బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 17
( ద్రుశ్యము 81 )
( సాంకాశ్యమనే రాజ్యము )
( చక్రవర్తి శంఖణుడు, మంత్రి రూపచంద్రుడు, రాజగురువు మాధవాచార్యుడు ఉంటారు. చక్రవర్తి సింహాసనానికి వెనుక పరిచారికలు వింజామరలు వీస్తూ ఉంటారు. )
( ప్రవేశం-- కోశాధికారి స్వర్ణగుప్తుడు )
స్వర్ణగుప్తుడు--- సాంకాశ్య నరేంద్రులు, శంఖణ చక్రవర్తులకు జయమగుగాక ! -- కోశాధికారి స్వర్ణగుప్తుడు నమస్కరిస్తున్నాడు. ( ఆని నమస్కరిస్తాడు )
రూపచంద్రుడు--- స్వర్ణగుప్తా ! చక్రవర్తుల వారు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. మన కోశాగారంలో నిల్వలు ఎలా ఉన్నాయి ? సాలీనా జరిగే జమా, ఖర్చులు ఎంత ? ఈ వివరాలను ప్రభువులవారికి తెలియజేయండి.
స్వర్ణగుప్త--- మహామంత్రి రూపచంద్రుల వారికి, రాజగురువు మాధవాచార్యుల వారికి, నా నమస్కారములు ! మన సాంఖాశ్య రాజ్యం లోని సాలీనా ఖర్చు ఒకటిన్నర సంఖ్యల శ్రీరామ ముద్ర నిష్కములు అవుతుంది. సాలీనా రాబడి, రెండు సంఖ్యల శ్రీరామముద్ర నిష్కములు. పోగా మిగులు అర సంఖ్య శ్రీరామ ముద్ర నిష్కములు. కాని--- ఈ మధ్య సామంత రాజులైన విక్రమవర్మ, తేజసింహుడు, మహేంద్ర వర్మ, రణసింహులు, గత నాలుగేళ్లుగా కప్పము కట్టక ఫోవడం వల్ల, రాజ కోశములో నిల్వలు క్షీణించి పోయినవి. ఈ సంవత్సరము ఖర్చులకు మాత్రము నిలువ ఉంది.
మాధవాచార్య-- మహామంత్రీ ! మన సామంత రాజులు కప్పము చెల్లించ నందులకు, కారణమేమి ? దానికి మీరేమి చర్యలు తీసుకున్నారు ?
రూపచంద్ర--- ఆచార్యా ! ఈ సామంతులు నలుగురూ, ఏదో దురాలోచనతో, కప్పము కట్టడం లేదని తెలిసినది. వారిలో విక్రమ వర్మ, తేజో సింహుడు ఈ మధ్య వియ్యమందుట చేత, దగ్గరయి స్వాతంత్రము ప్రకటించినారు.
మాధవాచార్య-- ఆ తిరుగుబాటు దారుల మీద ఏ చర్యలు తీసుకొన్నారు ?
రూపచంద్ర--- వారు నలుగురు ఏకమయిన పక్షమున , మన సైన్యములు నిలువ జాలవు ! అందువలన సామంతోనే పనులు చక్కబెట్టుకోవాలి.
శంఖణుడు--- అమాత్యా ! ఇప్పుడేం చేయాలనుకొంటున్నారు ?
రూపచంద్ర--- కప్పము కట్టు వారికి, కొన్ని రాయితీలు,ఇస్తానని వారందరకు వేరు వేరుగా లేఖలు వ్రాయించాను.
శంఖణుడు--- అవును, ప్రస్తుత పరిస్థితిలో ఇదే సరియైన మార్గము ! రెండెళ్ల కప్పము కట్టిన చాలునని, ఇది మీకు మాత్రమే పరిమితమని, వేరు వేరుగా లెఖలు వ్రాయించి పంపండి. సామముతో పని చక్కబెట్టుకొన్న తరువాత, వారి మధ్య భేదోపాయముతో, కలతలు, కలహాలు పుట్టించాలి. చిక్కు సమస్యలు వచ్చినప్పుడు మనమే వారికి ’అండ-దండ’ అని నమ్మించాలి. అలా చేయగలిగితేనే, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
మాధవాచార్య-- ప్రభూ ! ఈ శాశ్వత పరిష్కారమునకై, తమరొక పరి, వేంకటాచలమునకు, వెళ్లక తప్పదు !
శంఖణుడు--- వేంకటాచలమా !? ఏ పని మీద ఆచార్యా !
మాధవాచార్య--- వేంకటాచలమందు గల ’స్వామి పుష్కరిణీ’ స్నానం చాల మహిమాన్విత మైనది.
శ్లో-- ’ స్వామి పుష్కరిణీ స్నానం / సద్గురో పాద సేవనం,
ఏకాదశీ వ్రతం చాపి / త్రయ మత్యంత దుర్లభం !’
అనగా స్వామిపుష్కరిణీ స్నానము, సద్గురుని పాదసేవ, ఏకాదశీ వ్రతము ఈ త్రయము సామాన్యులకు లభింపవని భావము !
శంఖణుడు-- ( చికాకుతో ) ఆచార్యా ! రాజ గురువులైన మీ మాటలు, నాకు శిరోధార్యములు ! కాని ఇప్పటి సమస్య, ధార్మికము కాదు ఆచార్యా ! ఇది ఆర్ఠిక పరమైనది, అర్థమయిందా ?
మాధవాచార్య--- ప్రభూ ! స్వామి పుష్కరణీ స్నానము స్వామిత్వమును ప్రసాదిస్తుంది.
శంఖణుడు--- ( విసుగుతో ) ఆచార్యా ! స్వామి పుష్కరిణీ స్నానము , అంత మహత్తర మయినదే యగునెడల ఈ సమస్య నుండి, విడివడిన మరుక్షణమే ఆచరించెదను.
**************
( ద్రుశ్యము ౮౨ )
( సామంత రాజు మహేంద్ర వర్మ ఆలోచనా మందిరము )
( సామంత రాజులు నలుగురు, విక్రమవర్మ, తేజోసింహుడు, రణసింహుడు, మహేంద్రవర్మతో కలిసి ఉంటారు )
తేజోసింహ--- విక్రమ వర్మ మహారాజా ! శంఖణుడు, మనలను తరాజులను చేసి, ఆడింప బూనుకొన్నాడు. కప్పము కట్టుట కష్టమైన యెడల, రాయితీలు ఈయగలడట ! అది కూడ నాకు మాత్రమేనట !—
మహేంద్ర వర్మ--- అవును, విక్రమ వర్మ మహారాజా ! నాకు పంపిన లేఖలో కూడ రాయితీ ప్రస్తావన ఉంది ! దీనిని బట్టి శంఖణుని , బలహీనత స్పష్టమవుతోంది ! -- మీరు, నేను, తేజోసింహ, రణసింహులలో, ఎవరా శంఖణునికి తీసికట్టు !! మనమాతనికి కప్పమేల కట్టవలె ?
రణసింహ---- నిజము ! మనము కప్పము కట్టి, శంఖణుని రాజస్వము నింపుట ఏమి న్యాయము ?
విక్రమ వర్మ-- మిత్రులారా ! కప్పము కట్టకూడదన్న మీ ఏకాభిప్రాయాన్ని, నేను కూడ సమర్థిస్తున్నాను ! మనము నలుగురము, నాలుగు దిక్కుల నుండి దండయాత్ర చేసినచో, శంఖణుడు పరాజితుడు కాక మానడు.
మహేంద్ర వర్మ--- లెస్స పలికితిరి, విక్రమ వర్మ మహాఅరాజా !
తేజోసింహుడు--- మనము సామూహికముగా, దండయత్ర చేయ వలెనన్న నిర్ణయము, ఇక తిరుగు లేనిది !
రణసింహుడు-- విక్రమ వర్మ మహారాజా ! నలుగురు కలిసి దండయాత్ర చెసినచో, శంఖణుడు శంకర గిరి మాన్యాలు పట్టక మానడు. అతని రాజ్యమందు, ఈశాన్య భాగము మంచి సారవంతము, ఫలవంతము అయినది. వ్యాపారమునకు కూడ అది కూడలి స్థలము ఆ భాగము నాకు ఇచ్చిన యెడల, నేను మీతో చేయి కలుపుటకు సంసిద్ధముగా నున్నాను.
మహేంద్రవర్మ-- ఆ ఈశాన్య భాగము, నా రాజ్యమునకు సరిహద్దులలో ఉన్నది ! కావున దానిని నేను తీసుకొనుట న్యాయమగును.
తేజోసింహుడు--- దండయాత్రకు వలయు, ధన వ్యయమును నేను భరింప గలవాడను ! ఆ ఈశాన్య భాగము మాత్రము నా అధీనము చేయవలెను.
విక్రమవర్మ--- యుద్ధమునకు అర్థబలము కన్న, అంగ బలము ముఖ్యము ! నా సైన్యము సుశిక్షితము, సంఖ్యాగరిష్టము, కావున నాకే ఆ భాగము దక్కవలెను !
రణసింహ--- కాదు, నాకు ---
మహేంద్ర--- నాకు----
తేజోసింహ--- కాదు, నాకు ---
విక్రమ వర్మ--- మిత్రులారా ! శంఖణుని రాజ్యములో ఈశాన్య భాగము , ఎవరికి దక్కవలెనన్న, వాదన తప్ప, మరి అన్ని విషయములలోను, మనకు ఏకాభిప్రాయము కలిగినది కదా !
రణసింహ + తేజోసింహ -- అవును విక్రమ వర్మ మహారాజా !
మహేంద్ర వర్మ--- మనలో మనమీ తగవు మాని, ఆ భూభాగమును ముందు జయించవలెను కదా ! శంఖణుని రాజ్యచ్యుతుని చేసిన పిమ్మట, మనమా విషయము చర్చించు కొనుట, మంచిదని నా తలంపు !
విక్రమ వర్మ--- అవును శంఖణుని అడ్డు తొలగిన తరువాత, అతని రాజ్యమును పంచుకొను విషయమును వివేక వంతులైన, మంత్రి సభయందు పరిష్కరించుకొనుట మంచిది.
రణసింహ--- నిజము ! ముందుగా, మనము దండ నీతితో, రాజ్యమును పొంది----
తేజోసింహ---- ఆ పైన సామ నీతి ననుసరించుట మంచిది !
( ఆ మాటలకి అందరూ నవ్వుకొంటారు )
******************
( ద్రుశ్యము ౮౩ )
( రాజగురువు మాధవాచార్యుని ఇల్లు )
( రాత్రి రెండవ ఝాము .మాధవాచార్యుడు పడుకొని ఉంటాడు. తలుపు కొట్టిన చప్పుడుకి తెలివి వస్తుంది. లేచి వీథి తలుపు తీస్తూ అడుగుతాడు )
మాధవాచార్య--- ఎవరు, ఎవరది ?
( బయటి నుండి రాజు శంఖణుడు జవాబిస్తాడు )
శంఖణుడు-- ఆచార్యా ! నేను---
మాధవాచార్య--- అరరే ! ఈ గొంతుక మహారాజుల వారిదిలాగ ఉంది. ఇంత రాత్రి పూట ఇక్కడకి ఎ<దుకు వచ్చినట్లు ? ( అనుకొంటూ తలుపు పూర్తిగా తెరుస్తాడు )
( అక్కడ శంఖణ మహారాజుని చూసి ఆశ్చర్యపోతాడు. మహారాజు సాధారణ వేషంలో ఉంటాడు )
మాధవాచార్య--- మహారాజా ! మీరా !!--- ఏమిటీ సామాన్య వేషధారణ !?
( అంటూ ఉండగానే శంఖణుడు అతని నోరు నొక్కి, ఇంటి లోపలికి తోసి, తలుపు గడియ పెడతాడు )
శంఖణుడు--- ఆచార్యా ! కాల వశమున నా విరోధులందరూ కలిసి కట్టుగా వచ్చి, కోటను ఆక్రమించారు. నా పరివార వర్గములను, అమాత్యులు సురక్షిత స్థానమునకు చేర్చనున్నారు. నేనిలా మీ దగ్గరకు ----
మాధవాచార్య--- మహారాజా ! అర్థమయింది. మీ రాక నా కెంతో సంతోష కారక మయినను, మీ మేలుకొరకు, చెప్తున్నాను. నా ఇల్లు మీకు సురక్షితమైన స్థానము కాదు.
శంఖణుడు-- ఆచార్యా ! ఏమిటి మీరు అంటున్నది !
మాధవాచార్య--- అవును మహారాజా ! మీ పరివార వర్గము కన్న, మీ వెనుకనే విరోధులు గాలింపు చర్యలు పటిష్టం చేస్తారు. రాజధానిలోని అందరి ఇళ్లను వేటాడుతారు.
శంఖణుడు--- నిజమే ఆచార్యా ! నేను మరెచటకు వెళ్లగలను ?
మాధవాచార్య--- మహారాజా ! నేను మీకు ముందుగానే మనవి చేసుకొన్నాను. వేంకటాచలం పైన స్వామి పుష్కరిణి చాల మహిమ కలదని, ! ఆ స్వామి పుష్కరిణీ స్నానము వలన, మరల మీకు స్వామిత్వము ప్రాప్తించగలదు.
శంఖణుడు-- నిజమే ఆచార్యా ! వేంకటాచలమే సురక్షితమైన ప్రదేశమని నా తలపు. మీరు అన్నట్లు, స్వామి పుష్కరిణి స్నానము తిరిగి నాకు స్వామిత్వము ప్రసాదింప గలుగును గాక !
మాధవాచార్య--- మహారాజా ! అందుకు సంశయము లేదు. ఈ రాత్రే బయలు దేరి వేంకటాచలము చేరుట మంచిది. అందుకు ఏర్పాట్లు నేను చేస్తాను, లోపలికి రండు
( శంఖణుడు, మాధవచార్యుని వెనుక ఇంటి లోపలికి వెళ్తాడు )
*****************
( ద్రుశ్యము ౮౪ )
( స్వామి పుష్కరిణీ తీరం )
( శంఖణుడు ధ్యానం చేస్తుంటాడు )
శ్లో-- మేఘశ్యామం, పీతకౌశేయ వాసం / శ్రీ వత్సాంకం, కౌస్తుభోద్ధాసితాంగం,
పుణ్యోపేతం, పుండరీకాయతాక్షం, / విష్నుం వందే, సర్వలోకైక నాధం
సశంఖ చక్రం, సకిరీట కుండలాం / సపీత వస్త్రం, సరసీరుహేక్షణం
సహార వక్షస్థల శోభి కౌస్తుభం / నమామి విష్ణుం, శిరసా చతుర్భుజం ”
( విష్ణుమూర్తి, చతుర్భుజుడై, శంఖ చక్రాది ఆయుధాలతో ప్రత్యక్షమవుతాడు )
విష్ణు--- శంఖణా ! భక్తి శ్రద్ధలతో స్వామి పుష్కరిణి యందు, స్నాన మాచరించిన కారణమున నీ పూర్వపాప సంచయము నశించి, నీవు శుచిర్భూతుడవైనావు. ఇక నీ రాజ్యమును సుఖముగా పాలింతువు గాక ! భక్తి యుక్తులై ఈ స్వామి పుష్కరణిలో నిత్యము స్నానమొనర్చు వారు, స్వామిత్వము పొందగలరు.
( అని అద్రుశ్యమవుతాడు )
( శంఖణుడు కళ్లు తెరిచి చూస్తాడు. విష్ణువు ఎక్కడా కనిపించడు )
శంఖణుడు-- ఆహ ! ఏమి నా భాగ్యము !! విష్ణువు స్వయముగా వచ్చి, ధ్యానమందైనను, నా వంటి అల్పుని ముందు నిలిచి, నా అభీష్టము నెరవేరగలదని చెప్పుటకు, ఈ స్వామి పుష్కరిణియే కదా కారణము ! ఇక నా రాజ్యమును చేరి, అక్కడి స్థితిగతులు తెలుసుకొనెదను గాక !
( ప్రవేశం మాధవాచార్యుడు, మంత్రి రూప చంద్రుడు )
ఇద్దరూ---- మహారాజులకు అభివాదములు !
రూపచంద్ర-- మహారాజా ! మీకు శుభ వార్త ! విరోధులయిన మన సామంత రాజులు వారిలో వారు, మన రాజ్యము లోని ఈశాన్య భాగమగు సాంకాశ్యము కొరకు, కలహించి, ఒకరినొకరు చంపుకొని , మీ మార్గమును నిష్కంటకము చేసినారు. మన రాజ్యముతో పాటు, ఆ సామంతుల రాజ్యములు కూడ , మీ స్వామిత్వమునకు ఎదురు చూచుచున్నవి !!
మాధవాచార్య--- శంఖణ మహారాజా ! చూసితిరి కదా స్వామిపుష్కరిణీ స్నాన మహిమ !
శంఖణుడు--- ఆచార్యా ! మీ మాటలు నిజము ! స్వామి పుష్కరణీ స్నానము, మీ వంటి సద్గురు పాద సేవనము, ఏకాదశీ వ్రతము యీ మూడింటి ఫలము నాకు నాల్గురెట్లు ఎక్కువై లాభించినది. నేను ధన్యుడనయితిని !

Comments
Post a Comment