకుళావళి కొరకా ?
సూర్య -- అవును తల్లీ ! వకుళా మాతయే , ద్వాపర యుగమున యశోదా మాత ! శ్రీ వారి శైశవ లీలలు తప్ప, వివాహ వేడుక చూడలేక, ఆ కోరిక తోనే, తనువు చాలించినది ! యీ జన్మలో ఆమె కోరిక తీర్చాలని, శ్రీ వారు నభూతో నభవిష్యతి అనునట్లు , కళ్యోణోత్సవాన్ని నిర్వహించ నున్నారు !!
( లక్ష్మి మనసు కాస్త నెమ్మదిస్తుంది )
లక్ష్మి --- వేడుక వకుళా మాత కొరకే అయినా, ఫలితం పద్మావతికే కదా ?
సూర్య -- తల్లీ ! పద్మావతీ దేవి పరాయి మనిషి ఎట్లయినది ? ఆమె నీ సంకల్పము నుండి, జన్మించిన అయోనిజయే కదా !
లక్ష్మి --- ఏమంటివి ప్రభాకరా ? పద్మావతి నా సంకల్ప జనితయా ?
సూర్య --- అవును తల్లీ ! ఙ్ఞప్తికి తెచ్చుకొనుము , త్రేతాయుగమున, రావణాసురుని చెరయందుండిన, మాయా సీత వేదవతియే , ఈ యుగమున పద్మావతి ! శ్రీ వారిని పరిణయమాడుటకు, ఆమె చేసిన జన్మ జన్మల తపస్సు, మీకు చేసిన సేవల వలన , వరము పొందినది ! ఆ వరము తీర్చు సమయము శ్రీ వారికి నేడు లభ్యమయినది ! తల్లీ ! స్వామి కార్యమునకు సకల దేవ, ద్విజ, ఋషి పుంగవులు విచ్చేసినారు. ఎందరు వచ్చినను--- నీవు రాకున్న--- వివాహమునకు తరలి వెళ్లనని, శ్రీ వారు భీష్మించుకొని కూర్చొన్నారు--- నీ వేమందువు తల్లీ
లక్ష్మి -- ( చెమ్మగిల్లిన కళ్లతో ) భాస్కరా ! నేను రాకున్న స్వామి వారు, పద్మావతికి ఇచ్చిన వరము నెరవేరుట కష్టము ! అవునా ?!
సూర్య --- అవును !
లక్ష్మి --- సరి ! నా స్వామి ఇచ్చిన మాట తప్పడు ! అతని ధర్మపత్నిగా భర్తృ వాక్పరిపాలన చేయుటకు, నే నీ వివాహ వేడుకకు తరలి వచ్చెదను !
సూర్య --- తల్లీ ! మహధ్భాగ్యము ! నీవు నీ షోడశ కళలతో, వైభవ యోగినీ గణములతో, నిండు మనసుతో---
లక్ష్మి --- ( కళ్లనీళ్లతో ) ఎటుల రాగలను , విశ్వ సాక్షీ ! నిండు మనసు నెట్లు సమకూర్చుకోగలను ? భర్త హృదయమున నిశ్చింతగా నిల్చిన నన్ను, నా తండ్రి భృగువు తన దివ్య నేత్రముతో, కర్తవ్య భోధ చేసి, భూలొకమునకు పంపినాడు ! కర్తవ్య పరాయణనై, తపము నాచరించు నన్ను, --- సమస్త మాతృకా గణములు ఆశీర్వదించి, తమతమ తేజో, బల , వైభవములు ఇచ్చి పరిపూర్ణతను కలిగించినారు ! పరిపూర్ణ రూప బలములతో, సామ్రాజ్య లక్ష్మినై భర్తను చేరవలెనను, ఉవ్విళ్లూరుతున్న సమయమున, స్వామి నన్ను కాదని, నాకు సవతిని తేనున్నారు ! ఇది ఎంతటి గుండె కోతయో , -- పురుషుడవు, -- నీ కెట్లు తెలియ చెప్పగలను
సూర్య ---- తల్లీ ! నీ మాటలు యక్తి యుక్తములు కావనను ! నీ హృదయ వేదన సముచితమేనని, అర్థము చేసుకోగలను ! అర్థము కానిది----
లక్ష్మి --- ( రోషంతో ) ఏమిటి నీ కర్థం కానిది ?
సూర్య--- శ్రీ వారి లీలలు ! బ్రహ్మ రుద్రుల కయిన అర్థము కాని వారి ఆంతర్యము !! అయినను ఒక విషయము చెప్పగలను.
లక్ష్మి --- ఏ మా విషయము దివాకరా ?
సూర్య --- శ్రీ వారి అవతార రహస్యము కూడ నీ వలె, లోక కళ్యాణమునకే కదా ! మీ వలెనే స్వామి కూడ తపము చేసి, దేవతలందరి శక్తి సామర్థ్యములను , ఫలితముగా పొందిన వారే కదా ? అటుల తపః ఫలితమును గ్రహించిన స్వామి, నేడీ పరిణయమునకు, పూనుకొనుట , చిర కాలము నుండి, తనను స్మరించుచున్న భక్తుల యభీష్టము నెరవేర్చుట కొరకే నని చెప్పగలను ! ఈ పరిణయము ముగిసిన పిమ్మట స్వామి తన యవతార లీలలు చూపించక మానరు.
లక్ష్మి ---- సూర్యనారాయణా ! స్వామి తన కర్తవ్యము విస్మరింప లేదందువా ?
సూర్య -- లోకుల కర్తవ్యములను శాసించు స్వామి తన కర్తవ్యమును విస్మరించు ననుట పాడి యగునా తల్లీ ?-- పద్మావతీ దేవి నీ సంకల్పము నుండి, జన్మించుట వలన , నీవు త్రేతాయుగమున ఖండితురాలయితివి ! ద్వాపరమున నీ కళలు ఎనిమిది భాగములయి, శ్రీ వారికి అష్టమహిషీ కళ్యాణము తప్పని సరి అయినది ! ఇప్పుడీ కలి యుగమున, మాత్రుకా గణముల అంశలన్నియు, నీలో నిలుపుకొని, పరిపూర్ణత్వము పొందిన నిన్ను, స్వామి సంధింప కుండ ఉండగలరా తల్లీ ?
లక్ష్మి ---నిజమా సహస్ర కిరణా ?
సూర్య --- తల్లీ ! నీవు శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్ష మూలమువు ! పద్మావతీ దేవి నీ శాఖ !--- వృక్షము నెక్కుటకు, శాఖపై, కాలూనుట న్యాయమే కదా ?!
లక్ష్మి --- వృక్షము నెక్కుటకు, శాఖపై కాలూనుట న్యాయమేనని చెప్పి, నా మనసుకు ఊరట కలిగించినావు తిమిర హరణా ! -- పద నీ సప్తాశ్వ రథమెక్కడ ?
సూర్య --తల్లీ ! నీ నిర్ణయమునకు, చాల సంతోషమయినది, రమ్ము---
( సూర్యుని వెనుకగా లక్ష్మి బయలుదేరుతుంది )
*******************

Comments
Post a Comment