బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 21
( దృశ్యము ౯౧ )
( వేంకటాచలం పైన ఒక రావి చెట్టు )
( శ్రీనివాసుడు, బ్రహ్మ, శివుడు ఉంటారు )
బ్రహ్మ ---- తండ్రీ ! తల్లి లక్ష్మీ దేవి సూర్యనారాయణునితో పాటు వచ్చి, విడిది చేరినది. రేపు ప్రాతః కాలమున
( శ్రీనివాసుడు బదులివ్వడు ! దిగులుగా ఉంటాడు )
శివుడు -- ప్రభూ ! శ్రీనివాసా !. లక్ష్మి వచ్చిన వార్త తెలిసినను, మీ ముఖము కళా విహీనమై యున్నది, కారణ మేమి ?
శ్రీనివాస --- పరమేశ్వరా ! లక్ష్మి ఈ కార్యమునకు, కేవలము సాక్షి రూపమున వచ్చినదే గాని, తన పూర్వ వైభవముతో రాలేదు ! ఆహ్వానితులైన దేవతలు,
భూలోకమును చేరుట వలన, అన్నగత ప్రాణులయిరి. నేను రిక్తుడను ! నా ధనమంతయు పోయినది. నే నెట్లు వారికి భోజనము పెట్టగలను ?
శివుడు --- శ్రీనివాసా ! పెళ్లి చేయుటకు , ఇల్లు కట్టుటకు ప్రారంభించిన వాడు, అంతము వరకు తన ప్రయత్నము మానుకోకూడదు ! శుభ కార్యములలో, సమస్త సంభారములు సమకూర్చుకోవలసినదే గాని, విడనాడ కూడదు ! దనము లేనిచో ఋణము చేసి అయినను కార్యము నడిపింప వలయును !
శ్రీనివాస -- లెస్స పలికితిరి గిరిజా పతీ ! ఈ శుభ కార్యమునకు వలయు ధనము నివ్వగలవాడు కుబేరుడొక్కడే ! ఋణము అతని వద్దనే గ్రహించెదను గాక ! ( అని కుబేరుని తలస్తాడు ---( శ్లోకం)
శ్లోకం-- అశ్వారూడో, గదా పాణః / కుబేర, శ్ర్మీ శివః ప్రియః
నిధీశ్వరః, పీత వర్ణో / సోమో ధేను సముద్భవః
ఉత్తర సాందిశ్య లోక పాలకః / కుబేర మావాహయామి !
( కుబేరుడు ప్రత్యక్షమవుతాడు . శ్రీనివాసునుకు నమస్కరిస్తాడు )
కుబేర ----- ప్రభూ ! దేవ దేవా ! నన్ను పిలిచిన కారణము తెలియజేసి , సేవా భాగ్యము ప్రసాదింపుడు .
శ్రీనివాస--- కుబేరా ! నీ వలన కొంచెము కార్యమున్నది, ఈ కలి యుగమున నా కళ్యాణమునకు , నీవు ధనమిచ్చి జరిపించ వలయును. ఆ వివాహమునకు, ఆహ్వానితులై వచ్చిన దేవ , ద్విజ , ఋషి సమూహలములకు సమారాధన చేయుటకు , నాకు ధనము లేదు ----
కుబేర --- ( చేతులు జోడించి ) ప్రభూ ! ఋణ గ్రహీత పత్రమును వ్రాసి, ఋణదాత కడ, ఎట్లు ధనము పరిగ్రహించగలరో ,అటుల ఋణపత్రము వ్రాసి ఇచ్చిన, నేను మీకు ధనము నివ్వగలను.
శ్రీనివాస---- ( బ్రహ్మతో ) కుమారా ! ఋణ పత్రమును సిద్ధము చేయుము.
( బ్రహ్మ అప్పు పత్రాన్ని వ్రాసి, చదివి వినిపిస్తాడు )
బ్రహ్మ --- శ్రీ చాంద్రమాన విళంబి నామ సంవత్సర , వైశాఖ శుద్ధ సప్తమీ సోమవారము నాడు , ధనాధిపతి, ఉత్తర దిశా పాలకుడు అయిన కుబేరుని వద్ద, శ్రీ వేంకటాచ రమణుడైన శ్రీనివాసుడను పేరు గల నెను, నా కళ్యాణము నిమిత్తము, పదునాలుగు లక్షల సంఖ్య గల శ్రీరామ ముద్ర నిష్కములను , వృద్ధికి తీసుకొనుచున్నాను. వివాహ వర్షము మొదలు వెయ్యి సంవత్సరముల లోపున ఋణము తీర్చే నిర్ణయము ఇందులకు సాక్షులు--- చతుర్ముఖ బ్రహ్మ--- ( అని పత్రాన్ని శివుని చేతికిస్తాడు )
శివుడు --- రెండవ సాక్షి , కైలాస పతి శివుడు ( అని పత్రంపై సంతకం చేసి, ఆ పత్రాన్ని, శ్రీనివాసునికి ఇస్తాడు )
శ్రీనివాస --- ఓ అశ్వత్థ వృక్షమా ! మూడవ సాక్షి సంతకము నీవు చేయుము !
( అని దగ్గరున్న రావి చెట్టుతో అంటాడు రావి చెట్టు కొమ్మ ఒకటి వంగి,, ఋణ పత్రంపై సంతకం చేస్తుంది)
( ఆ తరువాత దానిపై తన సంతకం చేసి, శ్రీనివాసుడు , కుబేరునికి ఇస్తాడు )
( కుబేరుడు ఆ పత్రాన్ని దుస్తులలో దాచుకొని, తన మొలలోంచి ఒక జోలె తిసి, దాని మూత విప్పి, తిరగ వెస్తాడు )
( ఆ జోలె లోంచి ధనం రాశులుగా పడుతుంది )
శ్రీనివాస--- కుబేరా ! ఈ ధనమును నీ కడనే ఉంచి అవసరమగు చోట ఖర్చు చేయుము . సమారాధన కవసరమగు --- తండుల, మాష , ముద్గ , గుడ , తైల , మధు , క్షీర , శర్కర , ఆజ్య , దద్ధ్యాది పదార్ధములను,-- వస్త్ర , ఉత్తరీయ , దుకూలాది పరిక్షేధములను-- నాగ వల్లీ దళ, పూగీ ఫల, ఏలా , లవంగ , కర్పూరాది సుగంధ ద్రవ్యములను--- వివాహమునకు అవసరమగు మాంగల్య, తంతు, పాదాంగుష్ట , ముద్రికా ద్యాభరణములను సిద్ధము చేయుము .
శివుడు --- ప్రియసఖా కుబేరా ! నీవు షణ్ముఖునితో కలిసి వెళ్లి, దేవ ,ద్విజ , ఋషి పుంగవు ల<దరినీ, ఉచిత రీతిని సమారాధనకు ఆహ్వానింపుము ! పాండు తీర్థము మొదలు, శ్రీశైలము వరకు పంక్తుల వారీగా ఆశీనులను చేయుము !
బ్రహ్మ --- కుబేరా ! నీవు వెడలి అగ్ని దేవుని ఇక్కడకు పంపుము
కుబేర --- ఆఙ్ఞా ప్రకారము అటులనే చేసెదను !
( కుబేరుడు ధన రాశిని తిరిగి తన జోలెలో నింపుకొని, వెళ్తాడు. )
( ప్రవేశం అగ్ని. వచ్చి త్రిమూర్తులకి నమస్కరిస్తాడు )
బ్రహ్మ --- అగ్ని దేవా ! సమారాధన కొరక, భక్ష్యాన్న శాకాదులను పచనము చేయుము.
అగ్ని --- ప్రభూ ! పాకార్థము, భాజనములు ఒకటైనను కానరాదు ! ఎట్లు పచనము చేయగలను ?
( బ్రహ్మ శ్రీనివాసుని వంక చూస్తాడు.)
శ్రీనివాస-- మీ వంటి వారి, ఇండ్లలో ఉత్సవములు, సంప్రాప్తించెనేని , భాజనములు సమృద్ధిగా దొరకును. నా కళ్యాణమునకు ఒక్క భాజనమైన కానరాదు. నా అదృష్టమట్లున్నది !? వినుము—
౧.---స్వామి పుష్కరిణియే అన్న పాత్రము !
౨. పాప వినాశన తీర్థము సూప పాత్రము !
౩.—ఆకాశ గంగ పరమాన్న పాత్రము !
౪.—దేవ తీర్థము శాక పాత్రము !
౫.--- తుంబురు తిర్థము చిత్రాన్న పాత్రము !
౬.—కుమార ధారా తీర్థము భక్ష్య పాత్రము !
౭.---పాండు తీర్థము తింత్రిణీ రస పాత్రము !
౮.---మిగిలిన తీర్థములు వ్యంజన పాత్రములు !!
( శ్రీనివాసుడు ఆ మాటలంటూ ఉండగానే ఆ యా తీర్థాలన్నీ పాత్రలుగా మారిపోతాయి )
అగ్ని -- ప్రభూ ! ఆఙ్ఞా ప్రకారము అటులనే చేసెదను. కాని--- ( సందేహిస్తాడు )
శ్రీనివాస--- నీ సందేహము ఏమి పాక శాసనా ?
అగ్ని --- ప్రభూ ! ఇంత మంది దేవతా సమూహముల మధ్య , మహా ప్రసాదమును ఎవరికి నివేదన చేయవలెను , ఒకరికి చేసిన ఇంకొకరికి కోపము కలుగునేమో?
శ్రీనివాస--- అగ్ని దేవా ! నీ పశ్న సమంజసమే ! సమస్త భక్ష్యములను, అహోబిల నృసింహ స్వామికి నివేదన చేయుము !
అగ్ని --- ప్రభూ ! అటులనే చేసెదను !
*****************

Comments
Post a Comment