Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 27

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 27

( దృశ్యము 103 )

( అగస్త్యుని ఆశ్రమము )

( అగస్త్య ముని ధ్యానంలో ఉంటాడు . శ్రీనివాసుడు దిగులుగా కూర్చొని ఉంటాడు. పద్మావతి అతనికి దగ్గరగా వెళ్తుంది )

పద్మావతి --- ప్రభూ ! వేంకటాచలము పైన, మా పినతండ్రి కట్టించిన ఆనంద నిలయము చూసిన వెనుక, మీరు ఆనందముతో తిరిగి వత్తురని తలచితిని ! కాని ఇలా పుట్టెడు దిగులుతో, మరలి వచ్చుట , నాకు మతి తప్పిస్తున్నది ! స్వామీ , యీ మనోవ్యధకు కారణమేమి ?

( ప్రవేశం వకుళా మాత )

వకుళ --- నాయనా ! శ్రీనివాసా ! ఏమిటి నీ వ్యధ ?

( శ్రీనివాసుడు మాట్లాడడు )

పద్మావతి--- అగస్త్య మునీంద్రా ! నాధుడు నాతో తన మనోవ్యధ పంచుకొనుటకు ఇచ్చగింపకున్నాడు ! మీరైన దానిని తెలుసుకొని -----

వకుళ--- అవును మహర్షీ ! కుమారుని మనోవ్యధను తెలుసుకోండి !

( అగస్త్యుడు శ్రీనివాసుని వంక తేరిపార చూస్తాడు )

అగస్త్య --- శ్రీనివాసా ! ఆలయమును చూసావు కదా ?

శ్రీనివాస--- చూసాను మునీంద్రా !

అగస్త్య --- ఆలయము నీవు కోరినట్లు , రెండు గోపురములతో , మూడు ప్రాకారములతో , సప్త ద్వారములతో, ధ్వజ స్తంభముతో , నిర్మింప బడినదా ?

శ్రీనివాస --- అవును మునీంద్రా ! ఆస్థాన యాగ మండపముల తోను, వస్త్ర , మాల్య ,కర్పూరాది ద్రవ్యము లుంచుటకు గృహములతోను , ధన ధాన్య, తైల , ఘృత, భవనములతోను, భక్ష్య , భోజ్య ,భూషణ శాలల తోను, కూడి కడు రమ్యముగా నున్నది !

అగస్త్య --- శ్రీనివాసా ! ఆలయ నిర్మాణములో లోపములు లేనట్లే కదా ?

శ్రీనివాస --- లేవు మునీంద్రా ?

అగస్త్య --- ఆలయ ప్రవేశమునకు జరుగబోవు ఏర్పాట్లలో ఏమైన లోపములు గలవా ?

శ్రీనివాస--- వాటిని స్వయముగా బ్రహ్మ , విశ్వకర్మ, తొండమానుడు చూచుచున్నారు . అందువలన లోపములు ఉండుటకు తావు లేదు !

అగస్త్య --- అటులయిన శ్రీనివాసా , లోపము ఎక్కడ నున్నది ?

శ్రీనివాస-- మునీంద్రా ! లోపము ఆలయ నిర్మాణములో గాని, ప్రవేశమునకు జరగబోవు ఏర్పాట్లలో గాని లేవు

అగస్త్య --- మరి ఎక్కడ నున్నది ?

పద్మావతి--- స్వామీ ! లోపము లెందున్నవి ?

వకుళ --- శ్రీనివాసా ! లోపము ఎచ్చట. ఎవరి యందున్నది ?

శ్రీనివాస --- తల్లీ ! ప్రవేశించు వారి యుందున్నది !

పద్మావతి --- స్వామీ ! ప్రవేశించు వారెవ్వరు , మీరు , నేను ఇరువురమే కదా ?

శ్రీనివాస--- అవును దేవీ !

పద్మావతి --- మీ యందున్న మీ రిట్లు మధన పడెడి వారు కాదు ! కనుక, నా యందే యున్నది! ( అగస్త్యునితో , దుఃఖిస్తూ ) మునీంద్రా ! ఆ లోపమేదో మీరే తెలుసుకొని , నేనేమి చేయవలయునో , తేల్చి చెప్పుడు !

అగస్త్య--- పుత్రీ ! పద్మావతీ ! నీవు కాస్త నెమ్మదించుము తల్లీ ! శ్రీనివాసా ! -- ఆలయ ప్రవేశార్హత -- నీకు, పద్మావతీ దేవికి కాక , మరెవరికైన కలదా ?

శ్రీనివాస --- మునీంద్రా ! శ్రీలక్ష్మికి ప్రవేశార్హత లేదందురా ?

అగస్త్య --- అర్థమయినది శ్రీనివాసా ! నీ మనో వ్యథకు కారణము తెలిసినది. పుత్రీ , పద్మావతీ ! నీకు కూడ విషయము తెలిసినట్లే కదా ?

పద్మావతి-- తెలిసినది మునీంద్రా ! నాధుని మనోవ్యధ తెలిసినది ! శ్రీ మహా లక్ష్మికి ప్రవేశార్హత లేదనుటకు నే నెవరను మహర్షీ ? నేనామె వెన్నంటి రావలసిన దాననే గాని , ఒంటరిగా ప్రవేశించుదానను కాదు గదా ?

శ్రీనివాస ----- ఏమంటివి పద్మావతీ ! నీవు శ్రీలక్ష్మిని వెన్నంటి రావలసిన దానవా ? ---నిజమా ?

పద్మావతి --- అవును ప్రభూ ! నిజమే ! -- ముందుగా శ్రీలక్ష్మి , తరువాతనే నేను , నేనామెకి సౌహార్ద్రత నిండిన చెల్లెలినే గాని . మాత్సర్యము మూట కట్టుకొన్న సవతిని కాను , కాలేను ! నా పెళ్లిరోజు వచ్చి , మిమ్ములను తన స్వహస్తములతో పెళ్లికుమారునిగా అలంకరించి, నా సరసన నిల్చోపెట్టి , నన్ను ఆశీర్వదించి వెళ్లినది ! నే నామె ఔదార్యము నెట్లు మరచి పోగలను ? రేపు ఆలయ ప్రవేశమునకు, ముందుగా ఆమె, తరువాతనే నేను ,-- మీ వెనువెంట వచ్చెడు వారము ! స్వామీ ! మీరామెను స్వయముగా వెడలి తోడ్కొని రండు ! నా మాటగ కూడా రమ్మనమని ఆమెను ప్రార్థింపుడు !

శ్రీనివాస --- దేవీ ! లక్ష్మిని తెమ్మని చెప్పి, నా మనసున పాలు పోసావు ! ( అని వకుళతో ) తల్లీ మీ అభిప్రాయ మేమి ?

వకుళ --- నాయనా ! లక్ష్మి లేని ఆలయ ప్రవేశము , ఊహించుటకు కూడ వీలు కాకున్నది ! దానికై నీవు పడిన వ్యధ సమంజసమే ! పద్మావతి కూడ నీవు పడిన మనోవ్య్ధధని నేర్పుగా బయటికి లాగి, దానిని నెరవేర్చు ఉపాయము చెప్పినది ! శ్రీమహా లక్ష్మి ,పద్మావతి దేవి వంటి, కోడళ్లను పొందినందుకు, నేనీనాడు గర్విస్తున్నాను ! --నీవు వెంటనే వెళ్లి , నా పెద్ద కోడలిని తీసుకొని రా !!

శ్రీనివాస -- తల్లీ ! నీ ఆజ్ఞను సత్వరము నెరవేర్చెదను !

******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ