బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 22
( దృశ్యము 92 )
( నైమిశారణ్యము )
(సూతమహర్షి, శౌనకాది ఋషులు ఉంటారు )
శౌనక --- సూత మహర్షీ ! శ్రీనివాసుడు , కుబేరుని కడ ఋణము చేసి, దేవ , ద్విజ , ఋషి సమూహములకు ఇచ్చిన విందు----,
౧ ఋషి ---నభూతో నభవిష్యతి అని చెప్పక తప్పదు !
సూతుడు -- త్రేతాయుగమున , శ్రీ రామ పరివారమునకు భరద్వాజ ఋషి ఇచ్చిన విందు, కలియుగమున శ్రీనివాసుడిచ్చిన విందు మరువ లేనివే అయినను, శ్రీనివాసుని వివాహమునకు తరలి వచ్చిన దేవ బ్రాహ్మణ ఋషి సమూహము, ఆకాశ రాజు రాజ్యమునకు తరలి వెళ్లుటకు ముందు, మార్గ మధ్యమందు , శుకాశ్రమమున శుక మహర్షి ఇచ్చిన విందు కూడ సాటి లేనిదని చెప్పవచ్చును !
౨ ఋషి -- .ఆశ్చర్యముగ నున్నది ,సూతమహర్షీ ! శుకుడు అదే పెళ్లివారికి, తన ఆశ్రమమున ఆతిథ్యమిచ్చినాడా, అదెట్లు జరిగినది ?
సూత --- చెప్పుటకేమున్నది ! ప్రభువు అవతార రహస్యము తెలిసిన వాడు గనుక , శుక మహర్షి అట్టి సాహసమునకు పూనుకొన్నాడు .
౩ ఋషి --- శుక మహర్షి సాఫల్యమొనర్చిన ఆ సాహస కార్యమెట్టిది ?
౪ ఋషి --- మాకు విన కుతూహల మగుచున్నది.!
********************** .
(దృశ్యము ౯౩ )
(శుకాశ్రమము )
( శ్రీనివాసుడు , శివుడు , బ్రహ్మ ,తన రెండు ప్రక్కలా నడుస్తూ ఉండగా , వెనక దిక్పాలకాది దేవతా సమూహములు , ఋషి ద్విజ గణాలు , వెంట రాగా , శుకాశ్రమం వైపు నడిచి వస్తూ ఉంటాడు )
( ఆశ్రమ ద్వారము బయట , శుక మహర్షి నిలబడి, చేతులు జోడించి , వస్తున్న వారికి ఎదురు వెళ్తాడు )
( చేతులు జోడించి వున్న శుకున్ని చూసి, శ్రీనివాసుడు ఆగుతాడు. ఆ వెనుక దేవతా బృందం ఆగుతారు )
శుకుడు --- ఆహా ! ఏమి నా భాగ్యము ! త్రిమూర్తులు వారి వెనుక దిక్పాలకాది దేవతా సమూహము . ఋషి బ్రహ్మణ గణములు -- దర్శన మాత్రమున సకల పాప క్షయమై నా జన్మము ధన్యమైనది !
శ్రీనివాస --- శుక మహర్షీ ! మేము పొద్దు గ్రుంకక ముందు నారాయణ వరము చేరవలె ! మార్గమధ్యమున అవరోధము లేర్పడిన క్షుధా పిపాసలకు గురయి నా బంధు మిత్ర పరివారము కష్టమునకు గురి కాగలరేమో ! అందువలన---
శుకుడు --- ప్రభూ ! శ్రీనివాసా ! నా ఆశ్రమమున సర్వదేవతా జన సందోహముతో , ఒక్క క్షణము నిల్చిన చాలును----
శ్రీనివాస ---- శుక మహర్షీ ! మీ ఆశ—ఆశయముల ,మాట ఎట్లున్నను, ఇంత పెద్ద పరివారము ఒక్క క్షణము ఆశ్రమము లోని కేగి, నిల్చుటకు, ఎంత సమయము గడచునో మీకు తెలియక ఇట్లు కోరుచున్నారు. కాలయాపన చేసిన , రాత్రి భోజనమునకు వేల మించిపో గలదు ! ఋషులు బ్రాహ్మణులు సంధ్య వార్చనిదే ఆరగించుటకు ఇచ్చగింపరు కదా ! --- మీకు తెలియని దేమున్నది ?
శుకుడు --- ప్రభూ ! మీ తొందరకు కారణము తెలిసినది ! శుకుడు ఆథిత్యమిచ్చుటకు జడిసి, తన గుమ్మము వద్దకు వచ్చిన అతిథి గణములను అటులనే తిప్పి పంపినాడన్న అపశృతి నాకు వలదు ! మీరు మీ పరివారముతో కలసి, నా ఆశ్రమమున సంధ్యాదులు నెరవేర్చుకొని నా ఆథిత్యము స్వీకరించి , పెళ్లివారింటికి వెళ్లుట మంచిది ! రండు ప్రభూ ! ఆశ్రమమునకు విచ్చేయుడు.
శ్రీనివాస --- శుక మహర్షీ! మీ కిది చాల శ్రమ కాగలదు !
శుకుడు --- ప్రభూ ! నా శ్రమ గురించి మీరు చింతింపకుడు ! మీ పద ధూళితో నా ఆశ్రమము పావనము చేయుడు !
శ్రీనివాస --- వలదు మహర్షీ ! వలదు ! మమ్ములను ముందుకు వెళ్లనీయుడు !
( శుకుడు వకుళా మాత దగ్గరకు వెళ్తాడు )
శుకుడు --- మాతా ! మీరైన నచ్చ చెప్పుడు , ఈ భక్తుని కోరిక మన్నింపుమని , స్వామికి విన్నవింపుడు. !
వకుళ --- శ్రీనివాసా ! వివాహ సంధాన కర్త ఇంట, ముందు రోజు రాత్రి విందు ఆరగించుట లోక ధర్మమే కదా !
శ్రీనివాస --- మాతా ! మీరు అంగీకరించిన , పిదుప నేను కాదనగలనా ? శుక మహర్షీ ! అటులనే కానిండు !
( శుకుడు తన తపో వేదికపై, శ్రీనివాసునికి , దాని ప్రక్కన లక్ష్మికి, వకుళా మాతకు ఆసనములు పరచి, ఆశీనులను చేస్తాడు )
( తక్కిన వారందరూ ఆసనాలు లేక నిల్చునే ఉండి పోతారు. అందరి ముఖాల లోను , బ్రహ్మ రుద్రాదులతో సహా చిరాకు కనిపిస్తుంది )
( శ్రీనివాసుని కూర్చోబెట్టాక , శుకుడు తన ఆశ్రమ మందలి పద్మ తీర్థములో స్నానము చేసి, విరాగి బ్రహ్మచారి గనుక, తనే మూడు రాళ్ల మధ్య కుండ పెట్టి, పొయ్యి రాజేసి, బియ్యం కడిగి ఎసట్లో పోస్తాడు )
( ఎసరు మరుగుతున్నట్లే, అందరిలోను కోపం మరుగుతూ ఉంటుంది. అయినా శ్రీనివాసుని ముఖం చూసి, అందరూ లేని ఓపిక తెచ్చుకొని చూస్తూ ఊంటారు )
( శుకుడు అన్నం వండి, చింత పండు రసం చేసి, ఒక కూరతో పాటు శ్రీనివాసునికి , వేదిక మీద కూర్చొన్న లక్ష్మికి, వకుళా మాతకు, తామరాకులపై వాటిని వడ్డిస్తాడు )
( శ్రీనివాసుడు వాటిని ఆరగిండం చూసి, లక్ష్మి వకుళా మాత కూడా భుజిస్తారు )
( ఆహ్వానితులయిన అతిథు లందరికి కోపం వస్తుంది . వారిలో ఒక ఋషి కోపంతో శుక మహర్షిని శపించ బోతాడు . శ్రీనివాసుడా దృశ్యాన్ని క్రీగంట గమనించి తన పొట్టను నిమురుకొంటూ, బ్రేవుమని తేన్చుతాడు )
( శ్రీనివాసును నోటి నుండి వెలువడిన ఆ వాయువు , కోపించిన ఋషి నోటిలోనికే కాక, తక్కిన వారందరి నోటిలోనికి ప్రవేశించి, వారి ఆకలిని తీరుస్తుంది )
( అందరి కందరూ, కడుపు నిండినట్లయి బ్రేవుమని తేన్చుతారు)
****************
( ద్రుశ్యము 95)
( నైమిశారణ్యము
( సూతుడు , శౌనకాది ఋషులు ఉంటారు )
సూతుడు ---ముని పుంగవులారా ! అదియే శ్రీనివాసుని అవతార రహస్యం ! అతను విరాట్ పురుషుడు ! సర్వ దేవతా , ఋషి గణ సందోహములను తన లోనే లీనము చేసుకొన్న పరిపూర్ణ అవతార మూర్తి !
౧ ఋషి --- మహర్షీ ! మీరు చెప్పిన ఈ ఉదంతముతో శ్రీ వేంటేశ్వరుని అవతార వైశిష్ట్యము తెలిసినది !
శౌనక ---- ఔను నిజమే ! సూత మహర్షీ ! ఇంత వరకు చెప్పిన కథా సారాన్ని బట్టి -- --
౨ ఋషి (శ్లోకము-) - వేంకటాద్రి సమం స్థానం / బ్రహ్మాండే నాస్తి కింఛన
౩ ఋషి --- వేంకటేశ సమో దేవో / నభూతో నభవిష్యతి !
౪ ఋషి --- సూతమహర్షీ ! వరుడు , వివాహ సంధాన కర్త ఇరువురూ ఇచ్చిన వేల్పుల విందు బహు బాగున్నది ! తక్కిన కళ్యాణ విశేషములు చెప్పి మమ్ములను ఆనందింప జేయుడు.
సూతుడు --- మునులారా ! సపరివార బంధు మిత్ర పరివారములతో వచ్చిన శ్రీనివాసుని , ఆకాశరాజు ఎదురేగి ఆహ్వానించి వివాహ వేదిక వద్దకు తీసుకొని వెళ్లాడు. వరుని పురోహితుడైన వశిష్టుడు శ్రీనివాసుని పెళ్లి పీట పైన ఆశీనుని చేసి ,సంకల్పం చేయించాడు. అటు వధువు పురోహితిడైన బృహస్పతి , బుట్టలో కూర్చొని ఉన్న నవ వధువు పద్మావతి చేత , గౌరీ పూజకు బదులు , మగళ చండికా దేవి పూజ చేయించినాడు .
శౌనక --- సూతమహర్షీ ! వధువు చేత ఆ దేవత పూజ చేయించడంలో, బృహస్పతి ఆంతర్యమేమిటి ?
సూతుడు--- బృహస్పతి, ఆమె కుజ దోష పరిహారార్థము ఆ పూజ చేయించాడు !
౧ ఋషి -- కుజదోషము అనగా నేమి ?
సూతుడు--- ( శ్లోకము )
లగ్నే, వ్యయేచ , పాతాళే, జామిత్రేచ , అష్టమే కుజే
కన్యా భర్తృః వినాశాయ, భర్తా, భార్యా వినాశకృత్ !.
అన్న జ్యోతిష శాస్త్ర సూత్రం ప్రకారం, కన్య జాతకంలో, కుజుడు లగ్నము నందు గాని, చతుర్థ స్థానము నందు గాని, సప్తమ ,అష్టమ , ద్వాదశ స్థానముల యందు గాని , ఉన్నట్లయితే, ఆమెకు వైధవ్యము కలిగిస్తాడు. అదే విధంగా వరుని జాతకంలో గాని ఉన్నట్లయితే కళత్ర నష్టము కలిగిస్తాడు.—మంగళ చండీకా దేవి పూజ వలన
యీ దోషము పరిహారము కాగలదు. నేనా పూజను, ఆ రోజు నా కళ్లారా చూసాను.

Comments
Post a Comment