బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 25
( దృశ్యము 99 )
( నారాయణ వరం దగ్గర యుద్ధభూమి )
( శ్రీనివాసుడు, పద్మావతి, అగస్త్యుడు, ఆశ్రమ వాసులు, ఉంటారు )
( శ్రీనివాసుని మాటలకు పద్మావతి ఏడుస్తూ ఉంటూంది )
( ప్రవేశం తొండమానుడు. వసుధానుడు యుద్ధ విరామం ప్రకటించి వస్తారు )
( తొండమానుడు శ్రీనివాసుని గాయాలను చూసి, తల్లడిల్లుతాడు )
తొండమాన --- ప్రభూ ! లోకపాలకా ! మిమ్ములను ఇట్టి దురవస్థ పాలు చేసిన నన్ను క్షమింపకుడు, ఈ క్షణమే నా కుత్తుక వేరు చేయుడు
( వసుధానుడు కూడా దుఃఖంతో శ్రీనివాసుని ముందు మోకరిల్లుతాడు )
వసుధానుడు --- ప్రభూ ! వేంకటేశ్వరా ! ఈ దురవస్థ కంతటికీ కారణం నేను, నా తొందర పాటుతో నా స్వజనానికి ముప్పు కొని తెచ్చుకొన్నాను. ఇక నేనీ యుద్ధము చేయను ! రాజ్యమంతయు నా పిన తండ్రికే ఇచ్చి వేయుడు ! నేను మీ పాద సేవ చేసుకొంటూ కాలం గడుపుతాను
శ్రీనివాస --- సరి, సరి ! మీ రిరివురూ యుద్ధ విముఖులైనప్పుడు, ఇక యుద్ధమెవరు చేయదురు ? కాని ఒక విషయము మాత్రము స్పష్టముగా తెలియ వలెను !
( తొండమానుడు, వసుధానుడు ఇద్దరూ మాట్లాడరు )
అగస్త్య ---- ప్రభూ ! స్పష్టమగుట కేమున్నది ? రాజ్యమును , కోశ దండములను, దుర్గములను సమముగా విభాగము చేసి, పంచి ఇమ్ము !
శ్రీనివాస --- ఏమి బావమరిదీ ! నీ మాటేమి ? తొండమాను చక్రవర్తీ ! మీ కిరువురకూ చెరి సగము రాజ్యము సమ్మతమే కదా ?
తొండమాన--- ప్రభూ ! నే నడిగినది భాగమే కదా ! అది లభించునప్పుడు నా అన్న కొడుకుతో నాకు శతృత్వ మెందులకు ?
శ్రీనివాస ---వసుధానుడా ! బాలకుడవే అయినను ప్రాఙ్ఞుడవు ! నీకు రాజ్య భాగము తీసుకొనుట సమ్మతమే కదా ?
వసుధాన -- సమ్మతమే బావగారూ !
శ్రీనివాస --- సరి ! మీ కొరకు యుద్ధము చేసి, ప్రాణములను విడుచుటకైన , సంసిద్ధుడనైన నాకు, షోడశ భాగములను, మీ మీ భాగములనుండి ఇవ్వ వలయును ! సమ్మతమే కదా ?
ఇద్దరూ -- సమ్మతమే ప్రభూ !
శ్రీనివాస --- అయిన ఈ యుద్ధభూమి ఏల ? ఆశ్రమమునకు పోయి మాట్లాడుకొనెదము గాక !
పద్మావతి --- స్వామీ ! స్వజనుల మధ్య సఖ్యము, నెరవేర్చినందులకు , సుంకము చెల్లించ మనుట ఏమి ధర్మము ?
శ్రీనివాస --- యుగధర్మము దేవీ ! -- నిన్ను పెండ్లి యాడుటకు పదునాలుగు లక్షల సంఖ్యల శ్రీరామ ముద్ర ని ష్కములను, వృద్ధికి తీసుకొన్నాను. ఎటుల తీర్చగలను ? నా కేమున్నదని ?-- నాకు ఉన్నదంతయు వేంకటాచలము పైన ఒక చీమల పుట్ట ! ఆ స్థలము కూడ వరాహస్వామిది ! దానికి అద్దె చెల్లించవలెను ! లక్ష్మీ దేవి నాకు ముందే ఎడమైనది ! నీతో వివాహము జరిగిన వెనుక, "నాథా ! నవ వధువుతో నిర్విఘ్నముగా కాపురము చేసుకొనుడు " అని ఎగతాళి చేసి వెళ్లి పోయినది ! ఆమె కరివీర పురమున సంపెంగ చెట్టు క్రింద ఘోర తపము చేసి, సకల దేవీ , దేవతా, యొగినీ, మాతృకా గణముల సిరి సంపదలన్నియు, తన కైవసము చేసుకొని, సామ్రాజ్య లక్ష్మియైనది ! కాని నన్ను కనికరింపదాయె ! కొండంత ఋణము, ఉండుట కొక వల్మీకము తప్ప నాకేమున్నది ! -- అందుకొని నేనొక నిశ్చయమునకు వచ్చితిని !
( స్వామి మాటలు అక్కడున్న వారందరికీ కళ్లు చెమర్చేలా చేస్తాయి )
( పద్మావతీ దేవికి కన్నీరాగ లేదు. తన చీర చెరుగుతో కంటి నీరు తుడుచుకొంటుంది )
పద్మావతి--- స్వామీ ! జన్మ జన్మాంతరమందు నా కిచ్చిన మాటకొరకు, నన్ను పెండ్లియాడి , ఎన్ని కష్టములు కొని తెచ్చుకొన్నారు ? నేనొక నష్ట జాతకురాలిని ! వివాహమయి కాళ్ల పారాణి కరిగి పోక ముందే , కన్న వారిని కోల్ఫోయాను ! తమ్మునకు, పిన తండ్రికి, మీ దయ వలన సఖ్యము కుదిరినది గాని, లేకున్న వారిలో ఎవరో ఒకరే కదా నాకు దక్క వలసినది ! ఆ పైన ఇపుడు మీరన్న దీనాలాపములు నా గుండెను తూట్లు చేయుచున్నది ! స్వామీ ! మీ నిర్ణయము ఏదైనను నేను త్రికరణ శుద్ధితో పాటించి, మీకు అండగా నిల్చెదను !---ముందు అదేమిటో చెప్పండి !
శ్రీనివాస -- దేవీ ! ఇక నుండి మనము ఒకరిచ్చినది పుచ్చుకొనుట కాక, ఇచ్చి పుచ్చుకొనెదము గాక !
పద్మావతి --- స్వామీ ! తమ ఆఙ్ఙ నెరవేర్చెదను ! వివరముగా తెలియ జేయండి.
శ్రీనివాస --- మన లోగిలికి, మన శరణు గోరి, ముందుగానే ముడుపు కట్టి, వచ్చు భక్త జనులకు వారి కార్య కారణములతో నిమిత్తము లేక ప్రాణమొడ్డియైనను , కోర్కె తీర్చవలె ! చేసిన దానికి లాభములో షోడశ భాగము లేదా ఇచ్ఛిత ధన కైంకర్యములు సుంకముగా, తీసుకొనవలెను ! ఇదియే ఇచ్చి పుచ్చుకొనుట !!
తొండమాన --- ప్రభూ ! మీ భక్తుడగు నే నుండగా , మీకి శ్రమ ఏల ? నా రాజ్యము మీ కొసగి, మీ పాద సేవ చేసుకొని కాలం గడుపుతాను ! నాతో రండి స్వామీ !
శ్రీనివాస -- తొండమాను రాజా ! నన్ను నీ రాజ్యమునకు మాత్రము పరిమితము చేయకుము ! భూదేవియే నన్ను సేవింప నుండగా, నీ చిన్నభూఖండము నాకేల ? అయినను నేను నా నిశ్చయమును , పద్మావతీ దేవితో పాటు, అమలు పరచెదను !
తొండమాన -- స్వామీ ! మీరీ కొండపైన చీమలపుట్టలో, కాలము గడుపుట ఎందులకు ? మీ నిశ్చయము తెలిసినది గనుక , అక్కడనే ఒక గృహ నిర్మాణము చేయుటకు ,నాకు అనుమతి నిండు.
వసుధాన --- కాదు బావగారూ ! ఆ అనుమతిని నాకు ప్రసాదింపుడు ! నా రాజ్యము వేంకటాచలమునకు దగ్గరగా నున్నది గనుక గృహ నిర్మాణము నాకే సులువు కాగలదు !
( శ్రీనివాసుడు వారిద్దరి వైపు వాత్సల్యంతో చూస్తాడు )
శ్రీనివాస --- వసుధానుడా ! నీ అభ్యర్ధనను , నేను అంగీకరింప జాలను ! ఏలననగా తొండమానుడు గత జన్మలో రంగ దాసుడను పేరుతో, నాకు భక్తితో సేవ చేసాడు ! పూజ కోసం పూల తోట వేసి, ఆ తోటకి నీరు తెచ్చేందుకు తన కాయకష్టంతొ ఒక బావి తవ్వాడు. నా వల్మీకము వానలో తడిసి పోతుందని భయపడి, దాని నలుప్రక్కలా గోడకట్టి పందిరి వేసే ప్రయత్నం చేసి, శాపవశాత్తు, స్వామి పుష్కరిణిలో స్నానమాడి, తనువు చాలించాడు కనుక నిర్మాణము అతనినే చేయనియ్యి !. –(అని తొండమానునితో ) తొండమానుడా !
తొండమాన --- ప్రభూ !
శ్రీనివాస --- నీవు కట్టించ వలసినది ఇల్లు కాదు ! ఆలయము !! కొండ మీద , వరాహ స్వామి నిర్దేశించిన స్థలమున , ఆలయమును నిర్మింపుము ! ఆలయ నిర్మాణము తరువాత, నేను నీవు అడిగిన, వరము నిచ్చెదను !
తొండమాన --- ప్రభూ ! మహా భాగ్యము ! ఆలయమును ఏ రీతిగా కట్టించ వలెను ?
శ్రీనివాస --- ఆలయము, రెండు గోపురముల తోను, మూడు ప్రాకారములతోను, సప్త ద్వారములతోను, ద్వజ స్తంభముతోను, కూడి, యుండవలయును ! తామ్ర పట్టములతో సంబద్ధముగాను, సువర్ణాలంకార మండితము గాను యుండవలయును !
తొండమాన --- ప్రభూ ! ఆటులనే కట్టించెదను ! ( అని తొండమానుడు శ్రీనివాసునికి , అగస్త్య మునికి నమస్కరిస్తాడు ) అగస్త్య మునీంద్రా ! స్వామి ఆనతి ప్రకారము, దేవాలయము నిర్మింప దలచితిని ! మీ ఆశీస్సులు ఆ కార్య నిర్వహణకు నాకు కవచ సదృశములు ! నన్ను ఆశీర్వదింపుడు .
అగస్త్య ---తొండమాను రాజా ! శ్రీనివాసునికై నీవు కట్టించు శిలాభవనము శాశ్వత కీర్తి నంద గలదు !!
వసుధాన --- బావగారూ ! బాబాయిని ఆలయ నిర్మాణము చేయుమని ఆదేశించినారు ! స్వర్గీయులైన నా తండ్రి అక్క వివాహమున ఈచ్చిన సారె, బహుమతులు, అప్పట్లో, మీరు స్వీకరింప లేదు ! ఇప్పుడు మీరు కాదన్నా, నేను ఒప్పుకోను ! మీ ఆలయ ప్రవేశ సమయమున అవి యన్నియు మీకు సమర్పించుకొనెదను !
పద్మావతి ---( వాత్సల్యంతో ) తమ్ముడూ ! నాన్నగారిస్తానన్న సారె,బహుమతులు, అన్నీసమర్పిస్తానంటున్నావు ! అవన్నీ నీకు ఙ్ఞాపకం ఉన్నాయిరా ? ఈ స్వామి దగ్గర అన్నీ లెక్కింపే సుమా ! ఏ ఒక్కటీ మరువ కూడదు !!
వసుధాన --- అవన్నీ నాన్నగారు, ఒక భవనములో పెట్టించారు, ఙ్ఞాపకం ఎందుకుండదు ? కావాలంటే చెప్తాను విను ! సారె ---- నూరు గరిశెల ధాన్యము, ముప్పది గరిశెల పెసలు, విస్తారముగా బెల్లము, చింత పండు, వెయ్యి ఘటముల పాలు, నూరు ఘటముల పెరుగు, అయిదు వందల ఘటముల ఘృత పూర్ణ పాత్రలు, రెండు వందల శర్కరతో కూడిన పాత్రలు, విశెషముగా ఇంగువ, లవణము, వార్తాక, కూష్మాండ, కదళీ, కంద మూలాది శాకములు, రెండు వందల మధు భాండములు, పదివేల గుర్రములు, వెయ్యి ఏనుగులు, అయిదు వందల గోవులు, నూరు గొర్రెలు, రెండు వందల దాసీలు, మూడు వందల దాసులు, వివిధ వస్త్రములు, రత్న పర్యంకము, స్వర్ణ కిరీటము, --- ఇంకను వివాహ వేడుక చూడ వచ్చిన దేవతలు, సామంత రాజులు ఇచ్చిన రత్నములు పొదిగిన పతకములు, బంగారు భుజ కీర్తులు, కంకణములు, ఉంగరములు, వజ్ర కవచము, లెక్కకు మిక్కిలిగా నున్నవి ! వాటి నన్నిటినీ మీ ఆలయ ప్రవేశ దినమున తెచ్చి సమర్పిస్తాను !
పద్మావతి --- విన్నారా స్వామీ ! మీరు మరీ లేని వారు కారు ! చీమల పుట్ట తప్ప వేరేమున్నది, అని వాపోవుట మీ ఆంతటి వారికి తగదు !
శ్రీనివాస --- దేవీ ! వసుధానుడు చెప్పిన దంతయూ స్త్రీ ధనము ! -- నా కడ నున్నది వల్మీకమే !
పద్మావతి --- ( చిరు కోపంతో ) స్త్రీ ధనము, నా ధనము అంటూ నన్ను వేరు చేయుదురేమి స్వామీ ? మీరు వైకుంఠమున నుండునప్పుడు ఎవరి ధనము వెచ్చించెడి వారు ?
శ్రీనివాస -- వైకుంఠమున గాని, నా తదితర యవతారములందు గాని, నాకు ధనముతో నవసరము కలుగనే లేదు ! లక్ష్మియే వాటిని చూసుకొనేది !
పద్మావతి --- నేను కాదన్నానా స్వామీ !
శ్రీనివాస --- దేవీ ! ఇది కలియుగ ధర్మము ! ఈ యుగమందు కులీన స్త్రీలు కూడ దనార్జన చేయుదురు ! భార్యా భర్తల మధ్య కూడ ఎవరి అప్పులు వారివి, ఎవరి ఆర్జన వారిది, అన్నట్లు మెలగుచుందురు . నేను ధర్మ రక్షకుడను గావున, యుగ ధర్మము ననుసరించియే నడుచుకొన వలెను ! కుబేరుని కడ ఋణము చేసినది నేను, గాని నీవు కాదు ! దానిని నేను తీర్చవలెను ! అర్థమయినదా ?
పద్మావతి --- అర్థమయినది స్వామీ !
****************

శ్రీధర్ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు
ReplyDeleteహారం